Thursday, September 23, 2010

మాతృత్వం,మన్నూ,మశానం లేని మా కోడిపెట్ట

రెండున్నర నెలల క్రితం మా ఇంట్లో పది కోదిగుడ్లను పొదిగిస్తే ఐదు పిల్లలొచ్చాయి.

అవి పుట్టిన క్షణం నుంచి నేను వాటి జీవన శైలిని గమనిస్తున్నాను.
తల్లి కోడి పిల్ల కోళ్ళను ఎంత అపురూపంగా చూసుకుంటుందో చూస్తూనే ఉన్నాను.వాటికి తినడం నేర్పించడం,తను తినకుండా పిల్లలకే తిండి వదిలేయడం,అంతెత్తున గద్ద కనిపించగానే చిత్రంగా అరవడం,పిల్లలన్ని తల్లి రెక్కల్లో దూరిపోవడం,బుల్లి కాళ్ళతో తవ్వడం నేర్పించడం తల్లికోడి ఎంతో నిష్ఠగా చేస్తూ ఉంటుంది.
నేలను తవ్వి,తవ్వి కాళ్ళు నొప్పిపెట్టగానే తల్లికోడి కాళ్ళను, రెక్కల్ని సాచి ఎక్సర్ సైజ్
చెYYఅడం,దాన్నీ పిల్లకోళ్ళు ఇమిటేట్ చేయడం చూసి తీరాల్సిందే.
ఇలా రెండు నెలపాటు తల్లికోడి అవిశ్రాంతంగా పిల్లకోళ్ళకి సమస్తం నేర్పేస్తుంది.గద్ద నుంచి,కాకుల్నిచి ఎలా తప్పించుకోవాలో చక్కగా చెబుతుంది.పిల్లకోళ్ళు అన్నీ నేర్చేసుకుని తమంత తాము తిండి వెతుక్కోవటం,గద్ద వస్తే చెట్లలోకి పారిపోవడం పక్కాగా నేర్చేసుకుంటాయ్.
ఇరవై ఒక్కోరోజు గుడ్డును పగలగొట్టుకుని పిల్లలొచ్చినంత సహజంగానే అరవై ఒక్కోరోజు నుండి తల్లి కోడి గమ్మత్తుగా ప్రవర్తించడం మొదలుపెడుతుంది.పిల్లాల్ని పొడవడం,దూరంగా తరిమెయ్యడం,తిండి కనబడితే ఎగబడి తనే తినెయ్యడం చేస్తుంది.పిల్లలని ఎంతో ప్రేమతో రెక్కల కింద పొదుపుకున్న తనే వాటిని భ్యంకరంగా పొడుస్తూ దూరంగా తరిమేస్తుంది.
ఈ దశలో మెల్లగా పుంజు దగ్గరవ్వడం రెండు దొస్తానా నడపడం మొదలౌతుంది.అంతకు ముందు చచ్చినా పుంజును దగ్గరకు రానివ్వదు.పిల్లల్ని సాకేటప్పుడు పుంజును దగ్గరకు రనీయదు.పుంజు,పెట్ట చెట్టపట్టలేసుకుని తిరగడంపెట్ట మళ్ళీ గుడ్లుపెట్టడం మొదలౌతుంది.

పిల్ల కోళ్ళు స్వతంత్రంగా తిండి వెతుక్కోవడం,స్వేచ్చగా తమంత తామే తిరగడం ,గద్దలనుచి ఇతర జంతువుల్నించితమని తామే రక్షించుకోవడం నేర్చేసుకుంటాయి.

ఈ పరిశీలనలో నేను నేర్చుకున్న అంశం ,గొప్ప పాఠం ఏమిటంటంటే పక్షులైనా,పిల్లలైనా సరే అన్నీ నేర్పించివదిలేయాలి.వాళ్ళకు ఎంతవరకు రక్షణ అవసరమో అంతవరకే మనం పట్టించుకోవాలి.వాళ్ళ బతుకుల్ని వాళ్ళను బతకనిస్తే అన్ని వాళ్ళే నేర్చుకుంటారు.తమని తాము రక్షించుకోవడం,తిండి సంపాదించుకోవడం నేర్పిస్తే అందరూ నేర్చుకుంటారు.ముఖ్యంగా ఆడపిల్లల్నీన్నీ నేర్పించి చదువు చెప్పించి,శారీరక ధృడత్వాన్ని అలవరైచే ఆటల్ని నేర్పించి సమాజంలోకి వదిలేసి చూడండి.బ్రహ్మాణ్డంగా నెగ్గుకొస్తారు.
అలా కాకుండా చిన్నప్ప్టి నుండి ఏడుపు కధల్ని చెబుతూంటే ఏడుస్తూనే ఉంటారు.
బుల్లి బుల్లి కోడిపిల్లలు బతుకు పోరు ఏలా చెYYఅలోచక్కగా నేర్చుకున్నపుడు బుర్ర,బుద్ధి ఉన్న మనుష్యులు నేర్చుకోలేరా?సిగ్గుచేటు కదా!
కొసమెరుపు:తల్లి వదిలేసిన పిల్ల కోళ్ళని అపుడపుడూ తండ్రి కోడ్పుంజు ఇలా పలకరిత్సూ ఉంటుంది.

17 comments:

కిరణ్ said...

సూపర్ ..

సుజాత వేల్పూరి said...

superb!

Kathi Mahesh Kumar said...

:)

మనసు పలికే said...

చాలా చాలా బాగుంది..:))

Sujata M said...

sooper dooper.

మధురవాణి said...

Amazing!

మాలా కుమార్ said...

సూపర్ గా వుంది .

Unknown said...

మాతృత్వం ఒక మన్ను. మాతృత్వం ఒక మశానం.

అదిరింది.

Unknown said...

ఈసారినుంచి ఆడపిల్లల్ని అలాగే చేద్దాం.

రాధిక(నాని ) said...

చాలా బాగుంది.

హరే కృష్ణ said...

nice observation!

Overwhelmed said...

bhale chepparandi.. eppatilagaane.

Ammayilani, Abbayilni kuda ilane cheyyali andi.

Surabhi said...

Super gaa chepparandi!!!
Navi kudaa same thoughts. Maa amma nannu alage pencharu.
Na pillalani alage penchalani prayatnam, maa vaaritho arguments pillalani vuurike conditions (bhayalatho) lo penchoddu, anni nerepinchi vodiliveyalani. Manchi example ichharu thaniki urgent ga cheppali.

santha sundari.r said...

డియర్ సత్యవతీ,
కోడి గురించి మీరు చెప్పినదే ప్రస్తుతం మా ఇంట్లో పిల్లి చేస్తోంది.సరిగ్గా మూడు నెలలు కంటికి రెప్పలా కాపాడిన తల్లి పిల్లి హఠాత్తుగా మరో మగ పిల్లి తో స్నేహం చేస్తూ పిల్లని తరిమి కొడుతోంది.పాపం పిల్లిపిల్లకి ఏమీ అర్థం కాక గోల గోల గా తల్లి కోసం అరుస్తోంది.
మీరన్నట్టు, పిల్లలని కూడా తమని తాము కాపాడుకునే నేర్పు అలవాటయే వరకూ జాగ్రత్తగా చూసుకుని ఆ తరవాత వదిలెయ్యాలి.మనం పిరికి మందు పోస్తూ జీవితాంతం వెనకుండి కాపాడితే వాల్లు ఏమీ నేర్చుకోలేరు.ఈ లోకం లో అవసరమైనప్పుడు కూడా ఒంటరి పోరాటం చెయ్యలేరు.
ఫోటోలతో సహా మీరు బ్లోగ్ లో రాసిన ఈ వ్యాసం(ఒక కథ అనచ్చేమో)చాలా బావుంది.ముఖ్యంగా జంతువులనీ,ప్రకృతినీ ,మనుషులనీ ప్రేమించే నాకైతే చాలా చాలా నచ్చింది.దీన్ని అందించిన మీకు ధన్యవాదాలు.
శాంత సుందరి.

Anonymous said...

జంతువులు మనిషికి ఆదర్శం కాదు, కాకూడదు. జంతువుల జీవనశైలి మానవుల మనస్తత్వానికి, సమాజానికీ నాగరికతకీ నప్పదు. జంతుపిల్లలు పుట్టుకతోనే నడుస్తాయి. అతిత్వరలో ఆహారాన్ని సంపాదించుకుంటాయి. కానీ మానవ బిడ్డలకు అలా చేయాలంటే దశాబ్దాలు పట్టుతుంది. జంతువులకు ఒక పేరెంట్ చాలు. కానీ మానవులకు ఇద్దరు పేరెంట్స్ ఉండడం ఒక తప్పనిసరి అవసరం. జంతువులకు మరపు ఎక్కువ. మనిషికి జ్ఞాపకశక్తి ఎక్కువ. అందుచేత అవి రక్తబంధాన్ని ఇట్టే మర్చిపోతాయి. మనిషికి అలా ఉండడం సాధ్యం కాదు. అది మనిషికి సాధ్యమైతే మనుషుల్లో వావివరుసలు కూడా నశిస్తాయి. సుదీర్ఘకాలం పాటు పరస్పరం ఆధారపడడం వల్లనే మానవుల్లో పరస్పర ప్రేమాభిమానాలు వృద్ధి చెందుతాయి. ఆ అభిమానాల వల్లనే మనుషులకు ఒక కుటుంబం, సమాజం, దేశం, దేశభక్తి, సమిష్టికృషి మొదలైనవన్నీ ఏర్పడతాయి. ఇలా ఇవన్నీ ఒకదానితో ఒకటి అల్లిబిల్లిగా అల్లుకుపోయిన విషయాలు.విడదీసి వేరువేరుగా చూడడానికి వీలుపడని విషయాలు. ఆ కారణం చేత సత్యవతిగారి అబ్జర్వేషన్లతో ఏకీభవించలేకపోతున్నాను.

ఇక్కడ - పిల్లల్ని ఒక దశలో వదిలేయాలని చెప్పేవారిలో ఏ ఒక్కరైనా అలా వదిలేయగలుగుతున్నారా ? నిజాయితీగా చెప్పండి. ఒకవేళ వదిలేస్తే ఇష్టపూర్వకంగా వదిలేస్తున్నారా లేక తమ పిల్లలు తమ మాట వినకపోవడం వల్ల బలవంతాన వదిలేస్తున్నారా ? తమ పిల్లల కోసం తాము ఏ భవిష్యత్ ప్రణాళికలూ వేయడం లేదా ? వారి కోసం ఏమీ సంపాదించడం లేదా ? వారికి పెళ్ళైన తరువాత కూడా వారి కాపురాల గురించి, మనవల గురించి కనుక్కోకుండా మాన్తున్నారా ?

santha sundari.r said...

మానవ మనస్తత్వం జంతువుల మనస్తత్వం వేరని తెలుసు.ప్రేమాభిమానాలు జంతువుల్లో కూడా ఉంటాయి.కుక్కలూ, ముఖ్యంగా ఏనుగులు ఒక ఏనుగు చనిపోతే ఏడుస్తాయనీ, దాని శవం చుట్టూ నిలబడి శోకిస్తాయనీ ఎక్కడో చదివినట్టు గుర్తు.ఇక పిల్లలమీద మనుషులకి ఆఖరిక్షణం వరకూ ప్రేమ ఉంటుంది...సందేహం లేదు.ఇక్కడ చాలా మంది చెప్పదల్చుకున్నది...నాకు అర్థం అయినంతలో... పిల్లలని over protect చెయ్యకూడదని.ముఖ్యంగా ఈ రోజుల్లో స్కూల్ వయసు నుంచే పిల్లలు ఎక్కువ సేపు తలిదండ్రులతో గడపటం లేదు.అందుకని వాళ్ళకి జీవితం అంటే ఏమిటో...ఎటువంటి ప్రమాదాలని ఎదుర్కోవలసి వస్తుందో చిన్నప్పుడే నేర్పాలి.జంతువులు చేసే పని అదే.అది మానేసి వాళ్ళని ఎల్లకాలం కాపాడాలని ప్రయత్నించడం సరి కాదు.ఒక్కోసారి వాళ్ళు మనకి చాలా దూరంలో ఉంటారు....అమెరికా లోనో ఆస్ట్రేలియా లోనో ఉన్న పిల్లలని మనం ఎలా కాపాడ గలం? ఎంత ప్రేమ ఉన్నా అది సాధ్యం కాదు కదా?
ఇంతకీ ఇక్కడ అందరూ చెప్పినది పిల్లలని ప్రేమించద్దని కాదనుకుంటా.వాళ్ళని ఎంతో ఎక్కువగా ప్రేమించటం వల్లే, వాళ్ళ బాగు కోరే వాళ్ళని self-sufficient గా తయారు చెయ్యలన్నది అసలు పాయింట్.ముఖ్యంగా యాసిడ్ దాడులూ, హత్యలూ,అత్యాచారా లూ పెరిగిపోతున్న ఈ రోజుల్లో ఆడపిల్లలని ధైర్యం గా ఉండేట్టు పెంచటం తలిదండ్రుల కర్తవ్యం..వాళ్ళకి జంతువుల్లాగే ఎదురుదాడి చేసి తమని తాము కాపాడుకోవటం నేర్పాలి.అంతవరకే ఇక్కడ మనుషులని జంతువులతో పోల్చటం జరిగిందని నా అభిప్రాయం.
ఆర్.శాంత సుందరి

Unknown said...

ఆడపిల్లలు ఎదురుదాడికి దిగడమా ?

ఈ కాన్సెప్టు చాలా ఆశ్చర్యకరంగా ఉంది. ఇది అసలు ఏ దేశంలో ఉందంటారు ? ఆడవాళ్ళకి ఇది నిజంగా చేతనైతే వాళ్ళకి మగవాళ్ళతోను, మగవ్యవస్థలతోను పనే ఉండదు. కానీ స్వేచ్ఛావాద మేధావుల ఊహలకు భిన్నంగా, పూర్వం కంటే ఎక్కువగా ఆధునిక ఆడపిల్లలకు మగవాళ్ళ అవసరం రోజురోజుకూ పెరిగిపోతోంది. ఇందుకు కారణం తెలియదు. సాధారణంగా తమ సమాజంలోని మగవాళ్ళు ఎలా ఉంటారో వాళ్ళ ఆడవాళ్ళూ అచ్చం అలాగే ఉంటారు. ఎదురుదాడిని - అది మగవాళ్ళు చేసినా సరే, ప్రభుత్వాలూ, చట్టాలూ పోలీసులూ ప్రోత్సహించరు. ఎందుకంటే భవిష్యత్తులో అది వాళ్ళ అధికారానికి సవాల్. అందుకని మన సమాజంలో ఎదురుదాడులనేవి మగవాళ్ళక్కూడా చేతకావు. ప్రపంచంలో ఎక్కడా లేనిదాన్ని ప్రతిపాదించి ప్రయోజనమేంటి ?

ఎంత చెప్పినా ఎన్ని చెప్పినా పిల్లల కోసం సంపాదించకుండా ఎవరూ ఉండడం లేదు. సంపాదనల సంగతలా ఉంచితే - మా చిన్నప్పుడు మమ్మల్ని ఎవరూ over-protect చేయలేదు. అది అసలు భారతీయ సంస్కృతి కాదు. ఈ over-protection culture ఈ మధ్యకాలంలో మొదలయింది, అదీ ఒకమ్మాయి-ఒకబ్బాయి కుటుంబాలొచ్చాక ! ఆ రోజుల్లో మేము సినిమా వాల్‌పోస్టర్లు చూసుకుంటూ అడ్డమొచ్చిన కుక్కల మీద రాళ్ళు రువ్వుతూ బడికి నడిచి వెళ్ళేవాళ్ళం. నడిచివచ్చేవాళ్ళం. ఇప్పుడు ఇంటిగుమ్మం ముందు స్కూల్‌బస్సెక్కించి బడిగుమ్మం ముందు దింపుతున్నారు అతిజాగ్రత్తగా ! ఈ over-protection తత్త్వం తెగబలిసి చాలా పెద్ద లెవెల్లో చట్టాలు కూడా చేయిస్తున్నారు. యాదృచ్ఛిక అనూహ్య పరిస్థితుల్ని ఎదుర్కునే ధీమాయే ఉంటే ఇదంతా దేనికి ?

తర్పణాలు త్రిశంకు స్వర్గాలు

 తర్పణాలు, త్రిశంకు స్వర్గాలు ............ మా సీతారాంపురం లో మా తాతకి చాలా పొలాలు ఉండేవి. మా తాత, చిన్న తాత ఇద్దరే పొలాలన్నింటిని పంచుకున్నా...