Posts

Showing posts from December, 2012

ఈ శనివారం సాయంత్రం ఈ జ్యేష్ట పౌరుల సాన్నిధ్యంలో.....

Image
ఈ రోజు సాయంత్రం ఎందుకో అబ్బూరి చాయా దేవిగారి దగ్గరికి వెళ్ళాలనిపించింది.
నాలుగింటికి వస్తానని ఫోన్ చేసాను.
వెళ్ళేసరికి నాకోసం టీ తెచ్చి ఉంచారు.
రెండు రకాల స్వీట్స్ పెట్టారు.
తను ఈ మధ్య చేసిన బొమ్మలు చూపించారు.
వాటర్ బాటిల్ తో చేసిన క్వీన్ విక్టొరియా బొమ్మ చూడండి ఎంత బాగుందో.
నడుం మీద చేతులుంచి ఎంతో కాంఫిడెంట్ గా ఉన్న ఇద్దరు ఇండియన్ వుమన్ బొమ్మలు ఎంత చూడ ముచ్చటగా ఉన్నాయో!!
ఎనభైలలో పడిన చాయాదేవి గారు ఎంత హాయిగా లైవ్లీగా ఉన్నారో మీరే చూడండి.
సి.ఆర్ ఫౌండేషన్ లో ఉన్న తన ఫ్రెండ్స్ అందరిని నాకు పరిచయం చేసారు .ఇంకొక అమ్మమ్మ గారికి తొంభై ఏళ్ళు.ఎంత హుషారుగా ఉన్నారంటే నా చెయ్యి పట్టుకుని తన రూం లోకి లాక్కెళ్ళి
తను చేసిన క్రోషో అల్లికల్ని చూపించారు.
నేను అమెరికన్ సిటిజెన్ ని నాకక్కడ అన్ని సదుపాయాలూ ఉన్నాయి కానీ నాకు ఇంగ్లీషు సరిగా రాదు.
నన్ను హాస్పిటల్ లో వేస్తే ఏ రోగమొచ్చిందో,ఎక్కడ నొప్పిగా ఉందో ఆ డాక్టర్లకి చెప్పలేనుగా అందుకే ఇండియా వచ్చేసాను.అంటూ ఒకటే నవ్వులు.


ఆవిడ నన్ను వదలకుండా పట్టుకుని రావడం వరకే నీ పని పోవడం నీ పని కాదు, నేను వదలనుగా అంటూ ఒకటే కబుర్లు.
ఆవిడకి తొంభై ఏళ్ళంటే నమ్మలేం.

ఆవిడకి బై చె…

పదహారు రోజులు కాదు… మూడొందల అరవై ఐదు రోజుల ఉద్యమం కావాలిప్పుడు

నవంబరు 25 నుండి డిసెంబరు 10 వరకు స్త్రీలపరంగా ప్రపంచవ్యాప్తంగా ఎన్నో భిన్నమైన కార్యక్రమాలు జరుగుతాయి. చాలా సంవత్సరాలుగా ఇవి జరుగుతున్నాయి. స్త్రీల మీద అమలవుతున్న హింసకు వ్యతిరేకంగా నవంబరు 25ని ‘వయొలెన్స్‌ అగెన్‌స్ట్‌ విమెన్స్‌ డే’ అంటూ మొదలుపెట్టి అంతర్జాతీయ మానవహక్కుల దినం డిసెంబరు 10తో ఈ కార్యక్రమాలు ముగుస్తాయి.ఒక్కోదేశంలో ఒక్కో కార్యక్రమం. మన దేశంలో కూడా వివిధ రాష్ట్రాల్లో భిన్నమైన ప్రోగ్రామ్‌లు చేస్తున్నారు. దీనిని 16 రోజుల ఏక్టివిజమ్‌గా కూడా పిలుస్తున్నారు. రోజుకో రకమైన హింస గురించి మాట్లాడినా గానీ ఈ రోజు స్త్రీల మీద అమలవుతున్న హింసా రూపాల గురించి మాట్లాడాలంటే ఈ పదహారు రోజులు ఏం సరిపోతాయి? ఎక్కడ మొదలు పెట్టి ఎక్కడ ఆపాలి? ఏ హింస గురించి ఎక్కువ మాట్లాడి ఏ హింస గురించి తక్కువ మాట్లాడాలి? అమ్మ కడుపులో భద్రంగా పడుకున్న పసికందుని చంపే క్రమం గురించి మాట్లాడాలా? పుట్టగానే, ఆడశిశువని తెలియగానే నోట్లో వడ్లగింజ వేసో, ముక్కు చెవులు మూసేసో చంపేసే అమానవీయత గురించి మాట్లాడాలా? సొంతపిల్లల్ని వయసు, వావి, వరస ఏమీ లేకుండా లైంగికంగా దాడి చేస్తున్న తండ్రుల గురించి మాట్లాడాలా? చదువు చెప్పాల్సిన పంతుళ్…