Saturday, July 16, 2011
ఒంటరి ప్రయాణాల్లో వెల్లువెత్తిన ఆదరణ
ఇంఫాల్లో సమావేశమైన మహిళా జర్నలిస్టులు
చాలా మంది ఒంటరిగా కొత్త ప్రదేశాలకి వెళ్ళడానికి భయపడుతుంటారు.
కొత్త ప్రాంతం,కొత్తమనుషులు,ఎవరైనా మోసం చేస్తారనే భయం వెంటాడుతూంటాయి.
కానీ నేను ఎన్నో ప్రాంతాలకి ఒంటరిగా ప్రయాణం చేసాను. చేస్తూంటాను.
నాకు ఎప్పుడూ భయమనిపించలేదు.
ఎంతో కల్లోలిత ప్రాంతమైన మణిపూర్ కి కూడా నేను ఒక్కదాన్ని వెళ్ళాను.
అక్కడికెళ్ళాకా చాలామంది మన రాష్ర్ట్రం వాళ్ళు కలిసారు.
అలాగే భువనేశ్వర్,లక్నో కలకత్తా, కొచ్చిన్.గౌహతి ఇలా ఎన్నో ప్రంతాలు తిరిగాను ఒంటరిగానే.
నిజానికి మనం భయపడినట్టు ఉండదు.
నోట్లో నాలుక ఉండి,నాలుగు ఇంగ్లీషు,హిందీ ముక్కలు వస్తే దేశం మొత్తం చుట్టేసి రావొచ్చు హాయిగా.
నేను 2008 లో మణిపూర్ వెళ్ళాను.జాతీయ స్థాయి మహిళా జరనలిష్టుల సమావేశాల్లో పాల్గోడానికి వెళ్ళాను.ఇంఫాల్ లో నాలుగు రోజులున్నాను.
దానికి సంబంధించిన ట్రావెలోగ్ "ఇంఫాల్ ఎక్ పల్ హసి ఎక్ పల్ ఆశు"పేరుతో ట్రావెలోగ్ రాసాను.
అయితే మణిపూర్ నుంచి షిళ్ళాంగ్ వెళ్ళాం. షిల్లాంగ్‌లోని రెయిన్‌బో హోటల్ యజవని హరీష్‌ని గురించి తప్పక రాయలి.అతను చాలా ఎమోషనల్‌గా నన్ను కదిలించాడు. నేను అచ్చం తన చెల్లెలులాగా వున్నానని, కళ్ళు, ముక్కుతీరు తన చెల్లెల్ని గుర్తుకు తెస్తోందని చెబుతూ మా గురించి వివరాలు అడిగి, హెల్ప్‌లైన్ గురించి విని ఆశ్చర్యపోయాడు. ఇక్కడ ఎవరూ అలా పని చెయ్యరని, తనకి లా ఫామ్ పెట్టాలని వుందని మీరు హెల్ప్ చేస్తరా అని అడిగాడు. మాకు గౌహతిలో చౌకగా మూడు నక్షత్రాల హోటల్‌లోరూమ్‌లు మాట్లాడి పెట్టాడు. హైదరాబాద్ వచ్చాక రెండు సార్లుమాట్లాడాడు. 'బెహాన్! ఆప్ ఫిర్ కబ్ ఆరే షిల్లాంగ్' అంటూ ఆప్యాయంగా మాట్లాడే హరీష్,
గౌహతిలో నన్ను తన ఆటోలో కూర్చోబెట్టుకుని,కామాఖ్య కొన్డ మీదకి,బ్రహ్మపుత్ర నది మీదకి పడవ శికారుకి తీసుకెళ్ళి,నగరమన్తా తిప్పి చూపిన్చి భద్రమ్గా నన్ను ఎయిర్ పోర్ట్ లో దిన్చిన ఆటో వాలా కమల్ భాయ్,
ఇప్పుడు నేను కమల్ భాయ్ గురించి కొంత రాయాలి.
నాతో ఉన్న వాళ్ళు కాజీ రంగా నేషనల్ పార్క్ చూడ్డానికి వెళ్ళి పోయారు.
నేను ఒక్కదాన్ని గౌహతిలో ఉండిపోయాను. ఆరోజు సాయంత్రం నా ఫ్లైట్ ఉంది.
ఆరోజు గౌగతి అంతా చూద్దమనిపించింది.
హోటల్ రూం ఖాళీ చేసేసి సూట్కేస్ తో సహా రోడ్డున పడ్డాను.
ఆటో మాట్లాడుకుని ఆ రోజంతా దానిలోనే తిరిగాను.కమల్ నాతోనే తిన్నాడు.నాతోనే తిరిగాడు.నేను షాపింగ్ కి వెళితే నా సామాను జాగ్రత్తగా చూసాడు.సామాను తీసుకుని పారిపోతాడేమో అనే ఆలోచన కూడా నాకు రాలేదు.
ఒకవేళ తెసుకెళ్ళినా చేసేదేమీ లేదు పోతే ఏంపోతాయిలే.కొన్ని బట్టలు,పుస్తకాలేగా అనుకున్నాను.
ఎంత జాగ్రత్తగా ఆరోజు నన్ను చూసుకున్నాడో చెప్పలేను.
నాకెప్పుడూ కమల్ గుర్తొస్తూంటాడు.
ఆ రోజంతా అతన్ని కమల్ భాయ్ అనే పిలిచాను.
నాకు నా ఒంటరి ప్రయాణాల్లో ఇలాంటి వాళ్ళు ఎందరో కలిసారు.
వాళ్ళని తలుచుకుంటే మనసుకు హాయిగా ఉంటుంది.
Subscribe to:
Post Comments (Atom)
తర్పణాలు త్రిశంకు స్వర్గాలు
తర్పణాలు, త్రిశంకు స్వర్గాలు ............ మా సీతారాంపురం లో మా తాతకి చాలా పొలాలు ఉండేవి. మా తాత, చిన్న తాత ఇద్దరే పొలాలన్నింటిని పంచుకున్నా...
-
-కొండవీటి సత్యవతి తెలుగు పత్రికలకు నూట యాభై సంవత్సరాల చరిత్ర ఉంది. మొదటి తెలుగు పత్రిక ఎప్పు...
-
అక్టోబరు 20 యావత్ భారతదేశంలోని మహిళల్ని గాయపర్చిన దినం. కించపరిచిన, అవమానపరిచిన దినంగా ఈ కంఠంలో ప్రాణం వున్నంతకాలం గుర్తుండిపోతుంది. ఎవరో ...
1 comment:
మంచి అనుభవం..పంచుకున్నారు. బాగుంధి.. మేడం. మనుషుల్లో..మంచితనం ఉంటుంది..ఇంకా ఉంది..కూడా.. అనిపిస్తుంది.చాలా రొజులుగా మీ బ్లాగ్ చూడటం మిస్ అవుతున్నాను.ఈ.. రోజు ..మీ పక్కనే ఉన్నట్లు ..మీరు చెబుతుంటే .. నేను వింటున్నట్లు ఉంది. ధన్యవాదములు
Post a Comment