జైళ్ళతో నా అనుభవాలు-రెండో భాగం

నేను 2008 లో 40 మంది రచయిత్రులను తీసుకుని ఉత్తరాంధ్ర టిప్ వేసాను.

అప్పుడే పోలీసుల అత్యాచారాలకు గురైన ఆదివాసీ స్త్రీలను కలవడానికి వాకపల్లి వెళ్ళాం.
గంగవరం పోర్ట్ బాధిత గ్రామాలు గంగవరం,దిబ్బపాలెం వెళ్ళి అక్కడి బాధితులను కలిసాం.బాక్సైట్ తవ్వకాలను వీరోచితంగా ఎదిరించిన కాకి దేవుడమ్మను,పాడేరులో కలిసి మాట్లాడాం.
ఆ తర్వాత విశాఖ సెంట్రల్ విజిట్ చేసాం. విశాఖ జైల్ పరిసరాలు చాలా సుందరంగా ఉంటాయిచుట్టూ సిమ్హాచలం కొండల పంక్తి,ఎత్తైన కొండలు,కళ్ళు తిప్పుకోనీయని పచ్చదనంతో కన్నుల పండగ చేస్తుంది.బయట నుండి వెళ్ళిన వారు ఆ సౌందర్యాన్ని ఎంజాయ్ చేస్తాం కానీ ఖైదీలకు ఆ అనందం దొరకదు కదా!!వాళ్ళ కళ్ళల్లో దిగులే ఉంటుంది.
మహిళా జైల్ చూసి ఖైదీలతో మాట్లాడాం.వాళ్ళు వినిపించిన బాధల గాధలు విని రచయిత్రులంతా కన్నీళ్ళు పెట్టుకున్నారు.ఎంతో మంది బయట వదిలేసి వచ్చిన పిల్లల గురించి,తమ బెయిళ్ళ గురించి,తమ కేసుల గురించి చెప్పకున్నారు.
జైలర్ నరశిం హం గారు ఆ రోజు మాకు ఎంతో సహకరించారు.వాళ్ళ ఇంటికి పిలిచి అంతమంది రచయిత్రులను చూసి ఆయన భార్య, తల్లి చాలా సంతోషపడ్డారు.
జీవితంలో మొదటి సారి జైలు కూడు తిన్నాం.జైలు కూడులా లేదనుకోండి.మా కోసం ప్రత్యేకంగా చేయించారు అని తెలిసిపోయింది.
మా కోసం నావి వారి సంగీత ప్రోగ్రాం ఏర్పాటు చేసారు.
మొత్తానికి తెలుగు దేశం లో ప్రసిద్ధులెన నలభై మంది రచయిత్రులతో కలిసి చేసిన ఆ సాహితీ యాత్ర అనుభవాలు అద్భుతం.
ముఖ్యంగా విశాఖ జైలు సందర్శనం.Comments

మీ జైలు సందర్శనం గురించి ఇంకా వివరంగా వ్రాసి వుండాల్సింది.
శరత్ గారు చెప్పినట్టే అండి..
కాస్త వివరం గా రాయల్సిన్దండి.

ఇంకా ఈ సిరీస్ లో పోస్ట్ లు వున్నాయ్ కదండి.కుదిరితే కాస్తంత వివరం గా రాయండి.

Popular posts from this blog

‘వైధవ్యం’ – రసి కారుతున్న ఓ రాచపుండు

అమ్మ...అమెరికా

అశోకం