Posts

Showing posts from August, 2011

మితృలందరితో ఓ సంతోష సందర్భాన్ని పంచుకోవాలని

Image
నిన్నఅంటే 30 ఆగష్ట్నవిజయవాడలోనేనొకప్రతిష్టాత్మకఅవార్డ్తీసుకున్నాను. నన్నపనేనిలక్ష్మిస్మారకఅవార్డునునాకుప్రదానంచేసారు. లక్ష్మిగారుమంగళగిరిలోప్రముఖసామాజికకార్యకర్తగా,లైన్స్క్లబ్సెక్రటరిగాపలుసేవాకార్యక్రమాల్లోపాల్గొనేవారట. 2007 లోఒకరోడ్డుప్రమాదంలోఆవిడమరణించారు. ఆవిడపేరుమీదవారిభర్తనన్నపనేనినాగేశ్వరరావుగారునన్నపనేనిలక్ష్మిస్మారకఅవార్డునుమహిళలఉన్నతికోసంపనిచేస్తున్నవారిప్రదానంచేస్తున్నారు. ఈసంవత్సరంఈఅవార్డుకోసంనన్నుఎంపికచేసారు. కృష్ణానదీతీరానచక్కటిఆహ్లాదకరవాతావరణంలోవిజయవాడకుచెందినఎందరోప్రముఖులసమక్షంలోఅవార్డుప్రదానంజరిగింది. ముఖ్యంగాప్రజానాట్యమండలిలోనాజర్తోకలిసిబుర్రకధచెప్పినకర్నాటిలక్ష్మీనరసయ్యగారిఆధ్వర్యంలో ,ఆయనముఖ్యపాత్రవహించిగాసమావేశంచక్కగాజరిగింది. నామితృలు,ప్రముఖస్త్రీవాదరచయితృలుపి.సత్యవతి,వి.ప్రతిమనానేస్తంగీతలసమక్షంలోఅవార్డుతీసుకోవడంనాకుచాలాసంతోషంకల్గించింది. ప్రముఖరచయితవిహారిగారునాగురించిచెప్పినమంచిమాటలునాకుకళ్ళల్లోనీళ్ళుతెప్పించాయి. నాకుఎంతోఆత్మీయులుపి. సత్యవతిగారునాగురించిచక్కటివిశ్లేషణచేసారు. హైదరాబాదుకేంద్రంగాపనిచేసేనేనువిజయవాడనగరప్రముఖులనుండిఅవార్డునుతీసుకోవడంవారిఆత్మీయతనుపొందడంనాకుఎంతోసం…

మా అత్తగారూ కొండమల్లెపూల తీగ

Image
మా అత్తగారికి 85 సంవత్సరాలు.ఆమెకు చెట్లంటే చాలా ప్రేమ.
ఆమె కోసం చూడండి కొండమల్లె ఎలా విరబూసిందో!!!!!

మా లియోగాడు ఎంత పెద్దవాడయ్యాడో!!!!

Image
లియో గాడు చాలా పెద్దోడైపోయాడు.కావాలంటే మీరే చూడండి.

చంచల్ గూడా మహిళా జైలు సందర్శన

Image
నిన్న చంచల్ గూడా మహిళా జైల్ ను  విజిట్ చేసాను.
ఇది నాలుగోసారి ఆ జైల్ ను చూడడం.
వివరాలు కొంచం తీరిక దొరికాకా రాస్తాను.

అన్నా కోసం నేను తయారు చేసిన పూల హారం

Image
అన్నా వెంటే మనమంతా

అన్నా కోసం నేను తయారు చేసిన కొండమల్లెల అనార్ పూల గుచ్చ్హం

Image
అన్నా కు, అన్నా వెంట నడిచిన కోట్లాది బారతీయులకు నా అభినందనలు.

వీరేశలింగం నుండి వి.ఎస్‌.నాయ్‌పాల్‌ దాకా…

ఈ మధ్య వి.ఎస్‌.నాయ్‌పాల్‌ వాచాలత్వం, అహంకారం గురించి చదివాక కోపంతో పాటు కొండంత దిగులూ కలిగింది. ఎవరైనా గానీ తమ తమ రంగాల్లో ఆకాశమంత ఎత్తు ఎదిగినా గానీ స్త్రీల విషయంలో ఎందుకంత దిగజారి ప్రవర్తిస్తారు? నోటి కొచ్చినట్టు ఎందుకు వాగుతారు? మహిళలందరి  గురించీ మాట్లాడే గుత్త హక్కులు వీళ్ళకెవరిచ్చారు?
దేశ సర్వోన్నత న్యాయస్థానంలో  ఛీప్‌ జస్టిస్‌ హోదాలో వుండి ఒకనాడు రంగనాధమిశ్రా స్త్రీలు ఇంటికే పరిమితమవ్వాలిలాంటి మూర్ఖపు మాటలు పలికి దేశంలోని స్త్రీలందరి కోపానికీ గురయ్యాడు. ఆ రోజు అన్నీ మహిళా సంఘాలూహైదరాబాదులో హైకోర్టు ముందు ధర్నా చేసి రంగనాధమిశ్రా దిష్టిబొమ్మను తగులబెట్టడం జరిగింది. తనకు మాలిన ధర్మంలా, తనకు సంబంధం లేని విషయాల్లో తలదూర్చి మహిళల గురించి తీర్పులు ప్రకటించే వాళ్ళు చాలామందే వున్నారు. విఎస్‌ నాయ్‌పాల్‌ తనను తాను గొప్ప రచయితగా చూసుకుని, మురిసి ముక్కలైపోవచ్చు. దానిపట్ల ఎవరికీ అభ్యంతరం లేదు. కానీ ప్రపంచంలోకెల్లా తానే, తాను మాత్రమే గొప్ప రచయితనని, మహిళా రచయితలు భావోద్వేగాల్లో కొట్టుకుపోయి చెత్తరాస్తారని, తాను వారి రచనలు అసలు చదవనని ఇంకా ఏమేమో చెత్త మాట్లాడాడు. ఒకవైపు చదవనని చ…

స్వాతంత్ర్య దినోత్స్వం సందర్భంగా వందలాది మొక్కలు నాటాను

Image
బంతి మొక్కల్లెండి

స్నేహ దినోత్సవాన నా స్నేహం కోసం నేను తయారు చేసిన స్నేహ గుచ్చం.

Image
పెద్ద మనీప్లాంట్ ఆకు మీద చుట్టూ సంపెంగలు.
మధ్యలో అనార్ పువ్వులు అక్కడక్కడా సీజనల్స్.
ప్రపంచంలో  ఎక్కడెక్కడో ఉన్న నా నేస్తాలందరికి కోసం ఈ స్నేహ గుచ్చం.
నా బ్లాగ్ చదివే వారందరికీ స్నేహ దినోత్సవాన ఈ స్నేహ పుష్పంతో  స్నేహాభినందనలు తెలుపుతున్నాను.

నేనొక మహా సాహస యాత్ర చేసి నిన్ననే తిరిగొచ్చాను.

Image
అమర్ నాధ్ యాత్ర కెళ్ళొచ్చాను.
నాకు అక్కడ ఏర్పడే శివలింగం  మీద పెద్దగా నమ్మకం లేదు కాని అక్కడికి
వెళ్ళి రావడం మాత్రం మహా సాహసమే.
జీవితానికి సరిపోయేంత థ్రిల్ ఉంటుంది ఈ ప్రయాణంలో.
ఆ సాహస యాత్ర గురించి రాయడం మొదలుపెట్టాను.
ఇంకా ఒళ్ళు స్యాధీనం లోకి రాలేదు.నొప్పులే నొప్పులు.
మీకొక థ్రిల్లింగ్ అనుభవాన్ని మాత్రం తప్పక పంచుతాను.
ఎదురు చూడండి ప్లీస్.