మితృలందరితో ఓ సంతోష సందర్భాన్ని పంచుకోవాలని

నిన్న అంటే 30 ఆగష్ట్ విజయవాడ లో నేనొక ప్రతిష్టాత్మక అవార్డ్ తీసుకున్నాను.
నన్నపనేని లక్ష్మి స్మారక అవార్డు ను నాకు ప్రదానం చేసారు.
లక్ష్మిగారు మంగళగిరిలో  ప్రముఖ సామాజిక  కార్యకర్తగా,లైన్స్ క్లబ్ సెక్రటరిగా  పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొనేవారట.
2007 లో ఒక రోడ్డు ప్రమాదంలో ఆవిడ మరణించారు.
ఆవిడ  పేరు మీద వారి భర్త నన్నపనేని నాగేశ్వర రావు గారు నన్నపనేని లక్ష్మి స్మారక అవార్డును మహిళల ఉన్నతి కోసం పని చేస్తున్న వారి ప్రదానం చేస్తున్నారు.
సంవత్సరం  అవార్డు కోసం నన్ను ఎంపిక చేసారు.
కృష్ణా నదీ తీరాన చక్కటి ఆహ్లాదకర వాతావరణం లో విజయవాడకు చెందిన ఎందరో ప్రముఖుల సమక్షంలో  అవార్డు ప్రదానం జరిగింది.
ముఖ్యంగా ప్రజా నాట్య మండలిలో నాజర్ తో కలిసి బుర్రకధ చెప్పిన కర్నాటి లక్ష్మీ నరసయ్య గారి ఆధ్వర్యంలో ,ఆయన ముఖ్య పాత్ర వహించిగా సమావేశం చక్కగా జరిగింది.
నా మితృలు,ప్రముఖ స్త్రీవాద రచయితృలు పి.సత్యవతి,వి.ప్రతిమ నా నేస్తం గీతల సమక్షంలో అవార్డు తీసుకోవడం నాకు చాలా సంతోషం కల్గించింది.
ప్రముఖ రచయిత విహారి గారు నా గురించి చెప్పిన మంచి మాటలు నాకు కళ్ళల్లో నీళ్ళు తెప్పించాయి.
నాకు ఎంతో ఆత్మీయులు పి. సత్యవతి గారు నాగురించి చక్కటి విశ్లేషణ చేసారు.
హైదరాబాదు కేంద్రంగా పని చేసే నేను విజయవాడ నగర ప్రముఖుల నుండి అవార్డును తీసుకోవడం వారి ఆత్మీయతను పొందడం నాకు ఎంతో సంతృప్తిని,గర్వాన్ని ఇచ్చింది.
సంతోషాన్ని మీతో కూడా పంచుకోవాలని ఇదంతా రాసాను.

Comments

అభినందనలు..
vasantha said…
Satyavathi garu,meeku naa abhinandanalu .chala santhoshanga vundi .
vasantha mukthavaram
సమస్యల్లో చిక్కుకున్న మహిళలకు చేయూతనందించే... మీకు నా హృదయపూర్వక శుభాభినందనలు...ఈ అవార్డు అనంతరం స్త్రీలకు మరింతగా సేవలందిస్తారని నా ఆకాంక్ష.....
Satyavathi garu,meeku naa abhinandanalu.
Anonymous said…
Congrats

Popular posts from this blog

అమ్మ...అమెరికా

‘వైధవ్యం’ – రసి కారుతున్న ఓ రాచపుండు

అశోకం