ఊరికి ఒకరిని ఉంచుకోవాలంటుంది నా ఫ్రెండ్

ఎందుకలా ఆముదం తాగిన ముఖం పెట్టారూ.
టైటిల్ చూడగా చూడగా ఏవేవో స్ఫురించేస్తున్నయ్ కదూ.
ఉంచుకోవడం పదం వింటేనే వెర్రిక్కిపోతారేంటి?
అయ్యబాబోయ్!అమ్మబాబోయ్!!!
నా ఫ్రెండ్ చెప్పేదేంటంటే మన కోసం రకరకాల పనులు చేసిపెట్టడానికి రకరకాల మనుష్యుల్ని ఉంచుకున్నట్టే
అంటే కారు తోలడానికి డ్రైవర్,ప్రయాణాలు చెయ్యడానికి ట్రావెల్ ఏజెంట్, స్టేషంకో బస్ స్టాండ్ కో వెళ్ళడానికి కేబ్ డ్రైవర్,బట్టలుతికి ఇస్త్రీ చెయ్యడానికి దోభి,వంట చెయ్యడానికి కుక్,
సొంత ఆఫీస్ ఉంటే అసిస్టంట్స్ వగైరా లన్న మాట.
మనం రక రకాల పనుల కోసం డబ్బిచ్చి రకరకాల మనుష్యుల్ని ఉంచుకుంటాం.
వాళ్ళతో పనులు చేయించుకుంటాం.
నా ఫ్రెండ్ అంటుంది కదా మనం వేరే ఊళ్ళకు వెళ్ళినపుడు కూడా ఇలా మనుష్యుల్ని ఉంచుకునే సౌకర్యం ఉంటే ఎంత బావుంటుంది.పనులన్ని చకచకా అయిపోతాయి కదా!!!!
కొత్త ఊర్లో అడుగెట్టగానే రిసీవ్ చేసుకోవడానికి,ఇంట్లోనో,మీటీంగ్ లోనో దింపడానికి ఓ టేక్ష్సి,
ఊళ్ళో వింతల్ని చూపించడానికి ఓ గైడ్,ఉండడానికి మంచి హోటల్,ప్రేమగా తిండి తిప్పలు చూడ్డానికి ఓ సర్వర్,
ఈ లిష్ట్ కొండపల్లి చేంతాడులా సాగుతుంది లాగితే.
ఇంతకీ నే చెప్పొచ్చేదేంటంటే
ఉన్న ఊళ్ళోను,విజిట్ చేసే ఊళ్ళల్లోను ,మనకి సహాయమందించే చేతుల్ని ఉంచుకోవాలని నా ఫ్రెండ్ చెవినిల్లు కట్టుకుని పోరి చెబుతోంది.
ఇంత మంచి పదాన్ని ఆయన ఆవిడను ఉంచుకున్నాడు,ఆమె ఆయన్ను ఉంచుకుంది అంటూ కించపరచడం ఏమీ బాగోలేదు సుమండీ.
ఓ ఆడ మగ మధ్య,లేదా ఓ మగ ఆడ మధ్య ఉండేది ఒక సంబంధం.ఒక రిలేషన్ షిప్.
పెళ్ళైతే ఒక పేరు పెళ్ళి కాకపోతే ఇంకో పేరు.
దాన్ని ఉంచుకోవడం అనకూడదేమో ఒక సారి ఆలోచించండి.Comments

kavya said…
హహ .. మీరు టూ మచ్ అండి :)
Anonymous said…
ఉంచుకోవడాన్ని ఉంచుకోవడం అని కాకుండా ఇంకేమనాలో మీరే చెప్పండి. ఒక మంచి పదాన్ని సూచించండి. అది వాడదాం. ఒకపక్క ఉంచుకోవడం మంచిపదమని మీరే అంటున్నారు. మఱోపక్క అది బాగలేదనీ అంటున్నారు. ఎలా మఱి ? సంప్రదాయంలో చిన్నిల్లు అనే పదం కూడా ఉంది. బావుంది కదా !

ఉంచుకోవడం పెళ్ళయినవాళ్ళే చేస్తారు. వారు పెద్దింటికీ చిన్నింటికీ మధ్య శాఖాచంక్రమణం చేస్తూంటారు. పెళ్ళికాని వాళ్ళు చేస్తే అది ఉంచుకోవడం అవ్వదు. Live-in అవుతుంది. రెంటికీ తేడా పాటించాలి కదా ! అందుకోసమైనా ఉంచుకోవడం అనక తప్పదు. పూర్వకాలంలో ఉంచుకోవడాలు లేవు. ఏకపత్నీవ్రతం లేదు కనుక. చిన్న భార్య అనేవారు. పోనీ అలా అందామా ?
Anonymous said…
' ఇలాకా ' అనాలని ముళ్ళపూడి వారు చెప్పారుకదండీ

Popular posts from this blog

‘వైధవ్యం’ – రసి కారుతున్న ఓ రాచపుండు

అమ్మ...అమెరికా

అశోకం