Posts

Showing posts from January, 2012

దుబాయ్! అబ్బో ఏం బడాయ్!!

దుబాయ్అబ్బో ఏం బడాయ్!!
బడా బాబుల కోసమే ఈ దుబాయ్
కళ్ళు నెత్తిమీద పెట్టుకుంటే కానీ కనిపించని
బడా బడా మేడలు
కళ్ళు విప్పార్చుకుని చూసినా
కనిపించని సామాన్య మానవుడు
కోరలొక్కటే లేవు గానీ ఈ మెగా మాల్స్ కి
నోళ్ళు తెరుకున్న  మహా భూతాలు
అమాంతం మనుషుల్ని లాగేసుకుని
గంటలతరబడి తమలో లీనం చేసేసుకుంటాయ్
కల్లు తాగిన కోతుల్లా వెర్రెక్కిపోతూ
ఆ వస్తుప్రపంచంలో కింద మీదా పడుతూ
చెత్తా చెదారాన్ని పోగేసుకంటూ
కాళ్ళకి చక్రాలు కట్టుకుని తిరిగే
దేశవిదేశాల జనాలని చూస్తుంటే
అనిపించింది దుబాయ్ అంటే
అమ్మడం,కొనడం, తినడం.

సెంటర్లో విల్లాల మిలియనీర్లు
అంచుల్లో "అలగా జనాల" కాలనీలు
విల్లాలకు రాళ్ళెత్తిన కూలీలు
మనవాళ్ళో పాకిస్తాన్ వాళ్ళో,బంగ్లా దేశ్ వాళ్ళో
ఎవరైతేనేం ఒక్కొక్కరిదీ ఒక్కో దుఖ గాధ
ఎడారుల్లో ఒయాసిస్ ని వెదుక్కుంటూ వెళ్ళి
ఇసుకతుపానుల్లో చిక్కుకుని గిలగిల్లాడుతున్న
సౌత్ ఏషియన్ ల చెమట చుక్కలు
గల్ఫ్ జలసంధిలో కలగలిసిపోయాయి
ప్రపంచీకరణ వికృత రూపం చూడాలనుందా
అయితే చలో దుబాయ్
అబ్బో ఏం బడాయ్!!

(దుబాయ్ వెళ్ళొచ్చాకా నాకు కలిగిన ఫీలింగ్స్ )

వృద్ధుల కోసం మా కొత్త కార్యక్రమం.

Image
ఈ రోజు నేను నా సహచరుడు కలిసి ఒక కొత్త కార్యక్రమం మొదలుపెట్టేం.
ఇంతకు ముందే మేమొక ట్రస్ట్ ఏర్పాటు చేసాం.
ఈ ట్రస్ట్ గ్రామాల్లో ఉన్న వృద్ధుల కోసం మొదలు పెట్టాం.
ఈ రోజు పడకండ్ల అనే గ్రామం లో మా పని  ప్రారంభిచాం.
 కర్నూలు జిల్లా అహోబిలానికి దగ్గరుండే  పడకండ్ల గ్రామాన్ని మొదటిదిగా ఎంచుకున్నాం.
ఈమె పేరు ఫకీరమ్మ.80 సంవత్సరాలు.ఒంటరి మహిళ.ఇంకా పొలాలకెళ్ళి కూలి చేస్తూ బతుకుతోంది.
ఈమె గారే  మా మొదటి అతిధి.
గ్రామం లో ని ఒక స్వచ్చంద కార్యకర్త మా తరఫున ఆమెకు ఇక నుండి భోజనం పెడతాడు.
మేము అతనికి డబ్బు చెల్లిస్తాం.
కొన్ని గ్రామాలను ఎంపిక చేసి అక్కడున్న 60 ఏండ్లు దాటిన వృద్ధులకు ఆహారం,వైద్య సహాయం  చెయ్యాలనేది మా సంకల్పం.

ఫీనిక్స్ పక్షిలా, పడిలేచిన కెరటం – ఇందిరా గోస్వామి

Image
2002 మార్చి నెలలో ఇందిరా గోస్వామి హైదరాబాదు వచ్చారు. పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో జరిగిన జాతీయ స్థాయి రచయిత్రుల మహాసభల్లో ముఖ్య అతిధిగా పాల్గొన్న ఇందిర ఆ రోజు ఎంతో ఉద్వేగభరితమైన ఉపన్యాసం ఇచ్చారు. నేను, కొండేపూడి నిర్మల ఆవిడను ఇంటర్వ్యూ చెయ్యడానికి లేక్‌వ్యూ గెస్ట్‌ హౌస్‌కి వెళ్ళినపుడు ఎంతో ఆత్మీయంగా మాట్లాడారు. ఉత్సాహంగా నవ్వుతూ మాతో దాదాపు గంటసేపు గడిపారు.
నవంబరు 29న ఇందిరా గోస్వామి మరణించారని విన్నపుడు చాలా బాధేసింది. 69 సంవత్సరాలకే ఆమె తుదిశ్వాస వీడడం ఒక్క అస్సామ్‌ రాష్ట్రానికే కాక యావత్‌ దేశానికి ఎంతో విషాదకరమైన అంశం. ఫీనిక్స్‌ పక్షిలా, పడిలేచిన కెరటంలా ఆమె అత్యంత విషాదంలోంచి తేరుకుని, భారతదేశం గర్వించదగ్గ రచయిత్రిలా ఎదిగిన తీరు మరుపురానిది. ఆత్మహత్యకు ప్రయత్నించిన నేపథ్యంలోంచి ఆత్మవిశ్వాసాన్ని ప్రోదిచేసుకుంటూ అత్యద్భుతమైన రచనల్ని అందించింది. మైమోన్‌ రాయసం పేరుతో అస్సామ్‌ అంతటా ప్రసిద్ధురాలైన ఇందిర అస్సామీయులకు పెద్దక్క. వేర్పాటు వాద ఉద్యమాన్ని నడుపుతున్న ఉల్ఫా ఉద్యమకారులతో శాంతి చర్చలకు శ్రీకారం చుట్టిన సాహసి ఆమె.
తాను ఎంతో ప్రేమించిన భర్త మాధవన్‌ రాయసం అయ్…

శ్రీ విద్య స్కూల్ స్పెషల్ పిల్లలు ఈ రోజ నాతో ఉన్నారు.

Image
శ్రీ విద్య స్కూల్ స్పెషల్ చిల్డ్రన్ తో నా పుట్టిన రోజు కొత్త సంవత్సరం వేడుక చాలా సంతోషంగా జరిగింది.
పిల్లలు మూడు గంటలు మా ఇంట్లో ఉండి నా పుట్టిన రోజును,నూతన సంవత్సరాన్ని అర్ధవంతం చేసారు.