Posts

Showing posts from July, 2010

మా సీతారాంపురం కధలూ,కబుర్లు- చిరంజీవి మా బస్ మేట్

మొన్న ఒకాయన మీ సీతారాంపురం ఎక్కడ అని అడిగారు. మా ఊరికి ఒక పక్క గోదావరి మరో పక్క సముద్రం ఉంది. నర్సాపురానికికి, మొగల్తూరికి మధ్యలో ఉంది మా ఊరు. మొగల్తూరు అంటే గుర్తొచ్చింది.సినీ స్టార్,ప్రజారాజ్యం అధ్యక్షుడు చిరంజీవి రోజూ మేము వెళ్ళే బస్సులోనే కాలేజికి వెళ్ళేవాడు.చిరంజీవి వాళ్ళు పాతకాలవ అనే ఊళ్ళో ఉండే వాళ్ళు. అతను శ్రీ వై ఎన్ కాలేజి,నేను బిజిబిఎస్ వుమన్స్ కాలేజి. అప్పట్లో అతని పేరు శివశంకర ప్రసాద్. కండక్టర్ సీటు పక్కన డోర్లో నిలబడి పోజులు కొడుతూ ఉండేవాడు. మొన్నీ మధ్య "లాడ్లి మీడియా అవార్డ్స్" ఫంక్షన్ కి అతన్ని పిలవడానికి వెళ్ళినపుడు బస్సు విషయాలు,ఫోజుల సంగతులు చెబితే పడీపడీ నవ్వాడు.ఇంకా మీకు ఆ విషయాలన్ని గుర్తున్నాయే అంటూ ఆశ్చర్యపోయాడు.ఇంకా చాలా గుర్తున్నాయి చెప్పనా అంటే వద్దులెండి హాయిగా ఉన్నాను అన్నాడు. కొంచం పెద్దవాళ్ళమయ్యాక బుస్సుల్లో ఎక్కేవాళ్ళం కానీ అంతకు ముందు అంతా నడకే.రోజుకి రానూ పోనూ ఎనిమిది కిలోమీటర్లు నడిచేవాళ్ళం.నడవలేనప్పుడు సైకిల్ లిఫ్ట్ అడిగే వాళ్ళం. ఎంత కష్టపడితే డిగ్రీ చేతికొచ్చిందని.మాది చాలా పెద్ద ఉమ్మడి కుటుంబం.మా తిండి తిప్పల గురించి పెద్దగా ఎవ్వరూ పట్టించుకునేవ…

మా సీతారాంపురం కధలూ,కబుర్లూ

Image
ముసురుపట్టిన ఈ సాయంకాలం

పదే పదే మా ఊరిని గుర్తుకు తెస్తోంది.ఇలాంటి సాయంకాలాలంటే చిన్నప్పుడు ఎంత ఇష్టంగా ఉండేది.
వర్షం మీద ఇష్టం కాదు.ముసురు పట్టిన సాయంకాలాల్లో మాత్రమే చేసే చింతపండు,ఆవపిండి తో చేసే ఘాటైన పులిహోర మీద ప్రేమ.ఇంకేమీ వండే వాళ్ళు కాదు.కంచం నిండా కావలసినంత పులిహోర,ఆవకాయ ముక్క.అంతే.అబ్బ! ఎంత బావుండేది.ముక్కులు ఎగపీల్చుకుంటూ వేడి వేడిగా తిటుంటే నా సామి రంగా! ఆ ఘాటు, ఆ రుచి తిని చూడాలే కానీ ఎంతని వర్ణించను.
మా ఇంట్లో ఓ యాభై మంది దాకా పిల్లకాయలుండే వాళ్ళం.
అందరం పొలోమని కంచాలేసుకుని పులిహోర కోసం ఎగబడిపోయే వాళ్ళం.వర్షా కాలంలో మాత్రమే వండుతారు అదీ బాగా ముసురు పట్టినప్పుడు.
అందుకే నాకు ముసురు పట్టిన ఈ నాలుగు రోజులుగా మా ఊరు,మా ఆవపిండి పులిహోరా,మా పిల్లమూకా తెగ గుర్తుకొస్తున్నారు.మా ఊరితో నాకెన్ని ఇలాంటి అనుభవాలో.ఎన్ని అద్భుతమైన అనుభూతులో!ఎంత సంతోషమో అవన్ని గుర్తు చేసుకుంటే.

చల్లగా కల్లు లాగించేసి .........

Image
కొంతమంది సాహితీ మిత్రులం కలిసి మార్చి నెలలో విశాఖ పట్టణం వెళ్ళేం.ఆ ముందు రోజు భల్లుగూడా వెళ్ళేం.చాలా కష్టపడి కొండలెక్కి గుట్టలెక్కి,అడవిదారిన పడి నడుస్తూ భల్లుగూడా వెళ్ళొచ్చాం.పోలీసుల అత్యాచారాలకు గురైన గిరిజన మహిళలతో మాట్లాడాం.తిండి తిప్పలు లేకుండా అర్ధ రాత్రి వైజాగ్ చేరాం.
నిద్రలేని రాత్రి గడిపి ఉదయాన్నే ఊరి మీద పడ్డాం.
శ్యామల గారు "మీ స్ఫూర్తితో కారు కొని నేనే నడుపుతున్నా మీరు చూడాల్సిందే " అంటూ కారేసుకుని వచ్చేసారు.
మరింకేం పదండి భీమునిపట్ట్ణం చూసొద్దాం అంటూ పొలోమని నేను, కవయిత్రి శిలాలోలిత,నా నేస్తం గీత బయల్దేరాం.డ్రైవింగ్ నేనే.
బుద్ధిగా భీమిలి వెళ్ళి సముద్రంతో కాసేపు ఆటలాడి రావొచ్చు కదా.
అబ్బే అంత బుద్ధి ఎక్కడిది?
నూకరాజు ఆయన భార్యామణి నూకాలమ్మ కల్లు కుండల్ని సైకిల్ మీద మోసుకొస్తూ మా కంట పడ్డారు.
వాళ్ళని ఆపి ముచ్చట్లు మొదలు పెట్టాం.
"ఏటి హైదరాబాదు నుంచొచ్చారా.కల్లు గానీ రుచి సూత్తారేటి."అన్నాడు నూకరాజు.
"అందులో నువ్వేమి కలపలేదుగా?"
"అబ్బే! అమ్మోరి తోడు మావు అలాంటి పనులు సేయం."అన్నాడు.
సరే మేము కారు దిగాం.నూకరాజు తాడిచెట్టు ఎక్కాడు.
త…

నాకు చట్రాలను చూస్తే చచ్చే భయం

Image
నాకు చట్రాలను చూస్తే చచ్చే భయం
అలాగని చావంటే భయమేలేదు
పుట్టిన క్షణమే చావూ సిద్ధమయ్యే ఉంటుంది
అలాగని క్షణక్షణం చావక్కరలేదుగా
బతకడం ఎంత సంబరమో కొందరికి
చెట్టుని చూస్తే సంబరం
పిట్టని చూస్తే రివ్వున ఎగరాలన్నంత ఉత్సాహం
ఆకాశంలోని నీలం రంగు
అవని అంతా కమ్ముకున్న నల్ల రంగు,ఎర్ర రంగు
తొలి వేకువలో తూరుపు సింధూరం
సాయం సంధ్యలో కెంజాయ
ఆషాడమాసంలో ఉరుముతూ వేంచేసే తొలి మేఘం
నిట్టనిలువునా పులకింతలు రేపే తొలకరి జల్లు
ఈ ప్రకృతి పచ్చదనాన్ని
ఈ రంగు రంగుల సీతాకోకచిలుకల్ని
నా కోసమే నట్టనడిరాత్రి పూసిన బ్రహ్మకమలాలు
సంపెంగ చెట్టు చూస్తే చిన్నదే
కళ్ళు విప్పి చూస్తే కణుపు కణుపూ మొగ్గలే
తెల్లారి చూస్తే కమ్మటి సువాసనలతో పువ్వులే పువ్వులు
ఈ అనార్ చెట్టు ఎంత ఉందని
అబ్బో ఎర్రెర్రగా ఎన్ని పూలు పూసిందో
ఈ గోగుపూల తీగకేమొచ్చిందో గోడంతా పాకేసింది
నక్షత్రాలను తెచ్చి పువ్వుల్లా పూయించేసింది
ఈ మాధవీలతను చూస్తే చాలు
గుండెల్లో బాల్యపు జేగంటలు మోగుతాయి
బులిబుల్లి గిన్నెల్నిండా
మధువు నింపుకున్న మధుమాలతులు
వస్తున్నానుండవోయ్ పొగడపూలమ్మా
నా మీద అలకేనా పూలన్నీ అలా ముడుచుకుపోయాయ్
ముందు నీ దగ్గరకే వస్తే తొందరగా పోగలానా
పొగడపూ…

మానవ ప్రవృత్తి వైపరీత్యాల ఫలితం…

మానవజాతిపై తన పంజాను విసిరి విధ్వంసం సృష్టిస్తున్న వైరస్‌కి పాతికేళ్ళు నిండాయి. ఈ ఇరవై అయిదు సంవత్సరాలలో కోట్లాదిమంది దీని బారిన పడ్డారు. ప్రాణాలు కోల్పోయారు. ప్రపంచంలోని ఏదో మూల ప్రతిరోజూ ఎవరో మరణిస్తూనే వున్నారు. చికిత్స లేని ఈ వైరస్ సృష్టిస్తున్న విధ్వంసానికి యువత, స్త్రీలు, అమాయక పిల్లలు ఆహుతైపోతున్నారు. ఇదేమీ ప్రకృతి వైపరీత్యం కాదు. ఇంతమంది చనిపోవడానికి కారణం అందరికి తెలుసు. హెచ్ఐవి ఎలా వస్తుందో, ఎందుకొస్తుందో తెలుసు. కానీ రాకుండా ఎలా కాపాడుకోవాలో అర్థం కాకపోవడం నిజంగా ఎంతో విషాదకరం. ఆ దిశగా ఆచరణాత్మక అడుగు జనబాహుళ్యం నుంచి పడకపోవటం మరీ విషాదం.

పితృస్వామ్య సమాజంలో పురుషుడి మీద ఆధారపడి బతుకుతున్న స్త్రీలు, తమమీద అమలవుతున్న హింసల్ని నోరెత్తి ప్రశ్నించలేని స్థితిలో వున్న స్త్రీలు, భర్తల విశృంఖల లైంగిక జీవితాన్ని తలొంచి ఒప్పుకోవడం ద్వారా, హెచ్ఐవికి గురవుతున్న వీరి ఒంటరి పోరాటాలకు అండగా నిలవడం, వారి వాణిని విన్పించడం భూమిక తన బాధ్యతగా భావించింది. ఈ సంచికలో ఎంతోమంది ఇలాంటి స్త్రీల జీవిత వ్యధలున్నాయి. గుండెల్ని మెలిపెట్టే కథలున్నాయి. వీరిపట్ల మానవీయ కోణాన్ని ఆవిష్కరించడమే మా లక్ష్యం. ఈ …

స్నేహ గీతం

Image
తెల తెల్లటి సంపెగపూలు
ఎర్రెర్రటి అనార్ పూలుపాలనురుగులాంటి నక్షత్రపుష్పాలు
నల నల్లని మబ్బుతునకలు
చల చల్లని చిరుజల్లులు
హాయైన వేళ
మనసు ఊయలలూగే ఈ వేళ
నేస్తం!
నీ చేతిలో చెయ్యేసి
ఆకాశం అంచుల దాకా నడవాలనిపిస్తుంది.
అంతు దరిలేని కబుర్లని కలబోసుకోవాలనిపిస్తుంది.

బ్రహ్మ కమలం మొగ్గలే మొగ్గలు

Image

సోంపేట విషాదం-"అభివృద్ధి" పేరు తో విధ్వంశం.

Image
అభివృద్ధి పేరు మీద జరుగుతున్న విధ్వంశంలో మరో నలుగురు అమాయక రైతు,మత్స్యకారుల బలిదానం జరిగింది.టి వి.లో కనబడిన భయానక,బీభత్స దృశ్యాలు మనస్సును కలిచివేసాయి.గుండెల్లో మంట పుట్టించాయి.పచ్చటి పంట పొలాలతో,మత్స్యకారులకు జీవికనిచ్చే జలాశయాలతో నిండి ఉన్న ప్రాంతాన్ని ధర్మల్ ప్రాజెక్టుకు కట్టబెట్టాలనే దుర్మార్గాన్ని అందరూ వ్యతిరేకించాలి.మా పొలాలను ఇవ్వమనే హక్కు రైతులకుంది.

పది ఉద్యోగాలు ఎర చూపి వందలాది ఎకరాలను గుంజుకునే దుర్మార్గ అభివృద్ధి లోని మోసాన్ని అర్ధం చేసుకోవాలి.
సోంపేట బాధితులకు అండగా ఉండాల్సిన అవసరం ఉంది.
సోంపేట ఘటనకు నిరసనగా ఈ రోజు ఉదయం అంబేద్కర్ విగ్రహం ముందు జరిగిన నిరసన ప్రదర్శనలో నేనూ పాల్గొన్నాను.నా సామాజిక బాధ్యతను నెరవేర్చుకున్నాను.

పోలీస్‌స్టేషన్‌ ఆవరణలో మహిళా సహాయ కేంద్రాలు

భారతదేశంలో లైంగిక అసమానతల్ని రూపుమాపే దిశగా, మహిళలపై హింసని నిర్మూలించడం, లింగ వివక్షతపై చైతన్యం కల్గించడం, మహిళా సాధికారతవంటి కార్యక్రమాలతో ఆక్స్‌ఫాం ఇండియా పనిచేస్తోంది.
మహిళలపై నానాటికీ పెచ్చరిల్లుతున్న హింస మానవహక్కుల విఘాతంగా పరిణమిస్తున్న నేపధ్యంలో బాధితుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని పోలీస్‌స్టేషన్‌లలో మహిళా సహాయక కేంద్రాలను నెలకొల్పడమన్నది ఒక వ్యూహాత్మక ప్రతిపాదనగా ముందుకొచ్చింది. రాష్ట్ర హోంశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కూడా ఈ ప్రతిపాదన గురించి పదే పదే ప్రస్తావిస్తూ తొలిదశలో పది పోలీస్‌స్టేషన్‌లలో సపోర్ట్‌ సెంటర్లను ప్రారంభించబోతున్నామని ప్రకటించి ఉన్నారు.
2004లో పోలీస్‌ కంట్రోల్‌ రూమ్‌ ప్రాంగణంలోకి మహిళా పోలీస్‌ స్టేషన్‌లో ఆంధ్రప్రదేశ్‌లోనే తొలిసారిగా ఆక్స్‌ఫాం, స్వార్డ్‌ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో మహిళా సహాయక కేంద్రం ప్రారంభమైంది. ఈ సహాయ కేంద్రం ఏర్పాటు నేడు పౌర సమాజమూ, ప్రభుత్వం మధ్య అద్భుత సమన్వయ సహాకారానికి తార్కాణంగా నిలిచిందంటే అతిశయోక్తి కాదు.
ఈ అనుభవంతోనే వరంగల్‌, కరీంనగర్‌, అనంతపురంలో కూడా ఈ సహాయ కేంద్రాలు ఏర్పడినాయి. ఈ నెల 23 వ తేదీన హైదరాబాద్‌ లోని ఉమన్‌ ప్రొటక్షన్…

చంచల్ గూడ మహిళా జైలు సందర్శన

మొన్న నేను చంచల్ గూడా లోని మహిళ జైలు కు వెళ్ళాను.
నేను అరెస్ట్ అయ్యి వెళ్ళేననుకునేరు.
జైలులో ఉన్న మహిళల సమస్య లు తెలుసుకునేందుకు,వారికి కౌన్సిలింగ్ ఇచ్చేందుకు ఐ జి ప్రిజన్స్ నాకు అనుమతి ఇచ్చారు.
నేను ప్రతి పదిహేను రోజులకు ఒకసారి జైలుకు వెళ్ళొచ్చు.
మహిళా ఖైదీలతో మాట్లాడవచ్చు.వాళ్ళ సమస్యల పరిష్కారానికి కృషి చెయ్యొచ్చు.
 దాదాపు వందమందితో మాట్లాడాను.
వాళ్ళ వాళ్ళ సమస్యలు చెప్పుకున్నారు.కొంతమంది జైలులో ఉన్నట్టు తమ ఇంట్లో వాళ్ళకు తెలియదని వాళ్ళతో చెప్పమని కోరారు.కొంత మంది అప్పీల్ విషయమై అడ్వొకేట్ తొ మాట్లాడమన్నారు.
ఒకామె అయితే తనను తన తల్లిని అరెస్ట్ చేసి తీసుకొచ్చేరని,తన నాలుగేళ్ళ కొడుకు ఒక్కడూ గుడెసె లో ఉండిపోయాడని,వాడిని వెతికించమని వెక్కి వెక్కి ఏడుస్తూ అడిగింది.గుడిశె ఎక్కడుంది అని అడిగితే అరే మైశమ్మ గుడి దగ్గర అంది.
నిన్న ఉదయం నుంచి మధ్యాహ్నం దాకా బండ్లగూడాలోని అరేమైసమ్మ గుడి చుట్టుపక్కల వెతికాను కానీ పిల్లాడు లేడక్కడ.అస్సలు గుడిశే లేదు.పోలీస్ స్తేషన్లో కంప్లైంట్ ఇచ్చి ఇంటికొచ్చేసా.
ఒక్కొక్కరిది ఒక్కో సమస్య.
శిక్షలు పడిన వాళ్ళవి ఒక రకమైన సమస్యలు.అండర్ ట్రెయిలర్ లవి భిన్నమైన సమస్యలు.వా…

నిన్న రాత్రి పూసిన బ్రహ్మ కమలం ఇదిగో

Image
నిన్న రాత్రి పూసిన బ్రహ్మ కమలం ఇదిగో.

బ్రహ్మకమలాలండీ బ్రహ్మకమలాలు

Image
(నిన్న పూసిన పువ్వు ఫోటో అప్ లోడ్ అవ్వలేదు.ఇవి పాత ఫోటోలు)
జూన్ నెల వచ్చిందంటే చాలు
మా ఇంట్లో బ్రహ్మ కమలాలు
బ్రహ్మాండంగా విడవడం మొదలౌతుంది.
నిన్న రాత్రి వర్షం పడుతూ ఉంది.
బ్రహ్మకమలం విచ్చుకోవడం,సువాసనలు వెదజల్లడం.
చిరుజల్లుల్లో తడుస్తూ కొంచం సేపు చూస్తూ కూర్చున్నాను.
కాసేపటికి మొత్తం తడిసిపోయాను.
అద్భుతంగా విచ్చుకుంటున్న పువ్వుని అలా వర్షంలో ఒంటరిగా
వదిలేయాలంటే ఎంత దుఖమో.
పోనీ కుండీని తీసుకెళదామా అంటే మొయ్యలేనంత బరువుంది.
ఏం చెయ్యాలి??
పువ్వుని కోసుకుని నీళ్ళల్లో వేసి ఇంట్లోకి పట్టుకెళ్ళిపోయా.
ఇల్లంతా ఘాటైన వాసన కమ్ముకుంది.
బోలెడన్ని ఫోటోలు తీసా. మీ కోసం కొన్ని.

మా ఇంట్లో కాపురం పెట్టిన పిచ్చుకలు

Image
కర్నూల్ లో మా ఇంట్లో ప్రస్తుతం పిచ్చుకలు హాయిగా కాపురం పెట్టాయి.
వాటికోసం బుల్లి ఇల్లు,ధాన్యపు కుచ్చులు,పక్కనే పచ్చటి వేప చెట్టు.
ఎంత హాయి కదా.ధాన్యపు కంకుల్ని ఇంత పొందిగ్గా అల్లే చంద్రుడు మా ఊరిలో ఉన్నాడు.ఈ కంకుల్ని ఈ పిచ్చికల జంట కోసం మా ఊరి నుండి తెచ్చానండోయ్.
మేము వెళ్ళినపుడల్ల మాకు కనువిందుగా,వీనులవిందుగా కిచ,కిచలాడుతూంటాయి.
చూడండి వాటి సొగసు.

గినీ పిగ్ లౌతున్న గిరిజన బాలికలు

ఇటీవల ఖమ్మం జిల్లాలోని గిరిజన ప్రాంతాల్లో నలుగురు గిరిజన బాలికలు మరణించారు. ఈ మరణాలు సహజంగా సంభవించినవి కావు. హ్యూమన్‌ పాపిల్లోమా వైరస్‌ (హెచ్‌.పి.వి) వాక్సిన్‌ తీసుకోవడంవల్ల ఈ మరణాలు సంభవించాయన్న విషయం బయట ప్రపంచానికి తెలిసింది. అసలు ఈ హెచ్‌.పి.వి వైరస్‌ వాక్సిన్‌ని ఈ పిల్లలకి ఎందుకిచ్చారు? ఎవరికిచ్చారు? ఎలా ఇచ్చారు? ఈ ప్రశ్నలన్నింటి గురించి కూలంకషంగా ఆలోచిస్తే, తీగ లాగితే డొంకంతా కదిలింది. చిన్న తీగ అనుకున్నది కాస్తా చాలా పెద్దదిగా, డొంక కాస్తా కాలసర్పాలు తిరిగే కారడవిలాగా తయారై, వాటి వివరాలు చదువుతూంటే, అర్థం చేసుకుంటూంటే వెన్నులోంచి నాగుపాము జర జరా పాకిన విభ్రాంతి కలిగింది.

వివరాల్లోకి వెళితే ”పాత్‌ ఇంటర్నేషనల్‌’ అనే అంతర్జాతీయ మందులకంపెనీ,
మరియు ఆయా రాష్ట్రాల సంయుక్త ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్‌లో ఖమ్మం జిల్లాలోను, గుజరాత్‌లోని కొన్ని ప్రాంతాల్లోను హెచ్‌.పి.వి వాక్సినేషన్‌ కార్యక్రమం ప్రారంభించాయి. ఈ కార్యక్రమం మొదలయ్యాక ఖమ్మంలోని ఏజన్సీ ప్రాంతంలో నలుగురు ఆడపిల్లలు మృత్యువాత పడ్డారు. హెచ్‌.పి.వి వాక్సిన్‌ వేసిన తరువాత తీవ్రమైన సైడ్‌ ఎఫెక్ట్స్‌ ఏర్పడి ఈ పిల్లలు చనిపోయారు.

ఈ విషాద సంఘ…

పొగడ పూల వర్షం

Image
తెల్లవారుఝామున తొలివేకువ వేళ వర్షంతో పాటు మా ఇంట్లో పొగడపూల వర్షం కూడా కురిసింది.ఒకటా రెండా చెట్టు కిందంతా పరుచుకున్న పూలని ఏరడానికి అరగంట పట్టింది.
నడుం నొప్పి వచ్చింది కానీ పొగడపూలని ఏరడంలో ఉన్న సంతోషం ముందు ఈ నొప్పులెంత?
వర్షం శుభ్రంగా కడిగి మరీ పూలని రాల్చింది.
సువాసనలు వెదజల్లుతూ ఎంత తేటగా ఉన్నాయో చూడండి.
ఈ బొకే చూసారా? నా నేస్తం గీతకి ఇవ్వడానికి నేనే తయరు చేసా.
పొగడపూల బొకే మీరెప్పుడూ చూసి ఉండరు.
పూలతో పాటు సువాసనలూ మీకు పంచే వీలుంటే బావుండు.