Posts

Showing posts from June, 2007
మధ్యాహ్నం ముసురు నన్ను ఇంట్లోనే కట్టిపడేసింది.చెయ్యాల్సిన పనులెన్నో ఎదురు చూస్తున్నా అలాగే ధారలుగా కురుస్తున్న వానని చూస్తూ కూర్చున్నాను.చెట్లన్నీ తలారా స్నానాలు చేస్తూ పచ్చగా మెరిసిపోతున్నాయి.సంపెంగ చెట్టు నిండా పూసిన సగం తెలుపు పూలు పరిమాళాలని వెదజల్లుతున్నాయి.నేను వర్షంలో తడుస్తూనే కొన్ని సంపెంగ పూలు కోసుకొచ్చుకున్నాను. నా చుట్టూ కమ్ముకున్న సంపెంగ పరిమళం.
ఇంకొంచం వానలో తడిసి తోటకటు వైపు వెళ్ళాను.అబ్బ!పొగడ పూల చెట్టుకింద నక్ష త్రాల్లా పరుచుకున్న పొగడపూలు.ఆ పూలన్నింటిని ఏరుకొచ్చి సంపెంగల పక్కన పోసాను.నా చుట్టూ ఓ వింతైన పరిమళం.
వర్షపు ధార పరవశం ఒకవైపు,మరో వైపు ఈ పూల పరిమళం .ఈ మధాహ్నం ఇంట్లో ఉన్నందుకు ఎంతో హాయి.
Image
ఫోనులో… సాంత్వన !
భూమిక జూన్ 2007


జీవితమన్నాక ఎన్నెన్నో సమస్యలు…వాటినెదుర్కొని ముందుకు సాగాలనే అందరి ప్రయత్నమూ. కానీ ఒక్కోసారి ధైర్యం సన్నగిల్లుతుంది. మనసంతా చీకటి ఆవరిస్తుంది. ఎవరితో చెప్పుకోవాలో తెలియదు. ఒక్కోసారి ఇక చాలు… ఈ లోకం నుంచి నిష్క్రమిద్దామని కూడా అన్పించవచ్చు. అలాంటి వారికి నేనున్నానని ఎవరైనా అండగా నిలబడితే… నాలుగు మంచి మాటలతో మెరుగైన భవిష్యత్తుపై చిగురంత ఆశ కలిగేలా చేస్తే… ఆ పనే చేస్తోంది భూమిక హెల్ప్‌లైన్‌.

కేవలం టెలిఫోన్‌లో మాట్లాడడం ద్వారా కొంతకాలంలోనే ఎంతోమంది జీవితాల్లో వెలుగు తేగలిగిన ఈ హెల్ప్‌లైన్‌ ఇప్పుడు ఎందరికో స్ఫూర్తి అయింది. సంఘసేవ పట్ల ఆసక్తి కల కొందరు ఆయా ప్రాంతాల్లో సొంతంగా ప్రారంభించగా, వెలుగు పథకం కింద జిల్లాల్లో ఇలాంటి హెల్ప్‌లైన్స్‌ ఏర్పాటుచేయడానికి ప్రభుత్వం తరఫునా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఒక్కో జిల్లా నుంచీ ఐదుగురు సభ్యులను ఎంచుకుని వారికి శిక్షణ ఇచ్చే బాధ్యతను కూడా భూమిక హెల్ప్‌లైన్‌ చేపట్టింది. ఈ నేపథ్యంలో హెల్ప్‌లైన్‌ గురించి వ్యవస్థాపకురాలు కొండవీటి సత్యవతి ‘వసుంధర’కు వివరించారు.

‘భూమిక’ తోనే మొదలు

‘పదిహేనేళ్లుగా నేను భూమిక పత్రిక ద్వారా స్త్రీ సమ…
Image
వెన్నెల పుష్పం

నిన్న అర్ధరాత్రి మా గార్డెన్లో ఓ అద్భుతం జరిగింది.ఈ అద్భుతం గురించి ఇంతకు ముందు విని ఉండడం వల్ల నేను 12 గంటలవరకు మేలుకుని కెమేరాతో సహ కాపు కాసి ఆ పువ్వు విచ్చుకోవడం ఫోటో తీసాను.అద్భుతమైన ఆ పువ్వు కొన్ని గంటలు మాత్రమే ఉండి తెల్లారేపాటికి తొటకూర కాడలా వేలాడిపోయింది. వెన్నెలంత తెల్లగా ఎంతో అందంగా ఉన్న ఆ పువ్వు అంత తొందరగా వాడిపోవడం నాకు చాలా బాధ కలిగించింది. ఈ మొక్కను నేను అస్సాంలోని గౌహతి నుంచి తెచ్చి మా గార్డెన్లో వేసాను. వాళ్ళు చెప్పిన పేరు రాత్కి రాణి,రేరాణి అని. నేను మత్రం వెన్నల పుష్పం అని పేరు పేట్టాను. ఈ పువ్వు అసలు పేరు తెలిస్తే ఎవరైనా చెబుతారని బ్లాగ్లో పెట్టాను.
Image
Opinion: Baby Servants of Baba Logs


By Malvika Kaul

New Delhi,(Women's Feature Service) Every other day I come across the baba-logs and their baby servants. The babas (girls and boys) are barely three or four years old, and their baby servants never more than 10 or 12. Sometimes, the baby servant is carrying the bawling baba, while mamma - usually a young woman who probably hits the gym on the weekends and is a newly-turned vegan - is carrying shopping bags while negotiating her way in a crowded market.
Often, the two young things can be seen in the park, the older one (the help) is keeping a watch on the younger one. And sometimes, I see them in people's kitchens, struggling to boil milk for the screeching baby. Struggling because their small frames barely reach high enough to see whether the milk has boiled, which means they have to wait for it to boil over and then react lightning quick. Surely, all the above activities are illegal - the anti-Child Labour (Prohibition and Reg…
Image
ఒంటరి దీవులు

జీవితం పూడ్చలేని ఓ అగాధంలా మారుతోంది
దేనితో పూడ్చాలి ఈ అగాధాన్ని?
జనం ఇరుకిరుకు గూళ్ళల్లోంచి బయటపడి
రోడ్ల మీద చీమల్లా పాకుతున్నారు
నోళ్ళు తెరుచుకుని నిలబడ్డ మహా మాల్స్
ఈ జనాన్ని అమాంతంగా మింగేస్తున్నాయ్
వందలాది వెర్రి మొర్రి చానల్స్
కంటి రెటీనా మీద కబ్జా చేస్తున్నయ్
ఇంటెర్నెట్ మహా మాయ
నరనరాల మీద నాట్యం చేస్తోంది
మొబైల్ ఫోన్ల మహ ప్రవాహం
చెవుల్లోంచి గుండెల్లోకి జారి
అయిస్ లా గడ్డకడుతోంది
"ఎవరికి వారౌ స్వార్హంలో
హ్రుదయాలరుదౌ లోకంలో"
నా కారు,నా చానెల్, నా మొబైల్, నా ఎఫ్.ఎం,
నా ఏ టి ఎం,నా ఇంటెర్నెట్, నా బాంక్ బాలెన్స్
ఇలా "నా"చుట్టూ గిరికీలు కొడుతున్నాం
మనం స్రుష్టించిన అద్భుత టెక్నాలజీ
మనల్నెంత ఒంటరుల్ని చేస్తోంది
"మన" ని "మనిషి" ని మర్చిపోయి
ఎవరికి వారం ఒంటరి దీవులమౌతున్నాం
తోటి మనిషి మాత్రమే పూడ్చగలిగిన
ఈ అగాధాలను
మార్కెట్లను ముంచెత్త్తుతున్న
మహా మాల్స్ లోని మహా చెత్త పూరిస్తుందా
మరింత అగాదగాన్ని స్రుష్టిస్తుంది తప్ప
మానవీయతని ప్రోదిచేస్తుందా
మానవీయ కోణాన్ని ఆవిష్కరిస్తుందా చెప్పండి.