Posts

Showing posts from January, 2011

నేను చచ్చి బతికి ఈవాల్టికి 26 సంవత్సరాలు

అవునండి.1985 లో నేను ఓ నాలుగ్గంటలు చనిపోయాను.
నా గుండెను ఓపెన్ చేసి డాక్టర్లు నా గుండె లయను ఆపేసి
తాత్కాలికంగా హార్ట్ లంగ్ మిషన్ కి అనుసంధానించారు.
నా గుండెకున్న రూపాయి బిళ్ళంత కన్నాన్ని ఓ స్పెషల్ మెటీరియల్తో కుట్టేసి
ఆపేసిన నా గుండెకు షాక్ ఇచ్చి మళ్ళి లయలోకి తెచ్చారు.
అంటే ఓ నాలుగ్గంటలు నేను డెడ్ అన్నమాట.
ఈ మాటలు హార్ట్ లంగ్ మెషీన్ ఆపరేటర్ మధు సూదన్ చెప్పాడు.
చాలా సార్లు ఆపేసిన గుండె షాక్ ఇచ్చినా తిరిగి కొట్టుకోదట.
అంటే పేషంట్ హరీ అన్న మాట.
నాకు 30 ఏళ్ళపుడు చాలా సీరియస్ అనారోగ్యం చేసి తిన్నదంతా కక్కేసే దాన్ని.
రోగమేంటో ఎవ్వరికీ అంతుబట్టలేదు.
నా డాక్టర్ ఫ్రెండ్ అనిత ఎందరో డాక్టర్లకి చూపించి ఆఖరికి
డా: అరవింద్ దగ్గరికి తీసుకెళ్ళింది.
అప్పటికి ఖంగ్ ఖంగ్ మని దగ్గుతున్నా.
ఆయన చెష్ట్ స్పెషలిష్ట్.గుండె మీద స్టెత్ పెట్టి అలాగే ఉండిపోయాడు.
మాకేమీ అర్ధం కాలేదు.
ఆయన వివరంగా చెప్పింది విని అందరం షాక్ అయ్యాం.
నాకు పుట్టుకతోనే (కంజినేటల్)గుండెకి పెద్ద కన్నం ఉంది.
ఇంత కాలం ఎవ్వరూ కనిపెట్టలేదు.
చెడు రక్తం,మంచి రక్తం కలగలిసిపోవడం వల్ల లోపల ఇన్
ఫెక్ట్ అయ్యి దగ్గు రావడం దానిటొ పాటు తిన్నదంతా వాంతి…

కన్నభిరాన్‌కి కృతజ్ఞతాభివందనాలతో

Image
శంకరన్‌గారు చనిపోయినపుడు హెచ్‌ఆర్‌ఎఫ్‌ మురళి మా ఆఫీసులో వున్నాడు. మేమిద్దరం ఏదో విషయం మీద సీరియస్‌గా మాట్లాడుకుంటున్నపుడు అతనికి ఫోన్‌ వచ్చింది. శంకరన్‌గారు చనిపోయారని ఎవరో చెప్పారు. మురళి వెంటనే వెళ్ళడానికి తయారైపోయాడు. 'నిబద్ధతతో పనిచేసే వ్యక్తులు ఇలా ఒకరి తర్వాత ఒకరు, చనిపోవడం చాలా బాధగా వుంది. గొట్టిపాటి నరేంద్రనాథ్‌, వనజ, బాలగోపాల్‌ ఇపుడు శంకరన్‌. బాధితుల పక్షాన పనిచేసే, మాట్లాడేవాళ్ళు కనుమరుగైపోవడం చాలా విషాదంగా వుంది. మురళీ'' అంటే మీకు మరింత బాధ కల్గించే విషయం ఇంకోటుంది అన్నాడు. 'ఏమిటది?' నేను ఆతృతగా అడిగేను. 'కన్నభిరాన్‌కి ఆరోగ్యం బాగా లేదు. ఒక కాలు తీసేసారు తెలుసా?' అంటూ అతను వెళ్ళిపోయాడు. ''ఆ...'' అంటూ నేను అలాగే వుండి పోయాను. చాలా దు:ఖం కల్గించే వార్త అది. అదే మూడ్‌లో శంకరన్‌ గారింటికి వెళ్ళాను. కన్నభిరాన్‌ కళ్ళల్లో మెదులుతూనే వున్నారు. శంకరన్‌ గారితో నాకు పెద్దగా పరిచయం లేదు కానీ ఆయన గురించి ఎంతో విని వున్నాను. ప్రశాంతంగా వున్న ఆయన ముఖం చూడగానే కళ్ళల్లో నీళ్లొచ్చాయి. కన్నభిరాన్‌గారి కాలు తీసేసిన విషాదం కూడా అందులో కలగలసి ఆ రోజంతా…

ఫోనులో… సాంత్వన !

జీవితమన్నాక ఎన్నెన్నో సమస్యలు…వాటినెదుర్కొని ముందుకు సాగాలనే అందరి ప్రయత్నమూ. కానీ ఒక్కోసారి ధైర్యం సన్నగిల్లుతుంది. మనసంతా చీకటి ఆవరిస్తుంది. ఎవరితో చెప్పుకోవాలో తెలియదు. ఒక్కోసారి ఇక చాలు… ఈ లోకం నుంచి నిష్క్రమిద్దామని కూడా అన్పించవచ్చు. అలాంటి వారికి నేనున్నానని ఎవరైనా అండగా నిలబడితే… నాలుగు మంచి మాటలతో మెరుగైన భవిష్యత్తుపై చిగురంత ఆశ కలిగేలా చేస్తే… ఆ పనే చేస్తోంది భూమిక హెల్ప్‌లైన్‌.
కేవలం టెలిఫోన్‌లో మాట్లాడడం ద్వారా కొంతకాలంలోనే ఎంతోమంది జీవితాల్లో వెలుగు తేగలిగిన ఈ హెల్ప్‌లైన్‌ ఇప్పుడు ఎందరికో స్ఫూర్తి అయింది. సంఘసేవ పట్ల ఆసక్తి కల కొందరు ఆయా ప్రాంతాల్లో సొంతంగా ప్రారంభించగా, వెలుగు పథకం కింద జిల్లాల్లో ఇలాంటి హెల్ప్‌లైన్స్‌ ఏర్పాటుచేయడానికి ప్రభుత్వం తరఫునా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఒక్కో జిల్లా నుంచీ ఐదుగురు సభ్యులను ఎంచుకుని వారికి శిక్షణ ఇచ్చే బాధ్యతను కూడా భూమిక హెల్ప్‌లైన్‌ చేపట్టింది. ఈ నేపథ్యంలో హెల్ప్‌లైన్‌ గురించి వ్యవస్థాపకురాలు కొండవీటి సత్యవతి ‘వసుంధర’కు వివరించారు.

‘భూమిక’ తోనే మొదలు

‘పదిహేనేళ్లుగా నేను భూమిక పత్రిక ద్వారా స్త్రీ సమస్యలపై పోరాడుతున్నాను. కార్య…

నా ట్రాఫిక్ కానిస్టేబుల్ మితృడు

ఎలా పరిచయమయ్యాడో గుర్తులేదు కానీ బేగంపేట్ ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర డ్యూటీ లో ఉండే ఓ కానిస్టేబుల్ తో స్నేహమయ్యింది.
స్నేహమంటే ఎప్పుడూ మాట్లాడుకున్నది లేదు.
కలిసింది లేదు.ప్రతి రోజు ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర కనబడతాడు.
నేను సిగ్నల్ దగ్గర కారు ఆపగానే అట్టెన్షన్లో కొచ్చి చక్కగా నవ్వుతూ సెల్యూట్ చేస్తాడు.
దూరంగా ఉంటే కనుక చెయ్యి ఊపి చిర్నవ్వుతాడు.
ఆ సిగ్నల్ దగ్గర అతను లేకపోతే ఏదో వెలితిగా ఉంటుంది నాకు.
నేను దాదాపు ఆరు గంటలకి ఇంటికొస్తాను.
నేనొచ్చే సమయం తెలుసు కాబట్టి నా కోసం ఎదురు చూస్తున్నట్టు అనిపిస్తుంది.
బేగంపేట్ సిగ్నల్ కి రాగానే నా కళ్ళు అతని కోసం వెతుకుతాయి.
అతని నవ్వు చాలా స్వచ్చంగా,పసిపిల్లాడి నవ్వు లాగా ఉంటుంది.
ఆ నవ్వు లోని తేటతనం నాకు నచ్చి రోజూ అతని కోసం చూస్తాను.
ఎప్పుడూ మాట్లాడాలనిపించలేదు.
అతను నాతో మాట్లాడ్డానికి ప్రయత్నించలేదు.
దుమ్మూ ధూళీ,కాలుష్యం మధ్య నిలబడి కూడా మల్లెపువ్వులాంటి నవ్వుల్ని
ఆయాచితంగా,అవ్యాజంగా వెదజల్లే నా ట్రాఫిక్ కానిస్టేబుల్
మితృడి గురించి మీకు చెప్పాలనిపించి రాసాను.

నిండుపున్నమి పండు వెన్నెలలో నేనొక్కదాన్నీ

Image
ఈ రోజు పౌర్ణమి.

పౌర్ణమి ప్రతి నెల వస్తుంది కదా.కొత్త ఏముంది.
సూర్యుడు రోజూ ఉదయిస్తాడు.రోజూ అస్తమిస్తాడు.
అయినా సరే ఉదయాస్తమయాలు రెండూ చూసినపుడల్లా మైమరిపిస్తాయి.
ఇంక నిడు పున్నమి గురించి వేరే చెప్పాలా?
"నిండు పున్నమి పండు వెన్నెలలో
నిను చేరగ అంటూ బాలసరస్వతి మెత్తటి మాధుర్యపు పాట
వింటూ వెన్నెల్లో హాయ్ హాయ్ గా నడుస్తుంటే
ఎంత బావుంటుంది.
నాకు ఈ రోజు ఎందుకో వెన్నెల్లో ఒళ్ళంతా తడుపుకోవాలనిపించింది.
వెన్నెలని మాత్రమే వెంటేసుకుని తిరగాలనిపించింది.
హుస్సైన్ సాగర్ మీద దర్జాగా,నిండుగా,మహా గీరగా
పోజులు కొడుతూ మల్లెపూవంటి వెన్నెల్ని ఒలకబోస్తున్న చంద్రుడితో
చక్కర్లు కొట్టాలనిపించింది.
ఆలస్యమేముంది. బూట్లు గీట్లు తగిలించి వాకింగ్ అవతారమెత్తి
ఒక్కదాన్నే డ్రైవ్ చేసుకుంటూ నెక్లెస్ రోడ్ కి పయనమయ్యాను.
ఏకాంతంగా ఉండే ప్రదేశాన్ని చూసుకుని హాయిగా కూర్చున్నాను.
మొబైల్ లో దాచుకున్న బాలసరస్వతి పాటలు
"రెల్లుపూల పానుపుపై జల్లుజల్లుగా ఎవరో చల్లినారమ్మా వెన్నెలా"
పాటలు వింటూ
తిలక్ అమృతం కురిసిన రాత్రిని గుర్తుతెచ్చుకుంటూ
పారవశ్యంలో మునిగిపోయాను.
ఆ హాయి, ఆ నిరామయ స్థితి ఎంత సేపుందో కానీ
క…

మై లిటిల్ ఫ్రెండ్ -బర్త్ డే గిఫ్ట్

Image
వీడి పేరు ప్రద్యుమ్న.
మేము paddy అని పిలుస్తాము,
వాళ్ళ అమ్మ నాన్న ప్రద్యు అని పిలుస్తారు.
వాడికి నాలుగు నెలలప్పుడు మాకు పరిచయమయ్యాడు.
ఇప్పుడు వాడికి 14 సంవత్సరాలు.
ఫిబ్రవరి 22 వాడి పుట్టిన రోజు.
ఈ పధ్నాలుగేళ్ళుగా వాడు మాకు అత్యంత ప్రియమయినవాడు.
మాకు చాలా ఆత్మీయుడు వాడు.
సంక్రాంతికి నాకు రెండు రోజులు ఖాళీ దొరికింది.
హెల్ప్ లైన్ పని నడుస్తూనే ఉంది
జలగావ్ మహరాష్ట్రలో ఒకమ్మాయిని సేవ్ చేసాము.
వాళ్ళ అమ్మా నాన్నలే ఆ పిల్లను ఇంట్లో బంధిస్తే జలగావ్ ఎస్.పి చొరవతో
ఆ సమస్యను పరిష్కరించాము.
అయినా కొంత సమయం మిగిలింది.
మా paddy పాత ఫోటోలన్ని బయటకు తీసాను.
వాడి బర్త్ డే బహుమతిగా ఇవ్వాలని ఇదిగో ఈ ఫోటో తయారు చేసాను.
వాడు సాయంత్రం వాళ్ళింట్లోను,రాత్రి మా ఇంట్లోను బర్హ్ డే సెలబ్రేట్ చేసుకుంటాడు.
శెలవులొస్తే మా ఇంట్లోనే ఉంటాడు.
వాడూ నేనూ కలిసి తెగ తిరుగుతాం.
ఈట్ స్ట్రీట్,ఐమాక్ష్,వాల్డెన్,కేఫ్ కాఫి డె ఇలా బోలెడంత తిరుగుతాం.
తెగ ముచ్చట్లు చెప్పుకుంటాం.
మా ఇద్దరికి వాడంటే ప్రాణం.

మా ఇంట భోగి మంట

Image
మా ఇంట్లో ఈ రోజు భోగి మంట వేసాం
పెద్ద పెద్ద దుంగలతో పాటు చెదలు పట్టిన కబోర్డ్స్ కూడా కాల్చేసాం.
మా అత్త గారు దర్జాగా కూర్చుని భోగి మంటని చూసారు.

పిల్లలు భలే ఎంజాయ్ చేసారు.
నా సహచరుడు,మా హాయ్ (కుక్కపిల్ల) కూడా మాతో చేరారు.

సంక్రాంతి శుభాకాంక్షలు-రావి ఆకులతో గ్రీటింగ్

Image
మితృలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు.

వివిధ దశల్లో రావి ఆకులెలా ఉంటాయో చూడండి.

నేనే దీన్ని మీకోసం తయారు చేసా.

ఊరికి ఒకరిని ఉంచుకోవాలంటుంది నా ఫ్రెండ్

ఎందుకలా ఆముదం తాగిన ముఖం పెట్టారూ.
టైటిల్ చూడగా చూడగా ఏవేవో స్ఫురించేస్తున్నయ్ కదూ.
ఉంచుకోవడం పదం వింటేనే వెర్రిక్కిపోతారేంటి?
అయ్యబాబోయ్!అమ్మబాబోయ్!!!
నా ఫ్రెండ్ చెప్పేదేంటంటే మన కోసం రకరకాల పనులు చేసిపెట్టడానికి రకరకాల మనుష్యుల్ని ఉంచుకున్నట్టే
అంటే కారు తోలడానికి డ్రైవర్,ప్రయాణాలు చెయ్యడానికి ట్రావెల్ ఏజెంట్, స్టేషంకో బస్ స్టాండ్ కో వెళ్ళడానికి కేబ్ డ్రైవర్,బట్టలుతికి ఇస్త్రీ చెయ్యడానికి దోభి,వంట చెయ్యడానికి కుక్,
సొంత ఆఫీస్ ఉంటే అసిస్టంట్స్ వగైరా లన్న మాట.
మనం రక రకాల పనుల కోసం డబ్బిచ్చి రకరకాల మనుష్యుల్ని ఉంచుకుంటాం.
వాళ్ళతో పనులు చేయించుకుంటాం.
నా ఫ్రెండ్ అంటుంది కదా మనం వేరే ఊళ్ళకు వెళ్ళినపుడు కూడా ఇలా మనుష్యుల్ని ఉంచుకునే సౌకర్యం ఉంటే ఎంత బావుంటుంది.పనులన్ని చకచకా అయిపోతాయి కదా!!!!
కొత్త ఊర్లో అడుగెట్టగానే రిసీవ్ చేసుకోవడానికి,ఇంట్లోనో,మీటీంగ్ లోనో దింపడానికి ఓ టేక్ష్సి,
ఊళ్ళో వింతల్ని చూపించడానికి ఓ గైడ్,ఉండడానికి మంచి హోటల్,ప్రేమగా తిండి తిప్పలు చూడ్డానికి ఓ సర్వర్,
ఈ లిష్ట్ కొండపల్లి చేంతాడులా సాగుతుంది లాగితే.
ఇంతకీ నే చెప్పొచ్చేదేంటంటే
ఉన్న ఊళ్ళోను,విజిట్ చేసే ఊళ్ళల్లో…

నా పుట్టిన రోజును ప్రపంచమంతా పండగలా చేసుకుంటోంది.

Image
నా పుట్టిన రోజును ప్రపంచమంతా పండగలా చేసుకుంటోంది.


అందరికీ బోలెడన్ని థాంక్యూలు.