Posts

Showing posts from May, 2013

మీడియా దృష్టిలో మహిళా సాధికారత అంటే….

ప్రతిరోజూ ఏదో ఒక చానెల్‌ నుండి పిలుపొస్తుంది. వస్తామని చెప్పగానే ఎక్కించుకు పోవడానికి వాహనమొస్తుంది. అతి మర్యాదగా తోడ్కొని తీసుకెళ్ళి స్టూడియోలో కూర్చోబెడతారు. లైట్లు వెలుగుతాయ్.
కెమెరాలు మర్యాదగా అటూ, ఇటూ కదులుతాయి. ఏంకర్‌ పక్కన కూర్చున్న వొక్కరమో, ఇద్దరమో మాట్లాడటం మొదలు పెడతాం. ఆంధ్రప్రదేశ్‌లో మహిళల మీద పేట్రేగిపోతున్న హింస గురించి యాంకర్‌ ప్రశ్నలు సంధించడం, దీనికి అతిధులు సమాధానాలు చెప్పడం, చర్చ ముగియడం. కొన్నిసార్లు ఉద్వేగంతో, కోపంతో మాట్లాడటం, నోరు నొప్పెట్టే వరకు సమస్యలు, నేరాలు, పరిష్కారాలు గురించి చర్చించడం మీడియాతో చాలా తరుచుగా జరిగే కార్యక్రమమిది.

దాదాపు అన్ని చానెళ్ళు స్త్రీల అంశాల మీద టాక్‌షోలు, చర్చా కార్యక్రమాలు నిర్వహిస్తూనే వున్నాయి. మాలాంటి వాళ్ళం వీటిల్లో పాల్గొంటూనే వున్నాం. ఒకానొక చానల్‌ వారి మహిళా కార్యక్రమంలో ఎన్నో అద్భుతమైన అంశాలు గురించి, ముఖ్యంగా రాత్రివేళల్లో హైదరాబాదు స్త్రీలకు రక్షణ ప్రదేశమేనా, రాత్రిళ్ళు డ్యూటీలు ముగించుకుని, క్యాబ్‌లలో ఇళ్ళకు చేరే మహిళా సాప్ట్‌వేర్‌ ఉద్యోగులకు ఎంత భద్రత వుంది, లాంటి అంశాల మీద జండర్‌ సెన్సిటివిటీతో ఎన్నో కార్యక్రమాలు నిర్వహ…