Posts

Showing posts from March, 2010

స్త్రీల అంశమే ఊపిరై కడదాకా సాగాల్సిందే.

Image
కొండవీటి సత్యవతి
1975 సంవత్సరం. మా నాన్న మా ఆవుపాలు పిండుతుంటే నేను లేగదూడను పట్టుకుని నిలబడ్డాను. రేడియోలో ఢిల్లీ నుండి వచ్చే ఏడుగంటల వార్తలు వస్తున్నాయి. ఆ సంవత్సరాన్ని అంతర్జాతీయ మహిళా సంవత్సరంగా ప్రభుత్వం ప్రకటించిందని వార్తల్లో చెబుతూ స్త్రీల కోసం ఎన్నో సరికొత్త కార్యక్రమాలు చేపట్టబోతున్నారని తెలియచెప్పాడు న్యూస్‌రీడర్‌. పాలుపిండడం అయిపోయింది. నేను దూడను వదిలేసాను. అది చెంగుమంటూ ఎగిరి తల్లి పొదుగులో దూరిపోయింది. ఆ రోజు ఉదయం రేడియోలో చెప్పిన మహిళా సంవత్సరం వార్త మా నాన్న బుర్రలో చేరిపోయింది. నేను డిగ్రీ పూర్తిచేసి ఇంట్లో ఉన్నాను. 'పద హైదరాబాద్‌ పోదాం నీకు ఉద్యోగం వచ్చేస్తుంది' అన్నాడు. హైదరాబాదా? నేను అప్పటికి పక్కజిల్లాకి కూడా పోలేదు. సరే అన్నాను. నాకున్న రెండో, మూడో చీరలు బాగులో పెట్టుకుని మా నాన్నతో కలిసి మహానగరంలోకి వచ్చేసాను.
హుస్సేన్‌సాగర్‌ పక్కన పాటిగడ్డ కాలనీ. మా చిన్నాన్న ఇంటికి వచ్చేసాం. అప్పటికే ఆ ఇంట్లో నాలాంటివాళ్ళు నలుగురు ఉన్నారు. మా చిన్నమ్మ, చిన్నాన్నల హృదయాలు విశాలమైనా, క్వార్టర్‌ మాత్రం మహా ఇరుకు. అందరం అందులోనే సర్దుకున్నాం. నన్ను దింపేసి మానాన్న వెళ్ళి…

హమ్మో!!!! ఎన్ని మోదుగపూలో !!!!!

Image
మార్చి ఎనిమిది మీటింగులో ప్రసంగించి
నేనూ నా నేస్తం సిద్దిపేటకెళ్ళి వస్తుంటే
కరీంనగర్ రహదారిలో కన్నులపండుగగా మోదుగపూలు.
కాదు కాదు మోదుగ వనాలు .
ఒకటా రెండా హమ్మో ఎన్ని వనాలో !
మోదుగపూలని
కావలించుకుని ఫోటో దిగితే కాని తనివి తీరలేదు.
నేనూ నా ఫ్రెండూ
ఒకటే కేరింతలు,తుళ్ళింతలు
అడవి అంటుకుందా అనిపించేలా
ఎర్రని మంటల్లా మోదుగపూలు
మండుటెండలో కూడా మమ్మల్ని సమ్మోహపరిచిన
మళ్ళీ మళ్ళీ రమ్మంటూ మత్తులో ముంచెత్తే
మోదుగ పూలు

ఓ భార్య రాసిన కవిత

నేను వండిన కూర అతనికి నచ్చలేదు
నేను చేసిన కేకూ నచ్చలేదు
అతనన్నాడు
నేను చేసిన బిస్కట్లు గట్టిగా ఉన్నయని
వాళ్ళ అమ్మ చేసినట్టు లేవట
నేను కాఫీ కూడా సరిగ్గా చెయ్యలేదట
ప్రేమగా చేసిన స్వీటూ నచ్చలేదు
అతని తల్లి మడత పెట్టినట్టుగా
అతని బట్టలు నేను మడత పెట్టలేదట
నేను వీటన్నింటికి సమాధానం ఏంటీ అని వెతుకుతుంటే
ఒక క్లూ కోసం మధనపడుతుంటే
అతని తల్లి చేసినట్టే నేను ఏమైనా చెయ్యగలనా
అని ఆలోచిస్తుంటే
నా పెదవులమీద చిరుదరహాసం మొలకెత్తింది
ఓ వెలుగు కిరణం నా కళ్ళ ముందు కదలాడింది
ఓ పని ఖచ్చితంగా
వాళ్ళ అమ్మ చేసినట్టు
చెయ్యగలననిపించి
చాచి ఓ లెంపకాయ్ అతని చెంప మీద వేసాను.
వాళ్ళ అమ్మ ఎప్పుడూ చేసేలా

అనుసృజన:సత్యవతి కొండవీటి
(రచయిత్రి ఎవ్వరో తెలియదు)

మాలో ఉన్న మనసు మాకు గాక ఇంకెవరికి తెలుసు?

http://www.andhrajyothy.com/navyaNewsShow.asp?qry=2010/mar/7/navya/7navya1&more=2010/mar/6/navya/navyamain


ఈసారి జుగల్‌బందీ ఎవరితో?
సంధ్య..
ఏ సంధ్య?
ప్రగతిశీల మహిళా సంఘం సంధ్య. పీఓడబ్ల్యూ సంధ్య.
అబ్బో ఫైర్‌బ్రాండ్. దులిపిపారేస్తుంది. నిప్పులు చెరుగుతుంది.
తర్వాత?
'భూమిక' ఎడిటర్ కొండవీటి సత్యవతి.
అవునా... ఆడవాళ్ల కోసం హెల్ప్‌లైన్ నడుపుతుంది... ఆవిడేగా...
అవును వాళ్లిద్దరే. రాష్ట్రంలో మహిళలకు, తెలుగు ఛానెళ్ల ప్రేక్షకులకు వీరిద్దరూ బాగానే తెలుసు. స్త్రీల సమస్యల మీద తక్షణం స్పందించే సంధ్య, సత్యవతులు ఫైర్‌బ్రాండ్సే. వాళ్లలో మామూలు మహిళలకుండే భావోద్వేగాలు లేవా? అందరి తరఫునా మాట్లాడే వాళ్ల అసలు స్వరం వినిపించినదెక్కడ? వాళ్ల మనసు సంగతులు ఎందరికి తెలుసు? వందేళ్ల అంతర్జాతీయ మహిళాదినోత్సవం సందర్భంగా ఈ జుగల్‌బందీ 'నవ్య'కు ప్రత్యేకం.

సత్యవతి : అంతర్జాతీయ మహిళా దినోత్సవంతో నా జీవితం తెలియకుండానే ముడిపడింది. '75 అంటే ముప్ఫై ఐదేళ్ల క్రితం ఒక మార్చిలో ఉదయం నేనూ మా నాన్నా ఆవుపాలు పిండుతూ రేడియో వింటున్నాం. 'ఈ ఏడాదిని అంతర్జాతీయ మహిళా సంవత్సరంగా ప్రకటిస్తున్నారం'టూ వార…

భల్లుగూడా ఆదివాసీ అక్కలకు జరిగిన అన్యాయాన్ని ఖండిచాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను

మేము ఒక ఇంటి ముందు కూర్చున్నాము. మా చుట్టూ ఊరంతా చేరారు.

జనవరి 22 న అత్యాచారానికి గురైన ముగ్గురు మహిళలు కూర్చున్నారు.

మేము వారితో మాట్లాడడానికి ప్రయత్నించాం.అయితే ఆ ముగ్గురికి తెలుగు రాదు.
వాళ్ళ ముఖాలు ఎంత అమాయకంగా ఉన్నాయొ చెప్పలేను.అసలు ఏ భావమూ కనబడ లేదు.బహుశా ఏడ్చి ఏడ్చి అలసిపోయినట్టు ఉన్నారు.
22 జనవరి రోజు ఎమి జరిగిందో చెప్పడానికి అక్కడ ఒకరిద్దరు తెలుగు తెలిసిన వాళ్ళు ఉన్నారు.
రాంబాబు అనే ఆయన మాకు దుబాసీగా వ్యవహరించాడు.
ఒక్కరి తర్వాత ఒక్కరు తమ పట్ల పోలీసులు ఎంత దారుణంగా ప్రవర్తించిదీ చెప్పారు.
జనవరి 22 న దాదాపు 80 మంది గ్రేహౌండ్స్ పోలీసులు స్థానిక ఎస్ ఐ.కేశవ్ రావ్ తో సహ భల్లుగూడా గ్రామం మీద దాడి చేసి మగ వాళ్ళని,మగ పిల్లల్ల్ని దగ్గరలోని స్కూల్ లో పెట్టి తాళం వేసారు. ఆ తర్వాత పోలీసులు ఆదివాసీల ఇళ్ళళ్ళోకి చొరబడి నలుగురు స్ర్తీల మీద అత్యాచారానికి పాల్పడ్డారు.వంతల డోమిని,వంతల రామి,వంతల ముక్త,కిల్లో భుట్టొ లు పోలీసుసు తమ మీద అత్యాచారం చేసారని,అందులో ఒకరి చేతుల్లో ఉన్న పసి పిల్లని తుప్పల్లోకి విసిరేసాసారని వివరించారు.అత్యాచారానికి గురైన ఇద్దరి భర్తలని అరెష్టు చేసి విశాఖ జైల్లో ఉంచి బాగా క…

భల్లుగూడ లో గిరిజన మహిళలపట్ల గ్రేహౌండ్స్ పోలీసుల బీభత్స కాండ

Image
ఫిబ్రవరి ఇరవై ఆరున కొంతమంది రచయిత్రులం  కలిసి
విశాఖ జిల్లా భల్లుగూడలో గ్రేహౌండ్స్ పోలీసుల అత్యాచారానికి గురైన గిరిజన మహిళలను కలిసాం.
ఉదయం పది గంటలకి విశాఖలో బయలుదేరి పాడేరు మీదుగా రెండు టాటా సుమోల్లో  బయలుదేరాం.భల్లుగూడా బాధిత స్త్రీలు పాడేరు వస్తారని ముందు చెప్పారు.
కానీ మేమే భల్లుగూడా వెళ్ళాల్సి వచ్చింది.
దాదాపు పది కిలోమీటర్లు కొండల్లో,అడవిలో నడవాలని చెప్పడంతో చాలామంది వాహనాల్లోనే ఉండిపోయారు.
నేను మరో ఏడుగురం  నాలుగున్నరకి  భల్లుగూడకి బయలుదేరాం.
దారంతా రాళ్ళు,రప్పలతో నిండి ఉంది.
రెండు కొండలెక్కి దిగడంతో నాకు చాలా అయాసం వచ్చేసింది.
మధ్యలో దట్టంగా చెట్లు అల్లుకున్న అడవి.
కొండలెక్కి అడవి దాటి భల్లుగుడా చేరేసరికి సూర్యాస్తమమౌతోంది.
మా కోసం ఊరంతా ఎదురుచూస్తోంది.
అత్యాచారానికి గురైన ముగ్గురు స్త్రీలు మాతో మాట్లాడడానికి
సిద్ధమయ్యారు....................

(మిగిలింది రేపు చదవండి)