Posts

Showing posts from September, 2008

తుపాకీ మొనపై వెన్నెల

Image
(ఈ ప్రయాణానుభవం ఇంతకుముందు ఆంధ్ర జ్యోతి ఆదివారం అనుబంధంలో  అచ్చయ్యింది. ఈ ఫోటో కూడా అందులోదే.)
     క్రితం సంవత్సరం జమ్మువెళ్ళి వచ్చిన దగ్గరి నుంచి శ్రీనగర్‌ చూడాలనే కోరిక మరింత బలపడసాగింది. మేం శ్రీనగర్‌ ప్రోగ్రామ్‌ వేసుకోగానే ఎక్కువమంది నిరుత్సాహపరిచారు.ముందే అక్కడ శాంతి భద్రతల సమస్య వుంది దానికి తోడు ఎన్నికలు కూడా  జరుగుతున్నాయి. శ్రీనగర్‌కు వెళ్ళడం మంచిది కాదు అని సలహా ఇచ్చారు. అయినా మేం వెళ్ళడానికే నిర్ణయించుకున్నాం.
     మే ఒకటవ  తేదీన ఢిల్లీలో దిగగానే పిడుగులాంటి వార్తను మోసుకొచ్చారు ప్రొటోకాల్‌ అదికారులు. ఏప్రిల్‌ 26 నుంచి వరసగా నాలుగు రోజులు శ్రీనగర్‌లో వర్షాలతో పాటు, విపరీతంగా మంచు కురిసిందని, లేహ్  వెళ్ళే రోడ్లు మంచుతో నిండిపోవడం వల్ల ముసేసారని ఆ వార్త సారాంశం. శ్రీనగర్‌, సిమ్లా, కులు,మనాలి ప్రాంతాల్లో మంచు కురస్తుండడం వల్ల అక్కడికి విమాన సర్వీసులు రద్దయ్యాయని కూడా చెప్పారు. ప్రాణం ఉస్సురంది. మాతోపాటు శ్రీనగర్‌ ప్రోగ్రామ్‌ పెట్టుకున్న మరొకరు వాళ్ళ ప్రయాణం కాన్సిల్‌ చేసుకున్నారు. ఢిల్లీలో రెండు రోజులు గడిపాక మే మూడో తేదీన ఉదయం తొమ్మిది గంటల ఫ్లయిట్‌కి మేం శ్రీనగర్‌ వెళ్ళాల్సి…

ఒంటరి దీవులు

Image
జీవితం పూడ్చలేని ఓ అగాధంలా మారుతోంది
దేనితో పూడ్చాలి ఈ అగాధాన్ని?
జనం ఇరుకిరుకు గూళ్ళల్లోంచి బయటపడి
రోడ్ల మీద చీమల్లా పాకుతున్నారు
నోళ్ళు తెరుచుకుని నిలబడ్డ మహా మాల్స్
ఈ జనాన్ని అమాంతంగా మింగేస్తున్నాయ్
వందలాది వెర్రి మొర్రి చానల్స్
కంటి రెటీనా మీద కబ్జా చేస్తున్నయ్
ఇంటెర్నెట్ మహా మాయ
నరనరాల మీద నాట్యం చేస్తోంది
మొబైల్ ఫోన్ల మహ ప్రవాహం
చెవుల్లోంచి గుండెల్లోకి జారి
అయిస్ లా గడ్డకడుతోంది
"ఎవరికి వారౌ స్వార్హంలో
హ్రుదయాలరుదౌ లోకంలో"
నా కారు,నా చానెల్, నా మొబైల్, నా ఎఫ్.ఎం,
నా ఏ టి ఎం,నా ఇంటెర్నెట్, నా బాంక్ బాలెన్స్
ఇలా "నా"చుట్టూ గిరికీలు కొడుతున్నాం
మనం స్రుష్టించిన అద్భుత టెక్నాలజీ
మనల్నెంత ఒంటరుల్ని చేస్తోంది
"మన" ని "మనిషి" ని మర్చిపోయి
ఎవరికి వారం ఒంటరి దీవులమౌతున్నాం
తోటి మనిషి మాత్రమే పూడ్చగలిగిన
ఈ అగాధాలను
మార్కెట్లను ముంచెత్త్తుతున్న
మహా మాల్స్ లోని మహా చెత్త పూరిస్తుందా
మరింత అగాదగాన్ని స్రుష్టిస్తుంది తప్ప
మానవీయతని ప్రోదిచేస్తుందా
మానవీయ కోణాన్ని ఆవిష్కరిస్తుందా చెప్పండి.

ఈ రోజు ఏమైందంటే........

Image
రోజూ ఉదయం లేచిందగ్గర నుండి ఒకటే ఉరుకులు పరుగులు.
ట్రాఫిక్ పద్మవ్యూహం లో సెగలు పొగలతో చిరాకులు
ఆఫీసుకి వెళ్ళగానే తలమునకలయ్యే పనులు
హెల్ప్ లైన్ లో అంతులేని సమస్యలు, సమాధానాలు, కౌన్సిలింగులు
ఈ రోజు రొటీన్ కి భిన్నంగా గడపాలని,రిలాక్ష్ అవ్వాలని అనుకున్నాం
నేను గీత.తను కూడా చాలా బిజి.తహసిల్దార్ కదా ఎప్పుడూ హడావుడే.
ఇద్దరం ఆఫీసు పనుల్ని పక్కన పెట్టేసి కలిసి గడపాలనుకున్నాం.
అన్నట్టు గీత ఎవరో చెప్పలేదుగా.నా నేస్తం.నాకు చాలా ప్రియమైన నేస్తం.
ఎంతటి పని ఒత్తిడి ఉన్నా మేమిద్దరం కలవడానికి,కబుర్లాడుకోవడానికి
కనీసం నెలలో ఒక రోజన్నా కేటాయిస్తాం.పనికి సంబంధించి ఏమి మాట్లాడం.
మాకిష్టమైన వన్ని చేస్తాం అంతే.
గీత ఈ రోజు ఉదయమే మా ఇంటికొచ్చేసింది.నేను నా పనులన్ని రేపటికి పోష్ట్ పోన్
చేసేసాను.
తనకిష్టమైన వెల్లుల్లి చికెన్,చేపల పులుసు,జొన్న రొట్టి చేసా.
తనకు ఎంతో ఇష్టమైన సంపెంగ పూలు,అనార్ పువ్వులు కోసి ఉంచాను
తను 11 కు వచ్చింది.కొన్ని కబుర్లయ్యాక ఇంటర్నెట్ ఓపెన్ చేసా.మా ఊరి వ్యాసం మీద వచ్చిన స్పందన చూసి చాలా సంతోష పడింది.
ఇద్దరం ఓ గంటన్నర సేపు కూరలతో పాటు కబుర్లు నంజుకుంటూ అన్నం తిన్నాం.
కాసేపు పుస్తకాల గుర…

సెజ్‌ సెగల్లో విలవిలలాడుతున్న పోలేపల్లి

Image
కొండవీటి సత్యవతి
పోలేపల్లి వెళ్ళాలని, అక్కడి సెజ్‌ బాధితులతో మాట్లాడి, వారి దు:ఖగాధని భూమికలో రాయలని చాలా రోజులుగా అనుకుంటున్నాను.
 రత్నమాల కూడ చాలాసార్లు చెప్పింది. అమెరికాలో వుండే జయప్రకాష్‌తో చాట్‌ చేస్తున్నపుడు తెలిసింది ఆగష్టు 7 న పోలేపల్లిలో పబ్లిక్‌ హియరింగు వుందని.
 సరే ఆ రోజు హాజరైతే అందరినీ ఒకే చోట కలిసినట్టు వుంటుందని, విషయలు బాగా అర్ధమౌతాయని అనుకుని శిలాలోలితకి, సుజాతాపట్వారీకీ ఫోన్‌ చేసాను.
శిలాలోలిత వస్తానని చెప్పడంతో పోలేపల్లి ప్రయాణం ఖాయమైంది.
ఆగష్టు 7న ఉదయం ఆరుకంతా రోడ్డెక్కేసాం. జడ్చర్ల దాదాపు 80 కిలోమీటర్లుంటుంది. మేము వెళ్ళేసరికి అక్కడ రత్నమాల, బాలగోపాల్‌, గీతాంజలి, హేమలలిత, సూరేపల్లి సుజాత వచ్చి వున్నారు. మాధవి, 50 మంది కాలేజీ పిల్లలతో కలిసి బస్సులో వస్తోందని, తన కోసమే ఎదురుచూస్తున్నామని సుజాత చెప్పింది. సమావేశం ఇంకా ఆరంభమయ్యే సూచనలు కనబడలేదు. టెంట్‌ వేస్తుంటే గాలికి కిందపడుతోంది. మేము నిలబడిన చోట రాక్షసుడి కోరల్లా రెండు ఆర్చీలు  ఎపి ఐఐసి వి రోడ్డు కిటూ అటూ దర్పంగా నిలబడి వున్నాయి. పొలాల్లో చురుగ్గా పనులు జరుగుతున్నాయి. ఆరవింద్‌ ఫార్మావారి షెడ్‌ నిర్మాణం జరుగుతుతో…

మా ఊరు సీతారామపురం-నా లైఫ్ లైన్

Image
ఆయ్‌! మాది నర్సాపురమండి. కాదండి... కాదండి నర్సాపురానికి నాలుగు మైళ్ళ దూరంలో వుందండి మావూరు. సీతారామపురం. మా గొప్పూరు లెండి. నిజానికి అదసలు ఊరులాగుండదండి. 'అప్పిచ్చువాడు వైద్యుడు, ఎప్పుడు ఎడతెగక పారు ఏరు' అని ఏమనగారు చెప్పినలాంటియ్యేమీ మా వూర్లో లేవండి. ఇప్పటిగ్గూడ మా ఊరికి బస్సు లేదంటే మరి మీరు నమ్మాలండి. నమ్మకపోతే మీ ఇష్టమండి. మా వూర్లోనండి ఏమున్నా ఏం లేకపోయినా బోలెడన్ని తోటలున్నాయండి. మామిడి, జీడిమామిడి, సపోటా, సీతాఫలం తోటలేనండి ఊర్నిండా. ఇక సరుగుడు తోటలగురించి, వాటి ఈలపాట గురించి ఏం చెప్పమంటారు. నే సెపితే కాదండి మీరు ఇనాలండి. తాడితోపులు, కొబ్బరిచెట్లు కూడా ఊరంతా వున్నాయండి.
    మా యింట్లో మేం సుమారు 50 మంది పిల్లలుండేవాళ్ళం.ఏసంగి శెలవులొస్తే ఇంకా పెరిగిపోయేవారు. మా తాతకి ఏడుగురు కొడుకులు. ఇద్దరు కూతుళ్ళు. మా చిన్నప్పుడు మేమందరం కలిసే వుండేవాళ్ళం. మా అమ్మ వాళ్ళ్ళ్ళు రోజూ వందమందికి వండి పెట్టేవాళ్ళంటండి. చివరాకర్న ఆడోళ్ళకి ఏముండేది కాదంట. అది వేరే సంగతిలెండి. మరొకసారి చెబుతాను  ఆ సంగతులు.
    మీరందర జీడిపప్పు బోలెడ్డబ్బెట్టి కొనుక్కుంటారుకదా. మాకైతే ఊర్నిండా జీడితోటలే. మ…

మంచుపల్లకీలెక్కించొద్దు

తల్లులదినం...మదర్స్‌ డే. ఇటీవలే ప్రాచుర్యంలోకి వచ్చింది. ఇంటర్నెట్‌లో లక్షల సంఖ్యలో మదర్స్‌ డే మీద వెబ్‌సైట్లు పుట్టుకొచ్చాయి. కనీసం ఆరోజైనా - ఐ లవ్యూ మామ్‌.. అని చెప్పమనే సందేశాలు కుప్పలుతెప్పలుగా వెబ్‌సైట్లనిండా వుంటాయి. తల్లుల త్యాగాలను కీర్తించే కవిత్వం... అబ్బో... నెట్‌నిండా పొంగిపొర్లుతోంది. మరిక లోటేంటి?.. తల్లుల గురించి ఇంత వీరలెవల్లో కీర్తిస్తుంటే సంతోషించక ఈ సన్నాయి నొక్కులేంటి అనిపిస్తోంది కదా..
మాతృత్వంలోనే వుంది ఆడజన్య సార్ధకం. అంటూ తల్లితనాన్ని ఆకాశానికెత్తేయడం వెనక పిల్లలు కనలేని స్త్రీలను అవవనించడం అంతర్లీనంగా వుందన్న విషయం ముందు అర్థం చేసుకోవాలి. మాతృత్వాన్ని పోటీలుపడి పొగిడే పురుషపుంగవులు పితృత్వం గురించి ఒక్కమాట కూడా ఎందుకనరో ఆలోచించగలగాలి.
సమాజాన్ని ముందుకు తీసుకెళ్ళగలిగే పనిని పునరుత్పత్తి శక్తి ద్వారా స్త్రీలు మాత్రమే చేయగలరు. అఫ్‌కోర్స్‌... పురుషుల పాత్ర లేకుండా ఈ పని జరగనప్పటికీ తొంభై శాతం బాధ్యత స్త్రీమీదే వుంది. మానవ జాతి మనుగడకే ప్రాణం పోసే మాతృత్వ ప్రక్రియను మాటల్లో కోటలు దాటించడం తప్ప ఆచరణలో అంతా అవహేళనే. స్త్రీ గర్భం ధరించిన క్షణం నుంచి కంటికిరెప్పలా కా…

విలక్షణమైన పెళ్ళి కార్డ్

Image

ఉదయపు వర్షం ఎంతో హర్షం

తెల్లవారనే లేదు
పిట్టలింకా కన్ను తెరవనే లేదు
చెట్ల మీద మంచు ఇంకా ఆరనేలేదు
నా కళ్ళమీంచి దూకుతున్న సెలయేళ్ళు
ఉదయాన్నే వచ్చిన వర్షపు ధారలు
నన్ను నిలువెల్లా తడిపేసి
కిల కిలా నవ్వుతుంటే
ఆ సందడికి లేచిన పిట్టలు
తామూ గొంతు కలిపాయి
ఓ పక్క వర్షధారలు
మరో పక్క కలకూజిత రాగాలు
నాకేమో కళ్ళమ్మట ఆనంద భాష్పాలు.