Posts

Showing posts from 2015

అశోకం

కొండవీటి సత్యవతి . నిర్మల మొబైల్ ఫోన్లోంచి ఖయ్‌మంటూ విజిల్ శబ్దం. ‘‘నన్నిక పనిచేసుకోనివ్వదా’’ అనుకుంటూ ఫోన్ లేసి చూసింది. అనల అమెరికా నుంచి... వాట్సప్‌లో మెసేజ్. ‘‘అమ్మా! నేనొస్తున్నాను. టికెట్ కన్ఫర్మ్ అయ్యింది. నువ్వు కూడా శెలవు పెట్టేయ్’’ ‘‘క్రిస్మస్ శెలవులు ... ఆ తర్వాత సంక్రాంతి శెలవులు’’ ‘‘సరె అన్నూ! ఏ రోజు బయలు దేరతావు’’ ‘‘డిశంబరు పది... మనం నాలుగురోజులు హైదరాబాదులో వుండి అమ్మమ్మ దగ్గరి కెళ్ళిపోదాం’’ ‘‘అన్ని రోజులు నువ్వా పల్లెటూళ్ళో ఉండగలవా?’’ ‘‘ఉంటాను... ఈరోజే అమ్మమ్మకి చెప్పేయ్. బై అమ్మా!’’ ఫోన్ సైలెంట్ మోడ్‌లో పెట్టేసి నిర్మల తన పనిలో పడింది.  ఆఫీసులో చాటింగ్ తనకిష్టముండదు. కానీ అన్నూ వదలదు. నెలరోజులు శెలవంటే... దొరుకుతుందో లేదో... ఇవ్వకపోతే సిక్ లీవ్ వుండనే వుంది. క్యాలండర్ చూసాను. నవంబరు 23. ఫర్వాలేదు. టైముంది. అర్జంట్ పనులేమున్నాయా అని ఆలోచిస్తుంటే... కోలీగ్ సరస్వతి అడిగింది. ‘‘అనల వస్తోందా నిర్మలా’’ ‘‘అవునే... నెల రోజులుంటుందట... ఇక్కడ కాదు. అమ్మమ్మ దగ్గరుంటుందంట’’. ‘‘అమెరికాలో వుండే పిల్ల అంతర్వేదిలో వుండగలదా?’’ ‘‘వుంటుందట... తనకి అలవాటే గానీ అన్ని రోజులుండలేదెప్పుడ…

జీవన'చాయ్'

ఫోటోల కోసం నా ఫేస్ బుక్ పేజీని దర్శంచండి
https://www.facebook.com/satyavati.kondaveeti

Chai-enge 16 th Story ~
కొండవీటి సత్యవతి గారితో జీవన'చాయ్' 11. 26.
ఈ రాత్రి ఒక స్నేహశీలి గిరించి రాయాలని, రేపటి స్నేహితుల రోజుకి ఒక కానుకలా ఇవ్వాలని ఇప్పటికే రాసిన దానికి ఇంట్రడక్షన్ జత చేస్తున్నాను. తను సత్యవతి గారు.
స్నేహానికి చిరునామా.
భూమిక' తొలి పరిచయం తోనే ఈ విశేషణం ఎలా సాధ్యం అంటే 'ఒక మెతుకు చాలు' అంటారు కదా, అలా.! అంతే మరి. వారితో ఇందిరా పార్క్ సందర్శన ఒక్కటి చాలు, అక్కడ నేను తీసిన ఒక్క చిత్రం చాలు, తను ఎంతటి స్నేహ వస్చాల్యం తో ఉంటె అక్కడి ప్రకృతి నా చిత్రం లో అపురూపంగా కనిపిస్తుంది? నేను మనుషులను తప్ప ప్రకృతి దృశ్యాలు తీయను. కాని తనతో వెళితే నాగ మల్లిని తీసాను. లావెండార్ చెట్టును తీసాను. అడవి బాదం కాయను తీసాను, పురుగూ బూషి కూడా నాకు మహత్యం లా కాన వచ్చింది. తాను ఒక స్నేహితు రాలి తల దువ్వినట్టు, వెంట్రుకలను అలవోకగా ముందుకు వేసినట్టు ఒక చెట్టు ఆకులను ముందకు వేసి అప్పటిదాకా దానికి ఊపిరి ఆడని స్థితిని తప్పించడం చూస్తే, 'ఈమె మనిషి కాదు, ప్రకృతి' అనిపించింది. అలా తొలిస…

చెట్టు మీద పిట్టల్లే నన్ను స్వేచ్చగా పెంచిన నాన్న.

Image
ఈ రోజు తండ్రుల దినమట.
మా నాన్నని తలుచుకుంటుంటే ఏమి గుర్తొస్తుంది.
ఆయన రోజంతా చేసిన కష్టం గుర్తొస్తుంది.
పొలంలో ఆరుగాలం పనిచేసిన రోజులు గుర్తొస్తాయి.
మా ఆవు కోసం పచ్చగడ్డి కోసుకొచ్చి మా వీధి అరుగు మీద అలా వొరిగి నిద్రపోయే నా నాన్న గుర్తొస్తాడు.
మా ఆవు కోసం చిట్టు... తవుడు గంపలో కలుపుతుంటే చెంబుతో నీళ్ళు పోసిన దృశ్యం గుర్తొస్తుంది.
మా తోటల్లో కూరగాయల మొక్కలకు దిగుడు బావిలోంచి బుడ్లజోడుతో (మట్టి కుండలు) నీళ్ళు ముంచి పోస్తుంటే నేనూ ఓ కుండ తీసుకుని ఆయన వెనకే నీళ్ళు పోసిన జ్ఞాపకాలు...
నన్ను స్కూల్ చేర్పించడానికి నరసాపురం తీసుకెళ్ళి అది ఏ స్కూలో తెలియకుండానే ఓ కొండపల్లి చేంతాడంత పేరున్న "హిదూ స్త్రీ పునర్వివాహ సహాయక సంగం స్కూల్" లో (అది ఓరియంటల్ స్కూల్ అని తెలిసో తెలియకో) నన్ను జాయిన్ చేసిన జ్ఞాపకం.
(అందరూ నన్ను విడో హోం లో చదువుతోంది అని వెక్కిరించేవారు.అప్పటికి విడోస్ అంటే ఎవరు అని నాకు తెలియదు.)
నేను కష్టాతి కష్టం గా డిగ్రీ పూర్తి చేసి ఇంట్లో ఉన్నప్పుడు "పద హైదరాబాద్ పోదాం నీకు ఉద్యోగమొస్తుంద"ని నన్ను ఈ మహానగరానికి తెచ్చి ఎలాంటి సంకోచం లేకుండా నన్ను మా చిన్నాన్న ఇంట్లో వదిలేసి …

వితంతువుల దినోత్సవమట

మనకి అన్నీ ఉత్సవాలే
ఏముంది సెలబ్రేట్ చేసుకోవడానికి??
ఏమి సాధించామట???
భళ్ళున గాజులు పగలకొట్టడం మానేసారా???
కృరంగా బొట్టు చెరిపేయడం మానేసాసా??
తెల్ల చీరలు కట్టించడం మానేసారా??
సొంత బిడ్డల పెళ్ళి మంటపంలోకి గౌరవంగా పిలవడం నేర్చేసుకున్నారా??
"పరమ పవిత్రత" ఆపాదించి అందరి మెడలకి తాకించే తాళి బొట్టుని ఆమె మెడకి కూడా తాకించే సంస్కారం అలవరుచుకున్నారా?
పొద్దున్నే కళ్ళబడితే తుపుక్కున ఊసే అమానవీయాన్ని మానవీయమంచేసుకున్నారా???
ఏమి సాధించారని వితంతు దినోత్సవం జరుపుకుంటారు???
అసలు స్త్రీలు ముత్తైదువులుగా...వితంతువులుగా ఎందుకు విడదీయబడాలి???
ప్రపంచంలో వితంతువులే కానీ భార్యలు పోయినవాళ్ళు ఎందుకుండరు?
వాళ్ళకో పేరు ఎందుకు లేదు???
ఒక వికారమైన రూపమెందుకు లేదు??
భార్య చనిపోయిన నెలలోనే రెండో పెళ్ళికి సిద్ధమయ్యే మగవాళ్ళ...
వాళ్ళ మనశ్శరీరాల మీద భార్యా విహీనత గుర్తులేమీ ఉండక్ఖరలేదు.
అదే స్త్రీలైతే...మనసు నిండా దిగుళ్ళు...
వికృతం చేసిన శరీరాలు అందంగా ఉండే ఆమెను అందవిహీనను చేసేదాకా సాగే పరమ అసహ్యకరమైన తంతులు...
భార్య పోయిన నాటినుంచే బయట ప్రపంచంలో స్వేచ్చగా తిరిగే భార్యావిహీనుడు..
ఆమె మాత్రం చీకటి గదిలో …

విశ్వప్రేమ ని నేర్పే విపశ్యన

                            కొండవీటి సత్యవతి
నాగార్జునసాగర్‌ వెళ్ళేదారిలో, గుర్రంగూడగ్రామంలోఈవిపాశనసెంటర్‌ వుంది.జూలై 19 వతేదీన 1.30కివిపాసనసెంటర్‌ చేరాను. 2.15 కంతాఅప్లికేషన్‌నింపడంఅయ్యింది. అప్లికేషన్‌ నింపాకపద్మజఅనేఆవిడదగ్గరికి (టీచర్‌)వెళ్ళమన్నారు.  అన్నినియమాలకుకట్టుబడివుంటారా? రూల్స్‌ మరియు రెగ్యులేషన్‌లుచదివారా? అనిఅడిగారు. అన్నీచదివాను. మీవైబ్‌సెట్‌లుకూడాచూసానుఅనిచెప్పాను. మీరుజర్నలిస్ట్‌నిరాసారుకదా! ఏపేపర్‌ అంటేభూమికపత్రికఅని, స్త్రీలకోసంఒకహెల్ప్‌లైన్‌ నడుపుతాననిచెప్పాను.మీరురెవెన్యూడిపార్ట్‌మెంట్‌లోచేసేవారుకదాఅనిఅడిగారు. నేను ఆశ్చర్యపోయిమీకెలాతెలుసుఅన్నా, తర్వాతచెబుతానుఅన్నారు. ఎలాతెలుసోఆతర్వాతచెప్పారులెండి.  నాకుసింగిల్‌ రూమ్‌ కావాలి. అంటే 117 ఇచ్చారు. సామానుమోసుకునిరూమ్‌ కొచ్చాను. రూమ్‌ చక్కగానీట్‌గా,క్లీన్‌గావుంది. సిమెంటుతోకట్టినమంచం, పరుపు. స్టోర్‌కెళ్ళిదుప్పట్లుతెచ్చుకునిమంచంమీదపరిచాను. నేనుతెచ్చుకున్నదుప్పట్లుకూడాపరుచుకునిఈరూమ్‌నిప్రేమించడంమొదలుపెట్టాను. రూమ్‌ ముందుచెట్లుపెద్దరావిచెట్టు. ఆకులుగలగలమంటూ ఒకటేసంగీతం.దానికితోడులెక్కలేవన్నీపిట్టలవైవిధ్యస్వరాలు.రామచిలకలు, పిచ…