Posts

Showing posts from August, 2013

ఇది నా ఆచరణ

ఫేస్ బుక్ లో ఈ రోజు పూజలు,వ్రతాలూ,నోముల గురించి నేను రాసినవి చదివి చాలా మంది మెచ్చుకున్నారు,కొంతమంది నొచ్చుకున్నారు.
కొంతమంది మీరు చెయ్యకపోతే మానెయ్యండి కానీ వేరేవాళ్ళని మానమని చెప్పకండి అని కోప్పడ్డారు.
కానీ.... నేను చెయ్యదలుచుకున్నవి..చెప్పదలుచుకున్నవి చేసి తీరతాను.
నేను సైన్స్ చదువుకోలేదు(ఓరియంటల్ టెంత్ క్లాస్) కానీ శాస్త్రీయ దృక్పధం ఏర్పర్చుకున్నాను.
ఇంటర్మీడియెట్ చదువుతున్నప్పటి నుండి నేను నాస్తికత్వం జీవన విధానం గా మార్చుకున్నాను.
మాయలు,మంత్రాలూ లేవంటూ నిప్పుల మీద నడిచాను.
నాకు నాతో పాటు బతికే మనిషి ముఖ్యం.మానవీయ కోణం ముఖ్యం.
ఈ సమాజం లో స్త్రీలు ఎక్కువ సమస్యలతో బతుకుతున్నారు,బాధపడుతున్నారు, కాబట్టి స్త్రీల అంశాల మీద పని చేస్తున్నాను.ఈ పని చెయ్యడం కోసం నా ప్రభుత్వ ఉద్యోగాన్ని(తాహసిల్దార్) 2000 లో వదిలేసాను.
నా జీవితాన్ని నేనే నిర్మించుకున్నాను.నా అస్తిత్వాన్ని నేనే వెతికి పట్టుకున్నాను.
నాకు నా పని పట్ల గొప్ప గౌరవం, ప్రేమ ఉన్నాయి.నేను చేసే పని నాకు గొప్ప తృప్తినిస్తుంది.సంతోషాన్నిస్తుంది.
నేను ప్రకృతి ప్రేమికురాలను.పచ్చదనం నా జీవితమంతా అల్లుకుని ఉంది.
జనాలు,వస్తువుల చుట్టూ,బంగారాల చుట్టూ,డబ…

ఈ ఆదివారం జ్యేష్టపౌర మితృలతో......

Image
ఈ రోజు ఫ్రెండ్ షిప్ డే
నేను నా నేస్తాలెవ్వరినీ కలవలేదు
కానీ...నాకెంతో ఇష్టమైన జ్యేష్టపౌర మితృల్ని మాత్రం కలిసాను.
రోజంతా వాళ్ళతోనే గడిచింది.
సి ఆర్ ఫౌండేషన్ లో అబ్బూరి చాయాదేవిగారు,వారి మితృలతో ఉదయం గడిచింది.
మధ్యాహ్నం దాదాపు నాలుగు గంటలు కొడవటిగంటి కుటుంబరావు గారి సహచరి వరూధిని గారితోను,వారి కూతురు శాంత సుందరి గారితోను
గడిచింది.
వరూధిని గారు నేను ఎన్నో విషయాలు మాట్లాడుకున్నాం.కడుపుబ్బ నవ్వుకున్నాం.
ఆవిడ మాటలు చాలా పదునుగా ఉంటాయి.సూటిగా ఉంటాయ్.
వరూధిని గారు ఎలా ఉన్నారు అంటే మెగా సీరియల్ లాగా ఉన్నాను అన్నారు ఠక్కున.
అలాంటి చెణుకులు ఎన్నో ఉంటాయి వారి మాటల్లో.
తన వయస్సు 86. అయినా ఎంతో చురుకుగా,ఉత్సాహంగా ఉంటారు.
ఆవిడ మాట్లాడుతుంటే సర్వం మర్చిపోయి,చీకటి పడింది ఇంటికెళ్ళాలన్న ధ్యాస లేకుండా
ఆవిడ ఎదురుగా కూర్చుని మంత్రముగ్ధనై విన్నాను.
రోజంతా జ్యేష్టులతో గడవడం నాకో అద్బుతమైన అనుభవం.(11 photos)

కర్నూల్,కర్నూల్ చుట్టుపక్కల ఉన్న మితృలకు ఓ విన్నపం.

ఫ్రెండ్స్

అందరికీ ముఖ్యంగా 
కర్నూల్,కర్నూల్ చుట్టుపక్కల ఉన్న మితృలకు ఓ విన్నపం.
కర్నూల్ లో మాకు ఓ ఇల్లుంది.
ఆ ఇల్లు కేంద్రంగా ఏవైనా సేవా కార్యక్రమాలు చేపట్టాలని చాలా కాలంగా అనుకుంటున్నాం నేను నా సహచరుడు.
ఒక ట్రస్ట్ కూడా మొదలు పెట్టి కొన్ని గ్రామాల్లో జ్యేష్ట పౌరులకు భోజనం పెట్టే కార్యక్రమం మొదలు పెట్టాం.
అది ఇంకా సమగ్రమైన రూపం తీసుకోలేదు.
కర్నూల్ లో మా ఇల్లు పెద్దగానే ఉంటుంది,ఖాళీగా ఉంది.
నేను వారం లో రెండు రోజులు కర్నూల్ లో గడపాలని నిర్ణయించుకున్నాను.
ఇక్కడ హైదరాబాద్ లో భూమిక పత్రిక,హెల్ప్ లైన్ కార్యక్రమాలు యధావిధిగానే నడుస్తాయి.
ముందు గా మా ఇల్లున్న కాలనీలో ఒక గ్రంధాలయం మా ఇంట్లోనే మొదలుపెట్టి క్రమంగా కార్యక్రమాలు విస్తరించాలని ప్రయత్నం.
ప్రస్తుతం మా డబ్బుతోనే మొదలు పెడుతున్నాం.
ఇంకా ఎలాంటి కార్యక్రమాలు చేస్తే బావుంటుందో మితృలు సలహాలు,సూచనలు ఇవ్వాలని కోరుతున్నాను.
మా ఇల్లు కర్నూల్,తిరుపతి హైవే మీద,మారుతి మెగా సిటి లో ఉంది.
ఎదురుగా అందమైన జగన్నాధ కట్ట/గుట్ట ఉంటుంది.
సెప్టెంబర్ 5 నేను నా సహచరుడు కలిసి బతకడం మొదలుపెట్టిన రోజు.
ఆ రోజు నుండే మా సేవా కార్యక్రమం మొదలు పెట్టాలని నా కోరిక.
సో.... ప్లీజ్ ...ర…

‘ఆమ్లం’ ఆయుధమైన వేళ…. ‘సుప్రీమ్‌ కోర్టు తీర్పు’

జూలై 16న యాసిడ్‌ అమ్మకాలకు సంబంధించి సుప్రీమ్‌ కోర్టు వెలువరించిన తీర్పు చదివాక నా మనసులో ఒక దుఃఖ కెరటం ఎగిసిపడి, కళ్ళల్లోకి ప్రవహించింది. స్వప్నిక, ప్రణీత, అనురాధ, పేర్లు తెలియని ఇంకెందరో యాసిడ్‌ బాధిత స్త్రీలు గుర్తొచ్చారు. మన మధ్య లేకుండాపోయిన స్వప్నిక, మన మధ్య వుంటూనే యాసిడ్‌ గాయాలను మోసుకుంటూ తిరుగుతున్న ప్రణీత లాంటి వాళ్ళు నీళ్ళు నిండిన కళ్ళకి అస్పష్టంగా కనబడుతున్నారు. ఉదాత్తమైన, కడురమణీయమైన ‘ప్రేమ’ భావన ఇంతటి వికృత రూపాన్ని తీసుకోవడం భరింపశక్యం కాకుండా వుంది. యాసిడ్‌ లాంటి ప్రమాదకర రసాయనంతో దాడిచేసే కొంతమంది పురుషుల కౄరత్వం – అదీ తాము ప్రేమించామని చెప్పుకునే వారిపట్ల, ఎంత అమానుషమైందో వేరే చెప్పనవసరం లేదు.

స్పప్నిక, ప్రణీతల మీద యాసిడ్‌ దాడి జరిగిన వెంటనే నిందితుల్ని పోలీసులు ఎన్‌కౌంటర్‌ చేసి చంపేసినప్పటికీ మన రాష్ట్రంలో వరుసగా యాసిడ్‌ దాడులు జరిగాయి. ఈ దాడులకు వ్యతిరేకంగా 2009లో భూమిక రాష్ట్రస్థాయిలో ఒక సమావేశం నిర్వహించి, అప్పటి హోమ్‌ మినిష్టర్‌ సబితా ఇంద్రారెడ్డిని ఆహ్వానించడం జరిగింది. యాసిడ్‌ లభ్యతల మీద ఆంక్షలు విధించాలని, బాధితులకు తగురీతిన నష్టపరిహారం చెల్లించాలని, నేరాన్ని…