Tuesday, June 5, 2012

తెలుగులో సరికొత్త ప్రక్రియ ఛాయాచిత్ర కథనం




అబ్బూరి ఛాయాదేవిగారు ఏ పని చేసినా ఎంతో కొత్తగా, సృజనాత్మకంగా వుంటుందనడానికి తార్కాణం ఆవిడ ఇటీవల తయారు చేసిన 1948 నుండి 2011 దాకా ఛాయాచిత్ర కథనం. (రాజమండ్రి నుంచి రాజమండ్రిదాకా) నాకు తెలిసినంతవరకు తెలుగులో ఇలాంటి ప్రయత్నం ఇంతవరకూ ఎవరూ చెయ్యలేదు. ప్రస్తావనలో తానే ఇలా చెప్పారు.
”జీవితం పొడుగునా రకరకాల అనుబంధాలు ఏర్పడిన వ్యక్తులను స్మరించుకుంటూ, పోయిన వారికి స్మృత్యంజలి ఘటిస్తూ, బతికి ఉన్నవారికి కృతజ్ఞతాసుమాలు సమర్పిస్తూ ఆత్మీయతని చూపిస్తూ రూపొందించిన సజీవ సచిత్ర ఆత్మకథ ఇది. ఇది నా ఛాయాచిత్ర కథనం.”
సాధారణంగా ఆత్మకథలు సుదీర్ఘంగా సాగుతూ అక్కడక్కడా కొన్ని ఫోటోలు తళుక్కుమంటుంటాయి. అయితే ఛాయాదేవిగారి పుస్తకంలో మాత్రం – (నిజానికి దీనిని పుస్తకం అనకూడదు. ఛాయాదేవి గారు ఛాయాచిత్ర కథనాన్ని సిడిలో భద్రపరిచారు. కొన్ని కాపీలను కలర్‌ జిరాక్స్‌ తీయించి నాలాంటి కొందరు మితృలకు ఇచ్చారు. ఈ పుస్తకాన్ని ఎవరైనా ప్రచురిస్తే చాలా బావుంటుంది. ఈ సి.డి.ని అస్మిత వారి వెబ్‌సైట్‌లో పెడతారని వారి వెబ్‌సౖెెట్‌ అడ్రస్‌ యిచ్చారు. ఫోటోలు మాట్లాడతాయి ఫలానా ఫోటో ఎక్కడ, ఎ సందర్భంలో, ఎవరితో దిగారు. ఆ వ్యక్తికి సంబంధించిన వివరాలు, వారితో తనకున్న సంబంధబాంధవ్యాలు చెప్పుకుంటూ వెళ్ళతారు.

ఈ పుస్తకంలో మొదటిఫోటో 1948లో వారి అన్నయ్య డా. ఎం.జి. కృష్ణ తీసారు. అప్పటికి ఛాయాదేవి గారి వయస్సు 15 సంవత్సరాలు. ఆ తొలిఫోటో నుంచి మొదలుపెట్టి దాదాపు రెండువందల పేజీలు ఎ4 సైజులో వందలాది ఫోటోలు, వ్యాఖ్యాలు. చివరి ఫోటో 6.8.11  నుండి 8.8.11 రాజమండ్రిలో జరిగిన సాహిత్య అకాడమీ వారు తీసిన ఫోటో. తొలి ఛాయా చిత్రం, తుది ఛాయాచిత్రానికి నడుమ ఛాయాదేవిగారి బంధువులు, మితృలూ, ఆత్మీయులూ, సభలు, సమావేశాలకు చెందిన ఫోటోలు చెప్పే కథల్లో అరవై మూడు సంవత్సరాల సాహిత్య చరిత్ర యిమిడి  వుందంటే అతిశయోక్తి కాదు. ఒక్కొక్క ఫోటోను జాగ్రత్తగా అధ్యయనం చేస్తే ఆ ఫోటో తీసిన సందర్భానికి ఎంతో ప్రాముఖ్యత వుంటుంది.”మా పెళ్ళికి ఫోటోలు లేవు. పెద్దగా బాజా భజంత్రీలూ లేవు”అంటూ ఛాయాదేవిగారు 19 పేజీలో ఓ అద్భుతమైన ఫోటో పెట్టారు. ఇంటి బాల్కనీలో అబ్బూరి వరదరాజేశ్వరరావుగారు, ఛాయాదేవిగారు హృద్యంగా నవ్వుతున్న ఫోటో అది. గమ్మత్తేమిటంటే ఈ పుస్తకంలోని దాదాపు ఎనభై శాతం ఫోటోల్లో ఛాయాదేవిగారు సీరియస్‌గా వున్నవే వున్నాయి. పైన నేను పేర్కొన్న ఫోటోలో ఇద్దరూ భలే నవ్వుతుంటారు.

ఛాయాదేవిగారు ఢిల్లీలో  వున్నపుడు ఇందిరాగాంధి, నెహ్రూలాంటి రాజకీయ ప్రముఖుల్ని కలసినపుడు తీసిన ఫోటోలు, వారి వివరాలు చదవడానికి చాలా బావున్నాయి. ఎన్నో జ్ఞాపకాలు పెనవేసుకునే ఫోటోలు చూడడం వేరు, అవి చెప్పే కథలు చదవడం వేరు. ఎంతో అపారమైన జ్ఞాపకశక్తి వుంటే తప్ప ఆ పని చేయలేం. ఛాయాదేవిగారు 63 సంవత్సరాల చరిత్రని అవలీలగా ఫోటోలతో చెప్పించారు. తాను ఈ ప్రయత్నం ఎందుకు చేసానో చెబుతూ ” అసలు ఈ పనులన్నీ ఎందుకు పెట్టుకోవడం అని నన్ను నేను ప్రశ్నించుకుంటూ వుంటాను. నేను పోయాక ఈ కాగితాలు, పత్రాలు, ఫోటోలు ఏమైపోతే నాకెందుకు అని వేదాంత ధోరణిలో అనుకోకుండా వాటిని డిటిపి  చేయించి, స్కానింగ్‌ చేయించి, సి.డిల్లో కెక్కించి వెబ్‌సైట్‌లో (ప్రచురించడం మరీ క్లిష్టం, కష్టం కనుక) పెట్టడం దేనికి? నేను పోతే నా రచనలగురించి, ఫోటోల గురించి పట్టించుకునే వాళ్ళెవరూ లేరు. ఎవరి అభిరుచులూ, ఆసక్తులూ, బాధ్యతలూ వాళ్ళవి. నా పేరు ఇంకా కొనసాగాలన్న తాపత్రయం కన్నా, నాకు ఇంత పేరు రావడానికి వెనుక ఎంతమంది పెద్దల, మిత్రుల, బంధువుల, అబిమానుల ఆదరాభిమానాలు, సహకారాలు ఉన్నాయో తలుచుకుని, నలుగురికీ తెలియచేసే మార్గం ఇదేనని తోచడంవల్ల ఈ కార్యక్రమానికి పూనుకున్నాను” అంటూ వివరించారు.

ఏది ఏమైనా గానీ తెలుగులో ఓ అపూర్వ, నవీన కార్యక్రమానికి ఆద్యురాలుగా నిలిచిన అబ్బూరి ఛాయాదేవిగారు అభినందనీయులు.  ఈ పుస్తకం విస్తృతంగా బయటకు వచ్చివుంటే, ఆ పుస్తకాన్ని చూసిన వారందరూ ఖచ్చితంగా తమ ఫోటో ఆల్బమ్‌ల దుమ్ము దులపడం ఖాయం. ఒక్కో ఫోటోని సుదీర్ఘంగా చూస్తూ, ఆ ఫోటో చరిత్రను జ్ఞాపకం తెచ్చుకుంటూ ఛాయాదేవిగారిని అనుసరించడం జరిగే తీరుతుంది. పుస్తకం మొత్తం చూసాక ఛాయాదేవిగారితో వివిధ సందర్భాలలో వున్న నా ఫోటోలు చూసుకుని చాలా సంతోషపడి ”ఛాయాదేవిగారూ నావి, భూమిక కార్యక్రమాలవీ చాలా ఫోటోలున్నాయి మీ పుస్తకంలో ” ”అంటే భూమికతో నా అనుబంధం అలాంటిది మరి” అన్నారు నవ్వేస్తూ…

ఎంతో శ్రమకోర్చి ఛాయాదేవిగారు తయారు చేసిన ”ఛాయాచిత్ర కథనం” అందరికీ అందుబాటులోకి వస్తే చాలా బావుంటుంది. దానికి ఎవరైనా పూనుకుంటారేమో ఎదురుచూద్దాం. ఇంత చక్కటి ఆలోచన చేసి ఎంతో కష్టపడి ఛాయాచిత్రకథనం రాసి తెలుగువారికి అందుబాటులోకి తెచ్చిన ఛాయాదేవిగారి ప్రయత్నం మరెందరికో స్ఫూర్తి దాయకం కావాలని ఆశిస్తున్నాను.
ఛాయాదేవిగారి ప్రస్తుత చిరునామా: రూమ్‌నెం. 103, సి.ఆర్‌ ఫౌండేషన్‌, కొండాపూర్‌, హైద్రాబాద్‌ 500 084 ఫోన్‌: 8179377817


Monday, June 4, 2012

కొస్టల్‌ కారిడార్‌ మింగేసిన రమణ చెల్లెలు

                 ప్రస్తుతం మీడియాలో హోరెత్తుతున్న కొన్ని కంపెనీల పేర్లు, వాటి నిర్వాకాలు చదువుతుంటే  నాలుగేళ్ళ క్రితం జరిగిన కొన్ని సంఘటనలు నా కళ్ళ ముందు కనబడుతున్నాయి.


2008లో అనుకుంటాను నేను చేనేత మహిళలు నిర్వహించిన ఒక సమావేశంలో పాల్గొనడానికి చీరాల వెళ్ళాను. మీటింగ్‌ తరువాత అక్కడికి దగ్గరలోనే వున్న బీచ్‌ను చూద్దామని ఒక టాక్సీ బుక్‌ చేసుకుని బయలుదేరాను. టాక్సీ డ్రెవర్‌ పేరు రమణ అని గుర్తు. మేం బీచ్‌వేపు వెళుతుంటే ఆ దారికటూ ఇటూ పొలాలన్నీ కంచెవేసి వున్నాయి. కనుచూపు మేరంతా  పొలాలు పడావు పడి వున్నాయి. ”ఏంటి! ఈ పొలాలన్నీ ఎవరివి కంచె ఎందుకు వేసారు?” అని రమణ నడిగాను. ”ఈ పొలాలన్నీ రైతులవండి. కోస్టల్‌ కారిడారో ఏంటో…అదేంటో నాకు  సరిగ్గా తెలవదండి. అది వస్తుందని ఈ పొలాలన్నీ తీసేసుకున్నారు. అదిగో! అటు చూడండి. అక్కడ మా పొలం కూడా వుంది. మాకు నష్టపరిహారమివ్వరు. అమ్ముకోనియరు!” రమణ చెప్పుకు పోతున్నాడు. ”మీ పొలం ఎవరు తీసుకున్నారు.

ప్రభుత్వం నష్టపరిహారం ఇస్తుంది కదా ! ”అంటే  ”ఆ ఇషయాలేవీ నాకు తెల్వదండి. నేను టాక్సీ నడుపుకుంటాను. అయ్యన్నీ మా నాన్న చూసుకుంటాడు. మా చెల్లి పెళ్ళి చేద్దామని మా నాన్న ఎకరం పొలం బేరం కూడా పెట్టాడండి. ఆ టైమ్‌లోనే మా పొలాలు లాక్కున్నారు.  మా నాన్న మా చెల్లి పెళ్ళి చెయ్యలేక పోయాడు. మా చెల్లి వొళ్ళు కాల్చుకుని చనిపోయిందండి.” రమణ గొంతులో ఎంతో వేదన. ”అయ్యో! ఎంత ఘోరం జరిగింది.” అన్నాన్నేను ఏమనాలో తెలియక. ”మరేం చేస్తదండి. పెళ్ళి కుదిరింది. ముహూర్తాలు కూడా పెట్టుకున్నాం. పొలం అమ్ముకోడానికి వీల్లేకుండా పోయింది. మా చెల్లి చాలా సున్నితమండి. భరించలేకపోయింది.” అన్నాడు రమణ.

మేం మాట్లాడుకుంటుండగానే బీచ్‌ వచ్చేసింది. నాకు బీచ్‌లో దిగాలన్పించలేదు. సముద్రాన్ని చూస్తే ఉప్పొంగే నా హృదయం ఆ రోజు ఉప్పొంగలేదు. ఆత్మహత్య చేసుకుని చనిపోయిన రమణ చెల్లి  నా కళ్ళలో నీళ్ళు పెట్టించింది. కను చూపు మేరంతా సంకెళ్ళలో వున్న వేలాది ఎకరాల భూమి కూడా కన్నీళ్ళు పెడుతోందా అన్పించింది నీళ్ళతో నిండిన నా కళ్ళకి. రైతుల స్వేదంతో పులకించే భూమాతను చెరపట్టి, రైతుకు దూరం చేసి నోటికి తిరగని అడ్డమైన కంపెనీలకి ధారాదత్తం చేసిన భూమి ద్రోహులు ఈ రోజు చట్టం ముందు దోషులుగా నిలబడ్డం గొప్ప సంతోషంగానే వున్నా, రమణ కుటుంబంలాంటి  లక్షల కుటుంబాల కన్నీళ్ళు, కడగండ్లు తీరుతాయా లేదా? ఇదంతా నాటకమా అనే అనుమానం కూడా మనసులో పొడసూపుతోంది. పోలేపల్లి, కాకినాడ,సోంపేట, అరకు, పాడేరు. గంగవరం లాంటి ఎన్నెన్ని ఊళ్ళు, ఎంతమంది బాధిత ప్రజలు. ”అభివృద్ధి” దొంగజపం చేస్తూ, చటుక్కున చేపను పట్టి గుటుక్కున మింగేసే దొంగ కొంగలా లక్షలాది ఎకరాల సస్యశ్యామలమైన, ఆకుపచ్చటి భూముల్ని బీడు భూముల్ని చేసి నాశనం  చేసిన భూబకాసురులు జైళ్ళ పాలయితే వాళ్ళు చేసిన దౌష్ట్యాలూ, దుర్మార్గాలూ, దౌర్జన్యాలు సమసిపోతాయా? పోయిన ప్రాణాలు తిరిగి వస్తాయా?

‘మా ప్రాణం పోయినా మా భూములివ్వమని’ నినదించిన పోలేపల్లి ప్రజల్ని అరబిందో కంపెనీ నిర్వాసితులను చేసే వొదిలింది. ” మా సముద్రం పోనాదండీ” అంటూ గుక్కపట్టి ఏడ్చిన దిబ్బపాలెం, గంగవరం ప్రజల్ని సముద్రంలోకి అడుగుపెట్టకుండా ఇనుపగోడ కట్టింది పోర్ట్‌. ”జిందాల్‌గాడిని మా భూముల్లో అడుగు పెట్టి చూడమనండ”ి అంటూ సవాలు విసిరిన కాకిదేవుడమ్మ, కాకినాడ సెజ్‌ మింగేసిన తమ భూముల్లో ఏరువాక మొదలు పెట్టిన కాకినాడ మహిళలు, తుపాకులకు ఎదురు నిలిచి పోరాడిన సోంపేట సాహసస్త్రీలు.

సూట్లు, బూట్లు వేసుకుని, పెద్ద పెద్ద కార్లల్లోంచి దిగుతూ అమాయకపు ముఖాలు పెట్టుకుని చట్టం ముందు దోషులుగా నిలబడిన వాళ్ళందరినీ చూస్తుంటే నాకు మళ్ళీ రమణ చెల్లెలు గుర్తుకొస్తోంది. కాకి దేవుడమ్మ, పోలేపల్లి చుక్కమ్మ, సోంపేట స్త్రీలు పదే పదే గుర్తుకొస్తున్నారు. లక్షలాది నిర్వాసితుల కన్నీళ్ళను తాగి, వారి జీవనాధారమైన భూముల్ని లాక్కున్న ద్రోహుల్ని చూస్తే కడుపులోంచి ఏదో తెలుములకుంటూ బయటకొస్తోంది. బహుశా అది నాలో పేరుకుపోయిన కోపం, ఉద్రేకం, ఉద్వేగం అయ్యుంటుంది. భూమి, పుట్రా కోల్పోని నాకే ఇంత ఉద్రేకం ఎగిసిపడితే సర్వం కోల్పోయి రోడ్డున పడ్డ లక్షలాది నిర్వాసితుల మాటేంటి??? రస్‌ఆలఖైమా, గిల్‌క్రిస్ట్‌, ఎమ్మార్‌, వాన్‌పిక్‌ వీళ్ళందరూ ఎవరసలు? కనీసం స్వదేశం వాళ్ళైనా కాదు. వీళ్ళ లాభాల కోసమా రైతుల భూముల్ని భోంచేసింది?

ఈ సందర్భంగా కాకిదేవుడమ్మ  అమాయకంగా అన్న మాటొకటి గుర్తుకొస్తోంది. ” ఆ జిందాల్‌కి నెలకి ఎన్నో కోట్లు జీతమంటకదా! అంత జీతమొచ్చేటోడికి నా భూమే కావలసిసోచ్చిందా? నేను చచ్చినా నా భూమి వొదల్ను” ”శభాష్‌! దేవుడమ్మా శభాష్‌! ప్రభుత్వాలు, నానా రకాల కంపెనీలు గుంజుకున్న భూముల్ని తిరిగి సంపాదించుకోవడానికి ఇపుడు కావలసింది వేలాది దేవుడమ్మలు. లక్షలాది చుక్కమ్మలు.
Share

Friday, June 1, 2012

అందరికి ఉపయోగపడే సమాచారం

ఆంధ్ర ప్రదేశ్ హై కోర్ట్ ప్రధాన న్యాయమూర్తి గారు మేమిచ్చిన రిప్రజెంటేషన్ కి పాజిటివ్ గా స్పందించారు.
అందరికి ఉపయోగపడే సమాచారం
అందుకే మీతో పంచుకుంటున్నాను.

OFFICE OF THE METROPOLITAN SESSIONS JUDGE:HYDERABAD

Dis.No. 2994 /MSJ/Hyd/2012 Dt: 1 .6.2012

From
Sri.G.Shyam Prasad,M.A.,B.Com.,B.L.
Metropolitan Sessions Judge
Hyderabad.

To
Smt. K. Satyavathi,
Chief Functionary,
Bhumika Women's Collective
Hyderabad

Madam,
Sub:- Representation submitted to Hon'ble Chief Justice of
A.P. - for establishing four Mahila Courts - received
representation by e-mail - reply - communicated - regarding.

Ref:- 1. Your representation dated 18.4.2012.
*******

Adverting to the above subject, in response to e-mail received from respected Chief functionary from Bhumika Women Collective, I am to state that, to avoid delay in conducting the trial of cases where women are victim, on the suggestions of Hon'ble High Court of A.P., cases of similar nature, have been transferred to few Courts to expedite the disposal. I am herewith furnishing the particulars of the cases transferred on the directions of the Hon'ble Chief Justice of High Court of A.P.

1. There were about 726 cases relating to Protection of Women from Domestic Violence Act pending in twenty one (21) Special Magistrate Courts. These cases have been withdrawn and transferred to III and IV Metropolitan Magistrate Courts, Hyderabad for the convenience of parties and for speedy disposal. Therefore, the parties have to attend the said two Courts hereafter.

2. There are about 441 cases relating to the Immoral Traffic (Prevention) Act, 1956 pending in seventeen (17) Addl. Chief Metropolitan Magistrate Courts. All these cases have been withdrawn and transferred to the Court of Special JFCM, where there is less pendency of excise cases.

3. As far as the offences relating to Section 498-A IPC and the Dowry Prohibition Act are concerned, the cases are distributed for speed trial to two Courts, zone wise viz., Mahila Court designated as XIII Addl. Chief Metropolitan Magistrate, Hyderabad for disposal of cases filed from Women Police Station, Central crime station and other police stations of all zones; and XV Addl. Chief Metropolitan Magistrate Court, for women police stations of South and North Zones.

In view of the direction of the Hon'ble High Court, the above cases have been transferred for speedy trial by withdrawing from various Courts to the above said Courts.

This is for favour of information.
Yours faithfully

METROPOLITAN SESSIONS JUDGE
HYDERABAD.

తర్పణాలు త్రిశంకు స్వర్గాలు

 తర్పణాలు, త్రిశంకు స్వర్గాలు ............ మా సీతారాంపురం లో మా తాతకి చాలా పొలాలు ఉండేవి. మా తాత, చిన్న తాత ఇద్దరే పొలాలన్నింటిని పంచుకున్నా...