Posts

Showing posts from February, 2010

మహిళలకు సహాయ కేంద్రం

Image
మహిళలకు సహాయ కేంద్రం
మహిళా పోలీస్‌ స్టేషన్‌, సిసిఎస్‌, హైదరాబాద్‌
   ఈ రోజు ఉదయం 11 గంటలకు  నగర పోలీస్ కమీషనర్ ఎ.కే ఖాన్ ప్రారంభించారు. మీటింగ్ ఉండడం వల్ల సబితా ఇంద్రా రెడ్డి ఈ కార్యక్రమానికి రాలేక పోయారు.     మహిళలపై నానాటికీ పెచ్చరిల్లుతున్న హింస మానవ హక్కులకు విఘాతంగా పరిణమిస్తోంది. ఈ నేపథ్యంలో బాధితుల అవసరాల్ని దృష్టిలో ఉంచుకుని, పోలీస్‌ స్టేషన్లలోనే మహిళా సహాయ కేంద్రాల్ని నెలకొల్పడమన్నది ఒకానొక వ్యూహాత్మక ప్రతిపాదనగా ముందుకొచ్చింది. మహిళలపై హింసకు వ్యతిరేకంగా పోలీసు విభాగంతో పాటు, ఆక్స్ ఫాం ఇండియా, స్వార్డ్ సంస్థల సమష్టి కృషి ఫలితంగా ఈ ప్రతిపాదన కార్యరూపాన్ని సంతరించుకుంది. ఆంధ్రప్రదేశ్లో 2004లో ప్రారంభమైన ఈ మహిళా సహాయ కేంద్రాల ఏర్పాటు నేడు పౌరసమాజమూ, ప్రభుత్వాల మధ్య అద్భుత సమన్వయ సహకారానికి తార్కాణంగా నిలిచిందంటే అతిశయోక్తి కాదు. ఈ ప్రోత్సాహకర అనుభవం ఆధారంగా సహాయ కేంద్రాల ఏర్పాటు డిఎఫ్యైడి సహకారంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు (వరంగల్, కరీంనగర్, అనంతపురం) విస్తరించింది. శ్రీ ఎ.కె.ఖాన్‌ అదనపు డిజిపి (లా అండ్‌ ఆర్డర్)గా పనిచేస్తున్న కాలంలో దీనికి సంబంధించిన ఆదేశాలు జారీ అయ్యాయి. రాష్…

నేనొక్కదాన్ని కోణార్క్, పురి వెళ్ళొచ్చానోచ్!!!

Image
భువనేశ్వర్ వచ్చింది మహా సీరియస్ మీటింగ్ కి.
జెండర్ బడ్జెట్.బడ్జెట్ ని స్త్రీల ద్రుష్టి కోణం నుండి,
జెండర్ పర్స్పెక్టివ్ నుండి ఎలా అర్ధం చేసుకోవాలి
అనే అంశం మీద మీటింగ్ జరిగింది.
కెంద్ర ప్రభుత్వం గ్రుహ హింస నుండి స్త్రీలకు రక్షణ కల్పించే చట్టం తెచ్చింది గానీ
దాని అమలుకు సరిపడిన నిధులివ్వడం లేదు.
జెండర్ బడ్జెట్ కు,ఈ అంశానికి ఉన్న లింక్ కు సంబంధించి
భువనేశ్వర్ లో ఒకటిన్నర రోజులు మీటింగ్ జరిగింది.
చర్చోపచర్చలు,తీర్మానాలు అయ్యాయి.
బుర్ర వేడెక్కిపోయి చల్లగాలి పీల్చుకోకపోతే పిచ్చెక్కిపోయేలా ఉందని కారు బుక్ చేసుకుని కోణార్క్ కి పారిపొయ్యా.
కోణార్క్ శిల్ప సౌందర్యం రెండు కళ్ళు విప్పార్చుకుని చూడాల్సిందే.
అద్భుత శిల్పవిన్యాసం.
ఎన్నివేలమంది శిల్పులు అహర్నిశలు అన్నపానాలు లేకుండా చెక్కారో.
సూర్యుడి రధచక్రాలను చూస్తుంటే ఆ రధం కదులుతున్నదా అనే భ్రమ కలుగుతుంది.
కోణర్క్ చూడడం గొప్ప అనుభవం.
కోణర్క్ నుండి సముద్ర తీరం వెంబడి పురి వెళ్ళడం
మరో అపూర్వానుభవం.
వైజాగ్ నుండి భీమిలి వెళ్ళే రోడ్డులా ఉంటుంది.
దీన్ని మెరైన్ డ్రైవ్ అంటారట.
మధ్యలో దట్టమైన అడవి కూడా వస్తుంది.
పురి బీచ్ అండమాన్ బీచ్ లాగా అనిపించిం…

ఇంఫాల్ ఎక్ పల్ హసి -ఎక్ పల్ ఆశు

2008లో పూనాలో జరిగిన మహిళా జర్నలిస్ట్‌ల ఆరో సదస్సులో 2009లో జరగబోయే సదస్సు ఇంఫాల్‌లో జరుగుతుందని ప్రకటించిన దగ్గర నుంచి ఈశాన్యభారతాన్ని చూడడానికైనా తప్పనిసరిగా ఈ సమావేశాలకి హాజరవ్వాలని అనుకున్నాను. పూనాలో సమావేశాలు జరుగుతున్నపుడే హెల్ప్‌లైన్‌ ఎక్స్‌పోజర్‌ విజిట్‌కి జైపూర్‌ వెళ్ళడం వల్ల నేను వాటిని మిస్‌ అయ్యాను. ఎలాగైనా ఇంఫాల్‌ వెళ్ళాలని డబ్బులు దాచుకోవడం మొదలుపెట్టాను. మణిపూర్‌ చాలాదూరం కాబట్టి ప్రయాణ ఖర్చులకే ఇరవైవేలు కావాలి. సొంత డబ్బులతోనే వెళ్ళాలి.

దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో వున్న మహిళా జర్నలిస్ట్‌లు 2003లో ఢిల్లీలో సమావేశమైనపుడు ఒక వెబ్‌సైట్‌ నిర్మాణంతో పాటు ప్రతి సంవత్సరం కలవాలనే నిర్ణయం తీసుకున్నారు. ఆ మొదటి సమావేశానికి నేను హాజరయ్యాను. మీడియాలో మహిళలు ఎదుర్కొంటున్న వివిధ సమస్యల మీద చర్చలతో పాటు, ఎన్నో అంశాల మీద మూడురోజులపాటు సమావేశాలు జరుగుతాయి.
మూడునెలల క్రితం ఇంఫాల్‌లో సదస్సు నిర్వహణా బాధ్యతని స్వీకరించిన అంజులిక నుంచి చక్కటి కవితాత్మకమైన ఆహ్వానం నెట్‌వర్క్‌ సభ్యులందరికీ అందింది. అంజులిక రాసిన ఈమెయిల్‌ అందరిలో ఉత్సాహాన్ని నింపింది. ఇక అప్పటినుండి ప్రయణపు ఏర్పాట్లు మొదలయ…

సింగారం పోవాలే

ఉప్పల్ కి ఏడు కిలోమీటర్ల దూరంలో సింగారమనే పల్లె ఉంది.
ఊరు చక్కగా ఉంటుంది.తెలంగాణా పల్లె వాతావరణం ఉంటుంది.
ఊరంతా మోదుగు పూల చెట్లు.
సీజన్లో ఎర్రటి మోదుగు పూలతో ఊరంతా ఎర్రబారి ఉంటుంది.
నిన్న నేను నా నేస్తం గీత నా కారులో నేనే డ్రైవ్ చేస్తూ సింగారమెళ్ళేం.
సింగారం ప్రత్యేకత ఒకటి ఊరంతా పచ్చగా కూరగాయలపాదుల్తో నిండి ఉంటుంది.
నా నేస్తం వాళ్ళ పెద్దమ్మ గారి ఊరు.
వాళ్ళింట్లో టర్కి కోళ్ళు,గిన్ని కోళ్ళు, మామూలు కోళ్ళు
బోలెడు ఉన్నాయి.
అన్నింటిని మించి అక్కడ చల్లటి నీరా ప్రెష్ గా దొరుకుతుంది.
అలా చూస్తున్నారేంటి?
అప్పుడే తాటి చెట్టు నుండి దింపిన నీరా నీటుగా ఉంటుంది.
నమ్మకం లేకపోతే ఒక్కసారి తాగి చూడండి.
నిజానికి నీరా కొబ్బరి నీళ్ళకంటే శ్రేష్టమైంది.
దానిలో నానా చెత్తా కలిపి కల్లు కాంపౌండ్ లో బ్రష్టు పట్టిస్తారు.
మొత్తానికి సింగారమెళ్ళడం తియ్యటి నీరా తాగడం భలే బావుంటుంది.