Posts

Showing posts from 2011

పొగడపూల తో నూతన సంవత్సర శుభాకాంక్షలు

Image
కొత్త సంవత్సర శుభాకాంక్షలతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మితృలందరికోసం నేను తయారుచేసిన పొగడపూల గుచ్చం.
పొగడపూల వెనకున్నది ఓ చెట్టుకి పూసిన పువ్వు.వుడ్ రోజ్ లా సహజమైన పువ్వు.
దానికి నేను పొగడపూలను అతికిస్తే ఇంత అందమైన పుష్ప గుచ్చం తయారైంది.
సృజనాత్మక దృష్టి ఉండాలే గాని ప్రకృతి మనకెన్నో అద్భుతాలను అందిస్తుంది.
ఈ కళాత్మక గుచ్చ్హాన్ని మీ అందరితో పంచుకోవడం నాకు గొప్ప సంతోషాన్నిస్తుంది.
నా దృష్టిలో ఆనందం మన చుట్టూనే ఉంటుంది.దాన్ని ఒడిశి పట్టుకొవడం ఇదిగో ఇలాగే.

శుభాకాంక్షలతో
మీ
సత్యవతి

కొత్త సంవత్సరం

Image
బుల్లి రావి మొక్క
వొళ్ళంతా వొలకబోసుకున్న రంగులు
ఒకే మొక్కకి ఎన్ని రంగులున్న ఆకులో
మనిషి జీవితం కూడా ఒక్కటే
ఎన్నెన్ని రంగుల కలలు
ఎన్నెన్ని వైవిధ్యాల అలలు
భిన్నత్వం బహు సుందరం
ఏకధృవం  ఎంత బోరో కదా!!!!
కొత్త సంవత్సరం
కొత్త రంగుల్ని మీ జీవితం లో నింపాలని
మనసారా కోరుకుంటూ...


శుభాకాంక్షలు.

ఉత్తరం
పుస్తకం
ప్రియ నేస్తం సాన్నిహిత్యం
చెట్టు చేమ
చుట్టూ నీళ్ళు
చూపు ఆనినంత మేరా పచ్చదనం
ఎత్తైన కొండలూ
ఎరుపెక్కిన తూరుపు దిక్కు
ఎప్పుడూ నవ్వే పెదవులు
ఏదైతే ఏమిటిలే అంటూ
నల్లేరు మీద బండిలా నడిచిపోయే జీవితం
ఎవరో వస్తారు ఏదో చేస్తారు లాంటి ఉదాసీనతలకు
బై బై చెప్పేసి
నువ్వే ఒక ఉద్యమం
నువ్వేఒక మార్పు సంకేతం
నూతన సంవత్సరాన ఇదే నా సందేశం
ఇవే నా  శుభాకాంక్షలు.

ప్రేమలేఖ

అబ్బాయి రాస్తే
అందమైన మోము,అద్దాల్లాంటి చెక్కిళ్ళు,
సిం హ మధ్యమం లాంటి నడుము
నిగనిగలాడే నీలి కురులు
మేలిమి బంగారులాంటి మేని చాయ

అమ్మాయి రాస్తే
ఆరడుగుల అందం ,ఆజానుబాహువులు
గిరజాల జుట్టు,సన్నని మీసకట్టు
ప్రేమలేఖల్లొ ఉండేదంతా శరీర వర్ణనేనా?
శరీరాల స్పృహమాత్రమేనా?

ఆశయాలు,ఆదర్శాలు
మనసులోతులు,మానవీయ కోణాలు
ఆత్మ గౌరవాలు,సహజీవన సౌరభాలు,
ఇవేవీ లేకుండా ప్రేమలేఖా?

పూల మధ్య దారం ఇమిడిపోయినట్టు
ఆత్మిక బంధంలొ శరీరాల కలయిక ఉండాలి
ప్రేమలేఖల్లో పూల పరిమళాలు గుబాళించాలి
అంతరంగాలు ఆవిష్కృతమవ్వాలి.

లేఖ అంటేనే ప్రేమ సువాసనల్నో,
స్నేహ సువాసనల్నో మోసుకొచ్చేది.
అలాంటి లేఖ ప్రేమని మోసుకొస్తే....
మొగలి పొత్తులో పొదివినట్టు
మల్లెపూల మధ్యలో అమరినట్టు
గరికపువ్వు మీద తుషారబిందువట్టు
ప్రేమలేఖ
ప్రియమైన లేఖ

ప్రియమైన మా ఊరు వెళ్ళి ఈ రోజే వచ్చాను.

Image
మా ఇల్లు
                                                                           మా ఇంటి ఆవరణ
                                                                                   మా ఊరు
ప్రియమైన మా ఊరు సీతారామపురం వెళ్ళి ఈ రోజే వచ్చాను.

హాయిగా ఓ నాలుగు రోజులు
 మా గోదావరి గట్లెంబడి,
కోనసీమ కొబ్బరి చెట్లెంబడి,
పేరుపాలెం బీచెంబడి,
మా ఊరి సరుగుడు తోటలెంబడి,
ఆరాంగా తిరిగి
అలుపు సొలుపు మర్చిపోయి
పొద్దున్నే రైలు దిగి
జనారణ్యంలోకి వచ్చి పడ్డాను.

“Breaking the Conspiracy of Silence behind voilence against women and girl children

Image
Today more than 1000 school and college children attended this function.
we from Bhumika mobilized some funds and distributed sweets,biscuits,water and fruity.
all the students belongs to Govt. schools and colleges.
the meeting went well.
children performed so many cultural programes.
we are so happy to observe that children made so many posters on WHAT IS GOOD TOUCH AND WHAT IS BAD TOUCH.

A campaign on “Breaking the Conspiracy of Silence” was initiated in about 100 schools and colleges in Hyderabad, Secunderabad and Rangareddy districts from 25th to 10th December. The major objectives of the campaign are: building solidarity, dissemination of information and sensitization of larger sections of the society, particularly men on the need to break silence and more particularly the conspiracy behind the silence with regard to increasing crime rate of violence on women and girls. The target group for this rally would be adolescent girls and boys with focus on violence and abuse in schools &…

“Breaking the Conspiracy of Silence”

Dear All
A campaign on “Breaking the Conspiracy of Silence” was initiated in about 100 schools and colleges in Hyderabad, Secunderabad and Rangareddy districts from 25th to 10th December. The major objectives of the campaign are: building solidarity, dissemination of information and sensitization of larger sections of the society, particularly men on the need to break silence and more particularly the conspiracy behind the silence with regard to increasing crime rate of violence on women and girls. The target group for this rally would be adolescent girls and boys with focus on violence and abuse in schools & colleges.The campaign is a joint effort of different NGOs and network groups working on women and girls’ rights in twin cities of Hyderabad and Secunderabad and facilitated by Samatha Gender Resource Centre, a unit of Andhra Pradesh Mahila Samatha Society. In this regard, we are happy to invite you cordially to the public meeting on 14th December at Harihara…

నైమిషంలో నిశ్శబ్దపు అనుభవం

Image
ఈ రోజు ఉదయమే నేను అబ్బూరి చాయాదేవి గారు,సుజాతా మూర్తి గారు
కలిసి ఘటకేస్వర్ దగ్గరున్న కొండాపూర్ లో నిర్మించిన జిడ్డు కృష్ణ మూర్తి సెంటర్ నైమిషం కెళ్ళాం.
నేనే డ్రైవ్.
నైమిషం చాలా బాగుంది.16 ఎకరాల విస్తీర్ణంలో  చాలా సౌందార్యత్మకంగా కట్టారు.
బోలెడన్ని చెట్లు,రకాల పక్షులు,ఆవులు,దూడలు ఉన్నాయి.
అక్కడే పండించిన కూరగాయలతో ఆవు పెరుగుతో కమ్మటి భోజనం పెట్టారు.ఓ గంట సేపు తోటంతా నడిచాము.
సెంటర్లో ఉన్న బ్రిజేష్ కృష్ణమూర్తి గారి వీడియోలు చూపించారు.
తిరుగు ప్రయాణంలో గీత వాళ్ళింటికి  వెళ్ళేం.
అక్కడే సంపూర్ణ చంద్ర గ్రహణం చూసాం.
గీత పెట్టిన వేడి వేడి మేతి పరోటాలు,గుత్తి వంకాయ కూర తినేసి ఇంటికి బయలు దేరాం.
ముందు సుజాత గారిని తర్వాత చాయా దేవి గారిని దింపేసి నెక్లెస్ రోడ్లో గ్రహణం విడుతున్న దృశ్యాలు చూసుకుంటూ ఇంటికొచ్చేసాను.
చాయా దేవి గారు ఎనభైలకి,సుజాత గారు డెబ్బైలకి దగ్గర వయసున్న వారు.
ఈ రోజు వారిద్దరితో చాలా హాయిగా గడిచింది.

శివకామి తో ఓ సాయంత్రం

Image
ప్రసిద్ధ తమిళ దళిత రచయిత్రి, ఏక్టివిస్ట్ ఈ రోజు హైదరాబాదు వచ్చారు.
నేను ,వేమన వసంత లక్ష్మి,రత్నమాల,గెడ్డం ఝాన్సి,మేరి మాదిగ,జూపాక సుభద్ర,గ్రేస్ నిర్మల, విజయభారతి,బొజ్జా తారకం గారూ జాజుల గౌరి తదితరులం శివకామితో చాలాసేపు మాట్లాడినాం. చాలా అంశాలు చర్చకు వచ్చాయి.
ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసి మమ్మల్ని అందరిని ఆహ్వానించిన తారకం గారికి కృతజ్ఞతలు.

ఈ రోజు మా అత్త గారి 87 వ పుట్టిన రోజు.

Image
ఈ రోజు మా అత్త గారి 87 వ పుట్టిన రోజు.

రైన్ బో హోం పిల్లల తిరిగొచ్చిన బాల్యానికి పండగ

Image
I was guest of honor for this wonderful program.
I prepared a big flower boke for 1500 students
Rainbow homes is a campaign launched in Andhra Pradesh in the year 2008 to protect the rights of, and help reclaim the childhood of, deprived girls in urban areas which was extended for boys at a later stage. The categories of children targeted for these homes are children on streets, children of homeless families, children in begging, children in rag picking, children of sex workers and in sex work, children in domestic work and facing abuse and violence, children from farmers and weavers families those are effected by hunger deaths and suicides etc. These children face multiple vulnerabilities due to no adult protection-- either have no parents or escaped from abusive, violent environments because of alcoholic or irresponsible parents. They are deprived of education, distanced from health care, adult care and ridden with psychological problems resulting in self-destructive habits like drug…

Campaign “On Breaking the Conspiracy of Silence”

Image
Violence affects lives of millions of women in our country in all socio economic and educational classes. It cuts across cultural and religious barriers impeding the right of women to participate fully and contribute effectively in the society.  Violence against women in the society exists in different forms such as domestic violence, rape, eve teasing, child marriage, corporal punishment, sexual abuse and female foeticide to name a few. All are violations of the most fundamental human rights. To address the widespread violence in our society it has become imperative to address these issues and advance equality in society.  Placing Andhra Pradesh in the given context some alarming figures come to the fore. A.P has been experiencing a steep rise in crimes against women. It topped the list in crimes against women during 2010 with 27,244 cases being registered accounting for 12.8% of the total crime in the country. The data released by National Crime Records Bureau also pegs A.P. to have h…

కర్నూల్ లో మా సెనెగ చేను,జొన్న చేను.

Image

నా రెండో కధల సంపుటి "మెలకువసందర్భం" పుస్తకం మీద ఆంధ్ర జ్యోతి లో ఆదివారం వచ్చిన రివ్యూ

నా రెండో కధల సంపుటి "మెలకువసందర్భం"
పుస్తకం మీద ఆంధ్ర జ్యోతి లో  ఆదివారం వచ్చిన రివ్యూ

http://www.andhrajyothy.com/sundayPageshow.asp?qry=2011/nov/20/sunday/newbooks&more=2011/nov/20/sunday/sundaymain

మా ట్రిప్ సూపర్ సక్సెస్

Image
రచయిత్రులు,జర్నలిస్టులు,ఉపాధ్యాయులు,వ్యక్తులు...
మొత్తం 25 మంది నాలుగు రోజులపాటు సాహితీ యాత్ర చేసి వచ్చాం.


పూర్తి రిపోర్ట్ త్వరలోనే.

భూమిక ఆధ్వర్యంలో నాలుగోసారి సాహితీ యాత్ర

Image
భూమిక ఈ సారి నిర్వహిస్తున్న సాహితీ యాత్ర కర్నూల్ జిల్లా, నల్లమల ఫారెష్ట్ కడలివనం లోని అక్క మహాదేవి గుహలు,మల్లెల ద్వీపం.
10 న బయలుదేరి పున్నమి రాత్రిని అహోబిలంలో గడపాలని ప్లాన్ చేసాం.
అన్నీ తిరిగి,చూసి 13 సాయంత్రానికి తిరిగి వస్తాం.
ఈ యాత్రలో రచయిత్రులు,జర్నలిస్ట్లులు,యాక్టివిస్టులు  ఉన్నారు.

షర్మిలా ఇరామ్‌ ఉపవాస దీక్షకు పదకొండేళ్ళు

Image


సెప్టెంబర్‌ 23న జర్నలిస్ట్‌ జ్యోతి పున్వాని నుండి వచ్చిన ఒక ఇమెయిల్‌ నన్ను తీవ్రమైన దు:ఖానికి గురి చేసింది. ఆ ఇమెయిల్‌ సారాంశం ఏమిటంటే గత పదకొండేళ్ళ సంవత్సరాలుగా ఇంఫాల్‌లో నిరాహార దీక్ష చేస్తున్న షర్మిల ఆరోగ్యం క్షణక్షణం క్షీణిస్తోందని, చాలా ప్రమాదకరమైన అనారోగ్య లక్షణాలు పొడసూపుతున్నాయని, దీర్షకాలంగా నిరాహారంగా ఉండడమే దీనికి కారణమని డాక్షర్లు అంటున్నారని, షర్మిల కోసం నా అణువణువూ దు:ఖంతో నిండిపోయింది. ఎవరీ షర్మిలా? ఎన్నో వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న  ఆమె కోసం మనసెందుకు ఇంత ఆరాటపడుతోంది? కళ్ళలోంచి జలాజలా కన్నీళ్ళెందుకు ఉబికి వస్తున్నాయి?
షర్మిలా ఇరామ్‌ పేరు తలుచుకుంటేనే ఒక ఉత్తేజం, ఉద్వేగం కలుగుతాయి. ఆమెను చూడగలిగితే...ఇంకెంత సంతోషం కలుగుతుంది. నిలువెత్తు త్యాగం, నిర్ధుష్టమైన ఆచరణ ఆమెను ఆకాశమంత ఎత్తులో నిలిపాయి. పది సంవత్సరాలుగా నోటి ద్వారా ఎలాంటి ఘన ఆహారం తీసుకోకుండా మణిపూరి ప్రజల కోసం నిరాహార దీక్ష చేస్తున్న షర్మిల ఇరామ్‌ జీవితం ఎంతో ఆదర్శపూరితమైంది.
 నేను 2009 మార్చిలో జాతీయ స్థాయి మహిళా జర్నలిస్ట్‌ల సమావేశంలో పాల్గొనడానికి  మణిపూర్‌ రాజధాని ఇంఫాల్‌ వెళ్ళాను. మార్చి…

పి సి పి ఎన్ డి టి చట్టం మీద ఒక రోజు మీటింగ్ ( ఆడపిండాల హత్యలకు వ్యతిరేకంగా )

Image
Dear Friends,

Greetings from Bhumika Women's Collective!

We would like to inivite you all for a One Day State Level Consultation on "Pre-Conception & Pre-Natal Diagnostic Techniques Prohibition of Sex Selection" (PC PNDT) Act on November 5th 2011 at Minerva Grand, RP Road, Secunderabad from 10:00 am - 4:00 pm.

Kindly confirm your participation along with the number by today (November 1st 2011).

Look forward to meet you all.

Regards,

K. Satyavathi
Chief Functionary
Bhumika Women's Collective
Mob: 9618771565


జహంగీర్ దర్గాకెళ్ళి మట్టి కుండల్ని కొనుక్కొచ్చిన వైనంబెట్టిదన....

Image
ఈ ఆదివారం ఏదైనా ప్రత్యేక కార్యక్రమం చెయ్యాలనిపించింది.
ఇంట్లో నా సహచరుడు కూడా లేడాయే.
ఒక్కదాన్ని ఏం చేయ్యాలా అని ఆలోచిస్తుంటే ఎటైనా లాంగ్ డ్రైవ్ కి వెళదామా అనిపించింది.
జహంగీర్ దర్గాకి వెళ్ళాలని నిర్ణయించాను.
మా బంగ్లా లో ఉండే పిల్లల్ని కూడా  వెంటేసుకుని పదకొండింటికి నేనే డ్రైవ్ చేస్తూ బయలుదేరా.
జహంగీర్ దర్గా హైదరాబాదుకి దాదాపు నలభై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది.
షం షాబాద్ దాటాక కొత్తూర్ దగ్గర  ఎడంవైపు తిరిగి ఐదు కి.మీ లోపలికళ్ళాలి.
రోడ్డు బావుంది.ఓ గంటలో దర్గా చేరాం.జనంతో కిటకిట  లాడుతోంది.
జనాలు భాజా భజింత్రీలతో ఊరేగింపుగా వస్తున్నారు.
ఈ దర్గాలో ముస్లిం ల కన్న హిందువులు ఎక్కువగా కనబడ్డారు.
దర్గా లోపలికి మహిళలకి ప్రవేశం లేదంటూ బోర్డులు పెట్టారు.
అంటే దర్గా బయట  వారికోసం ద్వారం ఉంది.లోపలికి రానివ్వరు.
కానీ విచిత్రంగా తమని రానివ్వని దర్గాకి మహిళలే ఎక్కవ రావడం కనిపించింది.
జనాలు దేవుళ్ళుగా కొలిచే  వాళ్ళు కూడా లింగ వివక్షతని చూపించడం ఎంత దారుణమో కదా!!


దర్గా సంగతి వదిలేస్తే నేను ఎప్పటి నుండొ కొనుక్కోవాలనుకుంటున్న నల్ల మట్టి కుండలు,దాకలు,పాలుకాచుకునే కుండలు బోలెడన్ని కొనుక్కొచ్చుకున్నాను.…

తలకోనలో తకిట తకిట తందానా

Image
తలకోన జలపాతంలో జలకాలాడాకా
ఆ అడవిలో ఎత్తైన చెట్లకి కట్టిన వంతెన మీద చిందేసినప్పటి చిత్రం

బంతి పూలతో దీపావళి శుభాకాంక్షలు.

Image
మితృలందరికీ దీపావళి శుభాకాంక్షలు.
ఈ బంతి పూలు మా గార్డెన్ లో పూసినవి.
 ఉదయం ఓ గంప నిండా కోసి ఈ శుభాకాంక్షలు  రాసి ఫోటో తీసాకా అందరికీ పంచేసాను.
మీ కోసం ఈ ఫోటో.

ఉత్తరం ఉత్త కాయితమేనా???

ఈ మధ్య ‘హిందూ’, న్యూస్‌ పేపర్‌లో ప్రతీ ఆదివారం ప్రచురించే ‘ఒపెన్‌పేజీ’లో ఉత్తరాల మీద చాలా అర్థవంతమైన చర్చ జరిగింది.

ఉత్తరాల ప్రేమికురాలిగా నేను ఆ చర్చనంతా చదివాను. మ్యూజియమ్‌లో వస్తువులాగా మారిపోయిన ఉత్తరం గురించి బాధపడుతూ ఒకాయన చాలామంచి వ్యాసం రాసారు. ఆయన్ని సమర్ధిస్త్తూ బోలెడన్ని వ్యాసాలు, ఉత్తరాలు ఎడిటర్‌కి వచ్చాయి. వాటన్నింటిని చదువుతుంటే చాలా సంతోషమన్పించింది. నాలాంటి ఉత్తరాల పిచ్చివాళ్ళు ఇంకా చాలామందే వున్నారని సంబరమన్పించింది.
ఉత్తరం ఉత్త కాయితమేనా? కార్డు, ఇన్‌లాండ్‌ కవర్‌, ఎన్వలప్‌ ఈ మూడు సమాచార వాహికలు, ఈ సమాచారాన్ని మోసుకొచ్చే పోస్ట్‌మేన్‌/ వుమెన్‌ మన జీవితాల్లో ఏదో ఒక సందర్భంలో ప్రభావం చూపి వుంటాయి. బహుశ ఈ తరానికి చెందిన వాళ్ళకి ఉత్తరంతో అంత గాఢమైన అనుబంధం ఉండకపోవచ్చు. చిట్టి పొట్టి ఉత్తరాల, ఇ మెయిళ్ళ యుగమిది. వాళ్ళ కమ్యూనికేషన్‌ అంతా ఎలక్ట్రానిక్‌ వస్తువులద్వారానే. పోస్ట్‌మేన్‌/వుమెన్‌ వాళ్ళకేమీ కాడు. పోస్ట్‌మేన్‌/వుమెన్‌ కోసం ఎదురు చూడడటమంటే ఏంటో కూడా వాళ్ళకి అనుభవం కాదు. ఉత్తరం రాయడం, డబ్బాలో వేయడం, అవతలి వాళ్ళు అందుకోవడం, తిరిగి సమాధానం రాయడం. ఈ మొత్తం ప్…

ఈ గ్రామీణ స్త్రీలు అద్భుతమైన సోషల్ వర్కర్స్

Image
ఈ ఫోటో లో ఉన్న దాదాపు వంద మంది మహిళలకు నేను రెండు రోజులుగా ట్రైనింగ్ ఇస్తున్నాను.
ఈ రోజు సాయంత్రం శిక్షణ ముగిసిన సందర్భంగా తీసిన గ్రూప్ ఫోటో ఇది.
వీరంతా కస్తూరిబా గాంధి బాలికల  రెసిడెన్సియల్  పాఠశాలకి వారానికి ఒక సారి వెళ్ళి ఆ బాలికల బాగోగులు, వారేమైనా సమస్యల్ని
ఎదుర్కొంటున్నరా అని విచారిస్తారు.వారికి కౌన్సిలింగ్ ఇస్తారు.
వీరిని ఆంధ్ర ప్రదేశ్  ప్రభుత్వం సర్వ శిక్షా అభియాన్ ప్రోగ్రాం కింద నియమించింది.
వారందరికి  అడాల్సెంట్ బాలికలు ఎదుర్కునే అంశాల మీద,వారి సమస్యల మీద,బేసిక్ కౌన్సిలింగ్ స్కిల్స్ మీద   రెండు రోజుల శిక్షణ నివ్వడడం జరిగింది.