Posts

Showing posts from September, 2010

యూ ఎన్ ఎఫ్ పి ఎ -లాడ్లీ మీడియా అవార్డ్ ఫర్ జన్డర్ సేన్సిటివిటి ఇన్ మీడియా

ఎంట్రీలకు ఆహ్వానం

ఆడ శిశువులను అంతమొందించే విష సంస్కృతిని... కూకటి వేళ్లతో పెకిలించేందుకు... ఐరాస పాపులేషన్‌ ఫండ్‌, పాపులేషన్‌ ఫస్ట్‌ సంస్థలు నడుం బిగించాయి. ఆ దిశగా కృషి చేసే వారిని సత్కరించేందుకు... జాతీయ స్థాయిలో 'లాడ్లీ మీడియా అవార్డు'లను నెలకొల్పాయి. జాతీయ స్థాయి అవార్డు అందుకున్న 'భూమిక'  దక్షిణ భారతంలో లాడ్లీ అవార్డుల పర్యవేక్షణ బాధ్యతలు చేపట్టింది. ఆ అవార్డులకు సంబంధించి మరిన్ని వివరాలు...

 మహిళల హక్కులు, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న 'భూమిక హెల్ప్‌లైన్‌' వ్యవస్థాపకురాలు కొండవీటి సత్యవతి 2008 సంవత్సరానికి గాను జాతీయ అవార్డ్ (లాడ్లీ మీడియా అవార్డు) గెలుచుకున్నారు. 'భూమిక'లో సంపాదకీయానికి ఆ అవార్డు లభించింది. .

'లాడ్లీ' అంటే ప్రియమైన అనీ... నవ్వుల పాపాయి అనీ అర్థం. అలాంటి అమ్మాయిని, గారాలపట్టిని పుట్టకముందే చంపేయకుండా... ఆనందమైన జీవితాన్ని అందించమంటూ... ఐరాస పాపులేషన్‌ ఫండ్‌ కొన్నేళ్లుగా ప్రచారం చేస్తోంది. దేశవ్యాప్తంగా చైతన్యం తెచ్చే దిశలో వడివడిగా నడక సాగిస్తోంది. 'స్త్రీ సమస్యలపై ప్రతిఘటించాలి.. పోరాడాలి.. బాలికల సంఖ్య పె…

మాతృత్వం,మన్నూ,మశానం లేని మా కోడిపెట్ట

Image
రెండున్నర నెలల క్రితం మా ఇంట్లో పది కోదిగుడ్లను పొదిగిస్తే ఐదు పిల్లలొచ్చాయి.
అవి పుట్టిన క్షణం నుంచి నేను వాటి జీవన శైలిని గమనిస్తున్నాను.
తల్లి కోడి పిల్ల కోళ్ళను ఎంత అపురూపంగా చూసుకుంటుందో చూస్తూనే ఉన్నాను.వాటికి తినడం నేర్పించడం,తను తినకుండా పిల్లలకే తిండి వదిలేయడం,అంతెత్తున గద్ద కనిపించగానే చిత్రంగా అరవడం,పిల్లలన్ని తల్లి రెక్కల్లో దూరిపోవడం,బుల్లి కాళ్ళతో తవ్వడం నేర్పించడం తల్లికోడి ఎంతో నిష్ఠగా చేస్తూ ఉంటుంది.
నేలను తవ్వి,తవ్వి కాళ్ళు నొప్పిపెట్టగానే తల్లికోడి కాళ్ళను, రెక్కల్ని సాచి ఎక్సర్ సైజ్
చెYYఅడం,దాన్నీ పిల్లకోళ్ళు ఇమిటేట్ చేయడం చూసి తీరాల్సిందే.
ఇలా రెండు నెలపాటు తల్లికోడి అవిశ్రాంతంగా పిల్లకోళ్ళకి సమస్తం నేర్పేస్తుంది.గద్ద నుంచి,కాకుల్నిచి ఎలా తప్పించుకోవాలో చక్కగా చెబుతుంది.పిల్లకోళ్ళు అన్నీ నేర్చేసుకుని తమంత తాము తిండి వెతుక్కోవటం,గద్ద వస్తే చెట్లలోకి పారిపోవడం పక్కాగా నేర్చేసుకుంటాయ్.
ఇరవై ఒక్కోరోజు గుడ్డును పగలగొట్టుకుని పిల్లలొచ్చినంత సహజంగానే అరవై ఒక్కోరోజు నుండి తల్లి కోడి గమ్మత్తుగా ప్రవర్తించడం మొదలుపెడుతుంది.పిల్లాల్ని పొడవడం,దూరంగా తరిమెయ్యడం,తిండి కనబ…

రేవులో తాడిలా ఎదిగిన వెదురు బియ్యం మొక్క

Image
ఈ మొక్క చూసారా?వెదురు బియ్యం మొక్క.కొమ్మలూ,రెమ్మలతో,పొడవైన కంకులతో చూడముచ్చటగా ఉంది కదా?
ఏమి లాభం.ఒక్క బియ్యం గింజని కూడా సంపాదించలేం.
కంకి మాత్రం పొడుగ్గా,సూదివాటంగా ఉంటుంది.
ముట్టుకుంటే చాలు జలజలా రాలిపోతాయి బియ్యపు గింజలు.
గింజ గట్టిగా కొర్రల్లాగా ఉంటుంది.
ఈ బియ్యాన్ని ఎలా జాగ్రత్త చెయ్యాలో ఎవరైనా చెబుతారా???

కొట్టేసినందుకు రోజూ బెదిరిస్తున్న చెట్టు

Image
ఈ చెట్టు చూసారా?నేను వద్దంటున్నా వినకుండా కూరగాయల మొక్కలకు నీడ వస్తుందని మా వాళ్ళు కొట్టేసారు.దీనిని కొట్టినందుకు నేను వారం రోజులు నా సహచరుడితో మాట్లాడలేదు.ఓ రోజంతా ఏమీ తినలేదు.చెట్టును కొడితే నాకు అంత బాధగా ఉంటుంది.మొత్తం కొట్టొద్దన్న మాటను విని ఇదిగో ఇలా వదిలేసారు.తలలేని ఆ చెట్టేమో తర్జని చూపిస్తూ బెదిరిస్తోంది.నాకు దానిని చూస్తుంటే అలాగే అనిపిస్తోంది.
దానికి చిగుర్లు ఎప్పుడొస్తాయా అని నేను చూస్తుంటే అదేమో చూపుడు వేలితో నన్ను బెదిరిస్తూ, కొట్టేస్తుంటే పట్టించుకోలేదు కదా అని నన్ను నిలదీస్తున్నట్టు అనిపిస్తోంది.

”అమ్మ ఇంట్లో వంట చేయును. నాన్న సంపాదించి తెచ్చును”. ఇక్కడే ఆగిపోయిన పాఠ్యాంశాలు

Image
ఇటీవల ఒక డిగ్రీ కాలేజీలో ఒక సమావేశం ఏర్పాటు చెయ్యడం జరిగింది. ఆ కాలేజీ ప్రిన్సిపాల్‌ నాకు మిత్రురాలు. విద్యార్థులెదుర్కొంటున్న సమస్యల గురించి, ‘ప్రేమ’ దాడుల గురించి ఇంకా వారు ప్రస్తావించే అంశాల మీద ఈ మీటింగులో మాట్లాడాలని, వారిని చర్చల్లో చురుకుగా పాల్గొనేెలా ప్రోత్సహించాలని తను చెప్పింది. ‘జండర్‌ సెన్సిటివిటీ ‘ గురించి కూడా మాట్లాడాలని నేను సూచించాను. నాతో పాటు ఇంకో ఫ్రెండ్‌ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.

పదకొండు గంటలకి మీటింగు మొదలైంది. మూడొంతులు మగపిల్లలు, ఒక వంతు ఆడపిల్లలు వున్నారు. మగపిల్లలు అల్లరిగా కామెంట్స్‌ చేస్తున్నారు. అమ్మాయిలు ముసి ముసి నవ్వులు ఒలకబోస్తూ, ముడుచుకుని కూర్చున్నారు. నేను కొంత ఆశ్చర్యపోయాను. అమ్మాయిలు ఇంకా ఇంత ఒద్దికగా కూర్చునే వుంటున్నారా? వాళ్ళుకూడా బాగా అల్లరి చేస్తారేమోనని నేను అనుకున్నాను. కానీ అలా జరగలేదు. యుగాలు గడిచినా ఈ బిడియం, ఒద్దిక వీళ్ళను వొదలవా అన్పించింది.

మేము పిల్లల్ని చర్చల్లోకి దింపడానికి ప్రయత్నిస్తూ మీకు మళ్ళీ పుట్టడానికి అవకాశమొస్తే, ఆ జన్మలో అమ్మాయిగా పుట్టాలను కుంటారా?” అబ్బాయిగా పుట్టాలనుకుంటారా?” అని అడిగాం. అబ్బాయిలంతా మగవాళ్ళగానే అ…