Posts

Showing posts from 2014

కోయంబతూర్ వెళ్ళింది జాతీయ స్థాయి పార్టనర్స్ సమావేశానికి.

https://www.facebook.com/satyavati.kondaveeti/posts/599896830117040

కావ్యేషు నాటకం రమ్యం...

Image
మీటింగులు..పనులు....భూమిక పత్రిక పని...హెల్ప్ లైన్ కేసులు...
ఎంత వొత్తిడి ఉన్నా 5.30 అయ్యేసరికి రవీంద్ర భారతి మీద వాలిపోవడం...
తొలిరోజు గీత...మలిరోజు మూడో రోజు నాతో ప్రశాంతి...ప్రాణనేస్తాల తో కలిసి రసాస్వాదనం...
వనమాలి అనే సాంస్కృతిక సంస్థ ...వీటి బాధ్యులు దేవి...శాంతారావ్...మహేష్.
మూడు రోజులపాటు 5.30 నుంచి 10.30 దాకా నాటకం నన్ను పూనింది...
మొదటి రోజు రాయలసీమ పాలెగాడు నరసిమ్హా రెడ్డి వీరోచిత తొలి స్వాతంత్ర్య పోరాట స్పూర్తి...
రెండో రోజు పుల్లరి పన్నును ధిక్కరించిన కన్నెగంటి హనుమంతు అద్భుత చరిత్ర...
ఈ రెండు నాటకాలు స్టేజిని సర్వాంగ సుందరంగా అలంకరించి సీను సీనుకి స్టేజి అలంకరణ మారుస్తూ ప్రదర్శించారు.
మూడో రోజు ఎవరి పేర్లు తలిస్తే రక్తం ఉప్పొంగుతుందో, ఆదివాసుల కోసం అస్త్రాలను బ్రీటీష్ వారికి వ్యతిరేకంగా ఎక్కుపెట్టి ఉద్యమించి పోరాడి వీరమరణం పొందారో వారు...జోడేఘాట్ వీరుడు కొమరం భీం...మన్యం శూరుడు అల్లూరి సీతారామరాజు...
ఈ రెండు నాటకాలని వీధి నాటక రూపం లో మహాద్భుతంగా ప్రదర్శించారు.
ఆ నాటకాలను చూస్తూ పొందిన ఉద్వేగం ...రసాస్వాదనం మరే ప్రక్రియలోను పొందలేము.
కళ్ళ ముందు కనబడే పాత్రలతో మమేకమై ఏడుస్తాం..నవ్వు…

అలజడులు...నా అంతరంగపు ఆనవాళ్ళు

నా జీవితంలో
ప్రేమకే స్థానం
పూజకి లేదు .
నా చేతులు
పాటుపడతాయ్
ప్రార్ధన చెయ్యవు .
నా కోరికలు
నేను తీర్చుకోవాల్సినవే
ఏ శక్తి,భక్తి తీర్చేవి కావు .
నా సాష్టాంగ ప్రణామం
నా కన్నవాళ్ళకే
కపట సన్నాసులకు కాదు .
నాకు జీవితమంటే
అలుపెరుగని పోరాటమే
అర్ధింపులు,వేడికోళ్ళు అస్సలుండవ్ .
నా ఇంట్లో పూజ గదులుండవ్
ప్రేమ గదులుంటాయ్
పుస్తకాల గదులూ ఉంటాయ్ .
నన్ను నేను సమర్పించుకునేది
నా లోని ఆత్మవిశ్వాశానికే
ఏ అతీత శక్తికో ,మరేదో అదృశ్యశక్తికో కానే కాదు ప్రజలు పోరాటాలు మర్చిపోవాలంటే
గుళ్ళవేపు తోలెయ్యడమే . భూములు దురాక్రమించాలనుకుంటున్నావా
ఏం ఫర్వాలేదు అక్కడో గుడి కట్టేయ్ .
ప్రజల కళ్ళు గుళ్ళ మీద
నీ కళ్ళు భూముల మీద .
ఆధునిక ఆదాయ వనరు
అడ్డదిడ్డంగా కట్టేసిన గుళ్ళు .
అమ్మ గుళ్ళంటూ కట్టి
చూపించేది మళ్ళీ అంగాంగ ప్రదర్శనే .
ప్రభుత్వ కార్యాలయాల్లో పూజలా???
సెక్యులరిజం జిందాబాద్ .
గవర్నమెంటాఫీసులు ప్రలందరివీ
పూజలు చేసే హక్కు ఎవ్వరికీ లేదు .
పూజ వ్యక్తిగతం
పబ్లిక్ ప్లేస్ లో గెంతక్కరలేదుగా !! .

నన్ను ఆవహించిన ఆదిలాబాద్‌ అడవి

Image
ఆదిలాబాదు అడవుల మీద మోహం ఈనాటిదా? కాదు కాదు…. చాలా సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నాను. సమతా రోషిణి ఆ జిల్లాలో పనిచేసినపుడు… మనోరమ ఆదిలాబాదు కలెక్టారాఫీసులో ఉద్యోగం చేసినపుడు…. చాలా చాలా అనుకున్నాను. ఎన్నోసార్లు వాళ్ళను అడిగాను.  ఆదిలాబాదు ట్రిప్‌ వేద్దాం… వివరాలు సేకరించండి అంటే…. ఎవ్వరూ వినలేదు. నా కోరిక అలాగే దాక్కుని వుండిపోయింది. ఆ అడవి మీద మోహం మరింతగా పెరిగిపోయింది. కుంతల జలపాతం కవ్విస్తూనే వుంది. అమృతలత పరిచయం… అది స్నేహరూపం దాల్చాక… ఇటువేపు రైటర్స్‌ ట్రిప్‌ వెయ్యండి… అన్నీ నేను చూసుకుంటాను అన్నపుడు మనసు మూలల్లో ముడుచుకుని కూర్చున్న కోరిక ఆఘమేఘాల మీద బయటకు ఉరికొచ్చింది. ఆయా ప్రాంతాల గురించి తెలిసిన అమృత ఆర్గనైజ్‌ చేస్తానంటే ఇంకేం కావాలి? అక్కడ పనిచేస్తున్న ప్రశాంతి సపోర్ట్‌ వుండనే వుంది. ఏ ప్రాంతం నుంచి… ఏ ప్రాంతానికి వెళ్ళాలి? రూట్‌ ఏమిటి? ఏ గ్రామం విజిట్‌ చెయ్యాలి? లాంటి విషయాలన్నీ మొత్తంగా వాళ్ళిద్దరికీ అప్పగించేసి ఆదిలాబాదు అడవి గురించి కలలు కనడం మొదలు పెట్టాను. భూమిక టీమ్‌ చకచకా పనులన్నీ పూర్తి చేసారు. బస్సు మాట్లాడారు. ట్రిప్‌కి వస్తామన్న వాళ్ళతో అసంఖ్యాకంగా మెసేజ్‌ల రూపంలో, …

తిరగరాయాల్సిన కథలు ఇంకెన్నో తేలాల్సి వుంది

Image
ఆ రోజు ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియమ్‌లోకి ప్రవేశించేటప్పుడు మనసులో ఓ చిన్న అసౌకర్యం. అయితే అంతకుముందు గేటు బయట చూసిన వైలెట్‌ కలర్‌ పూలబంతులు ఈ అసౌకర్యాన్ని చాలా వరకు తగ్గించేసాయి.ఆ పూలను చూసాకా కూడా మనసులో చీకాకులు, చింతలు మిగిలివున్నాయంటే మనం సరిగ్గా లేమన్న మాట. అంతకు ముందు అదే దారిలో వచ్చిన భానుజ గానీ, జమున గానీ ఆ పూలను చూడనే లేదు. అలా ఎలా చూడకుండా వుంటారా అని నాకు చాలా ఆశ్చర్యంగా వుంటుంది. వాళ్ళిద్దరిని కళ్ళు మూసుకోమని చెప్పి ఆ పూల చెట్టు దగ్గరికి తీసుకెళ్ళి కళ్ళు తెరవమని చెప్పినపుడు ఆ పూల సొగసు చూసి ఇద్దరూ ఆశ్చర్యపోయారు. ఇలాంటివి సత్యక్క కళ్ళబడతాయి. అని భానుజ అంటే… అబ్బ! ఎంత బావున్నాయి సత్యా! థ్యాంక్స్‌ అంటూ జమున చటుక్కున నా బుగ్గమీద కిస్‌ ఇచ్చేసింది. నేనదిరిపోయాను. ఈ లోపు ప్రశాంతి వచ్చింది. తను ఆ పూలను ముందే చూసింది. తనని తీసుకెళ్ళబోతుంటే ”అమ్మూ! పువ్వులా? నేను చూసాగా” అంది హాయిగా నవ్వేస్తూ . నేను రాయబోతున్నది ఈ పూల కథ కాదు. డిశంబరు నాలుగున ప్రశాంతి సారధ్యంలోని ఆంధ్రప్రదేశ్‌ మహిళా సమత సొసైటికి చెందిన మహిళలు ప్రదర్శించిన నృత్యరూపకం ”తిరగరాసిన కథ” గురించి. ఈ నృత్య రూపకాన్ని ఇంతకు …