Posts

Showing posts from September, 2011

జర్నలిస్టులకు "జెండర్ అండ్ మీడియా" వర్క్ షాప్

Image
భూమిక, పాప్యులేషన్ ఫష్ట్ సమ్యుక్త ఆధ్వర్యం లో సెప్టెంబర్ 19,20 తేదీలలో ప్రగతి రిసార్ట్ లో "జెండర్ అండ్ మీడియా"  మీద రెండురోజుల వర్క్ షాప్ జరిగింది. ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా  నుంచి దాదాపు 35 మంది జర్నలిష్టులు ఈ వర్క్ షాప్ లో పాల్గొన్నారు.
ఈ రిపోర్ట్ వివరంగా తర్వాత రాస్తాను.
చివరి రోజు ముగింపు సందర్భంగా తీసిన గ్రూప్ ఫోటో ఇది.

ఆదివాసీ మహిళ ముంజేతి కంకణం

Image
ఆదివాసీ మహిళ ముంజేతి  కంకణం
అవసరమొస్తే ....
ఆయుధమై చీల్చేస్తుంది

రాత్రి ఒంటి గంట వేళ సమ్మోహనంగా బ్రహ్మ కమలాలు

Image
రాత్రి ఒంటి గంట వేళ  సమ్మోహనంగా బ్రహ్మ కమలాలు

నాలుగు బ్రహ్మకమలాల సొగసు చూడండి

Image
ఆరు లో రెండు పూలు వేరే వాళ్ళకు ఇచ్చేసా.
నాలుగు బ్రహ్మకమలాల సొగసు చూడండి

ఇప్పుడు మా ఇంట్లో ఆరు బ్రహ్మ కమలాలు పూస్తున్నాయోచ్

Image
ఇప్పుడు మా ఇంట్లో ఆరు బ్రహ్మ కమలాలు పూస్తున్నాయోచ్

ఓహో!!! మహా నంది ఆహా!! అహోబిలం

Image
నిన్న నేను నా నేస్తం గీత వాళ్ళమ్మాయి జాని మహా నంది,అహోబిలం వెళ్ళొచ్చాం.
జలపాతాలతో పచ్చగా కళకళలాడిపోతోంది అహోబిలం.

మనకు తెలియాల్సిన మన చరిత్ర

తెలుగు యూనివర్సిటీలో ‘మహిళా అధ్యయన కేంద్రం’ ఏర్పాటు సమావేశంలో కె. లలిత ఉదహరించిన కొన్ని అంశాలు నాకు చాలా ఆసక్తిని కల్గించాయి. మహిళా అధ్యయన కేంద్రం ఎలా పని చేయాలో వివరిస్తూ చరిత్ర మరుగున  పడిపోయిన, పురుషుల  వెనుక వుండిపోయిన అద్భుత ప్రతిభా సంపన్న స్త్రీల గురించి పరిశోధన జరిగి, వారి జీవిత చరిత్రలు, వారి శక్తి సామర్ధ్యాలు వెలుగులోకి తేవాల్సిన పనిని ఈ కేంద్రాలు చేపట్టాలనే అర్ధంతో మాట్లాడింది లలిత.
రవీంద్రనాధ్‌ టాగూర్‌ 150 సంవత్సరాల జయంతిని దేశమంతా పెద్ద ఎత్తున పండుగలాగా చేసుకుంటున్నాం కానీ అతని సోదరి గురించి మనం మర్చిపోయాం. అలాగే విజ్ఞాన చంద్రికా గ్రంధమండలిని స్థాపించిన, ఆధునికాంధ్ర వాజ్ఞయ నిర్మాతల్లో ప్రముఖంగా పేర్కొనదగిన కొమర్రాజు లక్ష్మణరావుగారి గురించి తలుచుకుంటాం, శతజయంతులు నిర్వహిస్తాం కానీ ఆధునిక తెలుగు సాహిత్యానికి, తెలుగు సమాజానికి వేగు చుక్కలా దారి చూపి, తొలి కథను, తొలి స్త్రీల చరిత్రను రాసి, తొలి స్త్రీల సమాజాన్ని స్థాపించిన అద్భుత ప్రతిభామూర్తి లక్ష్మణరావు సోదరి భండారు అచ్చమాంబను మనం గుర్తుకు తెచ్చుకోం. వారి కృషిని గుర్తించం.” లలిత ప్రసంగం ఇలా సాగుతున్నంత సేపు నా మ…

ఆద్యంతం మహాద్భుతం - అమర్‌నాథ్‌ ప్రయాణం

Image
నాకు ప్రయాణాలు చెయ్యడం, కొత్త ప్రాంతాలు చూడడం చాలా ఇష్టమైన పనులు. ప్రయాణాలకి ఆఘమేఘాల మీద రడీ అయిపోతాను. అందులోను హిమాలయాల్లోకి పయనం అంటే ఇంక ఆలోచించేదే ముంది? అమర్‌నాథ్‌ ప్రయాణం అనుకోకుండా, హఠాత్తుగా సంభవించింది.  నా సహచరుడితో పాటు నా తమ్ముడు, అతని భార్య, వాళ్ళ అక్క కూడా వచ్చారు. శ్రీనగర్‌, అమర్‌నాథ్‌ చాలా చలి ప్రాంతాలు కాబట్టి బోలెడంత ఉలెన్‌ సామగ్రితో శుక్రవారం ఉదయం మా ప్రయాణం మొదలైంది. ఢిల్లీ వెళ్ళి అక్కడి నుండి శ్రీనగర్‌ బయలుదేరాం.

నాకు ఢిల్లీ నుండి శ్రీనగర్‌ వెళ్ళే దారిలో కనబడే హిమాలయాలు చూడడం చాలా ఇష్టం. హిమాలయాల మీద నుంచి విమానం వెళుతున్నపుడు, మంచుతో కప్పబడిన, మహాత్తుంగ పర్వతశ్రేణులు, లోయలు, ఆ లోయల్లోని ఆవాసాలు చూస్తున్నప్పుడు మనసు దూదిపింజెలాగా ఎగిరి, ఆ హిమాలయాలమీద తిరుగాడుతుంది. అయితే ఈసారి కొండలన్నీ నిజరూపాన్ని ప్రదర్శించాయి తప్ప ఒక్క పిసరు కూడా మంచు లేదు. పర్వతశ్రేణులు ఠీవిగా నిలుచున్నాయి శుభ్రంగా స్నానం చేసినట్టు. అది వేసవి కావడం వల్ల మంచు మొత్తం కరిగిపోయింది. నా మనసు కూడా నీరయి పోయింది మంచు కనబడక.

చలితో గడగడలాడిపోతాం కాబోలు, శ్రీనగర్‌ అంటే చలి కదా అనుకుని భుజాల…