Posts

Showing posts from May, 2012

ఆదివారం సత్యయమేవ జయతే ప్రోగ్రాం లో అమీర్ ఖాన్ చూపించిన గర్భ సంచుల్ని కోల్పోయిన అమ్మలు వీరే.

Image
గర్భసంచుల్ని కోల్పోయిన 100 మంది ఆడవాళ్ళు
నేను ఈ మధ్య ఒక సంస్థ వారు ఏర్పాటు చేసిన ఒక సమావేశానికి హాజరవ్వడం కోసం మెదక్ జిల్లా సదాశివపేట దగ్గర ఒక గ్రామానికి వెళ్ళాను. నేను చెప్పైన సంస్తకు చెందిన ఒక డాక్టర్ ఆ గ్రామంలో హిస్ట్రెక్టమి (గర్భ సంచుల తీసివేత)చేయించుకున్న స్త్రీలతో పని చేస్తున్నారు. ఆ సమావేశానికి దాదాపు 100 మంది మహిళలు హాజరయ్యారు. అందరూ హిస్ట్రెక్టమి చేయించుకున్న వాళ్ళే. తప్పు తప్పు చేయించుకున్న వాళ్ళు కాదు.భయానో నయానో ఒప్పించి ఒక విధంగా బలవంతపు ఆపరేషన్లకి గురిచేయబడినవాళ్ళు. కాన్సర్ వస్తుందని,పిల్లలు పుట్టాక దాని అవరంలేదు అని చెప్పి,ఇంకా రకరకాల కారణాలు చెప్పి వాళ్ళ గర్భసంచుల్ని కోసేసారట. ఒక్కొక్కళ్ళు తమ కధల్ని మాకు వినిపించారు. ఒకామెకి మరీ ఘోరంగా 19 ఏళ్ళకే తీసేసారు. ప్రస్తుతం వాళ్ళందరూ రకరకాల అనారోగ్య సమస్యలతో ఉన్నారు. నేను చెప్పిన డాక్టర్ అవిశ గింజలతో వాళ్ళకి వైద్యం చేస్తున్నారు. నేను వాళ్ళకి పోషకాహారం గురించి చెప్పాను. 

Thursday, August 20, 2009

అగ్నిపుత్రి

Image
టెెస్సి థామస్‌ పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగుతోంది. ఖండాంతర క్షిపణి అగ్ని ఖీ ప్రయోగం విజయవంతమవుతూనే అప్పటివరకు ఎవరికీ తెలియని టెస్సి అమాంతం మీడియాలో ప్రముఖవ్యక్తిగా మారిపోయారు. భారతదేశ మీడియానేకాక అంతర్జాతీయ మీడియా కూడా టెస్సికి నీరాజనాలు పడుతోంది. ”మిస్సెల్‌ వుమెన్‌” అని ”అగ్నిపుత్రి” అని బిరుదులిచ్చి సత్కరిస్తోంది. యావద్భారతీయ మహిళ గర్వంతో ఉప్పొంగాల్సిన సందర్భమిది. ఎందుకంటే అత్యధిక సంఖ్యలో పురుషులు పనిచేసే మిస్సెల్‌ డెవలప్‌మెంటు ప్రోగ్రామ్‌ శాఖలో, 49 సంవత్సరాల టెస్సి స్వయంకృషితో, పట్టుదలతో ఎదిగిన తీరు ఈ దేశ మహిళలందరికీ స్ఫూర్తిదాయకం.
1988లో డిఫెన్స్‌ రీసెర్చి డెవలప్‌మెంట్‌ ఆర్గనెజేషన్‌ (డిఆర్‌డివో)లో చేరిన టెస్సి జన్మరాష్ట్రం కేరళ. జన్మస్థలం అల్లెప్పి. తండ్రి చిన్నవ్యాపారి. తల్లి కుటుంబ నిర్వాహకురాలు. రాకెట్‌ లాంబింగ్‌ స్టేషన్‌కు అతి సమీపంలో ఆమె పెరగడంవల్ల రాకెట్ల పట్ల గొప్ప ఆకర్షణను,  ఇష్టాన్ని పెంచుకుంది టెస్సి.
టెస్సి పుట్టింది కేరళలోనే కానీ పాఠశాల, కళాశాల విద్య పూర్తవ్వగానే ఆమె ఉన్నత చదువుంతా పూనాలో పూర్తయ్యింది. ఇరవై సంవత్సరాల వయసపుడే ఆమె స్వరాష్ట్రాన్ని వదిలేసి ”గైడెడ్‌ మిస్సైల్…

శాస్ర్తీయ దృక్పధం గురించి చర్చలు జరిపే చోట ఇంత అశాస్రీయ పద్ధతులా ???????????????????

నిన్న ఉదయం దూరదర్శన్ వారి న్యూస్ & వ్యూస్ ప్రోగ్రాం లో పాల్గోడానికి దూర దర్శన్ ఆఫీసుకి కి వెళ్ళాను.నీ ముక్కేది అంటే తలంతా తిప్పి చూపినట్టు మా కార్ ఓ సందులోకి వెళ్ళి వెనక నించి పోర్టికో లోకొచ్చి ఆగింది.
ఇదేంటి ఓ నెల క్రితం వచ్చినప్పుడు కార్ మెయిన్  గేట్ లోంచే వెళ్ళింది కదా అని డ్రైవర్ ని అడిగితే ఆరుగురు ఉద్యోగులు చనిపోయారు.వాస్తు బాగా లేదంట. మైన్ గేట్ మూసేసారమ్మా అన్నాడు.
రకరకాల కారణాల వల్ల  మరణాలు సంభవిస్తాయి.దానికీ వాస్తు అంటూ సెక్యులర్ గా ఉండాల్సిన ప్రభుత్వ కార్యాలయాలను,వివిధ మతాల,నమ్మకాల వారు పని చేసే ప్రభుత్వ కార్యాలయంలో ఒక మతానికి చెందిన పద్ధతులను అనుసరించడం ఎంతైనా అభ్యంతరకరం.

పొగడపూలను చూపించమని అడిగిన మితృల కోసం

Image
కొత్త సంవత్సర శుభాకాంక్షలతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మితృలందరికోసం నేను తయారుచేసిన పొగడపూల గుచ్చం.
పొగడపూల వెనకున్నది ఓ చెట్టుకి పూసిన పువ్వు.వుడ్ రోజ్ లా సహజమైన పువ్వు.
దానికి నేను పొగడపూలను అతికిస్తే ఇంత అందమైన పుష్ప గుచ్చం తయారైంది.
సృజనాత్మక దృష్టి ఉండాలే గాని ప్రకృతి మనకెన్నో అద్భుతాలను అందిస్తుంది.

చలం గారి గొంతు వినాలనుందా?? ఆలస్యం దేనికి? వినేయండి.

అబ్బ! ఎన్ని పొగడ చెట్లు,ఎన్ని పొగడపూలు, ఏమా సువాసనలు.

Image
సెక్రటేరియట్దగ్గరరైతుబజార్లోకూరగాయలుకొనడంఅంటేనాకుభలేఇష్టం. కూరగాయలమీదప్రేమకన్నాచుట్టూఉన్నపొగడపూలవనంమీదేనాప్రేమ. అబ్బ! ఎన్నిపొగడచెట్లు,ఎన్నిపొగడపూలు, ఏమాసువాసనలు. ఏమికొంటున్ననానేదానిమీదనాకసలుస్పృహఉండదు. దృష్టంతాపొగడచెట్ల

సృజనాత్మకత ఉట్టిపడే అబ్బూరి చాయాదేవి గారు

Image
ప్రముఖ స్త్రీవాద రచయిత్రి, "తనమార్గం" కధల సంపుటికి సాహిత్య అకాడెమి అవార్డ్ పొందిన అబ్బూరి చాయా దేవి గారు ఇటీవల బాగలింగంపల్లి లోని తన ఇంటిని అమ్మేసి కొండాపూర్ లోని చండ్ర రాజేస్వర రావ్ ఫౌండేషన్ వృద్ధాప్య కేంద్రంలో చేరారు. బాగలింగంపల్లి లో చక చకా తిరుగుతూ అన్ని పనులూ చేసుకుటూ తిరిగేవారు.
ఓ రోజు హఠాత్తుగా నిర్ణయం తీసుకుని ఇల్లు అమ్మేసి కొండాపూర్ వచ్చేసారు.
భూమిక ఆఫీసు ఉన్నది బాగలింగంపల్లి లోనే కాబట్టి తరచుగా ఆఫీసుకు వచ్చేసేవారు.నేనూ రెగ్యులర్ గా వాళ్ళ ఇంటికెళ్ళేదాన్ని.
ఆవిడ షిఫ్ట్ అయ్యాకా ఒక సారి వెళ్ళాను కానీ ఆవిడ అప్పటికి రూం సర్దుకోలేదు.
ఈ రోజు సాయంత్రం చల్లగా వాన పడుతున్నవేళ చాయా దేవి గారిని చూడ్డానికి వెళ్ళి నా కళ్ళను నేను నమ్మలేక పోయాను.
తన రూం నూ ఎంత  అద్భుతంగా అలంకరించుకున్నారో మీరే చూడండి.
ఎనభైలలోకి ప్రవేశిస్తున్న ఆవిడ  కళా హృదయం,సృజనాత్మక శక్తికి జేజే లు చెప్పి తీరాలి.
అక్కడికెళ్ళిన ఈ నెల రోజుల్లో ఆవిడ ఎన్నో బొమ్మలు చేసారు.మదర్ థెరిస్సా,రవీంద్రనాధ్ ఠాగూర్,గురజాడ లాంటి ప్రముఖుల బొమ్మలు తయారు చేసారు.
చాయా దేవి గారు చేటలో చేసిన చాట భారతం చూసి తీరాలి.
కేంద్రం వారిచ్చిన ప…

ఈ కేక్టస్ కి వొళ్ళంతా ముళ్ళే

Image
ఈ కేక్టస్ కి వొళ్ళంతా ముళ్ళే కళ్ళని కట్టిపడేసే ఈ పువ్వేంటో  కరకుదనంలోంచి అపుడపుడూ కరుణ జారినట్టు బురదలోంచి కమలం పుట్టినట్టు.

ఈ రోజు నేనొక కొత్త బాధ్యతని స్వీకరించాను.

Image
ఈ రోజు నేనొక కొత్త బాధ్యతని స్వీకరించాను.
రాష్ట్రం లోని అత్యున్నత పోలీస్ కార్యాలయమైన డీ జి పి ఆఫీసులో ఏర్పాటైన
లైంగిక వేధింపుల ఫిర్యాదుల కమిటీలో నేను సభ్యురాలుగా నియమించబడ్డాను.
మహిళా పోలీసులకు సంబంధించిన ఫిర్యాదులను ఈ కమిటీ విచారిస్తుంది.

గృహహింస నిరోధక చట్టం అమలు తీరుపై రాష్ట్రస్థాయి వర్క్ షాప్

మన రాష్ట్రంలో గృహహింస నిరోధక చట్టం 2005 అమలుతీరుపై గత డిసెంబరు నెలలో రెండు రోజులపాటు వర్క్‌షాప్‌ నిర్వచించాం.ఇదే అంశంపై అంతకు ముందు సంవత్సరంకూడా ఒక సమావేశాన్ని భూమిక నిర్వచించింది.భారతదేశం మొత్తం మీద చూసుకుంటే మన రాష్ట్రంలో ఈ  చట్టం అమలుతీరు కొంత మెరుగ్గా వున్నప్పటికీ చాలా సమస్యలు కూడా వున్నాయి. ఈ చట్టం అమలులోకి వచ్చి ఆరు సంవత్సరాలు గడిచినప్పటికీ రాష్ట్రంలో చాలామందికి దీని గురించిన అవగాహన లేదు. రక్షణాధికారులంటే ఎవరు? ఎందుకున్నారు? ఎక్కడుంటారు అనే అంశం మీద చదువుకున్న స్త్రీలకి కూడా అవగాహన లేదు. ఒక విధంగా గ్రామీణ, నిరక్షరాశ్య మహిళలకి, వారు సంఘాలుగా ఐక్యమై వుండడం ద్వారా ఈ చట్టం గురించి కొంత చైతన్యం వుంది.
గృహహింస నిరోధక చట్టాన్ని అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం కొంత చొరవతో వ్యవహరించిన మాట నిజమే. అయితే ఈ చట్టం ప్రకారం ఎన్నో శాఖలు కలిసి కట్టుగా పనిచేస్తూ బాధిత స్త్రీలకు న్యాయం అందించాల్సి వుంది. గృహహింస నిరోధక చట్టం నిజానికి చాలా అందంగా అద్భుతంగా తయారు చేసిన చట్టం. బాధిత మహిళలకు లభించాల్సిన పరిహారాలన్ని అతి తక్కువ సమయంలో అంటే కేవలం 60రోజుల్లో లభించే అవకాశం వుంది. హింసకు పాల్పడుతున్న వ్యక్తుల…