Saturday, November 17, 2007

విజ్ఞప్తి

పదిహేను సంవత్సరాలుగా భూమికను ఆదిరిస్తూ, మాకు కొండంత అండగా నిలబడిన ప్రియపాఠకులకు నమస్కారం. భూమిక మాస పత్రికగా మారి రెండు సంవత్సరాలు పూర్తయ్యింది.

వెబ్‌సైట్‌ కూడా ప్రపంచ వ్యాప్తంగా వున్న తెలుగు వారి ఆదరణ పొందింది. ప్రతినెల క్రమం తప్పకుండా కొత్త కొత్త అంశాలతో, ఆలోచనలు రేకెత్తించే ఆర్టికల్స్‌తో మీ ముందుకొస్తోంది భూమిక.

ప్రత్యామ్మాయ, స్త్రీవాద పత్రికను నడపడంలోని ఇబ్బందులు విజ్ఞలైన మీకు తెలియనివి కావు. భూమికను మరింత బలోపేతం చెయ్యడానికి, ఆర్థికంగా కొంత నిధిని సేకరించడానికి మేము రెండు కొత్త ప్రాజెక్టులు చేపట్టాము.

1. స్త్రీలకు సంబంధించిన చట్టాలు, సహాయలు, సంస్థలు, ఏ సమస్యకు ఎవరిని సంప్రదించాలి, ఎవరితో మాట్లాడాలి, ఫోన్‌ నెంబర్లు, హెల్ప్‌లైనులు, న్యాయవాదులు, మానసిక సమస్యల కోసం ఎవరిని సంప్రదించాలి- అలాగే పిల్లలకి సంబంధించిన చట్టాలు సహాయలు, సంస్థలు, హెల్ప్‌లైనులు లాంటి వివరాలతో సమగ్రంగా రూపొందుతున్న డైరీ - 2008. దీని వెల రూ. 120/-

2. భూమిక హెర్బల్‌ హేండీ డైరీ - మేము 1998లో భూమిక నిధుల సేకరణ కోసం ప్రచురించిన హెర్బల్‌ డైరీని మరింత సమగ్రంగా, నూతన సమాచారంతో పునర్ముద్రించదలిచాము. అప్పట్లో ఈ డైరీ ఎంతో ఆదరణ పొందింది. మన చుట్ట వుండే, మన ఇంట్లో వుండే ఎన్నో వస్తువులతో ఎన్నో రోగాలను నయం చేసుకోవచ్చు. చిన్న చిన్న ఉపశమనాలు పొందొచ్చు. ఈ పుస్తకం ప్రతి ఒక్కరి వద్ద వుండతగింది. దీని వెల. రూ. 35/-

మేము ఈ రెండు డైరీల ప్రచురణ భూమికకు నిధులను సేకరించడం కోసమే చేపట్టాం. వీటి అమ్మకాల ద్వారా కొంత మూలనిధిని సేకరించాలనేది ముఖ్య ఉద్ధేశ్యం. భూమిక పట్ల మీ ప్రేమని, నిబద్ధతని ప్రకటించుకోవడానికి చక్కటి అవకాశం. హెర్బల్‌ డైరీని ఎక్కువ సంఖ్యలో కొని మీ బంధు, మిత్రులకు నూతన సంవత్సర కానుకగా బహూకరించండి. గ్రీటింగు కార్టులకు వందలకు వందలు ఖర్చు పెట్టే బదులు హెర్బల్‌ డైరీని కొంటే భూమికకు ఆర్ధిక లాభం -బహుమతి పొందినవారికి ఆరోగ్యలాభం. మిత్రులంతా ఒక్కొక్కరు పదికి మించకుండా ఆర్డర్‌ చేస్తే భూమిక పదికాలాల పాటు ఆర్ధికంగా నిలదొక్కుకుంటుంది.
భూమికను నిలబెట్టుకోవాలనే మా ఆవేదన అర్ధం చేసుకుంటారని. మేము ప్రచురిస్తున్న రెండు డైరీలను ఆదరిస్తారని ఆశిస్తూ…

తర్పణాలు త్రిశంకు స్వర్గాలు

 తర్పణాలు, త్రిశంకు స్వర్గాలు ............ మా సీతారాంపురం లో మా తాతకి చాలా పొలాలు ఉండేవి. మా తాత, చిన్న తాత ఇద్దరే పొలాలన్నింటిని పంచుకున్నా...