Posts

Showing posts from April, 2007
నేను ఈరోజు ప్రభుత్వం వారు నడిపే ఒక సోషల్ వెల్ఫేర్ హస్టలుకి వెల్లాను.ఆ హాస్టల్లో 70 మంది ఆడపిల్లలున్నారు.వాళ్ళంతా పదో తరగతి పరీక్షలు రాసి వాళ్ళ వాళ్ళ ఊళ్ళకెళ్ళకుండా ఈ శెలవుల్లో కంప్యూటర్.స్పోకన్ ఇంగ్లీష్ నేర్చుకుంటున్నారు.డాక్టర్ రెడ్డి ఫోండేషన్ వాళ్ళు వీళ్ళ కోసం ఈ రెండు కార్యక్రమాలు చేపట్టారు.పిల్లలు చక్కగా నేర్చుకుంటూన్నారు. నేను రెండు రోజులు వాళ్ళతో గడిపాను. ఈ ఆడపిల్లలందరూ వివిధ జిల్లాల నుండి వచ్చి ఈ హాస్టల్ ఉండి చదువుకుంటున్నారు.వాళ్ళతో మాట్లాడుతూ మీరంతా ఏమేమి అవ్వాలనుకుంటూన్నారు అని అడిగినప్పుడు ప్రతి ఒక్కరూ స్పందించి మేము ఫలానాది అవుదామనుకుంటున్నాము అంటూ చాలా స్పష్టంగా తమ తమ ఆకాంక్షల గురించి చెప్పారు.ఈ పిల్లలని ప్రోత్సహించాలే గాని వాళ్ళ గమ్యాలు తప్పక చేరుకుంటారు.వాళ్ళతో గడపడం నాకు గొప్ప ఉత్సాహాన్నిచ్చింది.
మా గోదావరి కధలు

వరదల్లో కొట్టుకొచ్చిన కొండాలమ్మ విగ్రహం కధ.

నేను తొమ్మిదో క్లాసు చదివే రోజులవి.నేను చదువుకున్నది "హిందూ స్త్రీ పునర్వివాహ సహాయక సంఘం"
స్కూల్లో.అంతే కాదు అది ఓరియంటల్ స్కూల్ కూడా.90% సంస్క్రుతం
మేము చదవేవాళ్ళం. సైన్సు,షోషల్, మాథ్స్ లాంటివేవి నేను చదువుకోలేదు.
నరసాపురం లో ని రాయపేటలో మా స్కూల్ ఉండేది.
ఒక రోజు మా సంస్క్రుతం మాష్టారు మాకు "మేఘసందేశం" పాఠం చెబుతున్నారు.మేము చాలా శ్రద్ధగా వింటున్నాము. అపుడు ఏం జరిగిందంటే మా స్కూల్లో అటెండర్ శ్రీరాములు పరుగెట్టుకుంటూ మా క్లాసులో కి వచ్చి 'అయ్యవారూ అయ్యావారూ మన గోదాట్లో కి వరదతో పాటు ఓ కొయ్య విగ్రహం కొట్టుకొచ్చిందంటా' అంటూ అరిచి చెప్పాడు.'ఒరేయ్ పోరా అవతలికీ అంటూ మా మాష్టారు శ్రీరాముల్ని తిట్టి క్లాసులోంచి పంపించేసారు. కాసేపటికి బెల్ కొట్టారు. అంతే. మేము పిల్లలమంతా పొలోమని గోదావరి వేపు పరుగులు తీసాం. వరద గోదారి ఉరవళ్ళు పరవళ్ళుగా ప్రవహిస్తోంది.ఒక చోట జనం గుంపుగా నిలబడడం కనపడింది.మేమంతా అటు వేపు పరుగెత్తాం.పెద్ద కొయ్య విగ్రహం కనబడింది.దాన్ని చూడగానే మాకు చాలా భయం వేసింది.చాలా పెద్దగా ఉంది.ఎవొరో…
1997 లో సంభవించిన పెను తుఫాను నర్సాపురం డివిజన్ లో ని అనేక మండలాల్లో తీవ్ర నస్టాన్ని కల్గించింది.అలాగే ఆ తర్వాత వచ్చిన వరదలు లంక గ్రామాలను ముంచెత్తాయి.రెవెన్యూ ఉద్యోగులు తుఫానుల్లో, వరదల్లో మునిగి తేలుతూ పనిచేయాల్సి ఉంటుంది.వరద ఉధ్రుతంగా ఉన్నపుడు మేము దొడ్డిపట్ల లో పడవెక్కి కనక్కాయ లంక వెళ్ళాల్సి వచ్చింది. అక్కడి ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించాలి."వరద నిల్వల" పేరుతో లంక గ్రామాల్లో బియ్యం,కిరసనాయిలు,పప్పు దినుసులు,పంచదార లాంటివి నిల్వ ఉంచుతారు.కానీ ఆ సంవత్సరం వచ్చిన వరదల్లో అన్నీ కొట్టుకుపోయాయి.కనక్కాయ లంకలో ప్రజలు తిండీ తిప్పలు లేకుండా చిక్కుకుపోయారు.మేము అవన్నీ పడవలొ నింపుకుని దొడ్డిపట్ల దగ్గర ఉధ్రుతంగా, భీకరంగా ప్రవహిస్తున్న గోదావరిని దాటే ప్రయత్నం చేసాం.
గోధుమ రంగులోకి మారిన వరద నీరు,కొట్టుకొస్తున్న ఇళ్ళ కప్పులు,జంతు కళేబరాలు,చెట్లు,చెత్త తో గోదారమ్మ బీభత్సంగా ఉంది. మా పడవ భయంకరంగా ఊగుతోంది.ప్రవాహ వేగానికి అటూ ఇటు కొట్టుకుపోతోంది.మేమంతా ప్రాణాలు అరచేత పట్టుకొని పడవలో కూర్చున్నాం.గోదారమ్మ ఉగ్ర రూపం గజ గజ ఒణికిస్తోంది.అయినా అవతల తిండి, నీళ్ళు లేక అల్లాడుతున్న ప్రజలు …
మా గోదావరి కధలు

వరద గోదావరి ఉగ్ర రూపం

మా మేనత్త గారి వూరు బూరుగు లంక గురించి చెప్పాను కదా.మీకు నచ్చిందని భావిస్తూ ఇప్పుడు కన క్కాయల లంక గురించి చెబుదామనుకుంటున్నాను.పాలకొల్లు దగ్గరున్న దొడ్డిపట్ల గ్రామానికి దగ్గగా వున్న లంక ఇది.ఈ లంకలో కి వెళ్ళాలంటే దొడ్డిపట్ల దగ్గర పడవెక్కి వెళ్ళాలి.బూరుగు లంక లాగా గోదావరిలో దిగి నడిచే ప్రశక్తే లేదు.కనక్కాయ లంక చుట్టూ లోతైన గోదారి ఉరవళ్ళతో ప్రవహిస్తూ ఉంటుంది.
పడవలో మాత్రమే ఈ లంకలోకి వెళ్ళగలం.ఆ... అన్నట్టు మర్చిపోయానండి.నేను 1996 లో యలమంచిలి ....వైజాగ్ దగ్గర ఎలమంచిలి కాదండీ.పశ్చిమ గోదవరి లో ఉన్న యలమంచిలండి.
ఈ మండలంలో నేను మండల రెవెన్యూ ఆఫీసర్ గా పనిచేసానండి.మా మండలం కింద మూడు లంక గ్రామాలుడేవి.అవి కనక్కాయల లంక,యెలమంచిలి లంక .....మరో లంక పేరు మర్చిపోయానండి.కనక్కాయ లంక చాలా అందమైంది. తమల పాకులు, మొక్కజొన్నలు ఎక్కువ పండిస్తారు.అవిశె చెట్లకి తమలపాకు పాదుల్ని పాకిస్తారు. లేత తమలపాకులు సున్నితంగా, సుకుమారంగా ఉంటాయి. ఈ లంకలో పండిన మొక్కజొన్న కంకుల్ని తిని తీరవలసిందే. అంత రుచిగా వుంటాయి.

మిగిలిన భాగం రేపు............
మా గోదావరి కధలు

మా మేనత్త గారి వూరు పేరు బూరుగులంక.తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో గోదావరి ప్రవహించినత మేరా బోలెడన్ని లంకలున్నాయి.కనక్కాయల లంక,యలమంచిలి లంక,బూరుగు లంక,పుచ్చల్లంక ఇలా ఎన్నో అందమైన లంకలున్నాయి.నేను పైన చెప్పిన బూరుగు లంక మా మేనత్త అత్తగారి వూరు.ఈ వూరు వెల్లడానికి రెండు దారులున్నాయి. ఒకటి నరసాపురంలో పడవెక్కి గోదావరి దాటి దాటి సఖినేటిపల్లిలో బస్సెక్కి వెళ్ళడం. రెండోది పెనుగొండ మీదుగా సిద్ధాంతం బ్రిడ్జి దాటి వెళ్ళడం.సిద్ధాంతం బ్రిడ్జి మీద నిలబడి చూస్తే కుడి వేపు,బంగారు వర్ణంలో మెరిసిపోయే ఇసుక తిన్నెల మధ్య చిన్న పాయలాగా పారే గోదావరి మలుపు తిరిగే చోట మా మేనత్త గారి బూరుగు లంక కనపడుతుంది.అచ్చమైన, అందమైన లంక.బూరుగు లంక మెడచుట్టూ నెక్లెస్ లా మెరుస్తుంటుంది గోదావరి.ఆ లంకలోకి వెళ్ళలంటే ఎవ్వరైనా సరే గోదావరిలో దిగి నడవాల్సిందే.ఎక్కువ లోతుండదు.ఆ చిన్న పాయలో పాదాలుంచి నడుస్తున్నపుడు చెప్పలేని ఉద్వేగం మనసును కమ్మేస్తుంది.తల్లి గోగారిని కాళ్ళతో తన్నుతూ నడవడం బాధగా అనిపిస్తున్నప్ప్టికి, నీళ్ళలో కాళ్ళు పెట్టగానే ఒళ్ళు జిల్లుమంటుంది.ఆ బుల్లి పాయను ధైర్యంగా దాటేసి, అఖండ గోదావరిని దాట…
Image
మా గోదావరి కధలు

మా రెండో అక్క వాళ్ళ వూరు కేసనపల్లి వెళ్ళాలంటే మేము మా సీతారామపురంలో బస్సు ఎక్కి నర్సాపురం వచ్చి,వలందర రేవులో పడవలో గోదావరి దాటి సఖినేటిపల్లి వెళ్ళాలి. అక్కడ ఇంకో బస్సు ఎక్కి వాళ్ళ వూరు వెళ్ళాలి.అప్పట్లో చిన్న చిన్న పడవలు మాత్రమే వుండేవి.నేను ఆ పడవల్లో ఎక్కి మహా ఆనందంగా మా చిన్నక్క వాళ్ళింటికి వెళ్ళే దాన్ని.అయితె పడవెక్కినప్పుడల్లా పడవ మనిషితో గొడవే.నాకు పడవ అంచు మీద కూర్చుని గోదావరి నీళ్ళల్లో చేతులు పెట్టి నీళ్ళతో ఆడుకుంటూ ప్రయాణం చేయాలని ఉండేది. కానీ పడవ మనిషి ఆడవాళ్ళని అంచు మీద కుర్చోనిచ్చేవాడు కాదు.ఎంత తగువుపడ్డా ఒప్పుకునేవాడుకాదు.నేను పోట్లాడి అంచు మీదే కూర్చునేదాన్ని.ఆడవాళ్ళు చెడిపోతున్నారు అంటూ తిట్టేవాడు.ఆడవాళ్ళు ఎందుక్కూర్చోకూడదు అంటూ నేను పోట్లాడేదాన్ని. నాతో మా నాన్న వున్నా కూడ మా నాన్న చెప్పినా పడవ మనిషి వినిపించుకునేవాడు కాదు. పడవ అంచు మీద కూర్చోడానికి, గోదావరిని ముట్టుకోవడానికి నేను చిన్నప్పుడే బోలెడన్ని యుద్ధాలు పడవవాళ్ళతో చేసాను.అంత చిన్న వయస్సులో వివక్షల గురించి అర్ధం కాకపోయినా ఆడవాళ్ళని కింద కూర్చోబెట్టి మగవాళ్ళని ఆనందంగా అంచుల మీద కూర్చోమని శాసించడం …
మా గోదావరి కధలు


మా వూరు సీతారామపురం అని నా పరిచయంలో చెప్పాను కదా. మా వూరికి గోదావరి నాలుగు కిలోమీటర్ల దూరంలో వుందండి.ఈ విషయం కూడా చెప్పినట్టే వున్నాను. వెన్నోల్లో మా గోదారి అందాలకి పరవసించినదాన్ని.గోదావరి నా జీవితంతో మమేకమైపోయింది.నేను ఏది రాయబోయినా గోదావరి ప్రశక్తి రాకుండా వుండదు.గోదావరితో నా అనుబంధం మా అమ్మతో నాకున్న అనుబంధం లాంటిదే. మా వూరు సీతారమపురంతో నా అనుబంధం కూదా అంతే. అయితే నాకు మా వూరితో మా గోదావరితో ఇప్పటికీ సజీవ సంబంధం వునందని చాలా గర్వంగా చెప్పుకోగలను. మా చిన్ని వూరిలో నేను చెట్టు మీద పిట్టల్లే పెరిగానని గొప్పగా చెప్పుకోగలను.నేను గడిపిన అద్భుతమైన బాల్యం ( సవాలక్ష ఆర్ధిక ఇబ్బందులున్నప్పటీకి)ఇప్పటికీ నా కళ్ళళ్ళో వెలుగుని నింపుతుంది.మా వూరికి ఒక పక్క గోగావరి మరో పక్క సముద్రం వుండడంతో నా బతుకు నీటితో ముడిపడిపోయింది.అందుకే నాకు నీళ్ళు చూస్తే వొళ్ళు తెలియని పరవశం కలుగుతుంది.సముద్రపుటలలు ఎప్పుడూ చేతులు చాచి పిలుస్తున్నట్టే వుంటుంది.నరసాపురం దగ్గర అఖండ వశిష్ట గోదావరి శాంత స్వరూపాన్ని ఒక సారి చూసిన వాళ్ళెవరూ మర్చిపోతారని నేను అనుకోను. అటువైపు విస్తరించిన కోన సీమ కొబ్బరి తోట…
నా నేస్తం

పువ్వులా నవ్వుతుంది
వెన్నెల్లా తాకుతుంది
ఆమె వేళ్ళ కొసల్లోంచి
ఆత్మీయత జాలువారుతుంది
ఆమె సాన్నిధ్యం
అంతులేని ఆనందాన్ని ఆవిష్కరిస్తుంది
ఆమె నవ్వు అలల్లా గాల్లో తేలి వచ్చి
నన్ను చైతన్యంతో నింపుతుంది
ఆమె స్పర్శ
పైరగాలిలా వొళ్ళంతా హాయి గొల్పుతుంది
ఆమె నడకలో ఆత్మవిశ్వాసం తొణికిసలాడుతుంది
ఆమె జ్ఞాపకం
నా పెదవి అంచు మీద చిరునవ్వు సంతకం
ఆమె స్నేహం అపురూపం,అపూర్వం,అనితరసాధ్యం
ఆమె ఎడబాటు
భరించలేని నిస్తేజం,అంతు తెలియని నిశ్శబ్దం
ఆమె కలయిక
గుండెల్లో గులాబీల గుబాళింపు
సంపెగలూ,చమేలీలు కలగలసిన
సువాసనల ఉత్సాహపు పలకరింపు.
BHANDARU ACCHAMAMBA, FIRST TELUGU STORY WRITER

Kondaveeti SatyavatiHistory of Telugu women writers is filled with numerous gems. If we dig them up and polish all those stones buried in dirt, the present day writings would be pale by comparison. We need to rewrite the current day history with an awareness of feminist perceptions and from women's perspective. Well-known writer, Gurujada Appa Rao, commented that "Modern day woman will rewrite history." His comment is significant in that he is considered by famous critcs and the academy as the first story writer in Telugu. In that sense, he is in competition with the woman who in fact was the first story writer in the entire history of Telugu fiction. I have great respect for Gurajada Appa Rao nevertheless I am going to establish authoritatively that Acchamamba was the first writer to write a modern Telugu story.

Acchamamba's first story was dhanatrayodasi. It was published in Hindusundari monthly in 1902; it dealt with a …
ఓ వొంటరి ఒడ్రంగి పిట్ట

పొద్దున్నే బద్దకాన్ని వదలగొడుతుంది
ఓ వొంటరి ఒడ్రంగి పిట్ట
కొంపలంటుకుపోయినట్టు
ఎవరో కొట్టడానికి వస్తున్నట్టు
పొడవైన తన ముక్కుతో
గుండె మీద పొడుస్తున్నట్టుగా
కుర్ కుర్ మంటూ అరుస్తుంది
ఎటో వెల్లిపోయిన తల్లి పిట్ట కోసం
గొంతు చించుకుంటూ
ఏడుపు స్వరంతో ఒకసారి
తల్లి రెక్కల్లో దూరినప్పటి
గునుస్తున్న స్వరంతో ఒకసారి
గుక్క తిప్పుకోకుండా అరుస్తోంది
కళ్ళు నులుముకుంటూ బయటకెళ్ళి చూద్దును కదా
కళ్ళను కట్టి పడేసే రంగు రంగుల్లో
ఇంధ్రధనుస్సుకు పొడవైన ముక్కు
మొలుచుకొచ్చిందా అన్నట్టు
బుల్లి ఒడ్రంగి పిట్ట
తల్లి కోసం దీనంగా ఏడుస్తోంది.
ATHEISM IS A WAY OF LIFE

When I look back into my past I can not but wonder at the changes that occurred in my life. Where have I started my journey and where have I reached! I did struggle a lot all these years to reach where I am today. In my struggle for existence my parents, friends and, later, my husband, helped me tremendously. I enjoyed the warmth of my friends throughout my life and I still do. The fragrance of friendship was with me at every major turn in my life. I love people and I have immense faith and trust in them. If I need any help of any kind, I look toward my fellow human beings.

I am an atheist. Atheism is a way of life for me. I don’t believe that a supernatural power rules this world. Nature is the prime caretaker of this world. If we protect nature it will protect us.

I said that atheism is a way of life for me. It has been so for the last thirty years. You may ask how I became an atheist and who influenced me. Nobody inspired me. Rahul Sankrutyayan’s “Olga to…
"ఫ్రెష్" మ్మార్కెట్ట్ల వెనక క్రష్ అవుతున్న మహిళల జీవనోపాధి

పెద్ద చేప చిన్న చేపను మింగుతుంది.భాగ్యనగరంలో ఫుడ్ బజార్లు ప్రవేశించి ఎన్నో సూపర్ బజార్లను మింగేసాయి.జెయింట్లు, బిగ్ బజార్లు వచ్చిఫుడ్ బజార్లను దెబ్బ తీసాయి.ఇపుడు తాజా కూరగాయలు, పండ్లు అందిస్తామంటూ తాజాగా మార్కెట్లో ప్రవేసించిన "ఫ్రెష్" సూపెర్ మార్కెట్లు, నగరంలో ఎక్కడెక్కడ కూరగాయలు అమ్మే స్థలాలున్నాయో అక్కడే తమ దుకాణం తెరిచి దశాబ్దాలుగా కూరగాయలు, పడ్లు,పువ్వులు అమ్ముకుని బతికే వాల్ల పొట్టల మీద చావు దెబ్బ కొడుతోంది. ఈ ఫ్రెష్ దుకాణాల్లో ఏ.సి. లు పెట్టి, తూచుదు మిషన్లు పెట్టి తక్కువ ధరలఖె కూరలు,పండ్లు అనే ప్రకటనలు గుప్పించడంతో మధ్య తరగతి, ఎగువ మధ్య తరగతి వర్గాల వారు ఈ దుకాణాల వేపు మళ్ళ్పోతున్నరు.ఎంతో ఆర్భాటంగా పెట్టిన రైతు బజార్లు ఎందుకూ కొరగానివిగా తయారవ్వబొతున్నయి.వీధుల్లో తొపుడు బళ్ళ మీద, తలల మీద బుట్టలు పెట్టుకుకి పళ్ళు, కూరగాయలు అమ్ముకునే వాళ్ళు జీవనోపాధిని కోల్పోయే ప్రమదపుటంచున నిలబడి వున్నరు.ఇల చిన్న వ్యపారాల ద్వార కూరలు అమ్ముకునేది మహిళలే అనంది వాస్తవం. ఈ మహిళల పరిస్తితి అగమ్యగోచరంగా తయారైంది.వారి కుత…
రాధిక గారూ
నేను నవంబర్ 2006 లో మీకు మెయిల్ ఇచ్చాను. అందులో

"స్నేహం మీద మీ కవితలు చాలా అద్భుతంగా వున్నాయి.నేను కూడా స్నేహానికి నా జీవితంలో చాలానే చోటిచ్చాను.నాకు చాలా ఆత్మీయులైన నేస్తాలున్నారు.అభినందనలు."
ఇదే నేను మీకు ఇచ్చిన పాత మెయిల్.
రాధిక గారూ
ధన్యవాదాలు.మీకూ నాలాగే అద్భుతమైన నేస్తం వున్నారని రాసారు.చాలా సంతోషమైంది చదివి.
నాకూ మీలాంటి అభిరుచులే వున్నందుకుకు ఆశ్చర్యంగా వుంది.
బహుశా అది మన గోదావరి ప్రభావమెమో.ఇంతకు ముందు మీ స్నేహమా బ్లాగ్ చదివి మీకు మైల్ కూడా ఇచ్చాను.మీ పరిచయం ఇలా కలిగినందుకు బోలెడంత ఆనoదంతో

సత్యవతి
Image
నువ్వు నేను- ఆ ఫోటో

సంతోషాన్ని నిర్వచించగలమా
ఆనందానికి అర్ధం చెప్పగలమా
అదొక మానసిక స్థితి
ఈ మానసిక స్థితి శరీరంలో ప్రతిఫలించడం
ఎవరైనా ఎపుడైనా చూసారా
పరవశంలో పొంగి పొర్లుతున్న మనసు
ముఖంలోనే కాదు
మొత్తం శరీరంలో ప్రతిఫలించడం
ఎవరైనా ఎపుడైనా చూసారా
పాపికొండల పారవశ్యం ఒకవేపు
గోదారమ్మ గలగలలు మరోవైపు
నీ స్నేహ మాధుర్యం మరోవైపు
ముప్పేటలా నన్ను ముంచెత్తిన వేళ
నా ముఖంలో వెయ్యి మతాబుల కాంతి
వెలుతురు విరజిమ్మతున్న పరిసరాల్లో
నిన్ను చుట్టుకున్న చేతుల్లో
పూసిన కాంతి పుంజరాలు
సంతోషాన్ని మనస్సే కాదు
శరీరం కూడా వ్యక్తం చేస్తుందని
ప్రక్రుతి పచ్చదనమే కాదు
ప్రియ నెచ్చలి వెచ్చని స్పర్శ కూడా
ఒళ్ళంతా విద్యుత్తరంగాలు పుట్టిస్తుందని
మన చాయాచిత్రం చూసాకే అర్ధమైంది.
స్నేహం

ఆత్మీయతలో ముంచి తీసినట్టుగ వుంటుంది
కనుచూపుమేరంతా
పరుచుకున్న పచ్చదనంలా వుంటుంది
గుండెకి సంబంధించిన
సుతిమెత్తని సవ్వడి లా వుంటుంది
భుజమ్మీద వాలిన
వెచ్చని స్పర్శలా వుంటుంది
గాయాలు కన్నీళై ప్రవహించేవేళ
చల్లని ఓదార్పులా వుంటుంది
నిస్సారంగా గడిచిపోయే మధ్యాహ్న్నపు వేళ
ముంగిట వాలే ఉత్తరంలా వుంటుంది
ఏకాంతపు సాయంత్రాల్ని
ఇసుకతిన్నెల మీదికి నడిపించే
సమ్మోహన శక్తిలా వుంటుంది
దిగులు మేఘాలు కమ్ముకున్నపుడు
చెప్పలేని చింతలేవో చీకాకుపెట్టేటప్పుడు
పెదవి మీద మొలిచే చిరునవ్వులా వుంటుంది
నీతో స్నేహం.......
అపూర్వం, అపురూపం
అది నా అంతరంగానికి, ఆత్మకి సంబంధించింది

గుప్పెడు అన్నం పెట్టండి చాలు

అమ్మంటే దేవతని
అమ్మంటే అనురాగ మూర్తని
అమ్మంటే ఆది శక్తని
ఇంకా ఇంకా ఎన్నో బిరుదులు
అమ్మ గోరు ముద్దలు తినకుండా
అమ్మ లాలి పాట వినకుండా
ఎవరైనా పెరుగుతారా
అమ్మ గుర్తొస్తే.....
గోరు ముద్దలేనా గుర్తొచ్చేది
లాలి పాటలేనా గుర్తొచ్చేది
అమ్మ ఒక చాకిరీ యంత్రమని
అమ్మ ఒక నిశ్శబ్ద గీతమని
అమ్మ ఒక సంక్షుభిత రూపమని
పగలు రేయి తేడా తెలియని
పనుల వలయంలో
అమ్మొక తిరగలి, అమ్మొక చీపురు
అమ్మొక చేట, అమ్మొక గాస్ స్టవ్
అందరి కదుపులూ నింపే అక్షయ పాత్ర
తన కడుపు వేపు కన్నెత్తి కూడా చూసుకోదు
కలో గంజో ఆమె కడుపు లోకి
కన్న వాళ్ళ కట్టు కున్నవాళ్ళ
కలల సాకారమే ఆమె నిరంతర క్రుషి
అమ్మతనపు ఆత్మీయతని
అన్నంలో కలిపి తినిపిస్తుంది
కట్టుకున్న వాడు నరరూప రాక్షసుడై
నరనరాన్ని నలుచుకుతింటున్నా
చిరు నవ్వుని పెదాలకి అతికించుకుంటుంది
పిల్లల కోడిలా బిడ్డల్ని గుండెల్లో దాచుకుంటుంది
తన గుండెల్లో గునపాలు దిగుతున్నా
పంటి బిగువున బాధని ఓర్చుకుంటుంది
ఇంత చేసి...............
రెక్కలొచ్చిన పిల్లలు
తలో దిక్కూ ఎగిరిపోతే
గుండె చెరువై కూలబడుతుంది
అమ్మంటే దేవతని అన్నదెవరురా
సిగ్గుపడాలి మనం ఆ మాట అన్నందుకు
దుఖపడాలి మనం నగ్న సత్యాలు చూసి
అమ్మని…

nee gnapakam

నీ గ్ఞాపకం
కారు మబ్బులు కమ్ముకున్నట్టుండే కలక్టరాఫీసులో
చిరు దీపంలా వెలుగుతుంటావు
నవ్వడం మరిచిపోయిన మనుష్యుల మధ్య
పువ్వు విచ్చుకున్నంత సహజంగా
చిర్నవ్వుతుంటావు
అందరిని హడలెత్తించే చిక్కుముడుల్ని
చిటికేసినంత ఈజీగా విప్పేసి
చిద్విలాసంగా నవ్వుతుంటావు
నిలవ నీరు మాత్రమే వుండే చోట
ఆశాపూరిత ఆలోచనల్ని ఆవాహన చేస్తుంటావు
నిస్తేజం నిత్యక్రుత్యమైన చోట
కొత్త గాలిలా వీస్తుంటావు
నువ్వుండె పరిసరాలు నిత్యనూతనంగా
జీవ కళల్ని విరజిమ్ముతుంటాయి
మాటలో మనసులో
ఆలోచనలో ఆచరణలో
ఆత్మవిశ్వాసం వెదజల్లుతుంటవు
నిజమోయ్ నేస్తం
నిన్ను తలచుకుంటే
అరచేతిలో వెన్నెల్ని చూసినంత ఆననందంగా వుంటుంది
అమావాస్య రోజున చందమామని చూసినంత సంబరంగా వుంటుంది.

anooraadha sinimalO paaTa

"ఆయేరే వొ దిన్ క్యోం న ఆయీ"
పాట వింటున్నపుడల్లా గుండెల్లో ఏదో లుంగచుట్టుకుంటున్న.
ఫీలింగ్
లతా గొంతు లోని ఆవేదనతో రవి శంకర్ సంగీతం కలగలసి
నరాలను మెలిపెడుతున్న అనుభూతి.
చేజారిపోయిన మధుర క్షణాలను
తలచుకుంటూ ఒంటరితనంలో వేగిపోతూ అనురాధ ఆలపించే ఈ పాట సూటిగ గుండెల్ని తాకుతుంది.
విన్న ప్రతి సారీ అవ్యక్తమైన బాధతో గుండె అదురుతున్న అనుభూతి.
వేల గొంతులొక్కసారిగా తమ ఆత్మ ఘోషల్ని ఆర్ద్రంగా ఒకే గొంతుకలో
ఒలికించినంత అనుభూతి
గుండె చిక్కబట్టడం అంటే ఇదే కాబోలు
వేలాది స్త్రీల అంతరంగ సంఘర్షణని తన గానంలో ఒలికించిన లత
నరాల మీద నాట్యం చేసిన రవిశంకర్ సంగీతం
అన్నీ కలగలసి ఈ పాట నా లోపల్లోపల
ఒక అలజడిని ఒక కల్లోలాన్ని రేపింది.
మసక మసకగ ఓ ఆత్మీయ స్త్రీమూర్తిని నా కళ్ళ ముందు ఆవిష్కరించింది.
చిద్రమౌతున్న మానసంబంధాల సంక్షోభాన్ని
నగ్నంగా నా ముందు సాక్షాత్కరింప చేసింది
ప్రేమ రాహిత్యపు విక్రుత పార్శ్వాన్ని
నా నట్టెదుట నిలబెట్టిన ఈ పాట
నా మీద గొప్ప ప్రభావాన్ని చూపించింది.
(ఈ పాట అనురాధ అనే హిందీ సినిమా లోది)

snEham

ఎద ఎదను కదిలించేది
ఎద ఎదను వెలిగించేది
అందరికి కావలసినది
ఎవరూ కొనలేనిది
అదే స్నేహం
ప్రాణంలో ప్రాణం
నిత్య నూతన పరిమళం
చెదరని సుందర దరహాసం
అదే అదే చెలిమి
మనిషికి అదే కలిమి
చీకట్లో చేయూత
వుత్సాహపు పులకరింత
అదే అదే దోస్తీ
వుంటే మనసుకు లేదు సుస్తీ
ఎన్ని ఇక్కట్లున్నా
నేస్తం ఎదురుగ వుంటే
ఏదో ఏదొ త్రుప్తి
మరువలేని అనుభూతి
మరపురాని మధుర గీతి

maagodavari

నా పేరు కొండవీటి సత్యవతి. మావూరు సీతారామపురం.నరసాపురం మండలంలో పశ్చిమ గోదావరి జిల్లాలో వుంది మా వూరు. నాకు మా వూరంటే చాలా ఇష్టం. మా వూరికి నాలుగు కిలోమీటర్ల దూరంలో గోదావరి వుంది.తొమ్మిది కిలోమీటర్ల దూరంలో సము ద్రం వుంది. నాకు మా గోదావరి అంటే ప్రాణం.మా అమ్మ అన్నా మా గోదావరి అన్నా మా వూరన్నా నాకు చాల ఇష్టం.