Posts

Showing posts from 2007

విజ్ఞప్తి

పదిహేను సంవత్సరాలుగా భూమికను ఆదిరిస్తూ, మాకు కొండంత అండగా నిలబడిన ప్రియపాఠకులకు నమస్కారం. భూమిక మాస పత్రికగా మారి రెండు సంవత్సరాలు పూర్తయ్యింది.

వెబ్‌సైట్‌ కూడా ప్రపంచ వ్యాప్తంగా వున్న తెలుగు వారి ఆదరణ పొందింది. ప్రతినెల క్రమం తప్పకుండా కొత్త కొత్త అంశాలతో, ఆలోచనలు రేకెత్తించే ఆర్టికల్స్‌తో మీ ముందుకొస్తోంది భూమిక.

ప్రత్యామ్మాయ, స్త్రీవాద పత్రికను నడపడంలోని ఇబ్బందులు విజ్ఞలైన మీకు తెలియనివి కావు. భూమికను మరింత బలోపేతం చెయ్యడానికి, ఆర్థికంగా కొంత నిధిని సేకరించడానికి మేము రెండు కొత్త ప్రాజెక్టులు చేపట్టాము.

1. స్త్రీలకు సంబంధించిన చట్టాలు, సహాయలు, సంస్థలు, ఏ సమస్యకు ఎవరిని సంప్రదించాలి, ఎవరితో మాట్లాడాలి, ఫోన్‌ నెంబర్లు, హెల్ప్‌లైనులు, న్యాయవాదులు, మానసిక సమస్యల కోసం ఎవరిని సంప్రదించాలి- అలాగే పిల్లలకి సంబంధించిన చట్టాలు సహాయలు, సంస్థలు, హెల్ప్‌లైనులు లాంటి వివరాలతో సమగ్రంగా రూపొందుతున్న డైరీ - 2008. దీని వెల రూ. 120/-

2. భూమిక హెర్బల్‌ హేండీ డైరీ - మేము 1998లో భూమిక నిధుల సేకరణ కోసం ప్రచురించిన హెర్బల్‌ డైరీని మరింత సమగ్రంగా, నూతన సమాచారంతో పునర్ముద్రించదలిచాము. అప్పట్లో ఈ డైరీ ఎంతో ఆదరణ …
Image
లుంబినిలో ఆకాశ మల్లెల వనం

లుంబిని పక్కనున్న పార్కింగ్ లో ఆకాశమల్లెల వనంలో
కాసేపు విహరించండి.
బాసింపట్టు వేసుకుకుని ఏ ఆకాశమల్లె చెట్టుకిందైనా
కళ్ళుమూసుకుని కూర్చోండి
మనమీద పరిమళాలు వెదజల్లుతూ
జలజలా రాలే ఆకాశమల్లెల్ని అనుభూతించండి.

ఆకాశమల్లెల జడివాన

Image
అనుకోకుండా ఇంటికొచ్చిన పిల్ల సిసింద్రీలను
వెంటేసుకుని ఈట్ స్ట్రీట్ కి వెళ్ళానా
ఎదురుగా ఉన్న పార్కింగ్ లో కార్ పార్క్ చేస్తుంటే
ఆకాశమల్లెల పరిమళం హటాత్తుగా చుట్టుముట్టింది
తలెత్తి చూద్దును కదా
గుత్తులు గుత్తులుగా వేలాడుతున్న ఆకాశమల్లెలు
పచ్చటి కారప్పూల చెట్లకి
ధవళ వర్ణం లో కుప్పలు తెప్పలుగా
విరగబూసిన ఆకాశ మల్లెలు
చిన్నప్పుడు కారప్పూలని పిలుచుకుంటే
భాగ్యనగరంలో అవే ఆకాశమల్లెలయ్యాయి
అందంగా పొందిగ్గా బారులు తీరి నిలబడ్డ
ఆకాశమల్లె చెట్ల కింద
ఆదమరిచి నిలబడ్డానా
జలజలా నా తలమీద
కాదు కాదు నా తనువంతా
తడిపేసిన ఆకాశమల్లెల జడివాన

ఈట్ స్త్రీట్ వెర్రి హోరుకి
పార్కింగ్ లోని ఈ పారవశ్యానికి
పొంతన ఎలా కుదర్చడం ?
ఒక్కొక్క పువ్వూ ఒయ్యారాలుపోతూ
పరిమళాలు వెదజల్లుతూ
నా మీద వాలుతుంటే
అబ్బో! ఆ అనుభవాన్ని అక్షరీకరించడం
ఇలా మీతో పంచుకోవడం
మహదానందంగా ఉంది.

ప్రతికూల పరిస్థితుల్లో ఒంటరి పోరాటం

జూలై మూడు 2007. రాజ్కోట్ వీధుల్లో పూజా చౌహాన్ అనే మహిళ లోదుస్తులు మాత్రమే ధరించి తన నిరసనని ప్రపంచానికి తెలియచెప్పింది.

అంతకు మించిన దారేదీ ఆమెకు కన్పించలేదు. అంత తీవ్రమైన చర్యకి దిగితే తప్ప ఆమె ఎదుర్కొంటున్న సమస్య ఎవరికీ అర్ధం కాలేదు. పోలీసులు, న్యాయవ్యవస్థ ఆమె పట్ల వ్యవహరించిన నిర్లక్ష్యవైఖరి ప్రపంచానికి తేటతెల్లం కాలేదు. ఎవరీ పూజా చౌహాన్?

2004లో పూజకి ప్రతాప్ చౌహాన్తో పెళ్ళయింది. ప్రతాప్ కూరగాయలమ్ముకుంట, పేపర్లు పంచుత జీవనం సాగిస్తున్నాడు. పూజ తన భర్త, అత్తతో కలిసి బతుకుతోంది. పూజ ఎక్కువగా చదువుకోలేదు. పెళ్ళయిన ఆరేడు నెలలకే ఆమెకు భర్తనుంచి కట్నం వేధింపులు మొదలయ్యయి. అదనపు కట్నం తెమ్మని భర్త, అత్త కలిసి తిట్టడం, కొట్టడం మొదలుపెట్టారు. ఈ లోపు ఆమెకు ఓ కూతురు పుట్టింది. ఆడపిల్లను కన్నందుకు కూడా హింసను చవిచడాల్సి వచ్చింది. ఒక రోజు ఆమెను బాగా కొట్టి, బిడ్డతో సహా ఇంట్లోంచి గెంటేయడం జరిగింది. తల్లిదండ్రులిచ్చిన కొద్దిపాటు సొమ్ముతో ఆమె అద్దె ఇంట్లో బతకడం మొదలుపెట్టింది. సరైన తిండి లేక, పోషకాహార లోపంతో తల్లీ బిడ్డలు చిక్కిశల్యాలయ్యారు. భర్త ఆమె అద్దెకుంటున్న ఇంటికి కూడా వచ్చి కట్నం తెమ్మని హిం…

ఆరు బ్రహ్మ కమలాలతో నేను

Image
ఆరు బ్రహ్మ కమలాలతో నేను

మిత్రులారా! బ్రహ్మ కమలాలు సంవత్సరానికి ఒకటో రెండో పూస్తాయని నేను విన్నాను.చదివాను.అయితే మా ఇంట్లో మాత్రం బ్రహ్మకమలాలు ఆగకుండా పూస్తూనే వున్నాయి.ఓ నెల రోజుల క్రితం తొమ్మిది పూలు పూసాయి.మళ్ళీ మొన్న పన్నెండు పువ్వులొచ్చాయి.రెండు రోజులు వరుసగా ఆరు ఆరు పువ్వుల చొప్పున వికసించి నన్ను ఆశ్చర్యంలో ముంచేసాయి.
మీకోసం ఈ ఆరు పువ్వులు.

పత్తి మందారం

Image
పత్తి మందారం పువ్వులివిగో.ఈ పువ్వులు ఉదయం పూసినప్పుడు పాల నురుగంత తెల్లగా ఉంటాయి.మధ్యాహ్నానికి చక్కటి గులాబీ రంగులోకి మారతాయి.సాయంత్రానికి ఎర్రటి అరుణిమ దాలుస్తూ ముడుచుకుపోవడం, రాలిపోవడం జరుగుతుంది.
ఈ రోజు మా ఇంట్లో పూసిన పత్తి మందారల భిన్న స్వరూపాలివి.

మణిపూర్ ఉక్కు మహిళ షర్మిలా ఇరామ్

షర్మిలా ఇరామ్, 35 సంవత్సరాల మణిపూర్ ఉక్కు మహిళ నిరవధిక నిరాహారదీక్ష మొదలుపెట్టి ఏడు సంవత్సరాలు దాటుతోంది. మణిపూ‌ర్‌లోనే కాక మొత్తం ఈశాన్య రాష్ట్రాల్లో 48 సంవత్సరాలుగా అమలులో ఉన్న అమానుష చట్టం ఆర్మడ్ ఫోర్సెస్ (స్పెషల్ పవర్స్) చట్టాన్ని (ఎఎఫ్ఎస్‌పిఎ) కి వ్యతిరేకంగా షర్మిల నవంబర్ 2000 లో తన అమరణ నిరాహారదీక్ష మొదలుపెట్టింది. నవంబరు 2, 2000, షర్మిల జీవితాన్ని అనూహ్యమైన మలుపుతిప్పిన రోజు. మణిపూ‌ర్‌లోని ‘మలోమ్’ ప్రాంతంలో ‘తిరుగుబాటు’ దారుల మీద అస్సామ్ రైఫిల్స్ జరిపిన దారుణ కాల్పుల్లో పదిమంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. శాంతి ఊరేగింపుకోసం ‘మలోమ్’ వెళ్ళిన షర్మిలను ఈ సంఘటన కలిచివేసింది. మణిపూ‌ర్‌లో ఇలాంటి దారుణ సంఘటనలు ఇంతకు ముందు జరగలేదా అంటే జరిగాయి. కాని శాంతి ఊరేగింపుల ద్వారానే ఈ భద్రతా దళాల దారుణాలను ఆపలేమని అర్థం చేసుకున్న షర్మిల ఆరోజు నుంచే తన అమరణ నిరాహారదీక్ష మొదలు పెట్టింది. ఆమె బలహీనమైన శరీరం యుద్ధ క్షేత్రంగా మారిపోయింది. ఆమె ఆత్మహత్యకు పాల్పడిందని ప్రభుత్వం ఆమె మీద కేసుపెట్టి జైలుకు పంపింది. ఆమెకు బెయిల్ కూడా ఇవ్వలేదు. అయినప్పటికి తన నిరాహారదీక్షని జైల్లోనే కొనసాగించింది. అప్పటినుండ…

మానవీయ భాష నేటి అవసరం

ఆగష్టు ఆరవ తేదీన సుందరయ్య విజ్ఞాన కేంద్రం మినీ హాలులో ‘’పాలపిట్ట పాట - ప్రత్యేక తెలంగాణా పోరాట పాటలు'’ వరవరరావు రాసిన పాటల సిడీల ఆవిష్కరణ సభ జరిగింది. మా భూమి సినిమాలో ‘’పల్లెటూరి పిల్లగాడా'’ పాటతో జనం నాలుకల మీద ఈనాటికీ నిలిచిన సంధ్య, విమల, రడం శ్రీను, పుష్ప, వెంకట్ల పాటలు వినడానికి ఎంతో ఉత్సాహంలో ఆ మీటింగుకు వెళ్ళడం జరిగింది. మీటింగు మొదలవ్వడానికి ముందు అందరం కలిసి సరదాగా కబుర్లు చెప్పుకుంటున్నాం.

నిజానికి ఎడిటోరియల్గా వస్తున్న ఈ కధనం రిపోర్ట్ల్లో రావలసింది. కానీ ఆనాటి ఆ సమావేశంలో జరిగిన ఒక బాధాకరమైన సంఘటన వల్ల సంపాదకీయం రాయాల్సి వస్తోంది. అయితే ఇది ఒక ఉద్యమాన్ని కించపరచడానికో, వ్యక్తిగతంగా ఎవరినో దుమ్మెత్తి పోయడానికో రాస్తున్నది కాదు. అస్తిత్వ ఉద్యమాల పట్ల ఉద్యమంలో వున్న వారి నిబద్ధత పట్ల వున్న గౌరవానికి ఈ సంపాదకీయానికి ఏలాంటి సంబంధమూ లేదు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమం పట్ల మాకెలాంటి వ్యతిరేకతా లేదు. ఇంతకు ముందు భూమిక తెలంగాణా పోరాట నేపధ్యంతో ‘’ ప్రత్యేక తెలంగాణ సంచికను'’ కూడా వెలువరించిన విషయం విస్మరించకూడదని మనవి.

అయితే ఆ రోజు సమావేశంలో జరిగిన సంఘటనని ఎత్తి చూపాల్సిన అవసరం చ…
గుండె చెరువౌతోంది మిత్రులారా!
మతమౌఢ్యం,మతవాదాల రూపమింత భయానకమా?


మన బతుకులింక వేయి పడగల మతమౌడ్య్లుల పడగ నీడల్లోనేనా?
అయ్యో!మనం 21 వ శతాబ్దంలోనే బతుకుతున్నామా!


నిన్న ఆ భయానక,బీభత్స సంఘటన జరగడానికి పది నిమిషాల ముందు నేను, పిఓడబ్ల్యూ సంధ్య,సుజాత,ఇంకో అమ్మాయి కలిసి విశాఖ గిరిజన స్త్ర్రీల పై అత్యాచారాల విషయమై జరిగిన సమావేశంలో పాల్గొని ముఖ్య మంత్రి కి మెమొరాండం ఇవ్వడానికి వెళ్ళేం.మేము ఆ రోడ్డు దాటిన పది నిముషాలకి బాంబు దాడి జరగడం,అందమైన లుంబిని పార్క్ బుద్ధుడి సాక్షిగా రక్తసిక్తమైపోయింది.అమాయక ప్రాణాలు మత మౌఢ్యానికి బలై పోయాయి.
కళ్ళ వెంబడి రక్తాశ్రువులు ధార కడుతున్నాయి. గుండెను పిండేసే ఆ బీభత్స ద్రుశ్యాలను చూసి చూసి మెదడు స్తంభించిపోయింది.
ఉదయమే పేపర్ ముట్టుకుంటే చేతులకంటిన నెత్తురు ఎంత కడుక్కున్నా,ఏ సబ్బులేసి తోముకున్నా వదలడం లేదు.ఆ నెత్తుటి చేతులతో తిండి సహించక,పడుకుంటే నిద్ర రాక పీడ కలలు
పగలు కూడ పీడిస్తున్నాయి.
అయ్యో! ఇది నాగరిక సమాజమా?
మతం పేరు మీద ఎన్ని కోట్ల మంది బలవ్వాలి?
క్షతగాత్రుల్ని చూస్తుంటే గుండె చెరువై కళ్ళళ్ళోంచి ఉప్పెనలా
దుఖం తన్నుకొస్తోంది.
ఈ బాధకి మందేమిటి?
Image
ఒక్కటి కాదు రెండు కాదు
ఐదు బ్రహ్మ కమలాలు


నిన్న రాత్రి మా ఇంట్లో ఒక్కటి కాదు రెండు కాదు ఐదు బ్రహ్మ
కమలాలు/వెన్నెల పుష్పాలు పరిమళాలు వెదజల్లుతూ
ఒకేసారి పూసాయి.అబ్బ! అంత ఘాటైన పరిమళం ఏ పువ్వు నుంచి వెలువడ్డం చూడలేదు.మీకోసం కొన్ని ఫోటోలు పంపుతున్నాను.
Image
ఖుషీ కా దిన్
జగనే కీ రాత్

హమ్మో! ఎన్ని నీళ్ళో
ఆకాశం లోంచి అంచెలంచెలుగా జారి
భూమిలో కి ఇంకుతున్నాయి
సాగర్ కాదది ఆనంద సాగరం
ఇరవై గేట్లు గుండెలు తెరుచుకుని
పాలనురుగుల్లాంటి ప్రేమ పానీయాన్ని ఒంపుతున్నాయ్
మెగా డాం ముందు
మరుగుజ్జుల్లా,మంత్ర ముగ్దల్లా
నువ్వూ,నేనూ
అదేంటో మరి అదేం చిత్రమో మరి
నువ్వూ నేనూ పాపికొండలు చూసి
పరవశించాలని వెళితే
గోదారమ్మ తన చుట్టూ
ఎత్తైన పచ్చదనాన్ని పరిచి
ముత్యాల ధారల్లాంటి వర్షంలో
వరదగోదారి అవతారమెత్తి
తానే పులకించిపోయింది గుర్తుందా నేస్తం!
అలాగే క్రిష్ణమ్మ కూడా
మనం సాగర్లో అడుగుపెట్టామని
ఎలా తెలుసుకుందో ఏమిటో
శ్రీ శైలం గేట్లను బద్దలు కొట్టుకుని
ఉవ్వెత్తున ఎగిసి పడుతూ
మనల్ని నిలువెల్లా తన్మయంలో ముంచేసింది
ఏభై మూడులొ నేనూ
నలభై ఆరులో నువ్వూ
పదేళ్ళ పిల్లకాయల్లోకి
పరకాయ ప్రవేశం చేసి
ఉల్లాసంలో ,ఉద్వేగంలో
ఒక ఉన్మాదంలో కొట్టుకుపోయాం
గంటల్ని క్షణాల్లా కరిగించేసి
అన్నం కూడా నీళ్ళల్లోనే ఆరగించేసి
ఎడారుల్లో బతికే వాళ్ళల్లా
నీళ్ళను కావలించుక్కూర్చున్నాం
ఆత్మీయ నేస్తాన్ని వాటేసుకున్నట్టు
అచ్చంగా నీళ్ళను హత్తుకుని కూర్చున్నాం
కెరటాలు కెరటాలుగా క్రిష్ణమ్మ ఉరికొచ్చి
మనల్ని ముంచేసినపుడు
చేతులు బార్లా చా…
Image
నవ్వుల పువ్వుల్ని పూయించిన వేసవి శిబిరం

కొండవీటి సత్యవతి

మే మొదటివారంలో ఓ రోజు ఉదయాన్నే సి. సుజాత ఫోన్‌ చేసింది. మూసాపేటలోని ఒక మురికివాడలో తాము ఒక వేసవి క్యాంప్‌ పెట్టబోతున్నామని, నన్నూ రమ్మని ఆ ఫోన్‌ సారాంశం. అంతేకాదు ప్రముఖ నవలారచయిత్రి యద్దనపూడి సులోచనారాణి తన పేరు మీద ఒక ఫౌండేషన్‌ (వై.ఎస్‌.ఎస్‌.ఆర్‌. ఫౌండేషన్‌) ఏర్పరచారని, దానిమీదనే ఈ క్యాంప్‌ మొదలు పెడుతున్నా మని కూడా చెప్పింది. ఆ క్యాంప్‌ చూడడానికి వెళ్ళాను నేను. మూసాపేటలో ఓ మారు మూల ఉన్న చిన్న పాఠశాల. అందులో చదివేది అందరూ ముస్లిమ్‌ పిల్లలే. అక్కడ సులోచనా రాణి, డా|| సునంద, సి. సుజాత ఇంకా కొంత మంది మిత్రులు కలిసారు. మాటల సందర్భంలో తను ప్రిన్సిపాల్‌గా రిటైర్‌ అయ్యా నని, ఎవరైనా పిల్లలు వుంటే వాళ్ళకు ఆంగ్లం నేర్పాలని ఉందని సునంద అన్నారు. కుందన్‌బాగులో ప్రయత్నం చేద్దాము లెండి అన్నాన్నేను.

అలా ఒక చిన్న ప్రయత్నానికి బీజం పడిందక్కడ. ఆ బీజం మొలకౌవుతుందని, చిగురుల్లాంటి పిల్లలలో నేను వేసవి శెలవుల్ని గడుపుతానని అస్సలు అనుకోలేదు. అంతవరకు నాకు అలాంటి ఆలోచనే లేదు. సరే. ఆలోచనను ఆచరణ లోకి తేవడానికి ప్రయత్నాలు మొదలు పెట్టాను. మ…
మిగిలిన భాగం

అలా మేము గుర్రం బండీ మీద కొంత కాలం స్కూలుకి వెళ్ళేం.మహేశ్వరం మావయ్య పూలరంగడిలా సెంట్లు పూసుకుని హుషారుగా ఉండేవాడు.అతను తన భార్యతో కాక కాలవ గట్టు మీద వేరే ఇంట్లో ఉండేవాడు.ఆ వేరే ఆమెని బీబమ్మ అనేవాళ్ళు. ముస్లిం స్త్రీ అన్నమాట.మహేశ్వరం మావయ్య తన ఇంట్లో తన భార్యతో కాక బీబమ్మతో ఎందుకుండేవాడో అర్ధమయ్యే వయసు కాదు. కానీ హుషారుగ బండి నడపడం,మమ్మల్ని బండి లో ఎక్కించుకోవడం,మళ్ళి జాగ్రత్తగా తీసుకురావడంతో అతనంటే మాకు చాలా ఇష్టంగా ఉండేది.అతను తన భార్యను పట్టించుకోకపోవడమే కాక బాగా కొట్టేవాడని చెప్పుకునేవారు.ఇప్పుడు తలచుకుంటే అతనంటే అసహ్యంగా అనిపిస్తుంది కానినా చదువు కొనసాగడంలో,చదువు నా జీవితంలో తెచ్చిన మార్పులో అతని పాత్ర కూడా ఉందని ఖచ్చితంగా ఒప్పుకుంటాను.ఆ గుర్రం బండి, మహేశ్వరం మవయ్య అంటే అందుకే ఒకలాంటి అభిమానం.ఆడవాళ్ళ పట్ల జరిగే అమానుషాలు,దుర్మార్గాలూఎలా ఉంటాయో వాటి స్వరూపం ఆ రోజుల్లో అర్ధమై ఉంటే నేనతని బండి ఎక్కేదాన్ని కాదు.
ఓ సారి మా బండి అదుపు తప్పి కాలువలో పడిపోయింది.నాకేమీ దెబ్బలు తగల్లేదు కానీ భారతి స్ప్రుహ తప్పి పడిపోయింది.మా పుస్తకాలన్నీ నీళ్ళల్లో పడిపోయాయి.
చాలా రోజులవరకు మాకు ప…
Image
మా గుర్రం బండీ-మహేశ్వరం మామయ్య

ఈరోజు హిందూ పేపర్లో ఎద్దుబండి ప్రయాణం గురించి జార్జి.ఎన్.నెట్టో రాసిన మ్యూజింగ్స్ చదివాక నాకు మా గుర్రం బండి గుర్తొచ్చింది.మా సీతారమపురంలో హైస్కూల్ లేదు.ఐదు వరకే ఉంది.ఆరో క్లాసు చదవాలంటే నర్సాపురం(ఐదు కిలోమీటర్లు)వెళ్ళాలి. చదువు కోసం నేను మా ఇంట్లో నిత్య యుద్ధం చేసేదాన్ని.మా నాన్నకి నన్ను చదివించాలంటే ఇష్టమే కానీ ఉమ్మడి కుటుంబమవ్వడం వల్ల డబ్బులుండేవి కావు.ఏలాగోలా నేను నర్సాపురంలో ఓరియంటల్ స్కూల్లో చేరాను.ఆ స్కూల్లో ఫీజులుండేవి కావు.అద్దేపల్లి సర్వి శెట్టి అనే ఆయన ఆడవాళ్ళ కోసం ముఖ్యంగా భర్తలు పోయిన వాళ్ళ కోసం ఓ సంస్థను స్థాపించి దానికి హిందూ స్త్రీ పునర్వివాహ సహాయక సంగం స్కూలు అని పేరు పెట్టేరు.
విడోస్ కోసం అక్కడ ప్తిమెట్ర్క్,నేత.దాన్సు,సంగీతం లాంటివి నేర్పేవాళ్ళూ.ఆ సంస్థ కిందే మా ఓరియంటల్ స్కూల్ నడిచేది.ఫీజులు లేవు కబట్టి నా చదువు సధ్యమైంది.అయితే రోజూ స్కూల్కి వెళ్ళడం మాకు పెద్ద సంస్యగా ఉండేది.ఇంట్లో వాళ్ళు అసలు పట్టీంచుకునేవారు కాదు. కొన్ని సంవత్సరాలు నడిచే వెళ్ళేవళ్ళం. సైకిల్ మీద వెళ్ళే వాళ్ళని లిఫ్ట్ అడిగి వెల్లేవాళ్ళం.నేను మెల్లగా సైకిల్ నేర్చుకున్నాన…
Image
నిప్పుల గుండం లో నడిస్తే కాళ్ళు కాలవు

నిప్పుల గుండం లో నడవడానికి, మహత్యాలకి ఏమి సంభంధం లేదన్నది నా అనుభవం.నేను 1980 లో విజయవాడలో జరిగిన ప్రపంచ నాస్తిక మహా సభలల్లో జరిగిన ఓ కార్యక్రమంలో నిప్పుల మీద నడిచాను. ఎర్రటి నిప్పుల మీద నడిస్తే కాళ్ళు కాలవు.నివిరుగప్పిన నిప్పు కాలుతుంది.తాటాకుతో నిప్పుల గుండాన్ని విసురుతారు.కణ కణలాడే గుండంలో మాత్రమే నడవాలి.చాలా వేగంగా కూడా నడవాలి.మనం నడిచినపుడు ఆ వేడికి అరికాళ్ళలో సన్నటి నీటిపొర ఏర్పడుతుంది.ఆ నీటి పొర కాళ్ళు కాలకుండా కాపాడుతుంది. ఇది విగ్న్ఞానం,సైన్సు కు సంబంధించినది. మహత్యాలకు,మాయలకు సంబంధించినది కాదు.
Image
Image
జూ లో పిట్టతో నా చెట్టా పట్టాల్
Image
బ్రహ్మ కమలం/ వెన్నెల పుష్పం

నిన్న అర్ధరాత్రి మళ్ళి మా ఇంట్లో బ్రహ్మ కమలం పూసింది.మొన్నపూసినప్పుడు మొక్క బయట ఉండడం వల్ల నేను సరిగ్గా గమనించలేదు కాని అబ్బ! ఏమి పరిమళం వెదజల్లిందని.నేను పువ్వు విచ్చుకునేటప్పుడు దాని స్టేజెస్ చూడాలని నా బెడ్రూంలోనే కుండీని పెట్టుకున్నాను.అద్భుతమైన అనుభవాన్ని పొందగలిగాను.ఆ పువ్వు పూయడం,పరిమళాలు వెదజల్లడం మీతొ కూడా పంచుకోవాలని కొన్ని ఫోటోలు పెడుతున్నాను.పరిమాళాలను పంపలేనుకాని ద్రుశ్యాలను పంపగలను.
మధ్యాహ్నం ముసురు నన్ను ఇంట్లోనే కట్టిపడేసింది.చెయ్యాల్సిన పనులెన్నో ఎదురు చూస్తున్నా అలాగే ధారలుగా కురుస్తున్న వానని చూస్తూ కూర్చున్నాను.చెట్లన్నీ తలారా స్నానాలు చేస్తూ పచ్చగా మెరిసిపోతున్నాయి.సంపెంగ చెట్టు నిండా పూసిన సగం తెలుపు పూలు పరిమాళాలని వెదజల్లుతున్నాయి.నేను వర్షంలో తడుస్తూనే కొన్ని సంపెంగ పూలు కోసుకొచ్చుకున్నాను. నా చుట్టూ కమ్ముకున్న సంపెంగ పరిమళం.
ఇంకొంచం వానలో తడిసి తోటకటు వైపు వెళ్ళాను.అబ్బ!పొగడ పూల చెట్టుకింద నక్ష త్రాల్లా పరుచుకున్న పొగడపూలు.ఆ పూలన్నింటిని ఏరుకొచ్చి సంపెంగల పక్కన పోసాను.నా చుట్టూ ఓ వింతైన పరిమళం.
వర్షపు ధార పరవశం ఒకవైపు,మరో వైపు ఈ పూల పరిమళం .ఈ మధాహ్నం ఇంట్లో ఉన్నందుకు ఎంతో హాయి.
Image
ఫోనులో… సాంత్వన !
భూమిక జూన్ 2007


జీవితమన్నాక ఎన్నెన్నో సమస్యలు…వాటినెదుర్కొని ముందుకు సాగాలనే అందరి ప్రయత్నమూ. కానీ ఒక్కోసారి ధైర్యం సన్నగిల్లుతుంది. మనసంతా చీకటి ఆవరిస్తుంది. ఎవరితో చెప్పుకోవాలో తెలియదు. ఒక్కోసారి ఇక చాలు… ఈ లోకం నుంచి నిష్క్రమిద్దామని కూడా అన్పించవచ్చు. అలాంటి వారికి నేనున్నానని ఎవరైనా అండగా నిలబడితే… నాలుగు మంచి మాటలతో మెరుగైన భవిష్యత్తుపై చిగురంత ఆశ కలిగేలా చేస్తే… ఆ పనే చేస్తోంది భూమిక హెల్ప్‌లైన్‌.

కేవలం టెలిఫోన్‌లో మాట్లాడడం ద్వారా కొంతకాలంలోనే ఎంతోమంది జీవితాల్లో వెలుగు తేగలిగిన ఈ హెల్ప్‌లైన్‌ ఇప్పుడు ఎందరికో స్ఫూర్తి అయింది. సంఘసేవ పట్ల ఆసక్తి కల కొందరు ఆయా ప్రాంతాల్లో సొంతంగా ప్రారంభించగా, వెలుగు పథకం కింద జిల్లాల్లో ఇలాంటి హెల్ప్‌లైన్స్‌ ఏర్పాటుచేయడానికి ప్రభుత్వం తరఫునా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఒక్కో జిల్లా నుంచీ ఐదుగురు సభ్యులను ఎంచుకుని వారికి శిక్షణ ఇచ్చే బాధ్యతను కూడా భూమిక హెల్ప్‌లైన్‌ చేపట్టింది. ఈ నేపథ్యంలో హెల్ప్‌లైన్‌ గురించి వ్యవస్థాపకురాలు కొండవీటి సత్యవతి ‘వసుంధర’కు వివరించారు.

‘భూమిక’ తోనే మొదలు

‘పదిహేనేళ్లుగా నేను భూమిక పత్రిక ద్వారా స్త్రీ సమ…
Image
వెన్నెల పుష్పం

నిన్న అర్ధరాత్రి మా గార్డెన్లో ఓ అద్భుతం జరిగింది.ఈ అద్భుతం గురించి ఇంతకు ముందు విని ఉండడం వల్ల నేను 12 గంటలవరకు మేలుకుని కెమేరాతో సహ కాపు కాసి ఆ పువ్వు విచ్చుకోవడం ఫోటో తీసాను.అద్భుతమైన ఆ పువ్వు కొన్ని గంటలు మాత్రమే ఉండి తెల్లారేపాటికి తొటకూర కాడలా వేలాడిపోయింది. వెన్నెలంత తెల్లగా ఎంతో అందంగా ఉన్న ఆ పువ్వు అంత తొందరగా వాడిపోవడం నాకు చాలా బాధ కలిగించింది. ఈ మొక్కను నేను అస్సాంలోని గౌహతి నుంచి తెచ్చి మా గార్డెన్లో వేసాను. వాళ్ళు చెప్పిన పేరు రాత్కి రాణి,రేరాణి అని. నేను మత్రం వెన్నల పుష్పం అని పేరు పేట్టాను. ఈ పువ్వు అసలు పేరు తెలిస్తే ఎవరైనా చెబుతారని బ్లాగ్లో పెట్టాను.
Image
Opinion: Baby Servants of Baba Logs


By Malvika Kaul

New Delhi,(Women's Feature Service) Every other day I come across the baba-logs and their baby servants. The babas (girls and boys) are barely three or four years old, and their baby servants never more than 10 or 12. Sometimes, the baby servant is carrying the bawling baba, while mamma - usually a young woman who probably hits the gym on the weekends and is a newly-turned vegan - is carrying shopping bags while negotiating her way in a crowded market.
Often, the two young things can be seen in the park, the older one (the help) is keeping a watch on the younger one. And sometimes, I see them in people's kitchens, struggling to boil milk for the screeching baby. Struggling because their small frames barely reach high enough to see whether the milk has boiled, which means they have to wait for it to boil over and then react lightning quick. Surely, all the above activities are illegal - the anti-Child Labour (Prohibition and Reg…
Image
ఒంటరి దీవులు

జీవితం పూడ్చలేని ఓ అగాధంలా మారుతోంది
దేనితో పూడ్చాలి ఈ అగాధాన్ని?
జనం ఇరుకిరుకు గూళ్ళల్లోంచి బయటపడి
రోడ్ల మీద చీమల్లా పాకుతున్నారు
నోళ్ళు తెరుచుకుని నిలబడ్డ మహా మాల్స్
ఈ జనాన్ని అమాంతంగా మింగేస్తున్నాయ్
వందలాది వెర్రి మొర్రి చానల్స్
కంటి రెటీనా మీద కబ్జా చేస్తున్నయ్
ఇంటెర్నెట్ మహా మాయ
నరనరాల మీద నాట్యం చేస్తోంది
మొబైల్ ఫోన్ల మహ ప్రవాహం
చెవుల్లోంచి గుండెల్లోకి జారి
అయిస్ లా గడ్డకడుతోంది
"ఎవరికి వారౌ స్వార్హంలో
హ్రుదయాలరుదౌ లోకంలో"
నా కారు,నా చానెల్, నా మొబైల్, నా ఎఫ్.ఎం,
నా ఏ టి ఎం,నా ఇంటెర్నెట్, నా బాంక్ బాలెన్స్
ఇలా "నా"చుట్టూ గిరికీలు కొడుతున్నాం
మనం స్రుష్టించిన అద్భుత టెక్నాలజీ
మనల్నెంత ఒంటరుల్ని చేస్తోంది
"మన" ని "మనిషి" ని మర్చిపోయి
ఎవరికి వారం ఒంటరి దీవులమౌతున్నాం
తోటి మనిషి మాత్రమే పూడ్చగలిగిన
ఈ అగాధాలను
మార్కెట్లను ముంచెత్త్తుతున్న
మహా మాల్స్ లోని మహా చెత్త పూరిస్తుందా
మరింత అగాదగాన్ని స్రుష్టిస్తుంది తప్ప
మానవీయతని ప్రోదిచేస్తుందా
మానవీయ కోణాన్ని ఆవిష్కరిస్తుందా చెప్పండి.
Image
చిక్కటి అడవిలో రెక్కవిప్పుతున్న చైతన్యం
కొండవీటి సత్యవతిలయోలా ఇంటిగ్రేటెడ్‌ ట్రైబల్‌ డెవలప్‌మెంట్‌ సొసైటీ చింతూరు మండలం కాటుక పల్లి వారి తరఫున వారు జరుపబోయే అంతర్జాతీయ మహిళాదినం సమావేశంలో పాల్గొన వలసిందిగా ఆహ్వానించ డానికి మోహన చంద్రగారు నా దగ్గరికి వచ్చినపుడు నేను కొంత తటపటాయించాను. అయితే ఈ సమావేశం దట్టమైన అడవిలో రెండు వేలమంది పైగా గిరిజన స్త్రీలతో జరుగుతుందని ఆయన చెప్పగానే నేను వెంటనే ఒప్పేసుకున్నాను. నాతో పాటు డాక్టర్‌ సమత రోష్ని, పంతం సుజాత, భూమికలో పనిచేసే లక్ష్మి కూడా బయలు దేరారు.

పన్నెండున మేం నలుగురం మచిలీపట్నం ఎక్స్‌ప్రెస్‌లో బయలుదేరి ఉదయం ఐదింటికి భద్రాచలం రోడ్‌లో దిగాం. మోహనచంద్ర కూడ మాతో వున్నారు. స్టేషన్‌లో మా కోసం క్వాలిస్‌ సిద్ధంగా వుంది. మేం అయిదుగురం ఎక్కగానే మా వాహనం భద్రాచలం వేపు బయలు దేరింది. కొత్త గూడెం నుండి భద్రాచలం దాదాపు నలభై కిలోమీటర్లుంది. అపుడపుడే తెల తెల వారుతోంది. చెట్లన్నీ మంచు ముసుగే సుకుని వున్నాయి. చల్లటి గాలి హాయిగా ఒళ్ళంతా నిమురుతోంది. పాల్వంచ, వెంటనే కిన్నెరసాని వాగు దాటాం. భద్రాచలంలో పెట్రోలు బంకు దగ్గర ఆయిల్‌ కోసం ఆగినపుడు ఆ బంకు యజమాని మమ్మల్ని వ…
మా వేసవి శిబిరం ముగించాలంటే నాకు చాలా బాధగా ఉంది.పిల్లలు బాగా అలవాటయ్యారు.చక్కగా పాడతారు.నేను ఈ మధ్య భద్రాచలం అడవుల్లోకి వెళ్ళాను.అక్కడ గిరిజన మహిళలు మార్చ్ 8 అంతర్జాతీయ మహిళా దినం సమావేశానికి నన్ను పిలిచారు.భద్రాచలానికి షుమారు 50 కిలోమీటర్ల దూరంలో అడవి లోలోపలికి వెళ్ళాము. అదో అద్భుతమైన అనుభవం.ఈ ప్రయాణపు రిపోర్ట్ చదవాలనుకుంటే భూమిక ఏప్రిల్ సంచిక చూడగలరు.ఆ సమావేశంలో మేము చాలా మంది గిరిజన బాల బాలికలతో సంభాషించాము. వారి ఆశలు, ఆశయాలు, కలలు,కోరికలు మాతో మనసు విప్పి చెప్పుకున్నారు.ఆ వివరాలన్ని ఆ రిపోర్టులో ఉన్నాయి. పిల్లలతో గడపడం, వారితో ముచ్చటించడం చక్కటి అనుభవాన్ని ఇస్తాయి.మనం కొంచం ఓపికతో వాళ్ళు చెప్పేది వింటే ఎన్నో సంగతులు చెబుతారు.ఆ గిరిజన పిల్లలతో గడపడం ఎంత ఉత్తేజాన్ని ఇచ్చిందో మళ్ళి సమ్మర్ కాంపులో ఈ పిల్లలు అంతే ఉత్సాహాన్ని పంచారు.వాళ్ళతో కలిసి ఆడడం, పాడడం, వాళ్ళకి మనకి తెలిసినవన్ని నేర్పడం చాలా చాలా బావుంది.వాళ్ళకి రోజుకో వెరైటి పండ్లు,స్వీట్లు,చాకలెట్లు,బిస్కెట్టులు పంచుతున్నాం. అందులో కూడ ఎంతో త్రుప్తి దాగి ఉంటుంది.
మా సమ్మర్ కాంపులో ముగ్గురి పుట్టిన రోజులు సెలబ్రేట్ చేసాం.
ఈ కాం…
Image
వేసవి శిబిరం ఫోటోలు మరికొన్ని
Image
వేసవి శిబిరం ఫోటోలు
నేను మరి కొంత మంది మిత్రులు కలిసి మే10 నుండి బేగుంపేట్ లోని మక్తా అనే ప్రాంతంలో పిల్లలకోసం ఒక వేసవి సిబిరం నడుపుతున్నామని ఇంతకు ముందు మీకు తెలియచేసాను.జూన్ 2న ఆ శిబిరాన్ని ముగించాలనుకుంటున్నాం. ఎందుకంటే జూన్ మొదటి వారంలోనే కొన్ని పాఠశాలలు రీఓపన్ కాబోతున్నాయి. ఈ వేసవి సిబిరం నడపడం నాకో అద్భుతమైన అనుభవం.30 మంది పిల్లల్ల్ని పోగేసి ఆటలు,పాటలు న్రుత్యాలు,డ్రాయింగ్ నేర్పించడం, వాళ్ళతో కలిసి ఆడడం, ఎగరడం అన్నీ చక్కని అనుభవాలే. మామూలుగా అయితే ఈ పిల్లలు సమ్మర్ కాంపులకు వెళ్ళగలిగిన వారు కాదు. మేము అనుకోకుండా ఈ కాంపు పెట్టడం పిల్లలకెంతో సంతోషాన్ని కలిగించింది.వాళ్ళ సంతోషం మాకు ఎంతో త్రుప్తినిచ్చింది.ఈ కాంపు లో పాల్గొన్న పిల్లలంతా ఎంతో ఉత్సాహంతో మేము చెప్పినవన్నీ నేర్చుకున్నారు.అద్భుతమైన బొమ్మలేసారు.రధాలు తయారు చేసారు.వాటిని చక్కగా అలంకరించారు.మీకోసం కొన్ని ఫోటోలు ఇవిగో.

ఇంకా ఉంది.....