Posts

Showing posts from December, 2008

"రంగవల్లి విశిష్ట మహిళా పురస్కారం"

మిత్రులకి నమస్కారం.
మీతో ఓ శుభవార్త పంచుకోవాలి.
 ఈ సంవత్సరానికి గాను "రంగవల్లి  విశిష్ట  మహిళా పురస్కారం" ఇవ్వడానికి నిర్ణయించినట్టు నిర్వాహకులు తెలియచేసారు.ఈ రోజు సాక్షి, జ్యోతి పత్రికల్లో కూడా ఈ వార్త వచ్చింది.మీ కోసం సాక్షి లింక్  ఇస్తున్నాను,
http://epaper.sakshi.com/Details.aspx?id=94174&boxid=139184830

మీ పక్షాన మా అక్షరాలను మోహరిస్తూ…

Image
భూమిక ముచ్చటగా మూడో సారి నిర్వహించిన రచయిత్రుల సాహితీ యాత్ర విజయవంతమైనందుకు మాకు చాలా సంతోషంగా వుంది.
ఈ యత్రని ప్లాన్‌ చెయ్యడం, ఆ ప్లాన్‌ని తచ. తప్పకుండా అమలు చెయ్యడం కోసం మేము రెండు నెలలు శ్రమించాం

నలభై మంది వివిధ వయస్సులకు చెందిన రచయిత్రులను మూడు రోజుల పాటు కొండలెక్కించి, గుట్ట లెక్కించి సముద్రతీరాల వెంబడి సాగిన ఈ యాత్ర మిగిలిన రెండిటికంటే చాలా భిన్నమైంది. సృజనాత్మక రచనల్లో సామాజిక ఉద్యమాలను మిళితం చేయడం, జీవన్మరణ పోరాటాల్లో వున్న స్త్రీల సామాజిక ఉద్యమాల అధ్యయనం ఈ యాత్రలో ముఖ్య భూమిక పోషించాలని నేను అభిలషించాను. ఆయా ఉద్యమాలకు నాయకత్వం వహిస్తున్న వారితో, వారికి తోడ్పాటునందిస్తున్న సంస్థలతో నిరంతరం మాట్లాడుత, ఉద్యమ నేపధ్యాల గురించి, వెళ్ళాల్సిన ప్రదేశాల గుర్తింపు, ఎవరెవరిని కలవాలి, ఎలా కలవాలి, ఎక్కడ కలవాలిలాంటి అంశాల గురించి నేను గంటల తరబడి, రోజుల తరబడి మాట్లాడాల్సి వచ్చింది. ఇంతమందికి వసతి ఏర్పాట్లు, భోజన ఏర్పాట్లు ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా ప్లాన్‌ చేసుకోవాల్సి వచ్చింది.
ఇంత భారాన్ని చాలా తేలికగా, ఎక్కడా ఎలాంటి లోటు, లోపం కలగకుండా పూర్తి చెయ్యగలగడం వెనుక ఎంతో మంది మిత్రుల సహకారం, క…

ప్రకృతి, నా తల్లి వేరు వేరు కాదు నాకు

(మా అమ్మ గురించి నేను రాసిన ఈ వ్యాసంతో సహ మరో పదిహేను మంది వివిధ భాషా రచయిత్రులకు వారి వారి తల్లులతో ఉండే అనుబంధం గురించిన ఆత్మకధాత్మక వ్యాసాల సంపుటిని డా: జయశ్రీ మోహన్ రాజ్ గారు ఇంగ్లీషులోకి అనువదించారు.రూపా పబ్లికేషన్ వారు "నా తల్లి నా బలం"(My mother my strenth)
టైటిల్తో ప్రచురించారు.ఆ పుస్తకం 10వ తేదీన జూబ్లిహిల్స్ లో ని "ఒడిస్సీ" బుక్ షాప్ లో ఆవిష్కరించబడుతోంది. సమయం 6.30 టు 7.30.)

మా అమ్మ పేరు కాశీ అన్నపూర్ణ.అమ్మ పుట్టినపుడు వాళ్ళ తాత గారు కాబోలు కాశీ వెళ్ళేరట.అందుకని అలా పేరు పెట్టేరు.అమ్మకి ఒక అక్క..ఇద్దరు చెల్లెళ్ళు.వాళ్ళ నాన్నని (మా తాతయ్యని)బాబాయి అని పిలిచేది. వాళ్ళ బాబాయి గురించి చాలా చెప్పేది. గ్రామాల్లో భూస్వాములు ఎలా ప్రవర్తిస్తారో అలాగే ప్రవర్తించేవాడాయన.గుర్రం మీద తిరుగుతూ,కనిపించిన ఆడపిల్లనల్లా చెరబడుతూ ,తింటూ, తాగుతూ వుండేవాడట.మేము చూళ్ళేదు కాని అమ్మ చెప్పేది.
అమ్మకి తన పుట్టిల్లంటే ఎంతో ప్రేమ.మా అమ్మమ్మ, తాతయ్య అరాచకాలలకి,అక్రుత్యాలకి నిలువెత్తు నిదర్శనంలా ఉండేదట. చెప్పుకోలేని వ్యాధేదో ఆమెని పట్టి పీడించేదని,దానితోనే ఆమె చనిపోయిందని అమ్మ బాధ పడే…

ప్రేమ భాష్యం

ఒకరినొకరు ప్రేమించండి

అయితే మీ ప్రేమను ఆంక్షాగ్రస్తం కానీకండి

మీ ఇరువురి ఆత్మల తీరాల మధ్య

కదిలే సంద్రం కావాలి మీ ప్రేమ

ఒకే ప్రేమ చషకాన్ని ఒంపుకునేకన్నా

ఒకరికొరకై ఒకరు

వేర్వేరు మధుపాత్రలు

నింపుకోవడంలోనే ప్రేమ ఉన్నది

మీకున్నది చెరిసగం పంచుకు తినడంలో సౌఖ్యమున్నది

అలాగని ఒకే కంచంలో భుజించనక్కర లేదు

కలిసి సాగించే గాన న్రుత్యాలు స్రుజించే మేలిరకం హాయిలో

ఏకాంత విరహ సౌఖ్యాన్ని విస్మరిచరాదు సుమా!

ఒకే శబ్ద సౌందర్యాన్ని నిర్మించే వీణ తీగలు సైతం

విడి విడిగానే స్పందిస్తాయి కదా!

మనసు విప్పి మాటలు చల్లుకోవడం మహత్తరంగా ఉంటుంది

కానీ మనసు నిచ్చి పుచ్చుకోవడం అన్నది అర్ధం లేని మాట.

మనందరి ఉద్వేగాలకు,ఉల్లాసాలకు మూలాధారమైన

గుండె మనుగడ మన చేతిలో లేదన్నది నిజం కదా!

ఒకరికొకరు తోడయి సమస్యల సహారాను

సరదా సమీరాలను కలిసి స్వీకరించండి

అయితే

నిలిపి ఉంచే మూల స్పంభాలు సైతం

విడి విడిగానే ఉంటాయి చూసారు కదా!

ఆకుపచ్చని ఆరోగ్యాన్ని వెదజల్లే మర్రి చెట్టు

వేప వ్రుక్షం పరస్పర చాయలో పరిమళాలు ఒలికించవు కదా!- ఖలీల్ జీబ్రాన్ (తెలుగుసేత ఎవరో)

ఈ రోజు చిరునవ్వులు చిలికించిన చందమామని చూసారా?

Image
ఈ రోజు చిరునవ్వులు చిలికించిన చందమామని చూసారా?
భలేగా ఉంది.నా ఫ్రీండ్స్ అందరికి ఫోన్ చేసి చెప్పేను.
పిల్లలున్న అమ్మలందరికీ జ్ఞాపకం చేసా.నిజంగానే నవ్వుతున్నట్టున్న జాబిల్లిని చూడ్డం ఓ చక్కటి అనుభవం. చికిలి కళ్ళల్లా అటు ఇటు రెండు చుక్కలు నోరంతా తెరిచినట్టు చంద్రవంక.అలా కళ్ళార్పకుండా చూస్తూంటే మనవేపే చూస్తూ నవ్వుతున్నాడనిపిస్తుంది. ఆ నవ్వును చూస్తూంటే చాలా రిలాక్సింగ్ గా ఉంది.మీరంతా చూసారో లేదోకానీ నేనైతే బోలెడంత సేపు చూసి ఆనందించా.ఫోటో సౌజన్యం చక్రవర్తి గారు.