మా గోదావరి కధలు

వరద గోదావరి ఉగ్ర రూపం

మా మేనత్త గారి వూరు బూరుగు లంక గురించి చెప్పాను కదా.మీకు నచ్చిందని భావిస్తూ ఇప్పుడు కన క్కాయల లంక గురించి చెబుదామనుకుంటున్నాను.పాలకొల్లు దగ్గరున్న దొడ్డిపట్ల గ్రామానికి దగ్గగా వున్న లంక ఇది.ఈ లంకలో కి వెళ్ళాలంటే దొడ్డిపట్ల దగ్గర పడవెక్కి వెళ్ళాలి.బూరుగు లంక లాగా గోదావరిలో దిగి నడిచే ప్రశక్తే లేదు.కనక్కాయ లంక చుట్టూ లోతైన గోదారి ఉరవళ్ళతో ప్రవహిస్తూ ఉంటుంది.
పడవలో మాత్రమే ఈ లంకలోకి వెళ్ళగలం.ఆ... అన్నట్టు మర్చిపోయానండి.నేను 1996 లో యలమంచిలి ....వైజాగ్ దగ్గర ఎలమంచిలి కాదండీ.పశ్చిమ గోదవరి లో ఉన్న యలమంచిలండి.
ఈ మండలంలో నేను మండల రెవెన్యూ ఆఫీసర్ గా పనిచేసానండి.మా మండలం కింద మూడు లంక గ్రామాలుడేవి.అవి కనక్కాయల లంక,యెలమంచిలి లంక .....మరో లంక పేరు మర్చిపోయానండి.కనక్కాయ లంక చాలా అందమైంది. తమల పాకులు, మొక్కజొన్నలు ఎక్కువ పండిస్తారు.అవిశె చెట్లకి తమలపాకు పాదుల్ని పాకిస్తారు. లేత తమలపాకులు సున్నితంగా, సుకుమారంగా ఉంటాయి. ఈ లంకలో పండిన మొక్కజొన్న కంకుల్ని తిని తీరవలసిందే. అంత రుచిగా వుంటాయి.

మిగిలిన భాగం రేపు............

Comments

Naveen said…
సత్యగారు, తెలుగు వికిపెడియాలో అన్ని గ్రామాలకు మరియు పట్టణాలకు ఒక్కో పేజీ తయారు చేశాము. కానీ వాటిల్లో ఎక్కువ సమాచారము లేదు. మీ అందమైన గోదావరి తీర ప్రాంతాలలో ఉన్న పల్లెలు మరియు పట్టణాల గురించి తెవికి (తెలుగు వికి) లో వ్రాయాల్సిందిగా ప్రార్థన. ఉదాహరణకు "యలమంచిలి" పేజీ చూడండి:
http://te.wikipedia.org/wiki/యలమంచిలి

- నవీన్ గార్ల
(http://gsnaveen.wordpress.com)

Popular posts from this blog

‘వైధవ్యం’ – రసి కారుతున్న ఓ రాచపుండు

అమ్మ...అమెరికా

అశోకం