Posts

Showing posts from April, 2011

బిట్టూ గాడి బెట్టు చూడండి

Image
నిన్న ఒక ఫంక్షన్ కి వెళ్ళాను.మా వాళ్ళదే.
దాంట్లో హైలైట్ ఏమిటంటే బిట్టూ గాడే.
మా మరిది కొడుకు తాను పెంచుకుంటున్న బుల్లి తాబేలు పిల్ల బిట్టూ.
వాడు దాన్ని చిన్న బాక్ష్ లో పెట్టుకుని రాయ్ చూర్ నుండి తెచ్చాడు.
భలే ముద్దుగా ఉంది.
దాన్ని కొట్టేయ్యాలని చాలా ట్రై చేసాను కానీ వాడు దాన్ని చాలా ఇష్టపడుతున్నాడు.
పోనీలే అని వదిలేసా.పెద్దమ్మా మీకు రెండు తాబేలు పిల్లల్ల్ని తెచ్చి ఇస్తానని ప్రామిస్ చేసాడు.బిట్టూ గాడిని తనతో తీసుకెళ్ళిపోయాడు.
చూడండి బిట్టూ గాడి సొగసులు.

మా ఇంట్లో విరగబూస్తున్న గులాబీలు

Image
నలుపు,ఎరుపు,తెలుపు,పసుపు, పింక్,తెలుపు గులాబిరంగు,ఆరెంజ్ అబ్బో ఎన్ని రంగులో!!!!

కొమ్మ కొమ్మకీ పూవు,గుత్తులు గుత్తులుగా రోజాలు.

పూల చుట్టూ లియో గాడి పరుగులు.

మాట్లాడుకోవాలి

Image
ఆకాశం నిండా నల్లటి మబ్బులు కమ్ము కుంటున్నాయి. మే నెలలో అనుకోకుండా, హఠాత్తుగా ఎదురైన చల్లటి అనుభవం. నిన్నటిదాకా నలభైనాలుగు డిగ్రీల ఉష్ణోగ్రత. ఈ రోజు ఇరవైఆరో ఇరవైఏడో. నిన్నటికి, ఇవాల్టికి ఎంత తేడా! బంగళాఖాతంలో పెనుతుఫాను. ఆ బీభత్సానికి ఎంత చక్కటి పేరు. లైలా! క్రితం సంవత్సరమొచ్చిన తుఫాను పేరు ఐలా! ఈ పేర్లు ఎవరు పెడతారో! ప్రళయ విధ్వంసం సృష్టించే ప్రకృతి వైపరీత్యాలకు ఆడవాళ్ళ పేర్లెందుకు పెడతారో!
తుఫాను గురించి, వాటి పేర్లు గురించి మాట్లాడుకుంటూ మురళి, మాధవి ఇంటి బయట లాన్‌లో కూర్చున్నారు. ఐదు గంటలకే చీకటి పడినట్లయిపోయింది. డాబా మీదికి ఎగబాకిన మాలతీలత ఆకు కనబడకుండా విరగపూసింది. మధురమైన సువాసనల్ని వెదజల్లుతోంది. ఇంకో పక్క కుండీలో గ్లోబులా పూసిన మే ఫ్లవర్‌. ఎర్రటి రంగుతో అద్భుతమైన అల్లికతో చూడముచ్చటగా వుంది. మబ్బుల చాటునుంచి కనబడీ కనబడనట్టుగా దర్శనమిచ్చింది నెలవంక.

”తుఫాను ప్రభావం బాగానే వున్నట్టుంది. బాగా వాన పడేట్టుంది. లోపలికెళదాం పద మురళీ” అంది మాధవి.

”వెళదాంలే! చినుకులు రాలనీ. బయట చల్లగా హాయిగా వుంది.” అన్నాడు మురళి.

”నిజమే. నాకూ కదలాలన్పించడం లేదు. మనం ఇలా కూర్చుని, ఇంత సామరస్యంగా మాట్ల…

ప్రేమలేఖ

Image
అబ్బాయి రాస్తే
అందమైన మోము,అద్దాల్లాంటి చెక్కిళ్ళు,
సిం హ మధ్యమం లాంటి నడుము
నిగనిగలాడే నీలి కురులు
మేలిమి బంగారులాంటి మేని చాయ
అమ్మాయి రాస్తే
ఆరడుగుల అందం ,ఆజానుబాహువులు
గిరజాల జుట్టు,సన్నని మీసకట్టు
ప్రేమలేఖల్లొ ఉండేదంతా శరీర వర్ణనేనా?
శరీరాల  స్పృహమాత్రమేనా?
ఆశయాలు,ఆదర్శాలు
మనసులోతులు,మానవీయ కోణాలు
ఆత్మ గౌరవాలు,సహజీవన సౌరభాలు,
ఇవేవీ లేకుండా ప్రేమలేఖా?
పూల మధ్య దారం ఇమిడిపోయినట్టు
ఆత్మిక బంధంలొ శరీరాల కలయిక ఉండాలి
ప్రేమలేఖల్లో పూల పరిమళాలు గుబాళించాలి
అంతరంగాలు ఆవిష్కృతమవ్వాలి.
లేఖ అంటేనే ప్రేమ సువాసనల్నో,
స్నేహ సువాసనల్నో మోసుకొచ్చేది.
అలాంటి లేఖ ప్రేమని మోసుకొస్తే....
మొగలి పొత్తులో పొదివినట్టు
మల్లెపూల మధ్యలో అమరినట్టు
గరికపువ్వు మీద తుషారబిందువట్టు
ప్రేమలేఖ
ప్రియమైన లేఖమా లియో గాడి మరిన్ని ఫోటోలు

Image
బెంగళూరు నుంచి బస్సెక్కి మా ఇంటికొచ్చిన లియో ఇదే.

బహు అల్లరిది.

మా ఇంట్లో ఇప్పటికే ఉన్న హాయ్ ని తరిమి తరిమి ఏడిపిస్తుంది.

అది వచ్చిన రోజు పావురాలు, కోడి పిల్లలూ క్యూ కట్టి మరీ దాన్ని చూసాయి.

కోడి పుంజు వేపు నదురు బెదురు లేకుండా ఎలా చూస్తోందో చూడండి.

హాయి వేపు కూడా నీ సంగతేంటి అన్నట్టు చూస్తోంది.

నా ముక్కు,చెవులు దానికి ఆటవస్తువులు.

నేరేడు పళ్ళల్లాగా నిగనిగలాడే కళ్ళు,చప్పిడి ముక్కు,ఊ అంటే వెక్కిరించే నాలుక.

నలభై రోజుల పిల్ల.

సరదా మూడ్ లో ఉంటే ముద్దులు,కోపంగా ఉంటే కొరుకుళ్ళు అదే పని దానికి.

వచ్చిన రోజు ముద్దుగా ఉందని ఎత్తుకుంటే కసుక్కున ముక్కు మీద ముద్రేసింది.

లవ్లి డాగ్.నా టైమంతా తినేస్తోంది.


మడిషన్నాకా రోగమూ వస్తుంది రొష్టూ వస్తుంది.సత్యసాయి దీనికి అతీతుడు కాదు.

85 సంవత్సరాలు నిండాకా మనిషి గుండె,ఊపిరితిత్తులు బలహీనంగానే ఉంటాయి కదా!
ఎంత దేవుడని మీరు మొత్తుకున్నా ఆయన మనిషేకాబట్టి ఆసుపత్రిలో పెట్టాల్సిందే.వైద్యం చెయ్యాల్సిందే.
దేవుళ్ళని పిలిచిన ఎంత మంది దయనీయంగా చనిపోలేదు.
ముమ్మిడివరం బాల యోగి మరణం ఎంత హృదయవిదారకమో మర్చిపోయారా.
మంగమ్మవ్వ ఇంకా జైల్లోనే ఉందనుకుంటాను.,జిళ్ళెళ్ళమూడి అమ్మ
దొంగనోట్ల చలా మణి లో దొరికిపోలేదా??
వయస్సు మీద పడినపుడు  అందరిలా మోకాళ్ళ నొప్పులొస్తాయి,చక్రాల బండి అవసరమౌతుంది. మూత్రపిండాలు సరిగా పనిచెయ్యకపోతే డయాలసిస్ చెయ్యల్సి ఉంటుంది.
గుండె పనిషెయ్యకపోతే పేస్ మేకర్ పెట్టాలి.
శ్వాస సరిగ్గా ఆడకపోతే ఆక్సిజన్ పెట్టాలి.
ఇవన్ని మనిషి అనారోగ్యం పాలైతే పెట్టి తీరాలి.
సత్య సాయి మమూలు మనిషే కాబట్టి ఇవన్ని అవసరమయ్యాయి.
పుట్టిన మనిషి మరణించక తప్పదు కదా.ఈయన మాత్రం దీనికి అతీతుడేలా అవుతాడు???
నీళ్ళిచ్చాడు,వైద్య సదుపాయాలిచ్చాడు,ఇంకేమోచేసాడు అంటే కుప్ప పడిన కోట్ల రూపాయలను ఏదో ఒకటి చెYYఆలి కదా!

గాల్లోంచి వాచీలు,వేళ్ళల్లోంచి విభూది పిసి సర్కార్ కూడా సృష్టించగలడు.ఇంకా ఎన్నో అద్బుతాలు చెయ్యగలడు
నిన్నటిదాకా క్రికెట్ మోత,ఇప్పుడేమో ఈయన మోత.
దేశ…

హవ్వ! జండర్‌ ఈక్విటీలో మనది అట్టడుగు స్థానం

మార్చి నెల అనగానే గుర్తొచ్చేది మహిళాదినం. అంతర్జాతీయ మహిళా దినం మొదలై వందేళ్ళు గడిచిపోయాయి. ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా మహిళాదినాన్ని శ్రామిక మహిళా పోరాట దినంగా జరుపుకుంటూనే వున్నాం. ఈ రోజును ఒక ఉత్సవంలాగా, ఒక పండుగలాగా జరపడానికి మార్కెట్‌ శక్తులు శాయశక్తులా కృషి చేస్తున్నాయి. ఒక విమాన సంస్థ మార్చి ఎనిమిదిన మహిళలకు టిక్కెట్లలో రాయితీలిస్తుంది. మరో కాస్మెటిక్‌ కంపెనీ తమ వస్తువుల్ని మరింతగా ప్రచారం చేసుకోవడానికి మార్చి ఎనిమిది వాడుకుంటుంది. ప్రభుత్వం కూడా తానేమీ తీసిపోలేదని నిరూపించుకుంటూ కొన్ని మొక్కుబడి కార్యక్రమాలను నిర్వహిస్తుంది. మార్చి ఎనిమిది ఒక పోరాట దినంగా మొదలై, పోరాటం పూర్తి కాకుండానే, ఆశించినమార్పు సమాజంలో రాకుండానే ఒక ఉత్సవదినంగా మారిపోవడం అత్యంత విషాదకరం.


విషాదమని ఎందుకంటున్నానంటే గతవారం ముంబయ్‌లో జరిగిన నిధిగుప్తా ఆత్మహత్య విషయమే తీసుకుంటే మన సమాజం ఏ స్థాయిలో వుందో అర్ధమౌతుంది. నిధి బాగా చదువుకుని, చార్టెడ్‌ అకౌంటెంట్‌గా పనిచేస్తోంది. ఇద్దరు పిల్లల తల్లి. పిల్లల్ని స్కూల్‌కి పంపడానికి తయారు చేసి, వాళ్ళని స్కూల్‌కి పంపకుండా 18 అంతస్థులు పైకి వెళ్ళి పిల్లల స్కూల్‌ బ్యాగు…