ఫేస్ బుక్ లో ఈ రోజు పూజలు,వ్రతాలూ,నోముల గురించి నేను రాసినవి చదివి చాలా మంది మెచ్చుకున్నారు,కొంతమంది నొచ్చుకున్నారు.
కొంతమంది మీరు చెయ్యకపోతే మానెయ్యండి కానీ వేరేవాళ్ళని మానమని చెప్పకండి అని కోప్పడ్డారు.
కానీ.... నేను చెయ్యదలుచుకున్నవి..చెప్పదలుచుకున్నవి చేసి తీరతాను.
నేను సైన్స్ చదువుకోలేదు(ఓరియంటల్ టెంత్ క్లాస్) కానీ శాస్త్రీయ దృక్పధం ఏర్పర్చుకున్నాను.
ఇంటర్మీడియెట్ చదువుతున్నప్పటి నుండి నేను నాస్తికత్వం జీవన విధానం గా మార్చుకున్నాను.
మాయలు,మంత్రాలూ లేవంటూ నిప్పుల మీద నడిచాను.
నాకు నాతో పాటు బతికే మనిషి ముఖ్యం.మానవీయ కోణం ముఖ్యం.
ఈ సమాజం లో స్త్రీలు ఎక్కువ సమస్యలతో బతుకుతున్నారు,బాధపడుతున్నారు, కాబట్టి స్త్రీల అంశాల మీద పని చేస్తున్నాను.ఈ పని చెయ్యడం కోసం నా ప్రభుత్వ ఉద్యోగాన్ని(తాహసిల్దార్) 2000 లో వదిలేసాను.
నా జీవితాన్ని నేనే నిర్మించుకున్నాను.నా అస్తిత్వాన్ని నేనే వెతికి పట్టుకున్నాను.
నాకు నా పని పట్ల గొప్ప గౌరవం, ప్రేమ ఉన్నాయి.నేను చేసే పని నాకు గొప్ప తృప్తినిస్తుంది.సంతోషాన్నిస్తుంది.
నేను ప్రకృతి ప్రేమికురాలను.పచ్చదనం నా జీవితమంతా అల్లుకుని ఉంది.
జనాలు,వస్తువుల చుట్టూ,బంగారాల చుట్టూ,డబ్బు సంపాదనల చుట్టూ దేవుళ్ళ చుట్టూ ప్రదక్షిణలు చేస్తే నేను చెట్ల చుట్టూ,కొండల చుట్టూ,అడవుల చుట్టూ,నీళ్ళ చుట్టూ తిరుగుతుంటాను.అందులోనే నాకు గొప్ప ఆనందం దొరుకుతుంది.
నాకు అద్భుతమైన స్నేహితున్నారు.నన్ను గుండెల్లో నిలుపుకున్న నేస్తాలున్నారు.నా చుట్టూ ఎప్పుడూ ఉండేవి ప్రకృతి,ప్రియ నేస్తాలు.
వీళ్ళిచ్చే ఆనందం ముందు అన్నీ బలాదూర్.
నేనెప్పుడూ గతం లోను,భవిష్యత్తులోను బతకను.
నిన్న జరిగినదాని గురించి చింతిస్తూ,రేపు ఏం జరగబోతోందో అన్న భయం లో నేనెప్పుడూ బతకను.నా ముందున్న క్షణాలు మాత్రమే నావి.ప్రస్తుతం లో బతకడం నాకిష్టం.ఆనందం,సంతోషం ఇంకెక్కడో ఉంటాయని,ఎప్పుడో హఠాత్తుగా ఊడిపడతాయని నేను నమ్మను.అవెప్పుడూ మన చుట్టూనే ఉంటాయి.వాటిని గుర్తించడమే మనం చెయ్యాల్సింది.
నాకు చావు పట్ల భయం లేదు.చనిపోతే కాలిస్తే బూడిదౌతాం,పాతిపెడితే మట్టిలో కలిసిపోతాం. అంతే.దాన్ని మించి మరేమీ లేదు.ఆత్మలు,స్వర్గాలు,నరకాలు అన్ని మానవ సృష్టి.మగవాళ్ళ కోసం రంభా ఊర్వశి తదితరులని స్వర్గంలో సిద్ధం చేసి,ఆడవాళ్ళకి మాత్రం ఏడేడు జన్మలకి వీడే భర్త అని చెప్పడం లోనే స్వర్గం భండారం బయటపడుతుంది.కాబట్టి వీటిని నేను నమ్మను.
నాకు జీవితం పట్ల భయం లేదు,అభద్రత అసలే లేదు.
నాకు కోరికలూ ఎక్కువగా లేవు.నాది చాలా సింపుల్ జీవితం.
నాకు అవి కావాలి,ఇవి కావాలి అనే గొంతెమ్మ కోరికలు లేవు కాబట్టి ఎవరి ముందో చేతులెత్తి దణ్ణం పెట్టి దేబిరించాల్సిన పని అస్సలు లేదు.
నాకు కోరికలుంటే నేనే తీర్చుకోవాలి కాని ఎవరో తీర్చాలని ఆశించను.
ఆత్మవిశ్వాసం,ఆత్మగౌరం నాకు పెట్టని ఆభరణాలు.నాకు నగల మీగ మోజు లేదు కానీ ఈ రెండు నాకు ప్రాణ సమానాలు.
ఇవన్ని చదివి ఈమెకి తలపొగరెక్కువ,అహంకారం ఎక్కువ అని మీరు అనుకునే ప్రమాదం ఉంది.
ఆ రెండు నాకు లేవండి.
నాకు జీవితం పట్ల భయం లేదని చెప్పాను కదా!!ఎక్కడైనా నేను హాయిగా బతికెయ్యగలను.
నాకు పెద్దగా సౌకర్యాలూ అక్కరలేదు.
చన్నీళ్ళు స్నానం చెయ్యగలగదం,ఎక్కడ ఏది దొరికితే అది తినగలగడం,నేలమీదైనా హాయిగా పడుకోగలగడం నాకు వెన్నతో అబ్బిన విద్యలు.
అందుకే నాకు జీవితం పట్ల భయం లేనిది.అలాగే నాకు జీవితం పట్ల కంప్లైంట్స్ కూడా లేవు.
చెయ్యగలిగినంత కాలం పనిచెయ్యాలి,సజాజం తో ముడిపడి ఉండాలి,రాయగలిగినంత కాలం రాయాలి ఇవే నా జీవిత లక్ష్యాలు.
వస్తు ప్రేమల్లోంచి,వ్యక్తి ప్రేమల్లోంచి విముక్తమై విశ్వ ప్రేమవైపు,ప్రకృతి ప్రేమ వైపు మళ్ళాలన్నదే నా అంతిమ లక్ష్యం.

1 comment:
ఆత్మవిశ్వాసం, ఆత్మ గౌరవం మీ ఆభరణాలు-- అవునండీ! ఎవరికైనా ఇంతకూ మించిన ఆభరణాలు ఉండనే ఉండవు. పైకి వేసుకొనేవన్ని గొప్పలు చెప్పుకోవడానికో, ఆత్మ న్యూనతా భావం తోనే కానీ- వారిలో మీరు చెప్పిన లక్షణాలు కనబడవు. వీటిలో పది అవి అంతరించి పోతూ ఉంటాయి. మీ అభిప్రాయాలూ తెలుసుకొని చాలా గర్వంగా అనిపించింది. నాలో నేను (కొన్ని విషయాలలో) తొంగి చూసుకున్నట్టయ్యింది. మీరు మీలాగే ఉండాలి. మీకు ఈ విజ్ఞత, సంస్కారం, ధైర్యం కలగడంలో మీ తల్లిదండ్రల పాత్ర ఉంది ఉంటుందనుకుంటాను కొంత వరకైనా! మీకు గల స్నేహబంధాలు ఖచ్చితంగా మీ ఆశయాలకు బాల చేకూర్చేవే అనుకోండి. ధన్యవాదాలు. మీ బ్లాగుకు ఇదే రావడం. మిగతా వ్యాసాలు అన్నీ చదువుతాను. నా బ్లాగు వీలయితే చూడండి. ముఖ్యంగా కింది లింకు లోని నా సొద.
http://gksraja.blogspot.in/2011/04/blog-post_18.html
Post a Comment