ప్రేమ భాష్యం

ఒకరినొకరు ప్రేమించండి

అయితే మీ ప్రేమను ఆంక్షాగ్రస్తం కానీకండి

మీ ఇరువురి ఆత్మల తీరాల మధ్య

కదిలే సంద్రం కావాలి మీ ప్రేమ

ఒకే ప్రేమ చషకాన్ని ఒంపుకునేకన్నా

ఒకరికొరకై ఒకరు

వేర్వేరు మధుపాత్రలు

నింపుకోవడంలోనే ప్రేమ ఉన్నది

మీకున్నది చెరిసగం పంచుకు తినడంలో సౌఖ్యమున్నది

అలాగని ఒకే కంచంలో భుజించనక్కర లేదు

కలిసి సాగించే గాన న్రుత్యాలు స్రుజించే మేలిరకం హాయిలో

ఏకాంత విరహ సౌఖ్యాన్ని విస్మరిచరాదు సుమా!

ఒకే శబ్ద సౌందర్యాన్ని నిర్మించే వీణ తీగలు సైతం

విడి విడిగానే స్పందిస్తాయి కదా!

మనసు విప్పి మాటలు చల్లుకోవడం మహత్తరంగా ఉంటుంది

కానీ మనసు నిచ్చి పుచ్చుకోవడం అన్నది అర్ధం లేని మాట.

మనందరి ఉద్వేగాలకు,ఉల్లాసాలకు మూలాధారమైన

గుండె మనుగడ మన చేతిలో లేదన్నది నిజం కదా!

ఒకరికొకరు తోడయి సమస్యల సహారాను

సరదా సమీరాలను కలిసి స్వీకరించండి

అయితే

నిలిపి ఉంచే మూల స్పంభాలు సైతం

విడి విడిగానే ఉంటాయి చూసారు కదా!

ఆకుపచ్చని ఆరోగ్యాన్ని వెదజల్లే మర్రి చెట్టు

వేప వ్రుక్షం పరస్పర చాయలో పరిమళాలు ఒలికించవు కదా!- ఖలీల్ జీబ్రాన్ (తెలుగుసేత ఎవరో)

Comments

sujji said…
చషకాన్ని ante aenti cheppagalaru..

Popular posts from this blog

‘వైధవ్యం’ – రసి కారుతున్న ఓ రాచపుండు

అమ్మ...అమెరికా

అశోకం