Posts

Showing posts from August, 2009

రావు బాలసరస్వతి గారి 81 వ జన్మదిన వేడుక

Image
నిన్న అంటే 28 న ప్రముఖ లలిత,సినీ సంగీత గాయకురాలు రావు బాలసరస్వతి గారి 81 వ జన్మదిన వేడుకలు సికింద్రాబాద్ లోని తాజ్ త్రీ స్టార్ హోటల్ ల్లో ఉత్సాహంగా,సరదగా జరిగాయి. ఆమెకు ఆత్మీయులైన అతికొద్ది మందినే ఆవిడ ఆహ్వానించారు."నువ్వు రాకపోతే చూడు దొంగా" అంటూ నన్ను ప్రేమగా పిలిచారు.ఆవిడ పాటలంటే ప్రాణం కాబట్టి నేను సంతోషంగానే వెళ్ళేను.నా ఫ్రెండ్ గీత నాతో వచ్చింది. మూర్తి,విజయలక్ష్మి,చైత్ర వంటి గాయకులు వచ్చారు. సురేఖా మూర్తి బాలసరస్వతిగారు గానం చేసిన,అత్యంత ఆదరణ పొందిన "ఆ తొటలోనొకటి ఆరాధానాలయము ఆ ఆలయములోని అందగాడెవరే" పాటని అద్భుతంగా పాడారు.విజయలక్ష్మి దేవదాసు లోని పాటను పాడి వినిపించారు.చైత్ర "ఈ చల్లని రేయి తిరిగి రానేరాదు నీ చక్కని మోము చూడ తనివి తీరదు" పాటని చక్కగా పాడింది. ఆ తర్వాత బాలసరస్వతి గారు కేక్ కట్ చేసి మా అందరి బలవంతం మీద "రెల్లు పూల పానుపుపై జల్లు జల్లు గా ఎవరో చల్లినారమ్మా వెన్నెల చల్లినారమ్మా"పాటని ఆ హోటల్ హాల్లో వెన్నెల్ని కురిపిస్తూ,అత్యంత మాధుర్యంగా పాడారు. ఆ తర్వాత అందరం భోజనాలు చేసాం. 81 సంవత్సరాల వయస్సులో కూడా ఎంతో ఉత్సాహంగా,జో…

గర్భసంచుల్ని కోల్పోయిన 100 మంది ఆడవాళ్ళు

Image
నేను ఈ మధ్య ఒక సంస్థ వారు ఏర్పాటు చేసిన ఒక సమావేశానికి హాజరవ్వడం కోసం మెదక్ జిల్లా సదాశివపేట దగ్గర ఒక గ్రామానికి వెళ్ళాను. నేను చెప్పైన సంస్తకు చెందిన ఒక డాక్టర్ ఆ గ్రామంలో హిస్ట్రెక్టమి (గర్భ సంచుల తీసివేత)చేయించుకున్న స్త్రీలతో పని చేస్తున్నారు. ఆ సమావేశానికి దాదాపు 100 మంది మహిళలు హాజరయ్యారు. అందరూ హిస్ట్రెక్టమి చేయించుకున్న వాళ్ళే. తప్పు తప్పు చేయించుకున్న వాళ్ళు కాదు.భయానో నయానో ఒప్పించి ఒక విధంగా బలవంతపు ఆపరేషన్లకి గురిచేయబడినవాళ్ళు. కాన్సర్ వస్తుందని,పిల్లలు పుట్టాక దాని అవరంలేదు అని చెప్పి,ఇంకా రకరకాల కారణాలు చెప్పి వాళ్ళ గర్భసంచుల్ని కోసేసారట. ఒక్కొక్కళ్ళు తమ కధల్ని మాకు వినిపించారు. ఒకామెకి మరీ ఘోరంగా 19 ఏళ్ళకే తీసేసారు. ప్రస్తుతం వాళ్ళందరూ రకరకాల అనారోగ్య సమస్యలతో ఉన్నారు. నేను చెప్పిన డాక్టర్ అవిశ గింజలతో వాళ్ళకి వైద్యం చేస్తున్నారు. నేను వాళ్ళకి పోషకాహారం గురించి చెప్పాను.

తాపీ రాజమ్మ గారి తొలి వర్ధంతి సభ

Image
మొన్న ఆదివారం నేను ఓ అద్భుతమైన సమావేశానికి వెళ్ళేను.ఎక్కడనుకున్నారు?చండ్ర రాజేశ్వరరావ్ ఫౌండేషన్ కి.అక్కడ తాపీ ధర్మారావు గారి కోడలు తాపీ రాజమ్మ గారి తొలి వర్ధంతి జరిగింది.రాజమ్మ గారి కొడుకు,కూతురు ఈ సమావేశం ఏర్పాటు చేసారు. అక్కడ కొండపల్లి కోటేస్వరమ్మ గారిని,వి.హనుమంతరావు గారిని,వేములపల్లి సత్యవతి గారిని,లీలావతి గారిని,సరళా దేవిగారిని,మల్లు స్వరాజ్యం గారినీ కలవడమే కాదు వారితో కలిసి భోజనం చేసాను.ఉద్యమాల కోసం జీవితాలను త్యాగం చేసిన ఎందరో మహానుభావులను ఆ రోజు కలిసాను. తాపీ రాజమ్మ గారి గురించి, వారి జీవితం గురించి ఎన్నో అపురూపమైన విషయాలు విన్నాను. నిజంగా ఆ ఆదివారం నాకు ఎప్పుడూ గుర్తుండిపోయే అనుభవాన్నిచ్చింది.

చేనేతకి చేయూత నిద్దాం

Image
ప్రపంచ చేనేత దినోత్సవం సందర్భంగా ఈ రోజు పీపుల్స్ ప్లాజా నుండి లుంబినీ పార్క్ వరకు చేనేత కోసం నడక కార్యక్రమం జరిగింది.నేను ఈ కార్యక్రమంలో పాల్గొన్నాను."ఈభూమి" లో నేను ఒరవడి పేరుతో కాలం రాస్తున్నను.ఆగస్ట్ నెలసంచిక లో వచ్చినఆ వ్యాసం మీ కోసం.

నేను ఇటీవల మా ఊరు సీతారామపురం వెళ్ళాను. నర్సాపురానికి దగ్గరగా ఒక పక్క గోదావరి, మరో పక్క సముద్రం చుట్టి వుండే మా ఊరు వెళ్ళడమంటే నాకెప్పుడూ సంబరమే. సంతోషంగా వెళ్ళిన నేను ఒక విషాద వార్తని వినాల్సివచ్చింది. ఆ వార్త నన్ను నా బాల్యంలోకి తీసుకెళ్ళిపోయింది. అది సూర్యనారాయణ మరణ వార్త. ఆయన వయసు మీద పడే చనిపోయాడు కానీ ఆయనతో వున్న ఒకానొక అనుబంధం గుర్తొచ్చి కళ్ళల్లో నీళ్ళొచ్చాయి. చివరిదశలో దీనాతిదీనంగా, దుర్భర దారిద్య్రంతో వాళ్ళ కుటుంబం చితికిపోయిందని విన్నపుడు నాకు ఈ దేశంలోని కోట్లాది చేనేత కళాకారులు, చేనేత కార్మికులు గుర్తొచ్చారు.
సూర్యనారాయణ చేనేత కళాకారుడు. వాళ్ళ కుటుంబమంతా మగ్గం మీద పనిచేసేవాళ్ళు. మా కుటుంబం మహా పెద్దది. దాదాపు వందమంది సభ్యులున్న ఉమ్మడి కుటుంబం. మా తాత, మామ్మలకి తొమ్మిది మంది సంతానం. వాళ్ళ పిల్లలు, వాళ్ళ పిల్లలు కలిసి మా ఇల్లొక సత్రం…

భారతీయ శిక్షాస్మృతి లోని ఆర్టికల్‌ 377- డిల్లీ హైకోర్ట్ జడ్జిమెంట్

భారతీయ శిక్షాస్మృతిలోని ఆర్టికల్‌ 377 కి 149 సంవత్సరాల చరిత్ర వుంది. లార్డ్‌  మెకాలే 1860లో ఈ ఆర్టికల్‌ని ఇండియన్‌ పీనల్‌ కోడ్‌లో చేర్చారు.  ఈ ఆర్టికల్‌ ప్రకారం అసహజ లైంగిక కార్యకలాపాలకు పాల్పడే స్త్రీ పురుషులు పది సంవత్సరాల జైలు శిక్షకి, పెనాల్టీకి గురవుతారు. వారిని శిక్షించడానికి ఈ ఆర్టికల్‌ రూపొందించబడింది.  నూట నలభై సంవత్సరాలుగా  ఈ ఆర్టికల్‌ను ఉపయోగించి హోమోసెక్సువల్స్‌ని నేరస్తులుగా ముద్రవేసి హింసించడం, బ్లాక్‌మెయిల్‌ చెయ్యడం జరుగుతూ వస్తోంది. కేసులు పెట్టడం కాక ఆయా వ్యక్తులను, కుటుంబ సభ్యులను బెదిరించే పనికి పోలీసులు పూనుకోవడంతో హోమోలు భయం భయంగా బతకడం, తీవ్ర మానసిక ఆందోళనకి లోనవ్వడం జరుగుతోంది.
377కి వ్యతిరేకంగాను, ఈ ఆర్టికల్‌కి మొత్తంగా  భారతీయ శిక్షాస్మృతిలోనుంచి తీసెయ్యాలని చాలా కాలంగా నిశ్శబ్ద ఉద్యమం జరుగుతోంది. చివరికి జూలై రెండు 2009 లో ఈ ఉద్యమం బహిరంగంగా రోడ్డెక్కింది. ఆర్టికల్‌ 377 భారత రాజ్యాంగంలోని సమానత్వ భావనకి విరుద్ధమని, చట్టం దృష్టిిలో అందరూ సమానమేనని ఢిల్లీ హైకోర్టు ప్రకటించడంతో వందల సంఖ్యలో హోమోసెక్సువల్స్‌, లెస్బియన్స్‌ ఢిల్లీలోని జంతర్‌ మంతర్‌ వద్ద ఆత్మగౌరవ ర్…