Posts

Showing posts from 2012

ఈ శనివారం సాయంత్రం ఈ జ్యేష్ట పౌరుల సాన్నిధ్యంలో.....

Image
ఈ రోజు సాయంత్రం ఎందుకో అబ్బూరి చాయా దేవిగారి దగ్గరికి వెళ్ళాలనిపించింది.
నాలుగింటికి వస్తానని ఫోన్ చేసాను.
వెళ్ళేసరికి నాకోసం టీ తెచ్చి ఉంచారు.
రెండు రకాల స్వీట్స్ పెట్టారు.
తను ఈ మధ్య చేసిన బొమ్మలు చూపించారు.
వాటర్ బాటిల్ తో చేసిన క్వీన్ విక్టొరియా బొమ్మ చూడండి ఎంత బాగుందో.
నడుం మీద చేతులుంచి ఎంతో కాంఫిడెంట్ గా ఉన్న ఇద్దరు ఇండియన్ వుమన్ బొమ్మలు ఎంత చూడ ముచ్చటగా ఉన్నాయో!!
ఎనభైలలో పడిన చాయాదేవి గారు ఎంత హాయిగా లైవ్లీగా ఉన్నారో మీరే చూడండి.
సి.ఆర్ ఫౌండేషన్ లో ఉన్న తన ఫ్రెండ్స్ అందరిని నాకు పరిచయం చేసారు .ఇంకొక అమ్మమ్మ గారికి తొంభై ఏళ్ళు.ఎంత హుషారుగా ఉన్నారంటే నా చెయ్యి పట్టుకుని తన రూం లోకి లాక్కెళ్ళి
తను చేసిన క్రోషో అల్లికల్ని చూపించారు.
నేను అమెరికన్ సిటిజెన్ ని నాకక్కడ అన్ని సదుపాయాలూ ఉన్నాయి కానీ నాకు ఇంగ్లీషు సరిగా రాదు.
నన్ను హాస్పిటల్ లో వేస్తే ఏ రోగమొచ్చిందో,ఎక్కడ నొప్పిగా ఉందో ఆ డాక్టర్లకి చెప్పలేనుగా అందుకే ఇండియా వచ్చేసాను.అంటూ ఒకటే నవ్వులు.


ఆవిడ నన్ను వదలకుండా పట్టుకుని రావడం వరకే నీ పని పోవడం నీ పని కాదు, నేను వదలనుగా అంటూ ఒకటే కబుర్లు.
ఆవిడకి తొంభై ఏళ్ళంటే నమ్మలేం.

ఆవిడకి బై చె…

పదహారు రోజులు కాదు… మూడొందల అరవై ఐదు రోజుల ఉద్యమం కావాలిప్పుడు

నవంబరు 25 నుండి డిసెంబరు 10 వరకు స్త్రీలపరంగా ప్రపంచవ్యాప్తంగా ఎన్నో భిన్నమైన కార్యక్రమాలు జరుగుతాయి. చాలా సంవత్సరాలుగా ఇవి జరుగుతున్నాయి. స్త్రీల మీద అమలవుతున్న హింసకు వ్యతిరేకంగా నవంబరు 25ని ‘వయొలెన్స్‌ అగెన్‌స్ట్‌ విమెన్స్‌ డే’ అంటూ మొదలుపెట్టి అంతర్జాతీయ మానవహక్కుల దినం డిసెంబరు 10తో ఈ కార్యక్రమాలు ముగుస్తాయి.ఒక్కోదేశంలో ఒక్కో కార్యక్రమం. మన దేశంలో కూడా వివిధ రాష్ట్రాల్లో భిన్నమైన ప్రోగ్రామ్‌లు చేస్తున్నారు. దీనిని 16 రోజుల ఏక్టివిజమ్‌గా కూడా పిలుస్తున్నారు. రోజుకో రకమైన హింస గురించి మాట్లాడినా గానీ ఈ రోజు స్త్రీల మీద అమలవుతున్న హింసా రూపాల గురించి మాట్లాడాలంటే ఈ పదహారు రోజులు ఏం సరిపోతాయి? ఎక్కడ మొదలు పెట్టి ఎక్కడ ఆపాలి? ఏ హింస గురించి ఎక్కువ మాట్లాడి ఏ హింస గురించి తక్కువ మాట్లాడాలి? అమ్మ కడుపులో భద్రంగా పడుకున్న పసికందుని చంపే క్రమం గురించి మాట్లాడాలా? పుట్టగానే, ఆడశిశువని తెలియగానే నోట్లో వడ్లగింజ వేసో, ముక్కు చెవులు మూసేసో చంపేసే అమానవీయత గురించి మాట్లాడాలా? సొంతపిల్లల్ని వయసు, వావి, వరస ఏమీ లేకుండా లైంగికంగా దాడి చేస్తున్న తండ్రుల గురించి మాట్లాడాలా? చదువు చెప్పాల్సిన పంతుళ్…

భూమికకు, నాకూ అవార్డుల, సన్మానాల సీజన్

Image
దశాబ్ద మహిళ అవార్డ్ (20-11-12)
డిప్యూటి సి ఎం శ్రీ దామోదర రాజనరసిమ్హ 
చేతుల మీదుగా అందుకున్నప్పటి చాయాచిత్రం

నవంబరు 21 న విజయ్ స్కూల్ టాలెంట్ షో ప్రోగ్రాం లో నేను ముఖ్య అతిధిగా పాల్గొన్నాను.
అమృతలత గారు, వారి టీం నాకు ఎంతో ఆత్మీయంగా సన్మానం చేసినప్పటి ఫోటో.
అమృతలత గారు
ఆర్మూరులో వీరు ఓ చిన్న విత్తనం నాటారు.
విత్తనం ఎప్పుడూ సజీవమైందే కదా.
పాతిన విత్తనం ఊరికే ఉంటుందా.తన పని తాను చేస్తుంది.
విత్తనం అంకురమైంది,లేలేత చిగుళ్ళు వేసింది,ఆకుపచ్చని కొమ్మలేసింది,కొమ్మ కొమ్మకీ పూలొచ్చ్హాయి, కాయలొచ్చాయి,కాయ పలకమారి,పండై మళ్ళి విత్తనాన్ని విరజిమ్మింది.
మీ విజయ ప్రస్థానం సరిగ్గా ఈ విత్తన ప్రస్థానం లాంటిదే అనిపించింది నాకు.
ఎల్ కే జి నుండి ఇంజనీరింగ్ వరకు వీరు అభివృద్ధిపరిచిన విద్యాలయాలు
ప్రతి సంవత్సరం వేలకొద్దీ ఉత్తమ విద్యార్ధుల్ని తయారుచేసి చక్కటి,సంస్కారవంతులైన పౌరులుగా సమాజం లోకి పంపిస్తున్నాయి.
వీరు తయారు చేసిన "ఆల్ వుమన్ టీం" కార్యాచరణ వెనక మీ టచ్ చక్కగానే వ్యక్తమైంది.
ఆనాటి సాయంత్రం ఎంత గాఢమైన అనుభూతిని మేము పొందామో,
ప్రేక్షకుల్ని కదలకుండా కట్టిపడేసిన పిల్లలు ఎంత అద్భుతంగా ఆ రోజు పర్ ఫార్…

కార్తీక మాసపు నెలవంక

నా మనసును పచ్చిపుండులా చేసిన 
ఒక వీధి పిల్లల సమావేశం నుంచి 
ఇంటికి తిరిగొచ్చే వేళ 
నా కళ్ళల్లోని నీళ్ళను తుడిచిన 
కార్తీక మాసపు నెలవంక
వారమంతా ఒకటే ఉరుకులు పరుగులు మీటింగులు,ఉపన్యాసాలు,శిక్షణలు
ఆరు రోజులు మనసుకు ఇష్టమైన పనులు
మరి నా సంగతేంటి అంటుంది హృదయం
నా దారంతా చెట్టు చేమా,పువ్వూ,పుట్టా
అలిసి సొలిసి ఇంటికొచ్చే వేళ
అల్లంత దూరాన సూర్యాస్తమయం
వానపడే వేళ సూర్యుడొస్తే
ఆ దారంతా రంగు రంగుల ఇంధ్రధనుస్సు
నీ కోసమేగా నా హృదయమా!
నా దారంతా పరుచుకున్నవి పచ్చని పచ్చని చెట్లేగా
నాకోసమే పూసే నాగమల్లి
నా మీద వర్షంలా కురిసే ఆకాశ మల్లి
ఇందిరా పార్కు రోడ్లో వస్తే గుబాళించే మొగలి పూలు
రామంతపూర్ రోడ్లో వెళితే సువాసనల సంపెంగ వనాలు
నెక్లెస్ రోడ్లో ఎంత సౌందర్యం ఉంది
హైదరాబాద్ లో అంతులేని కాలుష్యం ఉంది
భయంకరమైన బతుకు పోరు ఉంది
నిజమే!!
ఈ బీభత్సం మధ్య నే మనం బతకాల్సి ఉన్నప్పుడు
వొళ్ళొంచి పనిచెయ్యడం తో పాటు
కళ్ళిప్పి మనసు పెట్టి చూస్తే
మన చుట్టూ అల్లుకుకి ఎన్నెన్నో మహాద్భుతాలు
మనసుకు పట్టిన మకిలిని వదిలించే
ఆకుపచ్చని సోయగాలు
ఎటొచ్చీ అనుభవించగలిగిన
పసిప్రాయపు హృదయముండాలి.
అంతే.....
ఇంతలా కమ్ముకున్న చీకటి మధ్య
రోజుకో రేఖను కలుపుకుంటూ
కార్తీక పౌర…

విశాఖపట్నం నన్ను ఇలా సన్మానించింది.

Image
విశాఖ కి వెళ్ళింది గురజాడ మీద సమావేశం లో మాట్లాడడానికి.
తొమ్మిది నవంబర్ న రోజంతా గురజాడ సృష్టించిన స్త్రీ పాత్రల చుట్టూ తిరిగాం.
మధురవాణి,కన్యక,బుచ్చెమ్మ,నాంచారమ్మ,సరళ,సుబ్బి,మీనాక్షి,వెంకమ్మ.
చాగంటి తుల

సి,వాడ్రేవు వీరలక్ష్మి,రమాదేవి,సుధారాణి,జగద్ధాత్రి, ఒక్కో పాత్ర ఒక్కో విశ్లేషణ.
వుమన్ ఇండియా ఆర్గనైసేషన్ బాధ్యులు తాళ్ళురి సుగుణ,ఏవిఎన్ కాలేజి తెలుగుశాఖ బాధ్యురాలు అయ్యగారి సీతారత్నం,స్వాతంత్ర్య సమరయోధురాలు సరస్వతి గారు ఇంకా చాలా మంది పురుషులు వారందరి పేర్లు నాకు గుర్తులేవు.
చక్కటి సమావేశం.
సమావేశానంతరం చాగంటి తులసి గారికి నాకు సన్మానం.
నాకిష్టమైన పువ్వుల్లో ముంచెత్తారు.
నా స్నేహితురాలు జయ కూడా అక్కడ ఉండడం నాకు చాలా సంతోషమైంది.

లాడ్లి అవార్డుల ఫంక్షన్.......త్రివేండ్రం ట్రిప్

Image
2011-12 సంవత్సరానికిగాను లాడ్లీ అవార్డుల ప్రదానోత్స వం అక్టోబరు 6న త్రివేండ్రమ్‌లో జరిగింది. ఈ సంవత్సరం ఈ అవార్డులు పొందినవారు – అత్తలూరి అరుణ (హెచ్‌ఎమ్‌టి.వి) ఉమాసుధీర్‌ (ఎన్‌డిటివి) స్టెల్ లా (బ్లాగ్‌), రాజేశ్‌ (వనిత టివి),నందగిరి కిష్టయ్య (వనిత టివి), ఆంధ్రప్రదేశ్‌ గ్రామీణాభివృద్ధిశాఖ (ఎపిఎఆర్‌డి). రాజేశ్‌, కిష్టయ్యగారికి వనిత ఛానల్‌ యాజమాన్యం అనుమతి ఇవ్వనందున వారిద్దరూ అవార్డుల్ని స్వీకరించడానికి రాలేకపోయారు. నేను యాజమాన్యం వారితో మాట్లాడి కనీసం వొకరినైనా పంపమని కోరినప్పటికీ ఫలితం లేకపోవడంతో నేను, అరుణ, ఉమాసుధీర్‌ 5వ తేదీనే బయటుదేరి త్రివేండ్రం వెళ్ళాం. స్టెల్లా విదేశాల్లో వుండడంవలన రాలేకపోయింది. ‘అపార్డ్‌’ ని రిప్రజెంట్‌ చేస్తూ చంద్రమౌళి, ఐఎఎస్‌, కమీషనర్‌ గ్రామీణాభివృద్ధి శాఖ నుంచి 6 వ తేదీన వచ్చారు.

మేము ముగ్గురం త్రివేండ్రం ఎయిర్‌పోర్ట్‌లో దిగి, ‘కోవలం’ బీచ్‌ చూసుకుంటూ, మాకు రూమ్‌లు కేటాయించిన హోటల్‌కి వెళ్ళాలనుకున్నాం. ఎయిర్‌పోర్ట్‌ నిర్మానుష్యంగా వుంది. రాష్ట్ర రాజధానిలో వున్న ఎయిర్‌పోర్టులా లేదు. మన రాజమండ్రో, విజయవాడోలాగా అనిపించింది. ఫ్లయిట్‌లోంచి బయటకు రాగానే చేపలకంపు, నీచ…

ఎక్కడున్నా ఒక్కటేనా?

చుట్టూ పచ్చటి పొలాల మధ్య వుంది ఆ వృద్ధాశ్రమం. నాట్లు వేసి నెలరోజులైవుంటుంది. ఏపుగా పెరిగిన చేలు.. గట్ల మీద వరుసగా నాటిన కొబ్బరి చెట్లు. చక్కటి పరిసరాల్లో, హూందాగా నిలిచివున్న ‘జీవన సంధ్య’ ఆశ్రమం.నేను కారాపి, కిందికి దిగుతుంటే నాగరత్నంగారు ఎదురొచ్చారు.”రండి…రండి రంగారావుగారూ!” ఆవిడ గొంతు  గంభీరంగా వుంది…”నమస్తే నాగరత్నంగారూ! ఎపుడు జరిగింది””తెల్లవారుజామున నాలుగింటికి సంపూర్ణగారు వెళ్ళిపోయారు. హార్ట్‌ ఎటాక్‌ వచ్చింది.”

మహిళలు నడుపుతున్న పత్రికలు నాడు-నేడు

 -కొండవీటి సత్యవతి

తెలుగు పత్రికలకు నూట యాభై     సంవత్సరాల చరిత్ర ఉంది. మొదటి తెలుగు పత్రిక ఎప్పుడు ప్రచురితమైంది? ఆ పత్రిక ఏది? ఎవరు ప్రచురించారు అనే అంశం మీద భిన్న అభిప్రాయాలున్నాయి. ''ఆంధ్రజాతి అక్షర సంపద తెలుగు పత్రికలు'' పేరుతో శ్రీ పొత్తూరి వెంకటేశ్వరరావు గారు రాసిన పుస్తకం ప్రకారం తెలుగులో తొలి పత్రిక ''వృత్తాంతి''. ఈ పత్రిక ఆవిర్భావం జరిగింది 1832-38 మధ్య అని వారు పేర్కొన్నారు. ఈ పత్రిక వారపత్రికగా మద్రాసు నుంచి ప్రతి గురువారం వెలువడేది. మండిగ వెంకట రాయశాస్త్రి ''వృత్తాంతి'' సంపాదకులు. ఆ తరువాత 1878 సంవత్సరంలో కందుకూరి వీరేశలింగం రాజమండ్రిలో స్థాపించిన ''వివేక వర్ధని' పత్రికను గురించి ప్రముఖంగా చెప్పుకోవాలి. వీరేశలింగం పంతులు పత్రికల్ని ఒక ఉద్యమంలా నిర్వహించాడు. స్త్రీల కోసం కూడా వీరేశలింగం ఒక పత్రికను ప్రారంభించాడు. దానిపేరు ''సతీహిత బోధిని'' ఇది మాసపత్రిక. స్త్రీల ఆరోగ్యం, నీతి సూత్రాలు, భార్యలుగా స్త్రీల విద్యుక్త ధర్మాలు మొదలైన వాటిమీద ఈ పత్రికలో వ్యాసాలుండేవి.

    తెలుగులో తొలి తెలుగు పత్రిక 'వ…

వర్షం చల్లిన ఈ ముత్యాలసరాలు మీ కోసమే!!

Image
వర్షం కురుస్తున్నప్పుడు ఎంత బావుంటుదో
కురిసాకా ఈ ముత్యాలను చూడ్డం మరింత బావుంటుంది కదా!
వర్షం చల్లిన ఈ ముత్యాలసరాలు మీ కోసమే!!