Tuesday, May 29, 2012

ఆదివారం సత్యయమేవ జయతే ప్రోగ్రాం లో అమీర్ ఖాన్ చూపించిన గర్భ సంచుల్ని కోల్పోయిన అమ్మలు వీరే.

గర్భసంచుల్ని కోల్పోయిన 100 మంది ఆడవాళ్ళు


నేను ఈ మధ్య ఒక సంస్థ వారు ఏర్పాటు చేసిన ఒక సమావేశానికి హాజరవ్వడం కోసం మెదక్ జిల్లా సదాశివపేట దగ్గర ఒక గ్రామానికి వెళ్ళాను. నేను చెప్పైన సంస్తకు చెందిన ఒక డాక్టర్ ఆ గ్రామంలో హిస్ట్రెక్టమి (గర్భ సంచుల తీసివేత)చేయించుకున్న స్త్రీలతో పని చేస్తున్నారు. ఆ సమావేశానికి దాదాపు 100 మంది మహిళలు హాజరయ్యారు. అందరూ హిస్ట్రెక్టమి చేయించుకున్న వాళ్ళే. తప్పు తప్పు చేయించుకున్న వాళ్ళు కాదు.భయానో నయానో ఒప్పించి ఒక విధంగా బలవంతపు ఆపరేషన్లకి గురిచేయబడినవాళ్ళు. కాన్సర్ వస్తుందని,పిల్లలు పుట్టాక దాని అవరంలేదు అని చెప్పి,ఇంకా రకరకాల కారణాలు చెప్పి వాళ్ళ గర్భసంచుల్ని కోసేసారట. ఒక్కొక్కళ్ళు తమ కధల్ని మాకు వినిపించారు. ఒకామెకి మరీ ఘోరంగా 19 ఏళ్ళకే తీసేసారు. ప్రస్తుతం వాళ్ళందరూ రకరకాల అనారోగ్య సమస్యలతో ఉన్నారు. నేను చెప్పిన డాక్టర్ అవిశ గింజలతో వాళ్ళకి వైద్యం చేస్తున్నారు. నేను వాళ్ళకి పోషకాహారం గురించి చెప్పాను. 

Thursday, August 20, 2009

8 comments:

శ్రీనివాస కుమార్... said...

పరమ హేయమైన ఈ ఘటన చాలా ఆవేదన కల్గించింది. భవిష్యత్తులో అమాయక గ్రామీణ ప్రజలు ఇలాంటి ఘోరాలకు బలైపోకుండా వారిలో అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Sahithi said...

Madam,

ఎందుకు డాక్టర్స్ వాళ్ళను ఫోర్సు చేసి హిస్త్రేక్టామి చేసారు .ఆరోగ్య శ్రీ పథకం డబ్బులు కోసమా.

-Sahithi

maa godavari said...

ఇది ఆరోగ్య శ్రీ కిందకి రాదు.
డబ్బు కోసమే ఈ ఆపరేషన్లు చేసారు

Praveen Mandangi said...

ఇందిరా గాంధీ టైమ్‌లో చెయ్యించిన బలవంతపు కుటుంబ నియంత్రణల కంటే ఘోరంగా ఉంది ఇది.

శ్యామలీయం said...

> ఒకామెకి మరీ ఘోరంగా 19 ఏళ్ళకే గర్భసంచీ తీసేసారు.
పరమపవిత్రమైన వైద్యవృత్తిలో ఇంతటి నైచ్యానికి పాల్పడేవాళ్ళనూ చూస్తున్నామన్న ఆలోచనయే మహాభయంకరంగా ఉంది. డబ్బుకోసం కిడ్నీలు తీసే వాళ్ళూ, ఇలాంటి వాళ్ళూను. ఎక్కడికి పోతోంది సమాజం!
>....డాక్టర్ అవిశ గింజలతో వాళ్ళకి వైద్యం...
ఈ విషయంపై మరికొంచెం వివరంగా వ్రాయగలరా? అవిసెగింజలపొడి నూవులపొడిలాగే ఉంటుంది రుచికి. ఎక్కువరోజులు నిలవ ఉండదు. మధుమేహానికి చాలా మంచిది. ముఖ్యంగా trigliserides ని బాగా అదుపు చేస్తుంది. నాకు తెలిసింది ఇంతే. మీరు దేనికి అవెసె గింజలు వాడుతున్నారు వైద్యపరంగా?

ఆ.సౌమ్య said...

ప్చ్ దారుణం. దీనివల్ల వీళ్ళకి ఎలా డబ్బు వస్తుంది?

ఆ.సౌమ్య said...

ప్చ్ దారుణం. దీనివల్ల వీళ్ళకి ఎలా డబ్బు వస్తుంది?

KRISHNA'S చెప్పు దెబ్బలు-పూలదండలు said...

ఈ మధ్యనే ఆరోగ్యశ్రీ కింద చేయడానికి కొన్ని నిబంధనలు పెట్టారు. అంతకు మునుపు ఆరోగ్యశ్రీలో ఎడాపెడా కోసి పారేసి డబ్బులు దండుకున్నారు.

తర్పణాలు త్రిశంకు స్వర్గాలు

 తర్పణాలు, త్రిశంకు స్వర్గాలు ............ మా సీతారాంపురం లో మా తాతకి చాలా పొలాలు ఉండేవి. మా తాత, చిన్న తాత ఇద్దరే పొలాలన్నింటిని పంచుకున్నా...