ఈ రోజు సాయంత్రం ఎందుకో అబ్బూరి చాయా దేవిగారి దగ్గరికి వెళ్ళాలనిపించింది.
నాలుగింటికి వస్తానని ఫోన్ చేసాను.
వెళ్ళేసరికి నాకోసం టీ తెచ్చి ఉంచారు.
రెండు రకాల స్వీట్స్ పెట్టారు.
తను ఈ మధ్య చేసిన బొమ్మలు చూపించారు.
నాలుగింటికి వస్తానని ఫోన్ చేసాను.
వెళ్ళేసరికి నాకోసం టీ తెచ్చి ఉంచారు.
రెండు రకాల స్వీట్స్ పెట్టారు.
తను ఈ మధ్య చేసిన బొమ్మలు చూపించారు.
వాటర్ బాటిల్ తో చేసిన క్వీన్ విక్టొరియా బొమ్మ చూడండి ఎంత బాగుందో.
నడుం మీద చేతులుంచి ఎంతో కాంఫిడెంట్ గా ఉన్న ఇద్దరు ఇండియన్ వుమన్ బొమ్మలు ఎంత చూడ ముచ్చటగా ఉన్నాయో!!
ఎనభైలలో పడిన చాయాదేవి గారు ఎంత హాయిగా లైవ్లీగా ఉన్నారో మీరే చూడండి.
సి.ఆర్ ఫౌండేషన్ లో ఉన్న తన ఫ్రెండ్స్ అందరిని నాకు పరిచయం చేసారు
.ఇంకొక అమ్మమ్మ గారికి తొంభై ఏళ్ళు.ఎంత హుషారుగా ఉన్నారంటే నా చెయ్యి పట్టుకుని తన రూం లోకి లాక్కెళ్ళినడుం మీద చేతులుంచి ఎంతో కాంఫిడెంట్ గా ఉన్న ఇద్దరు ఇండియన్ వుమన్ బొమ్మలు ఎంత చూడ ముచ్చటగా ఉన్నాయో!!
ఎనభైలలో పడిన చాయాదేవి గారు ఎంత హాయిగా లైవ్లీగా ఉన్నారో మీరే చూడండి.
సి.ఆర్ ఫౌండేషన్ లో ఉన్న తన ఫ్రెండ్స్ అందరిని నాకు పరిచయం చేసారు
తను చేసిన క్రోషో అల్లికల్ని చూపించారు.
నేను అమెరికన్ సిటిజెన్ ని నాకక్కడ అన్ని సదుపాయాలూ ఉన్నాయి కానీ నాకు ఇంగ్లీషు సరిగా రాదు.
నన్ను హాస్పిటల్ లో వేస్తే ఏ రోగమొచ్చిందో,ఎక్కడ నొప్పిగా ఉందో ఆ డాక్టర్లకి చెప్పలేనుగా అందుకే ఇండియా వచ్చేసాను.అంటూ ఒకటే నవ్వులు.

ఆవిడ నన్ను వదలకుండా పట్టుకుని రావడం వరకే నీ పని పోవడం నీ పని కాదు, నేను వదలనుగా అంటూ ఒకటే కబుర్లు.
ఆవిడకి తొంభై ఏళ్ళంటే నమ్మలేం
.
ఆవిడకి బై చెప్పి వస్తుంటే ఇదిగో వీళ్ళ పైలా పచ్చీసు ఆట.జొకులు ,నవ్వులు.
ఈ అమ్మమ్మ గారు హాయిగా ఫోన్ లో ముచ్చట్లు.

ఓ గంట వారందరితోను గడిపి శాంతసుందరి గారింటికి బయలుదేరాను.
శాంతసుందరి గారు కొడవటిగంటి కుటుంబరావు గారి అమ్మాయి.
నేను వారింటికి వెళ్ళి కూర్చుంటుండగానే వరూధిని గారు వచ్చి మాదగ్గర కూర్చున్నారు.
కుటుంబ రావు గారి సహచరి వరూధిని గారని మీలో చాలా మందికి తెలుసనే నేను అనుకుంటున్నాను.
వరూధిని గారి కబుర్లు,సూటిగా వుండే వారి మాటలు వినాల్సిందే.
ఓ గంట సేపు నవ్వి నవ్వి నాకు పొట్టలో నొప్పి వచ్చింది.
సమకాలీన మతాధిపతులు,రాజకీయ నాయకులు,టీవీ సీరియళ్ళు,యాంకర్ల వెర్రిమొర్రి వేషాలు,హిందు పేపర్ లో వార్తల నాణ్యత,
భారతీయుల్లో పొంగి పొర్లుతున్న భక్తి రసం
ఆత్మ విశ్వాసం లేని అణుశాస్త్రవేత్తలు వరూధిని గారి మాటల ప్రవాహం లో గిలగిల్లాడారు.
ఆవిడ సెన్సాఫ్ హ్యూమర్ విని తీరాల్సిందే కానీ నేను చెప్పడం కుదరదు.
ఈ శనివారం సాయంత్రం ఈ జ్యేష్ట పౌరుల సాన్నిధ్యంలో వారి అద్భుతమైన మాటలు వింటూ,చర్యలు చూస్తూ గడపగలగడం అబ్బో నాకు ఎంత సంతోషమైందో చెప్పలేను.
ఆ సంతోషాన్ని మీకూ పంచాలనే నా ప్రయత్నం.

3 comments:
సత్యవతిగారూ,
ముందుగా Senior citizens (or August citizens?) కి మీరు వాడిన జ్యేష్ఠ పౌరులు అన్న పదం చాలా బాగుంది. అది తప్పకుండా వ్యాప్తిలోకి తీసుకు రావచ్చు. ఇక్కడ ప్రస్తావించిన వాళ్లందరి Human Spiritకీ నమోవాకాలు.
అభివాదములతో
మీరన్న జ్యేష్ఠ పౌరులు అన్న పదం నాకు చాలా నచ్చింది. అంత చురుకుగా వున్న వారందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నాను.

Post a Comment