మడిషన్నాకా రోగమూ వస్తుంది రొష్టూ వస్తుంది.సత్యసాయి దీనికి అతీతుడు కాదు.

85 సంవత్సరాలు నిండాకా మనిషి గుండె,ఊపిరితిత్తులు బలహీనంగానే ఉంటాయి కదా!
ఎంత దేవుడని మీరు మొత్తుకున్నా ఆయన మనిషేకాబట్టి ఆసుపత్రిలో పెట్టాల్సిందే.వైద్యం చెయ్యాల్సిందే.
దేవుళ్ళని పిలిచిన ఎంత మంది దయనీయంగా చనిపోలేదు.
ముమ్మిడివరం బాల యోగి మరణం ఎంత హృదయవిదారకమో మర్చిపోయారా.
మంగమ్మవ్వ ఇంకా జైల్లోనే ఉందనుకుంటాను.,జిళ్ళెళ్ళమూడి అమ్మ
దొంగనోట్ల చలా మణి లో దొరికిపోలేదా??
వయస్సు మీద పడినపుడు  అందరిలా మోకాళ్ళ నొప్పులొస్తాయి,చక్రాల బండి అవసరమౌతుంది.
మూత్రపిండాలు సరిగా పనిచెయ్యకపోతే డయాలసిస్ చెయ్యల్సి ఉంటుంది.
గుండె పనిషెయ్యకపోతే పేస్ మేకర్ పెట్టాలి.
శ్వాస సరిగ్గా ఆడకపోతే ఆక్సిజన్ పెట్టాలి.
ఇవన్ని మనిషి అనారోగ్యం పాలైతే పెట్టి తీరాలి.
సత్య సాయి మమూలు మనిషే కాబట్టి ఇవన్ని అవసరమయ్యాయి.
పుట్టిన మనిషి మరణించక తప్పదు కదా.ఈయన మాత్రం దీనికి అతీతుడేలా అవుతాడు???
నీళ్ళిచ్చాడు,వైద్య సదుపాయాలిచ్చాడు,ఇంకేమోచేసాడు అంటే కుప్ప పడిన కోట్ల రూపాయలను ఏదో ఒకటి చెYYఆలి కదా!

గాల్లోంచి వాచీలు,వేళ్ళల్లోంచి విభూది పిసి సర్కార్ కూడా సృష్టించగలడు.ఇంకా ఎన్నో అద్బుతాలు చెయ్యగలడు
నిన్నటిదాకా క్రికెట్ మోత,ఇప్పుడేమో ఈయన మోత.
దేశంలో ఇంకేమీ సమస్యల్లేనట్టు ఏ పిచ్చి పడితే ఆ పిచ్చిలోనే మునితేలుతున్న తెలుగుచానళ్ళకు బలవ్వడం తప్ప ఈ ఉగాదిపూట ఇంకేం చెయ్యగలం చెప్పండి.

Comments

కమల్ said…
గొర్రెలు..బాబోయి గొర్రెలు..మన సాంప్రాదాయం అదే కదండి.
anitha said…
దెవుడు చావకుడదని వెరె దెవునికి మొక్కాలంట
Praveen Sarma said…
ఒక మనిషి గారడీ విద్యలు నేర్చుకుని ప్రదర్శిస్తే అతను దేవుడని నమ్మేసే స్థాయిలో జనం ఉన్నారు. సరే, సైన్స్ గురించి తెలిసినవాళ్లు నమ్మే మూఢ నమ్మకాలు కూడా ఉన్నాయి. ఈ లింక్ దర్శించండి: http://radicalfeminism.stalin-mao.in/48424873 విచిత్రం ఏమిటంటే జనంలో మూఢ నమ్మకాలని నిర్మూలించాల్సిన రాజకీయ నాయకులే మూఢ నమ్మకాలని నమ్మడం. మాజీ డిజిపి హెచ్.జె.దొర సత్యసాయిబాబా కాళ్లు మొక్కేవాడు, అతను సత్యసాయి కార్‌ని స్వయంగా డ్రైవ్ చేసేవాడు.
సత్యవతి గారూ ... మీరు సూపరండి బాబూ
@ అనిత గారు
>> దెవుడు చావకుడదని వెరె దెవునికి మొక్కాలంట

మీ కామెంట్ సూపరో సూపరు
INTHYD said…
Superb....Maam,
I Don't Think He is A Bigg Cheater,Gambler......
HE is the Nominee Person For The Black Money which is deposited by Our Politicians,and BIGShots.................**

Anantapur Dist. ki Chaala ekkuva Panulu chesaadantunnaru..(**I'm not from ANANTAPUR).

** Ivalo, Repo........POyevarigurinchi....mana time waste cheskovatam..
*** Enta Moorkhulu leka pote Ivala (05/04/2011) EENADU main Page choodandi, There U will Find....Some Hundreds Of "PIcha Bhaktulu".....
*** Finally....
@ satyavati garu, Chaala Baaga Raasaru........... Thanks for Share...!!
Praveen Sarma said…
సత్యసాయి బాబా కోసం ఇంత పోలీస్ సెక్యూరిటీ పెట్టారు కానీ రూల్స్ ప్రకారం రాజకీయ నాయకులకీ, ప్రభుత్వ అధికారులకీ తప్ప ఎవరికీ అటువంటి సెక్యూరిటీ పెట్టకూడదు. నమ్మకాల కోసం రూల్స్‍నే తుంగలోకి తొక్కారు.
devudu perita amaayaka janam yedhainaa nammuthaaru..kaanee.. chadhuvukuni andha viswaasaalani proschahinche.. moorkapu paalakulani yemanaali Madam? nadi roddupai nilabetti cheppulatho.. kotte roju raavaalani powrulugaa manam korukovadam thappemi kaadhugaa.. aa roju yeppudo!!!!! andhikane kadhaa.. bootlu visirinchukuntunnaaru.. well said..Mdm..Thankyou!!!
Praveen Sarma said…
ఖురాన్‌లో ఒక దేవుడు, 25 మంది ప్రవక్తల పేర్లు వ్రాసి ఉన్నాయి. బైబిల్‌లో అంత కంటే ఎక్కువ మంది ప్రవక్తల పేర్లు వ్రాసి ఉన్నాయి. అన్ని మతాలలోనూ ఒక దేవుడూ, అనేక మంది ప్రవక్తలు ఉంటారు. కానీ ఆ మతాలలో ఎవడు పడితే వాడు తాను దేవుడినని చెప్పుకోవడానికి అవ్వదు. అలా చెప్పుకోవడం ఒక మన మతంలోనే సాధ్యం. అందుకే మన దేశంలో సాయిబాబాలు & కల్కి భగవాన్‌లమని చెప్పుకునేవాళ్లు అవతరిస్తున్నారు.
@ అనిత గారు
>> దెవుడు చావకుడదని వెరె దెవునికి మొక్కాలంట

ఈ వ్యాఖానం అదిరింది.
Praveen Sarma said…
మీరు ప్రదీప్ రాందాస్ (దత్తబాబా) గురించి విన్నారా? గుర్తు లేకపోతే తెలకపల్లి రవి గారు వ్రాసిన "బాబాల బండారం" పుస్తకంలో చదవండి.

Popular posts from this blog

అమ్మ...అమెరికా

‘వైధవ్యం’ – రసి కారుతున్న ఓ రాచపుండు

అశోకం