మా లియో గాడి మరిన్ని ఫోటోలు


బెంగళూరు నుంచి బస్సెక్కి మా ఇంటికొచ్చిన లియో ఇదే.

బహు అల్లరిది.

మా ఇంట్లో ఇప్పటికే ఉన్న హాయ్ ని తరిమి తరిమి ఏడిపిస్తుంది.

అది వచ్చిన రోజు పావురాలు, కోడి పిల్లలూ క్యూ కట్టి మరీ దాన్ని చూసాయి.

కోడి పుంజు వేపు నదురు బెదురు లేకుండా ఎలా చూస్తోందో చూడండి.

హాయి వేపు కూడా నీ సంగతేంటి అన్నట్టు చూస్తోంది.

నా ముక్కు,చెవులు దానికి ఆటవస్తువులు.

నేరేడు పళ్ళల్లాగా నిగనిగలాడే కళ్ళు,చప్పిడి ముక్కు,ఊ అంటే వెక్కిరించే నాలుక.

నలభై రోజుల పిల్ల.

సరదా మూడ్ లో ఉంటే ముద్దులు,కోపంగా ఉంటే కొరుకుళ్ళు అదే పని దానికి.

వచ్చిన రోజు ముద్దుగా ఉందని ఎత్తుకుంటే కసుక్కున ముక్కు మీద ముద్రేసింది.

లవ్లి డాగ్.నా టైమంతా తినేస్తోంది.


Comments

Indian Minerva said…
ఇపుడు మీరనెదేంటండీ?కుక్క(పిల్ల)కి కోడిపుంజంటే భయమూ బెరుకూ వుండాలా? :D

ఈ పగ్గుల్లో ఏముందో నాకస్సలు అర్ధంకాదు ఏ పిల్లినో,కుందేలునో పెంచుకోవచ్చుకదా? ఎంచక్కా softగా వుంటాయి అనిపిస్తుంది నాకు.
blogger said…
daani photo back side tesarentandi. e sari o machi phose lo unnapudu pic teesi blog lo pettandi :D
Vamsi said…
Entaku konnarandi.
Vamsi said…
entaku konnarandi
Vamsi said…
entaku konnarandi
Satyavati said…
లియో గాడిని కొనలేదండి.
ఫ్రెండ్స్ పంపారు.వాళ్ళ ఇంట్లో ఐదు పిల్లలు పుట్టాయట. మాకు ఒకటి ఇచ్చారు.
blogger said…
oooo chooooooo cheeeeeewt... pina me 2 dogs chupulu kalasina subhavela super pic
seolol said…
Клево Мопс!
У меня французский боксер.

I have french boxer :)

Popular posts from this blog

‘వైధవ్యం’ – రసి కారుతున్న ఓ రాచపుండు

అమ్మ...అమెరికా

అశోకం