Posts

Showing posts from March, 2009

ఇంఫాల్‌ - ఏక్‌ పల్‌ హసీ ఏక్‌ పల్‌ ఆశు

Image
2008లో పూనాలో జరిగిన మహిళా జర్నలిస్ట్‌ల ఆరో సదస్సులో 2009లో జరగబోయే సదస్సు ఇంఫాల్‌లో జరుగుతుందని ప్రకటించిన దగ్గర నుంచి ఈశాన్యభారతాన్ని చూడడానికైనా తప్పనిసరిగా ఈ సమావేశాలకి హాజరవ్వాలని అనుకున్నాను. పూనాలో సమావేశాలు జరుగుతున్నపుడే హెల్ప్‌లైన్‌ ఎక్స్‌పోజర్‌ విజిట్‌కి జైపూర్‌ వెళ్ళడం వల్ల నేను వాటిని మిస్‌ అయ్యాను. ఎలాగైనా ఇంఫాల్‌ వెళ్ళాలని డబ్బులు దాచుకోవడం మొదలుపెట్టాను. మణిపూర్‌ చాలాదూరం కాబట్టి ప్రయాణ ఖర్చులకే ఇరవైవేలు కావాలి. సొంత డబ్బులతోనే వెళ్ళాలి.
 దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో వున్న మహిళా జర్నలిస్ట్‌లు 2003లో ఢిల్లీలో సమావేశమైనపుడు ఒక వెబ్‌సైట్‌ నిర్మాణంతో పాటు ప్రతి సంవత్సరం కలవాలనే నిర్ణయం తీసుకున్నారు. ఆ మొదటి సమావేశానికి నేను హాజరయ్యాను. మీడియాలో మహిళలు ఎదుర్కొంటున్న వివిధ సమస్యల మీద చర్చలతో పాటు, ఎన్నో అంశాల మీద మూడురోజులపాటు సమావేశాలు జరుగుతాయి.
 మూడునెలల క్రితం ఇంఫాల్‌లో సదస్సు నిర్వహణా బాధ్యతని స్వీకరించిన అంజులిక నుంచి చక్కటి కవితాత్మకమైన ఆహ్వానం నెట్‌వర్క్‌ సభ్యులందరికీ అందింది. అంజులిక రాసిన ఈమెయిల్‌ అందరిలో ఉత్సాహాన్ని నింపింది. ఇక అప్పటినుండి ప్రయణపు ఏర్పాట్లు మ…

సేవ్‌ ద గర్ల్‌ ఛైల్డ్‌ ప్లీజ్‌!

జనవరి24 తేదీని ”జాతీయ ఆడపిల్లల దినం”గా కేంద్రం ప్రకటించింది. విచ్చలవిడిగా విస్తరించిపోయిన లింగ నిర్ధారణ పరీక్షలు, ఆడపిండాల హత్యలు, గృహహింస, పోషకాహారలేమి లాంటి అంశాలపై విస్తృత స్థాయి ప్రచారం చేపట్టాలనే ఉద్దేశ్యంతో ఈ ‘దినాన్ని’ ప్రకటించారు. టీవీప్రకటనలు, పాఠశాలల్లో పాఠాల రూపంలో, వ్యాపార ప్రకటనల్లోను ఆడపిల్లల గురించి ప్రచారం చేయనున్నారు. గృహ హింసకు సంబంధించి అన్ని రాష్ట్రాలకు అవసరమైన నిధులను మళ్ళించి, పూర్తి స్థాయి రక్షణాధికారుల వ్యవస్థను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అంతేకాకుండా ఈ నిధులను బడ్జెట్‌ కేటాయింపుల్లో భాగంగా చెయ్యాలని నిర్ణయించారు. మొత్తానికి ఇంత కాలానికి ఆడపిల్లల కోసం ఓ ప్రత్యేక దినాన్ని కేటాయించడంతోపాటు, ఆడపిల్లలెదుర్కొంటున్న వివక్షకి వ్యతిరేకంగా కొన్ని చర్యలు చేపట్టడం ఆహ్వానించదగిన పరిణామం. ఆలస్యం గానైనా ఆడపిల్లల సమస్యల మీద దృష్టి సారించడం ముదావహం.
అయితే ఒక ప్రత్యేక దినాన్ని ప్రకటించి, కొన్ని ప్రచార కార్యక్రమాలు చేపట్టినంత మాత్రాన మన సమాజంలో పాతుకుపోయిన లింగవివక్షని రూపుమాపగలమా? ఆడపిల్లల స్థితిగతుల మీద యునైటెడ్‌ నేషన్స్‌ ప్రకటించిన అంశాలను ఒక్కసారి గమనిద్దాం.
ు ప్రపంచ వ్యాప…

మాకు ‘నో’ అనే హక్కు లేదా?

”మేం చదువుకోకూడదా? మేం రోడ్లమీదకు రాకూడదా? మాకు ‘నో’ అనే హక్కు లేదా? ఎవడంటే వాడు నిన్ను ప్రేమిస్తున్నాను. నా ప్రేమను ఒప్పుకుని తీరాలి అని బలవంతపెడితే, మృగంలా ప్రవర్తిస్తే మేము ఒప్పుకు తీరాలా? మా ఇష్టాయిష్టాలకు ప్రమేయం లేదా? మేం ఒప్పుకోకపోతే కత్తులతో పొడవడం, ఆసిడ్‌ పోసి గాయపర్చడం. వీళ్ళంతా ఏ సంస్కృతికి వారసులు? వీళ్ళకి ప్రేమంటే తెలుసా? ప్రేమంటే ఇదేనా? వీళ్ళని శిక్షించే చట్టమేదీ లేదా?” ఈ ప్రశ్నలను మనం చాలాసార్లు విని వుంటాం. అగ్రికల్చర్‌ యూనివర్సిటీక్యాంపస్‌లో ఆసిడ్‌ దాడికి గురై మరణ యాతన అనుభవించిన అనూరాధ, బెంగుళూరులో అలాంటి దాడికే బలైన వందనా పాటిల్‌. ఈప్రశ్నలను పదే పదే వేస్తూనే వున్నారు. ఒక అయేష, ఒక ప్రత్యూష, ఒక స్వప్నిక, ఒక ప్రణీత-నిండు జీవితాలను ‘ప్రేమ’ అనే క్రూర క్రీడకి బలిపెడుతూనే వున్నారు. ‘ప్రేమ’ ఈ రోజు క్యాన్సర్‌ కన్నా ప్రమాదకరంగాతయారై ఆడపిల్లల్ని కబళిస్తోంది. ముక్కూ ముఖం లేని స్వప్నిక రూపం, ఉబ్బిపోయి కళ్ళు మూసుకుపోయిన ప్రణీత ముఖాలు మనోఫలకంలోంచి చెదరకుండా పదే పదే కళ్ళముందు కదలాడి కన్నీరు పెట్టిస్తున్నాయి. ఆ కన్నీళ్ళు ఆరకముందే నిందితులు దొరికారన్న వార్త ఎంతో ఊరట కలిగించింది. ఆసిడ…

విందు తర్వాత…..

కొండవీటి సత్యవతి

చలి గడగడలాడించేస్తోంది. చేతి వేళ్ళు కొంకర్లు పోతున్నాయి. గది మధ్యలోని బుఖారి నుంచి వచ్చే వెచ్చదనం ఏ మాత్రం సరిపోవటం లేదు.
”అబ్బ! ఇంత చలేమిట్రా బాబూ! ఎలా భరిస్తున్నావ్‌” వధవి అతి కష్టం మీద అంది. చలికి పళ్ళు టక టక కొట్టుకుంటున్నాయి.
”ఏం చేయమంటావ్‌ భరించక. అయినా నిన్ను చలికాలంలో కాశ్మీర్‌ రమ్మని ఎవడు చెప్పాడు” అని హనీఫ్‌ ”కాంద్దీ లావో” అన్నాడు.
”నాకేం తెలుసురా బాబూ! మరీ ఇంత భయంకరంగా వుంటుందంటే ఢిల్లీ నుంచే వెనక్కి వెళ్ళిపోయేదాన్ని” సుధాకర్‌ మాట్లాడకుండా సవెవాయ్‌ లోంచి వేడి వేడి టీ పోసి ఇచ్చాడు.
టీ తాగుత బుఖారీకి దగ్గరగా జరిగింది మాధవి. వెచ్చటి టీ గొంతులోకి జారుతుంటే హాయిగా వుంది. ఈ సీజన్‌లో ఇక్కడికి రావడం ఎంత బుద్ధి తక్కువో అర్థమైంది మాధవికి.
ఢిల్లీలో ఏదో మీటింగ్‌ అటెండవ్వ డానికి వచ్చింది. అది నిన్న ఉదయమే అయి పోయింది. తన పిన్ని కొడుకు సుధాకర్‌ శ్రీనగర్‌లో మిలటరీలో మంచి హోదాలో ఉన్నాడని ఎలాగైనా ఒకసారి శ్రీనగర్‌ వెళ్ళా లని వధవి ఎప్పటినుంచో అనుకుంటోంది. అయితే ప్రస్తుతం చాలా చలిగా వుంటుందని సుధాకర్‌ చెప్పినా విన కుండా వచ్చింది. సరే వస్తానంటే వద్దనడం ఎందుకులే అని సుధాకర్‌ ఊరుక…