Monday, May 14, 2012

అబ్బ! ఎన్ని పొగడ చెట్లు,ఎన్ని పొగడపూలు, ఏమా సువాసనలు.





సెక్రటేరియట్ దగ్గర రైతు బజార్ లో కూరగాయలు కొనడం అంటే నాకు భలే ఇష్టం.
కూరగాయల మీద ప్రేమ కన్నా చుట్టూ ఉన్న పొగడపూల వనం మీదే నా ప్రేమ.
అబ్బ! ఎన్ని పొగడ చెట్లు,ఎన్ని పొగడపూలు, ఏమా సువాసనలు.
ఏమి కొంటున్ననానే దాని మీద నాకసలు స్పృహ ఉండదు.
దృష్టంతా పొగడ చెట్ల మీదే.
ఒక్కరన్నా పచ్చటి చెట్ల వేపు కాసేపు తేరిపారా చూస్తారేమోనని నా కళ్ళు వెతుకుతుంటాయి. ఊహూ! అందరూ ఉరుకులు పరుగుల పందెంలో పోటీ పడుతూ కనిపిస్తారు.
పొగడపూల సువాసనలనైనా వీళ్ళు పీలుస్తారా అనిపిస్తుంది.
అంత ఘాటైన ,మధురమైన సువాసన అక్కడి గాలినిండా కమ్ముకున్నా
అయ్యో ఒక్కరికీ పట్టలేదే అని నాకు బోలెడు బాధ వేస్తుంది.
ఎంత హడావుడి గా ఉన్నా, ఎన్ని పనుల ఒత్తిడి ఉన్న అలా అలవోకగా పచ్చదనం వేపు చూస్తే ఎంత హాయిగా ఉంటుంది.
ఎన్ని అత్తరు బాటిళ్ళు, ఎంత గొప్ప బ్రాండ్ వైనా సరే సహజ సువాసనల్ని ఇవ్వగలుగుతాయి.
నేను రాసింది నమ్మకపోతే ఆప్ లోగ్ చలో సెక్రటేరియట్.







4 comments:

రసజ్ఞ said...

పొగడ పూలనగానే నాకు గుర్తుకొచ్చే ప్రదేశం ద్వారకాతిరుమల. చక్కగా గుడి చుట్టూ ఎన్ని పూలు రాలుతుంటాయో. భలే మత్తైన వాసన వస్తుంది!

కమనీయం said...

you have shown only the trees, not the flowers.please show pogaDa flowers separately.

మాలా కుమార్ said...

ఆ పొగడ చెట్లని నేనూ ఎప్పుడూ చూస్తాను .
టైటిల్ చూడగానే మీ పోస్ట్ అనే అనుకున్నాను :)

సామాన్య said...

ఎంత బాగా చెప్పారో !జీవితం ఉరుకులు పరుగులు కావడం ఒక్కటే కారణం కాదనుకుంటా ,, ,అసలా హృదయం లేక పోవడమే అసలు కారణం .అదే వుంటే అప్పుడు పలకరించిన సువాసనని కలవరపడి అన్వేషిస్తాం కాదంటారా!!

తర్పణాలు త్రిశంకు స్వర్గాలు

 తర్పణాలు, త్రిశంకు స్వర్గాలు ............ మా సీతారాంపురం లో మా తాతకి చాలా పొలాలు ఉండేవి. మా తాత, చిన్న తాత ఇద్దరే పొలాలన్నింటిని పంచుకున్నా...