నేను ఈరోజు ప్రభుత్వం వారు నడిపే ఒక సోషల్ వెల్ఫేర్ హస్టలుకి వెల్లాను.ఆ హాస్టల్లో 70 మంది ఆడపిల్లలున్నారు.వాళ్ళంతా పదో తరగతి పరీక్షలు రాసి వాళ్ళ వాళ్ళ ఊళ్ళకెళ్ళకుండా ఈ శెలవుల్లో కంప్యూటర్.స్పోకన్ ఇంగ్లీష్ నేర్చుకుంటున్నారు.డాక్టర్ రెడ్డి ఫోండేషన్ వాళ్ళు వీళ్ళ కోసం ఈ రెండు కార్యక్రమాలు చేపట్టారు.పిల్లలు చక్కగా నేర్చుకుంటూన్నారు. నేను రెండు రోజులు వాళ్ళతో గడిపాను. ఈ ఆడపిల్లలందరూ వివిధ జిల్లాల నుండి వచ్చి ఈ హాస్టల్ ఉండి చదువుకుంటున్నారు.వాళ్ళతో మాట్లాడుతూ మీరంతా ఏమేమి అవ్వాలనుకుంటూన్నారు అని అడిగినప్పుడు ప్రతి ఒక్కరూ స్పందించి మేము ఫలానాది అవుదామనుకుంటున్నాము అంటూ చాలా స్పష్టంగా తమ తమ ఆకాంక్షల గురించి చెప్పారు.ఈ పిల్లలని ప్రోత్సహించాలే గాని వాళ్ళ గమ్యాలు తప్పక చేరుకుంటారు.వాళ్ళతో గడపడం నాకు గొప్ప ఉత్సాహాన్నిచ్చింది.

Comments

radhika said…
ఈ మధ్య పిల్లలందరూ ప్రతీ విషయం లోనూ చాలా స్పష్టం గా వుంటున్నారు.అది పెద్దవాళ్ళ ప్రోద్భలం వల్ల కానీయండి మరేదయినా కానీయండి వాళ్ళూ తమ తమ లక్ష్యాలను,గమ్యాల విషయం లో ఖశ్చితమయిన అభిప్రాయాల్తో వుంటున్నారు.ఇది చాలా మంచి పరిణామం.

Popular posts from this blog

‘వైధవ్యం’ – రసి కారుతున్న ఓ రాచపుండు

అమ్మ...అమెరికా

అశోకం