Posts

Showing posts from November, 2018

నల్లమల నిలువెత్తు కొండల్ని అవలీలగా ఎలా ఎక్కానంటే… –

మార్చి నెలాఖరు… చేస్తున్న పనులన్నీ సంతృప్తికరంగా ముగిసాయి. ఓ రెండు రోజులు ఎటైనా ఎగిరిపోదామని మనసు రొద పెడుతుంది. ఎక్కడికెళ్ళాలి? ఎండలు చూస్తే మండుతున్నయ్‌.అయినా సరే వెళ్ళాలి. నల్లమల కళ్ళముందు కొచ్చింది. రా… రా… అని పిలవడం మొదలుపెట్టింది. ఆకురాలు కాలం… అడివంతా నగ్నంగా, నిజరూపంతో సాక్షాత్కరించే కాలం. పచ్చదనం మచ్చుకైనా కనబడదు. అయినా సరే వెళదామని నిర్ణయించుకున్నాను. ప్రశాంతితో అన్నాను ఓ రెండు రోజులు ఎటైనా పోదామా? అని. ‘సై’ అంది. కర్నూల్‌, మహానంది, అహోబిలం… ర్నూల్‌లో మహా ఎండలు. ఫర్వాలేదు… పోదామ్‌… అనుకున్నాం. ఏప్రిల్‌ నాలుగో సోమవారం… ఆఫీసులో కొన్ని పనులున్నాయ్‌. పన్నెండింటికల్లా పూర్తయిపోయాయి. మిట్ట మధ్యాహ్నం వేళ కారులో కర్నూల్‌ బయలుదేరాం. ప్రశాంతి చాలాసార్లు కర్నూల్‌ వెళ్ళింది కానీ, మహానంది, అహోబిలం చూళ్ళేదట. కర్నూల్‌లో ఆగకుండా మహానంది వెళ్ళిపోయాం. అప్పటిదాకా మండిన సూర్యుడు మహానంది కొండల్లోకి జారిపోయాడు. ఆ కొండల్లోంచి 365 రోజులూ జాలువారే నీటి చెలమల్లోకి సూర్యుడు పారిపొయ్యాడన్నమాట వేడి భరించలేక. మేం మహానందిలో దిగేసరికి కొంచం చీకటి పడుతోంది. పెద్దగా జనం లేరు. ఉన్నవాళ్ళు కొలనులో ఈతలు కొడుతూ…