Posts

Showing posts from September, 2009

యూ ఎన్ ఎఫ్ పి ఎ -లాడ్లీ మీడియా అవార్డ్ ఫర్ జన్డర్ సేన్సిటివిటి 2009-10 In Southern Region

Image
ఈనాడు 9-9-09

పాపాయిల సంక్షేమానికి పురస్కారాలు
ఆడ శిశువులను అంతమొందించే
విష సంస్కృతిని... కూకటి వేళ్లతో పెకిలించేందుకు... ఐరాస పాపులేషన్‌ ఫండ్‌, పాపులేషన్‌ ఫస్ట్‌ సంస్థలు నడుం బిగించాయి. ఆ దిశగా కృషి చేసే వారిని సత్కరించేందుకు... జాతీయ స్థాయిలో 'లాడ్లీ మీడియా అవార్డు'లను నెలకొల్పాయి. ఆ స్ఫూర్తిని అందుకున్న మన రాష్ట్రంలోని... ప్రముఖ హెల్ప్‌లైన్‌ 'భూమిక' వారితో కలిసి అడుగులేస్తూ... దక్షిణ భారతంలో లాడ్లీ అవార్డుల పర్యవేక్షణ బాధ్యతలు చేపట్టింది. ఆ అవార్డులకు సంబంధించి మరిన్ని వివరాలు...
చందమామ మీద చిందులేసే రోజులొస్తున్నా.. మహిళా సమస్యలు మాత్రం నానాటికీ పెరుగుతూనే ఉన్నాయి. భ్రూణహత్యలు, చదువుకి దూరంగా ఉంచడం, యాసిడ్‌ దాడులు, ఈవ్‌ టీజింగ్‌, పెళ్లయ్యాక అత్తింటి చిత్రహింసలు... వృద్ధాప్యంలో పిల్లల నిరాదరణ... ఇలా జీవితం ప్రతి దశలోనూ మహిళలకు సమస్యలే. వాటిని అధిగమించడానికి ఏం చేయాలి? మహిళల చైతన్యానికి ఏ మార్గాలు అనుసరించాలి? సామాజిక మార్పుకి ఎలా శ్రీకారం చుట్టాలి? ఈ దిశలోనే ఆలోచించిన ఐరాస పాపులేషన్‌ ఫండ్‌, పాపులేషన్‌ ఫస్ట్‌ సంస్థలు భ్రూణ హత్యల నివారణకు పాటుపడే వారిని ప్రోత్సహించాలనుకున్…