Thursday, January 19, 2012

దుబాయ్! అబ్బో ఏం బడాయ్!!

దుబాయ్
అబ్బో ఏం బడాయ్!!
బడా బాబుల కోసమే ఈ దుబాయ్
కళ్ళు నెత్తిమీద పెట్టుకుంటే కానీ కనిపించని
బడా బడా మేడలు
కళ్ళు విప్పార్చుకుని చూసినా
కనిపించని సామాన్య మానవుడు
కోరలొక్కటే లేవు గానీ ఈ మెగా మాల్స్ కి
నోళ్ళు తెరుకున్న  మహా భూతాలు
అమాంతం మనుషుల్ని లాగేసుకుని
గంటలతరబడి తమలో లీనం చేసేసుకుంటాయ్
కల్లు తాగిన కోతుల్లా వెర్రెక్కిపోతూ
ఆ వస్తుప్రపంచంలో కింద మీదా పడుతూ
చెత్తా చెదారాన్ని పోగేసుకంటూ
కాళ్ళకి చక్రాలు కట్టుకుని తిరిగే
దేశవిదేశాల జనాలని చూస్తుంటే
అనిపించింది దుబాయ్ అంటే
అమ్మడం,కొనడం, తినడం.

సెంటర్లో విల్లాల మిలియనీర్లు
అంచుల్లో "అలగా జనాల" కాలనీలు
విల్లాలకు రాళ్ళెత్తిన కూలీలు
మనవాళ్ళో పాకిస్తాన్ వాళ్ళో,బంగ్లా దేశ్ వాళ్ళో
ఎవరైతేనేం ఒక్కొక్కరిదీ ఒక్కో దుఖ గాధ
ఎడారుల్లో ఒయాసిస్ ని వెదుక్కుంటూ వెళ్ళి
ఇసుకతుపానుల్లో చిక్కుకుని గిలగిల్లాడుతున్న
సౌత్ ఏషియన్ ల చెమట చుక్కలు
గల్ఫ్ జలసంధిలో కలగలిసిపోయాయి
ప్రపంచీకరణ వికృత రూపం చూడాలనుందా
అయితే చలో దుబాయ్
అబ్బో ఏం బడాయ్!!

(దుబాయ్ వెళ్ళొచ్చాకా నాకు కలిగిన ఫీలింగ్స్ )

2 comments:

శ్రీలలిత said...

డబ్బులు చిల్లపెంకుల్లా చూసే బడాబాబుల గీర్వాణం గురించి మీరు
దుబాయ్ వెళ్ళొచ్చానని బడాయిగా చెప్పడం
సందర్భోచితంగా వుంది

Anonymous said...

Few days back i have seen a photo of how indian labour dubai....who sleeps in toilets also...due to lack o space.so sad

తర్పణాలు త్రిశంకు స్వర్గాలు

 తర్పణాలు, త్రిశంకు స్వర్గాలు ............ మా సీతారాంపురం లో మా తాతకి చాలా పొలాలు ఉండేవి. మా తాత, చిన్న తాత ఇద్దరే పొలాలన్నింటిని పంచుకున్నా...