నైమిషంలో నిశ్శబ్దపు అనుభవంఈ రోజు ఉదయమే నేను అబ్బూరి చాయాదేవి గారు,సుజాతా మూర్తి గారు
కలిసి ఘటకేస్వర్ దగ్గరున్న కొండాపూర్ లో నిర్మించిన జిడ్డు కృష్ణ మూర్తి సెంటర్ నైమిషం కెళ్ళాం.
నేనే డ్రైవ్.
నైమిషం చాలా బాగుంది.16 ఎకరాల విస్తీర్ణంలో  చాలా సౌందార్యత్మకంగా కట్టారు.
బోలెడన్ని చెట్లు,రకాల పక్షులు,ఆవులు,దూడలు ఉన్నాయి.
అక్కడే పండించిన కూరగాయలతో ఆవు పెరుగుతో కమ్మటి భోజనం పెట్టారు.ఓ గంట సేపు తోటంతా నడిచాము.
సెంటర్లో ఉన్న బ్రిజేష్ కృష్ణమూర్తి గారి వీడియోలు చూపించారు.
తిరుగు ప్రయాణంలో గీత వాళ్ళింటికి  వెళ్ళేం.
అక్కడే సంపూర్ణ చంద్ర గ్రహణం చూసాం.
గీత పెట్టిన వేడి వేడి మేతి పరోటాలు,గుత్తి వంకాయ కూర తినేసి ఇంటికి బయలు దేరాం.
ముందు సుజాత గారిని తర్వాత చాయా దేవి గారిని దింపేసి నెక్లెస్ రోడ్లో గ్రహణం విడుతున్న దృశ్యాలు చూసుకుంటూ ఇంటికొచ్చేసాను.
చాయా దేవి గారు ఎనభైలకి,సుజాత గారు డెబ్బైలకి దగ్గర వయసున్న వారు.
ఈ రోజు వారిద్దరితో చాలా హాయిగా గడిచింది.

Comments

Popular posts from this blog

‘వైధవ్యం’ – రసి కారుతున్న ఓ రాచపుండు

అమ్మ...అమెరికా

అశోకం