Wednesday, September 8, 2010

కొట్టేసినందుకు రోజూ బెదిరిస్తున్న చెట్టు

ఈ చెట్టు చూసారా?నేను వద్దంటున్నా వినకుండా కూరగాయల మొక్కలకు నీడ వస్తుందని మా వాళ్ళు కొట్టేసారు.దీనిని కొట్టినందుకు నేను వారం రోజులు నా సహచరుడితో మాట్లాడలేదు.ఓ రోజంతా ఏమీ తినలేదు.చెట్టును కొడితే నాకు అంత బాధగా ఉంటుంది.మొత్తం కొట్టొద్దన్న మాటను విని ఇదిగో ఇలా వదిలేసారు.తలలేని ఆ చెట్టేమో తర్జని చూపిస్తూ బెదిరిస్తోంది.నాకు దానిని చూస్తుంటే అలాగే అనిపిస్తోంది.
దానికి చిగుర్లు ఎప్పుడొస్తాయా అని నేను చూస్తుంటే అదేమో చూపుడు వేలితో నన్ను బెదిరిస్తూ, కొట్టేస్తుంటే పట్టించుకోలేదు కదా అని నన్ను నిలదీస్తున్నట్టు అనిపిస్తోంది.

7 comments:

కృష్ణప్రియ said...

hmm... నిజంగానే మీరు చెప్పినట్టు గా ఉంది..

వేణూశ్రీకాంత్ said...

హ్మ్ నిజంగానే అలా ప్రశ్నిస్తున్నట్లుందండీ...

durgeswara said...

nijame sumamdi

ఇందు said...

అవును పాపం...కొట్టెసినందుకు చెట్టుకి కొపమొచ్చుంటుంది...తొందర్లొనే చిగురులు వేసేస్తుందిలెండీ...

భావన said...

అవును సత్య వతి గారు కరంట్ తీగలకు అడ్డంవస్తోంది అని మా వీధి లో కూడా ఇలానే కొట్టేసారు రోజు ఇంటికి వస్తూ చూడలేక తల తిప్పుకుని వచ్చేస్తా. బాధ పడకండి తొందరలోనే చిగురులు వస్తాయి మీ కున్న గ్రీన్ థంబ్ కు ఖచ్చితం ఆ చెట్టే మళ్ళీ చెయ్యి చాచి స్వాగతమిస్తుంది.

జేబి - JB said...

మంచి పరిశీలన, చిత్రానికి తగ్గ వ్యాఖ్యానం - బాగుంది.

భాస్కర రామిరెడ్డి said...

Satyavati గారూ...,మీకు మీ కుటుంబ సభ్యులకు వినాయక చతుర్థి పర్వదిన శుభాభినందనలు

హారం

తర్పణాలు త్రిశంకు స్వర్గాలు

 తర్పణాలు, త్రిశంకు స్వర్గాలు ............ మా సీతారాంపురం లో మా తాతకి చాలా పొలాలు ఉండేవి. మా తాత, చిన్న తాత ఇద్దరే పొలాలన్నింటిని పంచుకున్నా...