Posts

Showing posts from September, 2007

ఆరు బ్రహ్మ కమలాలతో నేను

Image
ఆరు బ్రహ్మ కమలాలతో నేను

మిత్రులారా! బ్రహ్మ కమలాలు సంవత్సరానికి ఒకటో రెండో పూస్తాయని నేను విన్నాను.చదివాను.అయితే మా ఇంట్లో మాత్రం బ్రహ్మకమలాలు ఆగకుండా పూస్తూనే వున్నాయి.ఓ నెల రోజుల క్రితం తొమ్మిది పూలు పూసాయి.మళ్ళీ మొన్న పన్నెండు పువ్వులొచ్చాయి.రెండు రోజులు వరుసగా ఆరు ఆరు పువ్వుల చొప్పున వికసించి నన్ను ఆశ్చర్యంలో ముంచేసాయి.
మీకోసం ఈ ఆరు పువ్వులు.

పత్తి మందారం

Image
పత్తి మందారం పువ్వులివిగో.ఈ పువ్వులు ఉదయం పూసినప్పుడు పాల నురుగంత తెల్లగా ఉంటాయి.మధ్యాహ్నానికి చక్కటి గులాబీ రంగులోకి మారతాయి.సాయంత్రానికి ఎర్రటి అరుణిమ దాలుస్తూ ముడుచుకుపోవడం, రాలిపోవడం జరుగుతుంది.
ఈ రోజు మా ఇంట్లో పూసిన పత్తి మందారల భిన్న స్వరూపాలివి.

మణిపూర్ ఉక్కు మహిళ షర్మిలా ఇరామ్

షర్మిలా ఇరామ్, 35 సంవత్సరాల మణిపూర్ ఉక్కు మహిళ నిరవధిక నిరాహారదీక్ష మొదలుపెట్టి ఏడు సంవత్సరాలు దాటుతోంది. మణిపూ‌ర్‌లోనే కాక మొత్తం ఈశాన్య రాష్ట్రాల్లో 48 సంవత్సరాలుగా అమలులో ఉన్న అమానుష చట్టం ఆర్మడ్ ఫోర్సెస్ (స్పెషల్ పవర్స్) చట్టాన్ని (ఎఎఫ్ఎస్‌పిఎ) కి వ్యతిరేకంగా షర్మిల నవంబర్ 2000 లో తన అమరణ నిరాహారదీక్ష మొదలుపెట్టింది. నవంబరు 2, 2000, షర్మిల జీవితాన్ని అనూహ్యమైన మలుపుతిప్పిన రోజు. మణిపూ‌ర్‌లోని ‘మలోమ్’ ప్రాంతంలో ‘తిరుగుబాటు’ దారుల మీద అస్సామ్ రైఫిల్స్ జరిపిన దారుణ కాల్పుల్లో పదిమంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. శాంతి ఊరేగింపుకోసం ‘మలోమ్’ వెళ్ళిన షర్మిలను ఈ సంఘటన కలిచివేసింది. మణిపూ‌ర్‌లో ఇలాంటి దారుణ సంఘటనలు ఇంతకు ముందు జరగలేదా అంటే జరిగాయి. కాని శాంతి ఊరేగింపుల ద్వారానే ఈ భద్రతా దళాల దారుణాలను ఆపలేమని అర్థం చేసుకున్న షర్మిల ఆరోజు నుంచే తన అమరణ నిరాహారదీక్ష మొదలు పెట్టింది. ఆమె బలహీనమైన శరీరం యుద్ధ క్షేత్రంగా మారిపోయింది. ఆమె ఆత్మహత్యకు పాల్పడిందని ప్రభుత్వం ఆమె మీద కేసుపెట్టి జైలుకు పంపింది. ఆమెకు బెయిల్ కూడా ఇవ్వలేదు. అయినప్పటికి తన నిరాహారదీక్షని జైల్లోనే కొనసాగించింది. అప్పటినుండ…

మానవీయ భాష నేటి అవసరం

ఆగష్టు ఆరవ తేదీన సుందరయ్య విజ్ఞాన కేంద్రం మినీ హాలులో ‘’పాలపిట్ట పాట - ప్రత్యేక తెలంగాణా పోరాట పాటలు'’ వరవరరావు రాసిన పాటల సిడీల ఆవిష్కరణ సభ జరిగింది. మా భూమి సినిమాలో ‘’పల్లెటూరి పిల్లగాడా'’ పాటతో జనం నాలుకల మీద ఈనాటికీ నిలిచిన సంధ్య, విమల, రడం శ్రీను, పుష్ప, వెంకట్ల పాటలు వినడానికి ఎంతో ఉత్సాహంలో ఆ మీటింగుకు వెళ్ళడం జరిగింది. మీటింగు మొదలవ్వడానికి ముందు అందరం కలిసి సరదాగా కబుర్లు చెప్పుకుంటున్నాం.

నిజానికి ఎడిటోరియల్గా వస్తున్న ఈ కధనం రిపోర్ట్ల్లో రావలసింది. కానీ ఆనాటి ఆ సమావేశంలో జరిగిన ఒక బాధాకరమైన సంఘటన వల్ల సంపాదకీయం రాయాల్సి వస్తోంది. అయితే ఇది ఒక ఉద్యమాన్ని కించపరచడానికో, వ్యక్తిగతంగా ఎవరినో దుమ్మెత్తి పోయడానికో రాస్తున్నది కాదు. అస్తిత్వ ఉద్యమాల పట్ల ఉద్యమంలో వున్న వారి నిబద్ధత పట్ల వున్న గౌరవానికి ఈ సంపాదకీయానికి ఏలాంటి సంబంధమూ లేదు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమం పట్ల మాకెలాంటి వ్యతిరేకతా లేదు. ఇంతకు ముందు భూమిక తెలంగాణా పోరాట నేపధ్యంతో ‘’ ప్రత్యేక తెలంగాణ సంచికను'’ కూడా వెలువరించిన విషయం విస్మరించకూడదని మనవి.

అయితే ఆ రోజు సమావేశంలో జరిగిన సంఘటనని ఎత్తి చూపాల్సిన అవసరం చ…