నిన్న ఉదయం దూరదర్శన్ వారి న్యూస్ & వ్యూస్ ప్రోగ్రాం లో పాల్గోడానికి దూర దర్శన్ ఆఫీసుకి కి వెళ్ళాను.నీ ముక్కేది అంటే తలంతా తిప్పి చూపినట్టు మా కార్ ఓ సందులోకి వెళ్ళి వెనక నించి పోర్టికో లోకొచ్చి ఆగింది.
ఇదేంటి ఓ నెల క్రితం వచ్చినప్పుడు కార్ మెయిన్ గేట్ లోంచే వెళ్ళింది కదా అని డ్రైవర్ ని అడిగితే ఆరుగురు ఉద్యోగులు చనిపోయారు.వాస్తు బాగా లేదంట. మైన్ గేట్ మూసేసారమ్మా అన్నాడు.
రకరకాల కారణాల వల్ల మరణాలు సంభవిస్తాయి.దానికీ వాస్తు అంటూ సెక్యులర్ గా ఉండాల్సిన ప్రభుత్వ కార్యాలయాలను,వివిధ మతాల,నమ్మకాల వారు పని చేసే ప్రభుత్వ కార్యాలయంలో ఒక మతానికి చెందిన పద్ధతులను అనుసరించడం ఎంతైనా అభ్యంతరకరం.
4 comments:
Did you not tell those people then and there? Instead of posting here, why did not you raise the point in the DD office? Who will read this post from DD *and* actually act? You should have brain washed them directly on the program or in their office.
చాలా విచారకరం. మనదేశానికే వాస్తు బాగోలేదని చెపుతున్నారు. నమ్మే వారిని,ప్రోత్సహించేవారిని మనం మార్చ గలమా మేడం!
ప్రశించడం అయినా చేస్తున్నాం.అదే చాలు.
ఇలాటివి విజయవాడ ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా చాలా జరిగాయన్నది పచ్చి నిజం.ఆ విషయాలని వార్తలుగా వ్రాసి హైలెట్ చేసి ఒక రోజులో ఆ సంగతి మర్చిపోయిన మన పవర్ ఫుల్ ప్రింట్ మీడియాకి జోహార్లు అనుకున్నాను నేను..
ఎనానిమస్ గారూ
మన రోజువారీ జీవితం లో మనని కలతపెట్టే బాధ పెట్టే అన్యాయం అన్పించే ప్రతి సంఘటన లోకి ప్రత్యక్షంగా దూరిపోయి జుట్టు పట్టుకోవడమో కాలర్ పట్టుకోవడమో ఎవరమూ చెయ్యము.మనని కదిలించిన స్థాయిని బట్టి దాని స్పందన అనేక రకాలుగా ఉంటుంది...ఈ బ్లాగర్ తన స్పందనని ఇలా పంచుకున్నారు.దూరదర్శన్ వాళ్ళు దీనిని చదువుతారో మానతారో కాదు ఆలోచించాల్సింది..మూఢ నమ్మకాలు ఎంత లోతుగా కూడా వ్యాపించాయో మరో సారి తెలుసుకుంటాం...మన చుట్టూ అలా జరిగినపుడు మన శక్తి,సమయం మేరకు వాటిని నివారించడానికి ప్రయత్నిస్తాం...
ఇక ఇంత లాజిక్ మాటాడిన మీరు మీ ఉనికిని అనామకంగా ఉంచడం ఆశ్చర్యకరం...
మల్లీశ్వరి.
జాజిమల్లి బ్లాగర్.
శారదా శ్రీనివాసన్ గారి సి డి ని తయారు చేసే పని లో ఉన్నాం.
నేనే ఆ బాధ్యత తీసుకున్నాను.
ఈ సీ డి భూమిక ఆఫీసులో దొరుకుతుంది.
అది తయారు అవ్వగానే ఈ బ్లాగ్ లో పొష్ట్ చేస్తాను.
మీరు భూమిక హెల్ప్ లైన్ కి కాల్ చేసి చెబితే మీ అడ్రస్ కి పంపడమో మీరే వచ్చి తీసుకోవడమో చెయ్యొచ్చు.
భూమిక హెల్ప్ లైన్ 1800 425 2908
Post a Comment