Posts

Showing posts from July, 2008

పాలపుంత

Image
“నందూ! మనం చూద్దామనుకున్న జాగర్స్‌ పార్క్‌ జీటీవిలో వస్తోంది చూడు.”
“అవునా? నువ్వేం చేస్తున్నావిపుడు?”
“నీతో మాట్లాడుతున్నా”
“అబ్బో! జోకా?”
“పో… పోవోయ్‌ ఇంటి కెళ్లి సినిమా చూడు.”
“ఏ ఇంటికి?”
“ఏదో నీ ఇంట్లో చూడు ఫోన్‌ పెట్టేస్తున్నా”
“నీ ఇంటికే వస్తున్నా… కాచుకో”
“నిజంగా”
“అబద్దంగా”
“చచ్చేపనుందని నిన్న ఊదరగొట్టావ్‌”
“నీ దగ్గరకొచ్చా బతుకుదామని”
“రా మరి”
“తలుపు తియ్యిమరి” కాలింగ్‌ బెల్‌ మోగింది.
డోర్‌ తీస్తుంటే అతనికంటే ముందర పొగడపూల పరిమళం లోపలకొచ్చి గదినీ, ఆమెనీ కూడా చుట్టేసింది.
“దోసిలి పట్టు”
దోసిలి నిండా పొగడపూలు పోశాడు.
“ఇన్ని పూలు ఎక్కడివి నందూ”
“చెట్లవి”
“పొగడపూలు చెట్లకి పూస్తాయా? హృదయానికి అనుకున్నా”
“లుంబినీలో దొంగతనం చేశా”
దోసిలి అలాగే వుంచి చేతులు చాపింది.
ఆరడుగుల మనిషి అందంగా వొంగి ఆమె దోసిట్లో ముఖాన్నాన్చాడు. ఆ ఆనందాన్ని తట్టుకోలేనట్టేగా కొన్ని పూలు కిందకి జారిపోయాయి.
మెల్లగా ఆమె చుట్టూ చేతులేసి
“ఐలవ్‌ యూ మధూ”
“నా కోసం ఈ పూలన్నీ ఏరుకొచ్చావా?”
“నీ కోసం కాదు”
“మరి?”
“నా కోసమే”
“అదేంటి?”
“నీ దోసిట్లో పోసినప్పుడు నీ ముఖంలోని సంతోషాన్ని చూడ్డం కోసం.”
“అంత ప్రేమా?”
“ఇంత ప్రేమ” …

మొగలి పూలూ -ఇందిరా పార్కూ

Image
చాలా రోజుల తర్వాత ఈవేళ సాయంత్రం నేనూ గీత కలిసి ఇందిరా పార్క్ కి వెళ్ళేం.ఓ నాలుగైదేళ్ళ క్రితం రోజూ ఉదయం వాకింగ్ కి వెళ్ళేదాన్ని.అలా వెళ్ళే క్రమం లోనే మొగలి పూలమ్మే ఓ అమ్మాయితో పరిచయమైంది.ఇందిరా పార్క్ లో బోలెడన్ని మొగలి పొదలున్న విషయం చాలా మందికి తెలుసనుకుంటాను.ఆ పిల్లతో సాన్నిహిత్యం పెరిగి సీజన్ లో రోజూ మొగలి పువ్వు కొనేదాన్ని.చాలా సార్లు చల్లటి ఉదయపు వేళ మొగలి సువాసనల్ని మోసుకుంటూ గీత దగ్గరికెళ్ళేదాన్ని.తనకి మొగలి పూలంటే చాలా ఇష్టం.ఆ పూల పిల్ల మీద నేను "మొగలి పూల పిల్ల" అనే కధ కూడా రాసాను.అది నా కధల సంపుటి "ఆమె కల" లొ ఉంది.
ఈ రోజు నేనూ గీత ఆ పార్క్ కి వెళ్ళి చాలా సేపు కూర్చుని బోలెడన్ని కబుర్లు కలబోసుకున్నం.పూలమ్మే అమ్మాయి గుర్తొచ్చింది కాని ఎక్కడా కనబడలేదు.మొగలి పూల మీదకి మనసు మళ్ళింది. పొదల చుట్టూ ప్రదక్షిణ చేసాం కాని ఒక్క పువ్వూ కనబడలేదు.ఎలాగైనా పూలు సంపాదించాలని చిప్స్ అమ్ముకునె అతన్ని అడిగాం మొగలి పూలు దొరుకుతాయా అని.అతను తన బుట్ట మా దగ్గరే పెట్టి ఇప్పుడే వస్తానంటూ వెళ్ళి పూలు కోసే మనిషిని పట్టుకొచ్చాడు.వీళ్ళు కోస్తారని చెప్పి తన బుట్ట తీసుకుని వెళ్ళిపోయాడు.…

ATHEISM IS A WAY OF LIFE

When I look back into my past I can not but wonder at the changes that occurred in my life. Where have I started my journey and where have I reached! I did struggle a lot all these years to reach where I am today. In my struggle for existence my parents, friends and, later, my husband, helped me tremendously. I enjoyed the warmth of my friends throughout my life and I still do. The fragrance of friendship was with me at every major turn in my life. I love people and I have immense faith and trust in them. If I need any help of any kind, I look toward my fellow human beings.

I am an atheist. Atheism is a way of life for me. I don’t believe that a supernatural power rules this world. Nature is the prime caretaker of this world. If we protect nature it will protect us.

I said that atheism is a way of life for me. It has been so for the last thirty years. You may ask how I became an atheist and who influenced me. Nobody inspired me. Rahul Sankrutyayan’s “Olga to Ganga” made a tremendou…
Image

బడా కార్పోరేట్లను గడ గడ లాడిస్తున్న ‘’ముక్తా జోడియా'’

'’మేము మాకోసం పోరాడ్డం లేదు. మా తరువాత తరం కోసం పోరాడుతున్నాం.

ఈ అడవి మా తాత ముత్తాతలకు చెందింది.

ఇక్కడ మేము ఎలా ప్రశాంతంగా బతికామో మా తరువాత తరం కూడా ఇలాగే బతకాలి.


మా గుండె, మా ఆత్మ ఈ అడవితో ముడిపడి ఉంటాయి. మా జీవనాధారం ఈ అడవి. మమ్మల్ని ఇక్కడినుండి తరలించే హక్కు ఎవ్వరికీ లేదు'’ ఈ మాటలు చాలా స్పష్టంగా, ధృఢంగా ముక్తాజోడియా నోటి నుండి వాచ్చాయి. 58 ఏళ్ల ముక్త పదమూడు సంవత్సరాలుగా ఒరిస్సాలోని రాయగడ జిల్లాలో పెద్ద ఎత్తున ఉద్యమం నడుపుతోంది. గిరిజనుల హక్కుల కోసం ఆమె తలపడుతున్నది ఓ బడా కార్పొరేట్‌ దిగ్గజంతో అన్నది మరచిపోకూడదు. ఈ పోరాటం మొదలై చాలా కాలమే అయింది. ఉత్కళ్‌ అల్యూమినా ఇంటర్నేషనల్‌ లిమిటె కంపెనీ ముక్తకు చెందిన భూమిని లాక్కునే ప్రయత్నం చేసినపుడు మా ‘భిట్లా మట్టి’ (వ సొంతగడ్డ)ని తీసుకునే హక్కు ఎవరికీ లేదంట నినదించి, పెద్ద ఎత్తున గిరిజనులను సమీకరించి పోరాటం ప్రారంభించింది.
ఒరిస్సాలోని కాషీపూర్‌ బ్లాక్‌లో రాయగడ జిల్లాలో శ్రీగుడ దౌడగుడాలో ముక్తాజోడియా జన్మించింది. ఆమె చడ్డానికి సాదాసీదా, బక్కపలచని గిరిజన స్త్రీ లాగా కనబడుతుంది.కానీ ఈరోజు ఆమె ఒక్క పిలుపునిస్తే వందలాది గిరిజనులు ప్…

ధీరగాంభీర్యాల వెనుక....

ఇటీవల ఓ జాతీయస్థాయి ఆంగ్లపత్రిక ఆసక్తికరమైన ఒక వార్తను ప్రచురించింది.'లెటజ్ టాక్మెన్ ' అనే ప్రోగ్రాం కింద ఢిల్లీలో కొన్ని డాక్యుమెంటరీ సినిమాలను ప్రదర్సిన్చారు.ఈ డాక్యుమెంటరీలన్నీ మగవారికి సంబందించిన ప్రవర్తన,వాళ్ళల్లో ఉండే అపసవ్య నమ్మకాలు, పురుషత్వం గురించిన భ్రమలు వీటన్నింటి గురించి చర్చించాయి."ఇప్పటి వరకు పురుష ఉద్యమం మొదలవ్వకపోవటం నిజంగా విషాదం.ఇప్పటికైనా మగవాళ్ళు కళ్ళు తెరిచి తమ గురించి తాము తెలుసుకోవాలి.అనుభవాలు పంచుకోవాలి.అంతేకాకుండా ఫెమినిష్ట్ తరహాలో ఒక పురుష ఉధ్యమం మొదలవ్వాల్సి ఉంది.తమను తాము ఆవిష్కరించుకోవటానికి సరిపడిన భాష,ఒక వేధికల అవసరం ఇపుడెంతో ఉంది" అంటారు సినీనిర్మాత రాహుల్ రాయ్.
"నాకు అంతా తెలుసు,అన్నీ తెలుసు" అనే అహంకారపు ధోరణి వల్ల మగవాళ్ళు చాలా కోల్పోతుంటారు.ఏమీ తెలియకపోయినా తెలిసినట్లు గప్పాలు కొట్టడం,తెలియదని చెప్పడానికి బిడియపడడంవల్ల జీవిథంలో చాలా పోగొట్టుకుంటారు.
ఆడవాళ్ళకి సంబందించిన సమస్తం తమకు తెలుసునని భ్రమపడడమే కాకుండా, ఆడవాళ్ళకి ఏమీ తెలియదు,తమద్వారానే వాళ్ళు ప్రపంచాన్ని చూస్తారు అని కూడా అనుకుంటారు.పురుషాహంకా…

పులి మీద పుట్ర

Image
"మాటి" మ్యూజిక్ ఆల్బం మీలో చాలా మంది చూసి ఉంటారు.శుభా ముద్గల్ పాడిన ఈ
ఆల్బం లొ "నువ్వెలాంటి మగాడివి?కండోం వాడకుండా నీ భార్యని ప్రమాదంలోకి
తోసేలాంటి మగాడివా ?" అంటూ సూటిగా ప్రశ్నిస్తుంది. ఇటీవల ఓ దినపత్రిక
ప్రచురించిన దయనీయమైన ఓ కధనం చదివాక నన్ను ఈ పాట మల్లీ
వెంటాడింది.హెచైవి/ఏఇడ్స్ సోకిన ఓ స్త్ర్రీని ఎలా ఊరి బయటకు తోసేసారో
వర్ణించే ఆ కధనం లో ఆ స్త్రీ దిక్కులేకుండా ఊరవతల పడి ఉన్న ద్రుశ్యం
మనసుని పిండేస్తుంది.ఆమెకు హెచైవి అంటించింది ఆమె భర్తే అయినా సీన్ లో కి
భర్త రాడు. అందుకే పై పాటలోని ప్రశ్న మన ముందుకొస్తుంది."నువ్వెలాంటి
మగాడివి?"
మన దేశం లో హెచైవి బారిన పడుతున్న స్త్రీల శాతం క్రమంగా
పెరుగుతోంది.అయితే ఈ స్త్రీలంతా సెక్ష్ వర్కర్లు,వ్యభిచార వ్రుత్తిలో
ఉన్నవాళ్ళు అనుకుంటే పొరపాటే.వివాహ జీవితంలో ఉన్న స్త్రీలు తమ భర్తల
ద్వారా ఈ ఇంఫెక్షన్ కి గురవుతున్నట్టు ఇటీవల అధయనాలు
నిరూపిస్తున్నాయి.వీరి భర్తల ప్రమాదకర లైంగిక సంబంధాలు వీరి జీవితాలను
చిన్నాభిన్నం చేస్తున్నాయి.పురుషులు వివాహం బయట విచ్చలవిడిగా సంబంధాలను
కొనసాగిస్తూ ,ఎలాంటి జాగ్రత్తలూ తీసుకోకుండా భార్యతో కూడా
వ్యవహరిస…

అరుషి హత్య-అమానవీయ కోణాలు

మే నెల 17 వ తేదీన నేను మొదటి సారి అరుషి అనే పధ్నాలుగు
సంవత్సరాల అమ్మాయి హత్య గురించి ఢిల్లి లో ఉన్నపుడు చదివాను.నేషనల్
మీడియా అవార్డ్ తీసుకోవడాని కి డిల్లీ వెల్లడం వల్ల 17 న ఉదయమే ఆ వార్త
చదివి, అరుషి అమాయకమైన ముఖం చూసి చాలా బాధ పడ్డాను. ఆ రోజ వచ్చిన వార్తలో
ఆఇంటి లో పనిచేస్తున్న హేమరాజ్ అనే పనివాడు అరుషి హత్యకు పాల్పడి పరార్
అయ్యాడని పోలీసులు చెప్పారు. ఈ వార్త చాలా మందిని భయ కంపితులుని
చేసింది.ఇళ్ళల్లో పని చేసే వాళ్ళే పిల్లల్ల్ని చంపేస్తే ఎల అంటూ
నివ్వెరపోయారు.అయితే పోలీసులు ఇంటి టెర్రేస్ మీద పడున్న హేమరాజ్ శవాన్ని
కనుక్కోకుండా హేమరాజ్ ఇంట్లో కనబడ లేదు కాబట్టి అతనే ఆ హత్య చేసి ఉంటాడని
నిర్ధారణకి వచ్చేసి మొదటి స్టేట్మెంట్ ఇచ్చేసారు.
ఇంక అక్కడి నుండి ఈ కేసు ఎన్ని వంకరలు తిరగాలో అన్ని వంకర్లు
తిప్పారు పోలీసులు.ఆ తర్వాత రంగ ప్రవేశం చేసిన మీడియా ముఖ్యంగా
ఎలక్ట్రానిక్ మీడియా అరుషి పట్ల వ్యవహరించిన తీరు అత్యంత
జుగుప్సాకరం.అన్యాయంగా హత్యకు గురై అర్ధాంతరంగా ప్రాణాలు కోల్పోయీన ఆ
పిల్ల కారెక్టర్ కు ఎన్ని తూట్లు పోడవాలో అన్ని పొడవడం మొదలు
పెట్టారు.హేమరాజ్ చంపాడని ప్రకటించిన పోలీసులు కాదు కాదు హేమరాజ్
ని,అర…