Posts

Showing posts from July, 2012

భండారు అచ్చమాంబ సచ్చరిత్ర

Image
అసూర్యంపశ్య » Written by: అసూర్యంపశ్య 
http://pustakam.net/?p=11954 అచ్చమాంబ (౧౮౭౪-౧౯౦౫) గారి గురించి మొదటిసారి విన్నది బహుసా ఐదేళ్ళ క్రితం తూలిక.నెట్ లో వచ్చిన కొండవీటి సత్యవతి గారి వ్యాసం ద్వారా అనుకుంటాను. అప్పట్లో ఇది చదవగానే, ఆవిడ ఏం రాసారో? అన్న కుతూహలం కలిగినా… బద్ధకం వల్ల అంతగా శ్రమించలేదు వాటిని దొరకబుచ్చుకోవడానికి. కాలక్రమంలో ఆవిడ రాసిన కథలని పోయిన సంవత్సరం అనుకుంటా – సంగిశెట్టి శ్రీనివాస్ గారి సంపాదకత్వంలో “తొలి తెలుగు కథలు” పేరిట వెలువరించారు (ఈ కథలు ఇక్కడ, వీటి గురించి మాలతి గారి పరిచయం ఇక్కడా చదవొచ్చు). నేను కథలు ఒకటీ అరా తప్ప చదవలేదు కానీ, అచ్చమాంబ గారి గురించి వచ్చిన వ్యాసాలు కొన్ని (మాలతి గారివి, సత్యవతి గారివి) చదివాను. దానితో ఆవిడంటే ఒక విధమైన అభిమానం ఏర్పడ్డది – వందేళ్ళ నాడు, ఆవిడ తొలి తెలుగు కథలు, తొలిసారిగా “అబలా సచ్చరిత్ర రత్నమాల” పేరిట స్త్రీల చరిత్ర చిత్రణలు చేశారనీ, అలాగే ఆ కాలంలోనే ఆంధ్ర రాష్ట్రంలో స్త్రీ సమాజం స్థాపించి, స్త్రీ సమస్యల గురించి ఎన్నో ఉపన్యాసాలు ఇచ్చారనీ చదువుతూ ఉంటే. ఇన్నీ చేసిన ఈవిడ ముప్పై ఏళ్ల వయసులోనే, పదిసంవత్సారాలు కూడా లేని సాహితీ కెరీర్ …

”నా రేడియో అనుభవాలు, జ్ఞాపకాలు” సి డి రెడిగా ఉంది

మితృలారా!శారదా శ్రీనివాసన్ గారి సి డి భూమిక ఆఫీసులో రెడీ గా ఉంది.
కావలసిన వారు స్వయంగా తీసుకోవచ్చు(హైదరాబాద్ లో ఉంటే)
లేదంటే భూమిక  ఆఫీసు అడ్డ్రస్ కి 100/ ఎం వో పంపితే కొరియర్లో పంపిస్తాం.

Bhumika address
HIG II Block 8 flat 1
bagalingampally
hyderavad 500044
phone 27660173
”నా రేడియో అనుభవాలు, జ్ఞాపకాలు” పేరుతో శారదా శ్రీనివాసన్‌ గారు పుస్తకం తెచ్చిన విషయం భూమిక పాఠకులకు తెలుసు. ఆ పుస్తకం బహుళ జనాదరణ పొందింది. అయితే శారదగారి రాతకన్నా ఆమె గొంతును వినడం బాగుంటుందికదా. దేశ, విదేశాల్లో వుండే అశేష అభిమానుల కోరికను మన్నించి శారదగారు రెండువందల పేజీల పుస్తకాన్ని ఆరేడుగంటలపాటు స్టూడియోలో చదివి సి.డినీ తయారు చేసారు. ఎన్నో పాటల్ని శ్రావ్యంగా పాడారు. రచయిత్రి స్వయంగా చదివిన పుస్తకాన్ని వినడం ఖచ్చితంగా గొప్ప అనుభవంగా వుంటుంది.
కావలసిన వారు భూమిక ఆఫీసులో సంప్రదించగలరు.

సి.డి.వెల. రూ. 70 + పోస్టల్‌, కొరియర్‌ ఛార్జీలు రూ.30

విశ్వప్రేమ ని నేర్పే విపాశన

నాగార్జున సాగర్‌ వెళ్ళే దారిలో, గుర్రంగూడ గ్రామంలో ఈ విపాశన సెంటర్‌ వుంది.
జూలై 19 వ తేదీన 1.30కి విపాసన సెంటర్‌ చేరాను. 2.15 కంతా అప్లికేషన్‌
నింపడం అయ్యింది. అప్లికేషన్‌ నింపాక పద్మజ అనే ఆవిడ దగ్గరికి (టీచర్‌)
వెళ్ళమన్నారు.  అన్ని నియమాలకు కట్టుబడి వుంటారా? రూల్స్‌ మరియు
రెగ్యులేషన్‌లు చదివారా? అని అడిగారు. అన్నీ చదివాను. మీ వైబ్‌సెట్‌లు
కూడా చూసాను అని చెప్పాను. మీరు జర్నలిస్ట్‌ని రాసారు కదా! ఏ పేపర్‌ అంటే
భూమిక పత్రిక అని, స్త్రీల కోసం ఒక హెల్ప్‌లైన్‌ నడుపుతానని చెప్పాను.
మీరు రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌లో చేసేవారు కదా అని అడిగారు. నేను
ఆశ్చర్యపోయి మీకెలా తెలుసు అన్నా, తర్వాత చెబుతాను అన్నారు. ఎలా తెలుసో ఆ
తర్వాత చెప్పారులెండి.
నాకు సింగిల్‌ రూమ్‌ కావాలి. అంటే 117 ఇచ్చారు. సామాను మోసుకుని రూమ్‌
కొచ్చాను. రూమ్‌ చక్కగా నీట్‌గా, క్లీన్‌గా వుంది. సిమెంటుతో కట్టిన
మంచం, పరుపు. స్టోర్‌కెళ్ళి దుప్పట్లు తెచ్చుకుని  మంచంమీద పరిచాను. నేను
తెచ్చుకున్న దుప్పట్లు కూడా పరుచుకుని ఈ రూమ్‌ని ప్రేమించడం
మొదలుపెట్టాను. రూమ్‌ ముందు చెట్లు పెద్ద రావి చెట్టు. ఆకులు గలగలమంటూ
ఒకటే సంగీతం. దానికి తోడు లెక్కలేవన్నీ పిట్టల వ…