Posts

Showing posts from July, 2011

నిన్న రాత్రి మా ఇంట్లో మూడు బ్రహ్మకమలాలు పూసాయి.

నిన్న రాత్రి మా ఇంట్లో మూడు బ్రహ్మకమలాలు పూసాయి.


వాటిని వీడియో తీస్తూ నా ఫోటోలు సరదాగా పెట్టాను.

అనంతగిరి కొండల్లోకి అలా అలా.......

Image
అనంతగిరి అంటే వైజాగ్ జిల్లా అరకు దగ్గరి అనంత గిరి అనుకుంటే మీరు మూసిలో కాలేసినట్టే.
నేను రాస్తున్నది రంగారెడ్డి జిల్లా,వికారాబాద్ దగ్గరున్న అంతగిరి గురించి. హైదరాబాద్ కి కేవలం 80 కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ అద్భుతమైన ప్రదేశం. నిన్న అనుకోకుండా అప్పటికప్పుడు అనుకుని అనంత గిరికి ఎగిరిపోయాం నేను నా నేస్తాలు గీత,జయ. జయ నిన్ననే వైజాగ్ నుండి వచ్చింది. ఎటైనా పోదామా ముగ్గురం అనుకుని ఓ పెద్ద కారియర్ కట్టుకుని 10 గంటలకి బయలుదేరాం.నేనే డ్రైవింగ్. మబ్బులు పట్టిన ఆకాశం మాతోనే ప్రయాణం చేసింది. చల్లటి గాలి మమ్మల్ని వదిలితే ఒట్టు. హైదరాబాద్ కి కేవలం 80 కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ అద్భుమైన ప్రదేశం. వికారాబాద్ రోడ్ లో ఓ ప్రత్యేకత ఉంది.రోడ్డుపొడవునా ఊడలు దిగిన మర్రి చెట్ట్లు మనకి పచ్చటి స్వాగత తోరణాలు కట్టి ఆహ్వానిస్తున్నట్టుంటాయ్. ఈ రోడ్డు నాలుగు లేన్లో ఆరు లేన్లో అవ్వకూడదని నేను చాలా బలంగా కోరుకుంటున్నాను. రోడ్డు వెడల్పు ప్రోగ్రాం పెడితే ఈ మర్రి ఊడల సౌందర్యమంతా హుష్ కాకే. సరే! మేము ఈ పచ్చటి రోడ్డుమీద గతుకులు గట్రా ఉన్నప్పటికి రయ్మంటూ దూసుకెళ్ళసాగాం. నేను చాలా ఫాస్ట్ అండ్ రాష్ డ్రైవర్ ని లెండి. చేవెళ్ళ చెల్ల…

జైళ్ళతో నా అనుభవాలు-రెండో భాగం

నేను 2008 లో 40 మంది రచయిత్రులను తీసుకుని ఉత్తరాంధ్ర టిప్ వేసాను.

అప్పుడే పోలీసుల అత్యాచారాలకు గురైన ఆదివాసీ స్త్రీలను కలవడానికి వాకపల్లి వెళ్ళాం.
గంగవరం పోర్ట్ బాధిత గ్రామాలు గంగవరం,దిబ్బపాలెం వెళ్ళి అక్కడి బాధితులను కలిసాం.బాక్సైట్ తవ్వకాలను వీరోచితంగా ఎదిరించిన కాకి దేవుడమ్మను,పాడేరులో కలిసి మాట్లాడాం.
ఆ తర్వాత విశాఖ సెంట్రల్ విజిట్ చేసాం. విశాఖ జైల్ పరిసరాలు చాలా సుందరంగా ఉంటాయిచుట్టూ సిమ్హాచలం కొండల పంక్తి,ఎత్తైన కొండలు,కళ్ళు తిప్పుకోనీయని పచ్చదనంతో కన్నుల పండగ చేస్తుంది.బయట నుండి వెళ్ళిన వారు ఆ సౌందర్యాన్ని ఎంజాయ్ చేస్తాం కానీ ఖైదీలకు ఆ అనందం దొరకదు కదా!!వాళ్ళ కళ్ళల్లో దిగులే ఉంటుంది.
మహిళా జైల్ చూసి ఖైదీలతో మాట్లాడాం.వాళ్ళు వినిపించిన బాధల గాధలు విని రచయిత్రులంతా కన్నీళ్ళు పెట్టుకున్నారు.ఎంతో మంది బయట వదిలేసి వచ్చిన పిల్లల గురించి,తమ బెయిళ్ళ గురించి,తమ కేసుల గురించి చెప్పకున్నారు.
జైలర్ నరశిం హం గారు ఆ రోజు మాకు ఎంతో సహకరించారు.వాళ్ళ ఇంటికి పిలిచి అంతమంది రచయిత్రులను చూసి ఆయన భార్య, తల్లి చాలా సంతోషపడ్డారు.
జీవితంలో మొదటి సారి జైలు కూడు తిన్నాం.జైలు కూడులా లేదనుకోండి.మా కోసం ప్…

ఒంటరి ప్రయాణాల్లో వెల్లువెత్తిన ఆదరణ

Image
ఇంఫాల్లో సమావేశమైన మహిళా జర్నలిస్టులుచాలా మంది ఒంటరిగా కొత్త ప్రదేశాలకి వెళ్ళడానికి భయపడుతుంటారు.
కొత్త ప్రాంతం,కొత్తమనుషులు,ఎవరైనా మోసం చేస్తారనే భయం వెంటాడుతూంటాయి.
కానీ నేను ఎన్నో ప్రాంతాలకి ఒంటరిగా ప్రయాణం చేసాను. చేస్తూంటాను.
నాకు ఎప్పుడూ భయమనిపించలేదు.
ఎంతో కల్లోలిత ప్రాంతమైన మణిపూర్ కి కూడా నేను ఒక్కదాన్ని వెళ్ళాను.
అక్కడికెళ్ళాకా చాలామంది మన రాష్ర్ట్రం వాళ్ళు కలిసారు.
అలాగే భువనేశ్వర్,లక్నో కలకత్తా, కొచ్చిన్.గౌహతి ఇలా ఎన్నో ప్రంతాలు తిరిగాను ఒంటరిగానే.
నిజానికి మనం భయపడినట్టు ఉండదు.
నోట్లో నాలుక ఉండి,నాలుగు ఇంగ్లీషు,హిందీ ముక్కలు వస్తే దేశం మొత్తం చుట్టేసి రావొచ్చు హాయిగా.
నేను 2008 లో మణిపూర్ వెళ్ళాను.జాతీయ స్థాయి మహిళా జరనలిష్టుల సమావేశాల్లో పాల్గోడానికి వెళ్ళాను.ఇంఫాల్ లో నాలుగు రోజులున్నాను.
దానికి సంబంధించిన ట్రావెలోగ్ "ఇంఫాల్ ఎక్ పల్ హసి ఎక్ పల్ ఆశు"పేరుతో ట్రావెలోగ్ రాసాను.
అయితే మణిపూర్ నుంచి షిళ్ళాంగ్ వెళ్ళాం. షిల్లాంగ్‌లోని రెయిన్‌బో హోటల్‌ యజవని హరీష్‌ని గురించి తప్పక రాయలి.అతను చాలా ఎమోషనల్‌గా నన్ను కదిలించాడు. నేను అచ్చం తన చెల్లెలులాగా వున్నానని, కళ్…

రెండు దశాబ్దాల ప్రయాణం

Image
జనవరి 2012కి భూమికకు ఇరవై ఏళ్ళు నిండుతాయి. నా జీవితంలో రెండు దశాబ్దాలు భూమికతోనే పెనవేసుకుపోయాయి. నా ఇంటిపేరు భూమికయ్యింది. భూమిక నాశ్వాసలో భాగమయ్యింది. ఉదయం లేచిందగ్గర నుండి నా తొలి ఆలోచన భూమిక. నిద్రపోయేముందు కలవరపరిచేది భూమిక (హెల్ప్‌లైన్‌ కేసులు) ఇంతగా నాతో కలగలిసిపోయిన భూమిక మూతబడితే…
ఈ ఊహ కూడా నన్ను భయపెడుతుంది. భూమిక పత్రికలోంచి హెల్ప్‌లైన్‌లోకి మొదలైన ప్రయాణం, హెల్ప్‌లైన్‌ ఏర్పాటు భూమికను బలోపేతంచేసిన తీరు నేను తప్పక మననం చేసుకోవాలి. హెల్ప్‌లైన్‌ లేకపోతే పత్రిక మూతపడేదన్నది కఠోరవాస్తవం. ఐదారు సంవత్సరాల క్రితం భూమిక ఆర్థిక పరిస్థితి ఎలా వుందో ఇపుడూ అలాగే వుంది. హెల్ప్‌లైన్‌కి ఆక్స్‌ఫామ్‌ ఆర్థిక సహకారం దొరకడంతో భూమిక బతికిపోయింది. ఇలా ఎక్కువ కాలం జరిగే అవకాశం లేదు.
నిజానికి ఈ రోజు ఒక సంస్థగా భూమిక ఎన్నో కార్యక్రమాలు చేస్తోంది. గృహహింసచట్టం అమలుకోసం ఎన్నో డిపార్ట్‌మెంటులతో కలిసి పనిచేస్తోంది. ఉచిత న్యాయం బాధితులకు అందేలా లీగల్‌ సర్వీసెస్‌ ఆథారిటీతోను, రక్షణాధికారుల వ్యవస్థ సక్రమంగా పన…

ప్రాణమైన గోదావరిమీద ప్రాణ నేస్తంతో షికారు

Image
మా గోదావరంటే నాకు ప్రాణ సమానం.
ప్రాణమైన గోదావరిమీద ప్రాణ నేస్తంతో షికారుకెళితే
కనుచూపుమేరంతా కనువిందు చేసే పచ్చదనం
కోనసీమ కొబ్బరితోటల సౌందర్యం
అల్లంత దూరాన అగుపడే అన్నా చెల్లెలి గట్టు
పోటుమీదున్న సముద్రపు అలలు మా లాంచిని ఉయ్యాలలూగిస్తుంటే
నేను గీత ఎన్ని కబుర్లను కలబోసుకున్నామో1
గోదావరిలోంచి మా ప్రయాణం అంతర్వేది దాకా
అటుపైన అన్నా చెల్లెలి గట్టుదాకా
అన్నంటే సముద్రం చెల్లంటే గోదావరి
రెండు కలిసేచోటునే అన్న చెల్లెల గట్టు అని ఆప్యాయంగా పిలుస్తారు
సముద్రాన్ని పురుషుడితోను,నదుల్ని స్త్రీలతోను ఎందుకు పోలుస్తారో!
నిజానికి వరద గోదావరి మహా బీభత్సంగా ఉంటుంది.
వెన్నెల్లో గోదారి ఎంత ఉద్విగ్నం గా,పరవశం గా ఉంటుందో
వరద గోదారి అంత భయానకంగా ఉంటుంది
మా ప్రయాణం నవ్వుల నదిలో పువ్వుల నావ లా సాగుతూనే ఉంది
మా కబుర్లకు అంతూ పొంతూ లేదు అన్నం నీళ్ళ ధ్యాసే లేదు
గలగల పారుతున్న గోదారిలో మా కబుర్లు కలగలిసిపోతున్నాయ్
కొండ గాలి తిరిగింది గుండె ఊసులాడింది పాట సెల్లోంచి
గోదావరిని చూస్తే గుండె ఊసులాడకుండా ఉంటుందా
అదీ ప్రియనేస్తం పక్కనుంటే ఊసులకేమి కొదువ?
మేమిద్దరం కలిస్టే కబుర్లకేమి లోటు?
అందమైన ఆనాటి ప్రయాణానికి మా ముఖాల్లోలి వెలుగు
అద్దం పడు…

జైళ్ళతో నా అనుభవాలు-మొదటి భాగం

నేను మొదటిసారి 1999 లో రాజమండ్రి సెంట్రల్ జైల్ విజిట్ చేసాను.
అప్పుడు నేను రెవెన్యూ డిపార్ట్ మెంట్ లో పని చేస్తున్నాను.
పశ్చిమ గోదావరి జిల్లాలోని యలమంచిలి మండలం లో మండల రెవెన్యూ ఆఫీసర్ గా పని చేస్తున్నాను.
ఆ ఉద్యోగానికి రిజైన్ చేసాలెండి.
చిలకలూరిపేట బస్సు దహనం కేసు మీకు గుర్తు ఉండే ఉంటుంది.
1993 మార్చి 8 న చలపతి,విజయవర్ధనం అనే ఇద్దరు దళిత యువకులు చిలకలూరి పేట నుంచి హైదరాబాద్ వస్తున్న బస్సులో దోపిడీ చెయ్యడానికి ప్రయత్నించి పెట్రోల్ పొయ్యడం వల్ల బస్సు తగలబడి చాలామంది సజీవ దహనమయ్యారు.అదో భయానక సంఘటన.అప్పట్లో ఎంతో సంచలనం కల్గించిన ఘోరమైన నేరం.
ఈ కేసులో ముద్దాయిలైన చలపతి,విజయవర్ధనం లకు కోర్టు మరణ శిక్ష విధించింది.
వాళ్ళు చేసింది ఘోరమే.కాని మరణ శిక్ష పరిష్కారం కాదు.
అప్పట్లో మరణ శిక్షలకు వ్యతిరేకంగా పనిచేస్తున్న ఒక గ్రూప్ లో నా మితృరాలు ఉండడం,వాళ్ళు మరణశిక్షలకు వ్యతిరేకంగా ఒక డాక్యుమెంటరీ ఫిల్మ్ తీస్తుండడం వల్ల నేను కూడా వాళ్ళతో కలిసి మరణ శిక్షలు పడ్డ చలపతి,విజయవర్ధనం లను కలిసి వాళ్ళ ఇంటర్యూలను తీసుకోవడానికి రాజమండ్రి సెంట్రల్
జైలుకెళ్ళేం.
వాళ్ళని ఇంటర్యూ చెయ్యడం,వాళ్ళ వర్షన్ ని వినడం, దాన…

ఈ సీజన్ కి మొదటి బ్రహ్మకమలం

Image
విచ్చుకుంటున్న పువ్వు ఇది

ఈ సీజన్ కి మొదటి బ్రహ్మకమలం నేను ఈ పోష్ట్ రాస్తున్నపుడు విచ్చుకుంటోంది.
ఆ వాసనలు ఇక్కడివరకూ వ్యాపిస్తున్నాయ్.
పదుల్లో మొగ్గలు వచ్చాయి.


2003 లో మొదటి సారి మా ఇంట్లో పూసిన పువ్వు ఇది.